సాక్షి, న్యూఢ్లిలీ : దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలు, పొగమంచు విపరీతంగా పెరుగడంతో గాలి నాణ్యతలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు యునిటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. నవంబర్ 9కు తీసుకున్న టిక్కెట్లను నవంబర్ 13న రీ-బుక్ చేసుకోవాలని, ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా నవంబర్ 18కు ముందు తీసుకువెళ్లేలా చూస్తామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద ఈ ప్రాంతాన్ని ఎప్పడికప్పుడూ అడ్వయిజరీలతో పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రమాదకరమైన వాతావారణ పరిస్థితులు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని, కొన్ని సార్లు ప్రయాణికులు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సినవసరం లేకుండానే ప్రత్యామ్నాయ విమానాలకు అనుమతి ఇచ్చేలా ప్రయాణ ఉపసంహరణలు ఆఫర్ చేస్తామని కంపెనీ తెలిపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా విమానాలు కూడా ఢిల్లీకి ప్రయాణించడం లేదు. ఇతర ప్రత్యర్థి విమానయాన సంస్థలు కేఎల్‌ఎం, వెర్జిన్ అట్లాంటిక్, ఇతిహాద్‌లు కూడా ప్రయాణ ఉపసంహరణలు ఆఫర్ చేయనున్నాయో లేదో తెలుపలేదు.
Comments
Please login to add a commentAdd a comment