చెన‍్నై నుంచి 63 విమానాలు రద్దు | 63 flights cancel | Sakshi
Sakshi News home page

చెన‍్నై నుంచి 63 విమానాలు రద్దు

Published Sat, Jan 6 2018 6:50 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

63 flights cancel

సాక్షి, టీ.నగర్‌: ఢిల్లీలో రిపబ్లిక్‌ వేడుకల సందర‍్భంగా కట్టుదిట‍్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా చర‍్యల్లో భాగంగా చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన 63 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక పరేడ్‌ జరగనున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఢిల్లీ గగనతలంపై విమానాలు తిరగడాన్ని నిషేధించారు. ఈ నెల 18వ తేది నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు విమానాల పయనాన్ని రద్దు చేశారు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే 63 విమానాలను ఈ సందర్భంగా రద్దు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement