సాక్షి ప్రతినిధి, చెన్నై: విమాన చక్రం తెరుచుకోకపోవడంతో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విమానంలోని 143 మంది ప్రయాణికులు ఆకాశంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. బుధవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో పైలెట్ విమానాన్ని రన్‌వేపై దింపేందుకు ప్రయత్నించగా విమాన చక్రం తెరుచుకోకపోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక విమానాన్ని మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చెన్నై విమానాశ్రయ కంట్రోల్ రూంకి సమాచారం ఇచ్చాడు. ఎయిర్‌పోర్ట్ అధికారులు అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లతో వైద్య సిబ్బందిని రన్‌వే మీదకి చేర్చి ఎలాంటి ప్రమాదం జరిగితే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అరగంట తర్వాత పైలెట్ విమానాన్ని రన్‌వేపైకి తీసుకురాగా కింది భాగంలోని చక్రం అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 138 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది క్షేమంగా బైటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment