Chennai airport
-
Wasim Akram: భారత వీసా లేదు.. బోరున ఏడ్చేసా..!
పాకిస్తాన్ మాజీ పేసర్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ గతంలో జరిగిన ఓ విషాద సన్నివేశాన్ని తన ఆటోబయోగ్రఫీ "సుల్తాన్.. ఎ మెమోయిర్"లో ప్రస్తావించాడు. ఆ విషయాన్ని అక్రమ్ తాజాగా స్పోర్ట్స్ స్టార్ మ్యాగజిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. విషయం ఏంటంటే.. 2009లో అక్రమ్ తన భార్య హ్యుమా అక్రమ్‌తో కలిసి చెన్నై మీదుగా సింగపూర్‌కు ఫ్లైట్‌లో బయల్దేరాడు. మధ్యలో ఇంధనం నింపుకునేందుకు విమానం చెన్నైలో ల్యాండ్ కాగానే అప్పటికే గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అక్రమ్ భార్య హ్యుమా తీవ్ర అస్వస్థతకు గురై, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని అక్రమ్ బోరున విలపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అక్రమ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో కొందరు గుర్తించారు. ఆ సమయంలో అక్రమ్‌కు కానీ అతని భార్యకు కానీ భారత వీసాలు లేవు. దీంతో అతని భార్య చికిత్స కోసం భారత్‌లో ప్రవేశించే అస్కారంలేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఎయిర్పోర్ట్ అధికారులు అక్రమ్‌కు సహకరించి, అతని భార్యను చెన్నైలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అక్రమ్ భార్య అతర్వాత కొద్ది రోజులకే కన్నుమూసింది. ఇదే విషయాన్ని అక్రమ్ స్పోర్ట్స్ స్టార్ మ్యాగజిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. భారత అధికారులు గొప్ప మనసును కీర్తించాడు. తాను పాకిస్తానీని అయినప్పటికీ చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తన పరిస్థితి తెలిసి జాలిపడటమే కాకుండా కావాల్సిన సాయం చేశారని కొనియాడాడు. ఆ సమయంలో ఏడుస్తున్న తనను ఓదార్చడమే కాకుండా, వీసా గురించి ఆందోళన చెందవద్దని, తాము అంతా చూసుకుంటామని తనలో ధైర్యం నింపారని తెలిపాడు. ఈ విషయాన్ని మనిషిగా తానెప్పటికీ మరిచిపోలేనని పాత విషయాలను నెమరేసుకున్నాడు. -
విమానాశ్రయంలో రూ.40లక్షల బంగారం స్వాధీనం
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ.40.35 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి సౌదీ అరేబియా ప్రత్యేక విమానం చెన్నై విమానాశ్రయానికి బుధవారం ఉదయం వచ్చి చేరింది. ఇందులో వచ్చిన ప్రయాణికుల వద్ద తనిఖీ చేస్తుండగా విల్లుపురానికి చెందిన చంద్రు శక్తివేల్ (23) వద్ద 810 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రయాణికులు ఆకాశంలో బిక్కుబిక్కుమంటూ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: విమాన చక్రం తెరుచుకోకపోవడంతో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విమానంలోని 143 మంది ప్రయాణికులు ఆకాశంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. బుధవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో పైలెట్ విమానాన్ని రన్‌వేపై దింపేందుకు ప్రయత్నించగా విమాన చక్రం తెరుచుకోకపోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక విమానాన్ని మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చెన్నై విమానాశ్రయ కంట్రోల్ రూంకి సమాచారం ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ అధికారులు అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లతో వైద్య సిబ్బందిని రన్‌వే మీదకి చేర్చి ఎలాంటి ప్రమాదం జరిగితే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అరగంట తర్వాత పైలెట్ విమానాన్ని రన్‌వేపైకి తీసుకురాగా కింది భాగంలోని చక్రం అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 138 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది క్షేమంగా బైటపడ్డారు. -
చెన్నై నుంచి 63 విమానాలు రద్దు
సాక్షి, టీ.నగర్: ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన 63 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక పరేడ్ జరగనున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఢిల్లీ గగనతలంపై విమానాలు తిరగడాన్ని నిషేధించారు. ఈ నెల 18వ తేది నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు విమానాల పయనాన్ని రద్దు చేశారు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే 63 విమానాలను ఈ సందర్భంగా రద్దు చేస్తున్నారు. -
విమానాశ్రయం జనసాగరం
అన్నానగర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సమైక్యాంధ్ర ఉద్యమ సారథి వైఎస్.జగన్మోహన్రెడ్డికి చెన్నైలో ఘనస్వాగతం లభించింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు. బుధవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయూనికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో వేలాది మంది అభిమానులు ఆయన్ను అనుసరించడం, అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించడంతో విమానాశ్రయం నుంచి రోడ్డుపైకి చేరుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. పొరుగు రాష్ట్రానికి విచ్చేసిన నేతకు ఇంతటి ఘనస్వాగతమా? ఇన్ని వేల మంది అభిమానులా అంటూ స్థానికులు ఆశ్చర్యపోయారు.10.45గంటలకు కారులో బయలుదేరిన ఆయన ఆళ్వారుపేటలోని సోదరుని ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. సాధారణంగా ఎయిర్‌పోర్టు నుంచి ఆళ్వారుపేట చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. ఎయిర్‌పోర్టు నుంచి గిండీ, కత్తిపార జంక్షన్, నందనం, టీటీకే రోడ్డు వద్ద వేలాదిమంది జగన్మోహన్రెడ్డి అభిమానులు ఆయన కారు నుంచి బయటకు రావాలని పట్టుపట్టారు. అభిమానల కోరిక మేరకు ఆయన వాహనం దిగి వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు.స్వాగతించిన ప్రముఖులు: వైఎస్.అనిల్ రెడ్డి, వైఎస్.సునీల్‌రెడ్డి, ఎంపీ రాజమోహన్‌రెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలశౌరి, పి.అక్కిరెడ్డి, ఆనందకుమార్ రెడ్డి, జేకే రెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, అనిల్‌కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కేతిరెడ్డి జగదీశన్ రెడ్డి, పి.అక్కిరెడ్డి, మేరిగ మురళి, హరిరెడ్డి, నన్నపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, బి.రాఘవేంద్రరెడ్డి, గౌతం రెడ్డి, తాడి వీరభద్రరావు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిరణ్‌మోహన్, మైసూరారెడ్డి, జి.ప్రతాప్‌రెడ్డి, ఎల్లగిరి గోపాల్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కెన్సెస్ నరసారెడ్డి, పల్లవా సుబ్బారెడ్డి, కొమ్ముల లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రరెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రతాప్ సి రెడ్డి వంటి ప్రముఖులు ఎయిర్‌పోర్టుకు వచ్చి జగన్‌కు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. విజయేంద్రరాజు, ఆర్.ప్రతాపకుమార్‌రెడ్డి, మణివన్నన్, రాజేంద్రన్, కృష్ణారెడ్డి, బేతిపూడి శేష ప్రసాద్, ప్రవీణ్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, ముంగర మధుసూదనరావు, శశిధర రెడ్డి, హరిరెడ్డి, వి.నర్శింగరెడ్డి, డి.రాజారెడ్డి, జి.సురేష్‌రెడ్డి, కె.శేఖర్ రెడ్డి, కర్రల సుధాకర్, లక్ష్మీపతి రాజు, చక్రపాణి రెడ్డి, రమేష్‌రెడ్డి, యతిసాలరాజు, శేఖర్‌రాజు, గొల్లపల్లి ఇజ్రాయెల్, విజయకుమార్‌రెడ్డి, ఏకే రాజ్, జైపాల్ జగన్‌ను స్వాగతించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులోని విజిటర్స్ లాంజ్ మొత్తం జగన్‌ను స్వాగతించడానికి విచ్చేసిన ప్రముఖులతో క్రిక్కరిసిపోయింది. ఆళ్వార్‌పేటలో బ్రహ్మరథం: నగరంలోని ఆళ్వార్‌పేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. జగన్ సోదరుడు వై.ఎస్.అనిల్‌రెడ్డి నివాసం వద్దకు ఉదయాన్నే జన సందోహం తరలి వచ్చింది. గంటల తరబడి ఓపిగ్గా జననేత కోసం ఎదురు చేశారు. తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్, శరవణన్ అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతుండడంతో ఆయన మద్దతుదారులు అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రాంతంలోని రహదారుల్లో జగన్ అభిమానులు బారులు తీరారు. రోడ్లకిరువైపులా కార్లు, వ్యాన్లు నిండిపోయాయి. జగన్ కాన్వాయ్ ఆళ్వారుపేట ప్రాంతానికి చేరుకోగానే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ టీ షర్టులు ధరించిన కార్యకర్తలు, పోలీ సులు, జగన్మోహన్రెడ్డికి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సు గమం చేశారు. మహిళలు జగన్ కారుపై పూలవర్షం కురిపిం చారు. కోవూరు మ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు నియోజకవర్గం కో ఆర్డినేటర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గూడూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ పాశం సునీల్‌కుమార్, రాజమండ్రి వైఎస్సార్ సీపీ యువజన నేత పి.కిరణ్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు. వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.