
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ.40.35 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి సౌదీ అరేబియా ప్రత్యేక విమానం చెన్నై విమానాశ్రయానికి బుధవారం ఉదయం వచ్చి చేరింది. ఇందులో వచ్చిన ప్రయాణికుల వద్ద తనిఖీ చేస్తుండగా విల్లుపురానికి చెందిన చంద్రు శక్తివేల్ (23) వద్ద 810 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.