చెన్నై-న్యూఢిల్లీ టిక్కెట్టు ధర రూ.52 వేలు
చెన్నై-న్యూఢిల్లీ టిక్కెట్టు ధర రూ.52 వేలు
Published Wed, Dec 14 2016 11:17 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
న్యూఢిల్లీ: చెన్నై-న్యూఢిల్లీ విమాన చార్జీల ధరలు ఆకాశాన్నంటాయి. వర్దా తుపాను ప్రభావం కారణంగా చెన్నై-న్యూఢిల్లీ వెళ్లే విమానం టికెట్ల ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న విమాన టిక్కెట్ల ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ-చెన్నై వెళ్లే విమాన టికెట్ ధర రూ.24,792లు, కోల్ కతా నుంచి చెన్నై వచ్చే విమానం టిక్కెట్ ధర రూ.17,283లు గా ఉన్నాయ. అదే చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధర ఏకంగా రూ.52,000లుగా ఉంది.
సాధారణంగా ఆఖరి నిమిషంలో తీసుకునే విమానధరలు రూ.5 వేల నుంచి 8వేల వరకూ పెరుగుతూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సోమవారం చెన్నై ఎయిర్ పోర్టును మూసివేసిన కారణంగా ఒక్కసారిగా విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. దీంతో చార్జీలను ఆయా విమానయాన సంస్ధలు పెంచేశాయి.
Advertisement
Advertisement