ఫేస్‌బుక్ ఉద్యోగి కృపా బాల
సిడ్నీ : ఏడుస్తున్న చిన్నపిల్లలను సముదాయించడం శక్తికి మించిన పని. ఇక ఏడాదిలోపు పసికందులైతే మరీ కష్టం. తన 8 నెలల బాబు, భర్తతో కలిసి సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు యునైటెడ్ ఎయిరెలైన్స్ ఫ్లైట్‌లో బయలు దేరిన ఫేస్‌బుక్ ఉద్యోగి కృపా బాలకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో తన కొడుకు గుక్కపట్టి ఏడ్వడంతో బిజినెస్ క్లాస్ సీట్‌లో కూర్చున్న ఓ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో విమాన సహాయకుడు ఆమె దగ్గరకు వచ్చి చిన్నపిల్లను 5 నిమిషాల కంటే ఎక్కవ ఏడిస్తే అనుమతించమని తెలిపారు.
ఈ వ్యాఖ్యలకు ఖంగుతిన్న ఆ ఫేస్‌బుక్ ఉద్యోగి.. ఇదెక్కడి నిబంధన అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్.. ఆ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోగానే క్షమాపణలు తెలియజేసింది. అంతేకాకుండా టికెట్స్‌ను రిఫండ్ చేసింది. కానీ ఈ ఘటన చిన్నపిల్లలతో విమానంలో ప్రయాణించడం ఎంత కష్టమో తెలియచేసింది. అటు తల్లి తండ్రులు, తోటి ప్రయాణీకులు, విమాన సిబ్బందికి ఇబ్బందే అని తెలిసింది. పిల్లలతో విమాన ప్రయాణం చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment