
అరిచేతులు, అరికాళ్లు, పెదాలపై చమట గ్రంథులు ఉండవనే విషయం అందరికీ తెలుసు. అలాగే సహజ నూనెలు ఉత్పత్తి చేసే సేబాషియస్ గ్రంథులు కూడా ఉండవు. అందుకే వాటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐతే శరీరంలోని ఇతర భాగాలకంటే పెదవులు త్వరగా పొడిబారిపోతాయి. సూర్యరశ్మి నుంచి వెలువడే యూవీ కిరణాలు వల్ల పెదవులు త్వరగా పొడిబారి దెబ్బతింటాయి. అదరాలు ఎల్లప్పుడు తేమగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు మీకోసం..
►ఆరెంజ్ రసం కలిగిన లిప్‌బామ్ సూర్యుని నుంచి వెలువడే ప్రమాధకర కిరణాల నుంచి రక్షణ కల్పించి సహజ కండిషనింగ్‌లా పనిచేస్తుంది.
►పెదాలపై డెడ్ స్కిన్ పొరను తొలగించాలంటే వారానికి ఒకసారైనా టూత్ బ్రష్‌తో షుగర్ స్క్రబ్‌ను అప్లై చేయాలి.
►వెన్నను పెదాలపై రాయడం వల్ల ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా కనిపిస్తాయి.
►విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు ఆకుకూరలు తినాలి. అలాగే అధికంగా నీళ్లు తాగడం మంచిది.
►వేసవి వేడిలో పెదవులు నల్లగా మారతాయి. కాబట్టి మీ సహజమైన పెదాల రంగును కాపాడుకోవాలంటే.. కుంకుమపువ్వు, పెరుగును కలిపి రోజుకి 2, 3 సార్లు అప్లై చేస్తే, మీ పెదాల సహజ కాంతి చెక్కుచెదరదు.
►అర టీస్పూన్ గ్లిజరిన్, ఆముదం, నిమ్మరసం తీసుకుని, వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెదాలపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోతుంది.
►రోజుకి 12 గ్లాసుల నీరు త్రాగడం వలన మీ శరీరం మాత్రమేకాకుండా పెదవులు హైడ్రేట్ అవుతాయి. చర్మం రక్త ప్రసరణను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది కూడా.
చదవండి: Health Tips: జంక్‌ఫుడ్ తింటున్నారా? అల్జీమర్స్, డిప్రెషన్.. ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment