సాక్షి, తాడేపల్లిగూడెం: ‘ఈ రామన్నగూడెంలో ఏ కార్యక్రమాలకు నన్ను పిలవడంలేదు.. నా పాత్ర లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదు.. నా నియోజకవర్గంలో నన్నో అంటరానివాడిగా చూసే పరిస్థితి ఏర్పడింద’ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను నిలదీయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా.. నన్ను కట్ చేయాలని ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా’ అని దురుసుగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పక్కనే మహిళా తహసీల్దార్, సభలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం జరిగిన జన్మభూమి సభలో మంత్రి పై విధంగా నోరు జారారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. గ్రామ సభలో జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Wed, Jan 10 2018 5:35 PM | Last Updated on Wed, Jan 10 2018 7:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment