janma bhoomi meeting
-
ప్రభుత్వాన్నే నిలదీస్తా..
సాక్షి, తాడేపల్లిగూడెం: ‘ఈ రామన్నగూడెంలో ఏ కార్యక్రమాలకు నన్ను పిలవడంలేదు.. నా పాత్ర లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదు.. నా నియోజకవర్గంలో నన్నో అంటరానివాడిగా చూసే పరిస్థితి ఏర్పడింద’ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను నిలదీయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా.. నన్ను కట్ చేయాలని ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా’ అని దురుసుగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పక్కనే మహిళా తహసీల్దార్, సభలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం జరిగిన జన్మభూమి సభలో మంత్రి పై విధంగా నోరు జారారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. గ్రామ సభలో జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'
-
'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'
తాను బుల్లెట్లా దూసుకుపోతానని, ఎవ్వరికీ భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడవని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హోం మంత్రి తనపై కేసు పెడతానని చెబుతున్నారని, ఒక ముఖ్యమంత్రి అని కూడా లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వీటికి భయపడబోనని ఆయన అన్నారు. నీతి, నిజాయితీలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, తాము ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేశాము తప్ప.. టీఆర్ఎస్లా తప్పుడు రాజకీయాలు చేయలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేను తీసుకెళ్లి ఏం చేశారో టీఆర్ఎస్ చెప్పాలని ఆయన అడిగారు.