
‘సంతోషమే సగం బలం అంటారు. కానీ ఆ సంతోషానికి కారణమైన నువ్వే మా పూర్తి బలం. అమ్మ వీలుంటే మళ్లీ రా’ అంటూ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, అతని సోదరి అన్షులా పెన్ తమ తల్లి గుర్తు చేసుకున్నారు. మోనా వర్ధంతి సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోలను పోస్టు చేసి.. తమ తల్లిని స్మరించుకున్నారు. ‘నా చిరునవ్వుకి కారణం నువ్వు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా. వీలుంటే మళ్లీ రావొచ్చుగా’ అంటూ అర్జున్ కపూర్ భావోద్వేగంగా పోస్టు చేశారు. ‘కాలం అన్నింటినీ మారుస్తుందంటారు. కానీ ఏదీ మారలేదు. నువ్వు మమ్మల్ని వదిలేసి 7 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ మేము నీ ప్రేమలోనే ఉన్నామనిపిస్తుంది. ఇంకా నీ చేయి పట్టుకున్నట్టుగానే ఉంది. నిన్నెంతగా ప్రేమిస్తున్నామో అంతగా మిస్ అవుతున్నాం’ అంటూ అన్షులా పేర్కొన్నారు.
మోనా షౌరీ కపూర్, బోనీ కపూర్ మొదటి భార్య. 2012లో అర్జున్ తొలి సినిమా ‘ఇషక్‌జాదే’ రిలీజ్ అవుతున్న సమయంలో మోనా కాన్సర్ కారణంగా చనిపోయింది. బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి గత సంవత్సరం ఫిబ్రవరిలో మరణించడంతో ఆమె కుమార్తెలైన జాన్వీ, ఖుషి కపూర్ బాధ్యతలను అర్జున్, అన్షులా తీసుకున్నారు. గతంలో అర్జున్ మాట్లాడుతూ వారిద్దరూ ఎంతో పెద్ద మనసుతో నన్ను అన్నయ్యగా అంగీకరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment