హీరో బర్త్‌డే.. అందరూ ఉన్నా ఒకరు మాత్రం మిస్సింగ్‌! | Anshula Kapoor Celebrates Arjun Kapoor Birthday at Midnight | Sakshi
Sakshi News home page

హీరో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన చెల్లి.. ఒక్కరు తక్కువయ్యారు..

Published Wed, Jun 26 2024 7:37 PM | Last Updated on Wed, Jun 26 2024 7:56 PM

Anshula Kapoor Celebrates Arjun Kapoor Birthday at Midnight

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ బర్త్‌డే నేడు (జూన్‌ 26). అన్నయ్య బర్త్‌డే అంటే ఎలా ఉండాలి? ఆ రోజు తనను ఎంత సంతోషంగా ఉంచాలి? అని ఆలోచించినట్లుంది అన్షులా కపూర్‌. అందుకే అర్ధరాత్రి అర్జున్‌తో కేక్‌ కట్‌ చేయించింది. ఈ బర్త్‌డే పార్టీకి సంజయ్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌ సహా తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ ఫోటోలను అన్షులా షేర్‌ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మై నెంబర్‌ 1. ఎంతో పెద్ద మనసున్న నువ్వు అన్నింటినీ దాటుకుని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్నది సాధించాలి. నీ కష్టాలు తగ్గిపోవాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి..  లవ్‌ యూ అన్నయ్య అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. 

ఇక ఈ బర్త్‌డే పార్టీలో బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా మిస్సయింది. ప్రియుడి పుట్టినరోజు అనగానే అందరికన్నా ముందుగానే విషెస్‌ చెప్పే ఆమె ఈసారి మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయింది. పార్టీలో సైతం కనిపించలేదు. దీంతో వీళ్లిద్దరూ విడిపోయిన మాట వాస్తవమేనని అర్థమవుతోంది.

 

చదవండి: పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement