Sridevi Daughter: Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: మరింత ధైర్యం వచ్చింది.. చాలా అదృష్టవంతులం: జాన్వీ కపూర్

Published Sun, Apr 24 2022 6:50 PM | Last Updated on Sun, Apr 24 2022 7:05 PM

Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger - Sakshi

Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ తనదైన నటనతో బాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ అభిమానులకు టచ్​లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌ గురించి చెప్పుకొచ్చింది. 

'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్‌) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్‌ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌ ఇద్దరు బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. 

చదవండి: తెలుగులో జాన్వీ కపూర్​ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో



చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్‌ ఏం చెబుతోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement