siblings
-
Celebrity Siblings: సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు (ఫోటోలు)
-
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
-
సిబ్లింగ్స్ డే: సెలబ్రెటీ సిబ్లింగ్స్..ఆ బంధం ఏం చెబుతోందంటే..!
తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు/కూతురు ఉంటే హ్యాపీ అనుకుంటారు గానీ. అది అస్సలు నిజం కాదు. తమ్ముడో, చెల్లో ఉంటే ఆ దారే వేరు. ఆ బలమే వేరు. అలాంటి తోబుట్టువులకు సంబంధించిన ఒక రోజు ఉందని తెలుసా... ఈ బిజీ లైఫ్‌లో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు బంధాలు ఉంటున్నాయి. అందుగురించే ఓ రోజుని ఏర్పాటు చేసి మనతో పాటు అమ్మ కడుపున పుట్టిన వాళ్లను అస్సలు విస్మరించొద్దు అని చెబుతున్నారు. దీన్ని మనం ప్రతి ఏటా ఏప్రిల్ 10న తోబుట్టువుల దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీ తోబుట్టువులు జాబితా గురించి చర్చిద్దామా? రక్త సంబంధాలను ఎలా బలంగా పదిలపర్చుకోవాలో కూడా సవివరంగా తెలుసుకుందాం..! ఎంతటి వ్యక్తికైనా తన భాగస్వామి తోపాటు తోడబుట్టిన వాళ్లతో సత్సంబంధాలు బాగుండాలి. మన తోపాటు పుట్టిన వాళ్లని విస్మరించకూడదు. అంతెందుకు మన రామాయణంలో లక్ష్మణుడి కోసం రాముడు ఎంతగా పరితపిస్తాడో చక్కగా వివరించి ఉంటుంది. అందులో భార్య లేదా భర్త విధి వశాత్తు దూరమైతే మరొకరు ఆ స్థానం భర్తీ చేయగలరు గానీ మన తోడబుట్టినోడు దూరమైతే మరోకరు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఎంతో ఉద్విగ్నంగా రాసి ఉంటుంది. అంత గొప్ప రక్త సంబంధం అది. మృత్యువు తప్ప ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదు అన్నంత దృఢంగా ఉంచుకోవాలి. అలానే మన సినీ సెలబ్రెటీల తోబుట్టువులు ఒకరికొకరం అన్నంతగా ఉన్న వారెవరో చూద్దామా..! షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్ ఇద్దరు స్టైలిష్ లుక్‌లో ఉండే సోదరులు ద్వయం. ఇరువు మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌తో కూడిని బంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి ఉండే గౌరవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరి రిలేషన్ నుంచి తోబుట్టువని చిన్న చూపు కాకుండా గౌరవప్రదంగా చూసుకోవాలనే విషయం తెలుస్తుంది. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించాలంటే ముందు పెద్దవాళ్లే సరైన విధంగా ప్రవర్తించాలని చెబుతోంది. జాన్వీ కపూర్ -ఖుషీ కపూర్ టాలీవుడ్ అందాల రాశి దివంగంత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. ఇద్దరూ అమ్మకు తగ్గ అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇరువురు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. వారి తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడూ జాన్వీ తల్లిలా మారి తన చెల్లి ఖుషీకి ధైర్యం చెబుతూ మార్గ నిర్దేశించిన విధానం గురించి సోషల్ మీడియాల్లో విన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా ఇద్దర్ని కోల్పోయినప్పుడు మన తోడబుట్టిన వారికి ఎలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాలన్నది తెలియజేస్తుంది. అవసరమైతే తల్లిదండ్రులు రోల్‌ని తీసుకుని మరీ వారిపట్ల బాధ్యతతో వ్యవహరించాలనే విషయాన్ని తెలియజేబుతోంది. కరిష్మా కపూర్ -కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ నటుల అయిన ఈ సిస్టర్స్ ద్వయం ఎక్కడకు వెళ్లిన కలిసే వెళ్తుంటారు. కెరీర్ పరంగా మీడియా ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలు తెప్పించే ప్రయత్నం చేసినా..మాలో ఎవరికి స్టార్డమ్ వచ్చినా హ్యాపీనే అని హుందాగా చెప్పి ఆశ్చర్యపరిచిన పలు సందర్భాలు అనేకం. కష్టకాలంలో తోబుట్టువుకి ఎలా మద్దతు ఇవ్వాలన్నది కూడా వారిని చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. కేవలం సంతోషంగా ఉంటేనే తోబట్టువులు గుర్తు తెచ్చుకోకూడదు. బాధలో ఉన్నప్పుడు తరచి తరచి వారి బాగోగులు తెలుసుకోవాలి, వారికి కావాల్సినంత అండ దండ ఇవ్వాల్సి కూడా ఉంటుందనే విషయం తప్పక గ్రహించాలి. సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అన్నా-చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ల ద్వయంని చూస్తే తెలుస్తుంది. ఇద్దరు రాజకుటుంబానికి చెందిన వారి వల్లే మంచి అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తారు. ఇరువురు స్నేహితులేమో అనుకునేలా ఉంటారు. చెబితేగాని తెలియదు అన్నాచెల్లెళ్లు అని. మన తోడబుట్టిన వాళ్లతో ఇంతలా సరదాగా ఓ స్నేహితుడితో ఉన్నంత చనువుగా ఉండాలని చెప్పకనే చెబుతోంది వీరి బంధం. కృతి సనన్- నూపూర్ సనన్ అక్కా చెల్లెళ్లు ఎలా ఉండాలనేందుకు ఈ ఇద్దరే ఆదర్శం. అక్కా చెల్లెళ్లు అనంగానే కాస్త రాగద్వేషాలు, అసూయలు రాజుకుంటాయి. అది అందం లేదా కెరీర్ పరంగానైనా ఉండొచ్చు. కానీ వీళ్ల మధ్య వాటికి స్థానం లేదు. ప్రేమగా మెలుగుతున్న వారిని చూస్తే ఎవ్వరికైన అసూయాగా అనిపిస్తుంది. అబ్బా నాకు ఓ అక్క లేదా చెల్లి ఉంటే బాగుండును అనిపిస్తుంది. తగాదాలకు తావివ్వకుండా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ మంచి సోదరీమణుల్లా మెలుగుతుంది ఈ సిస్టర్స్ ద్వయం. చివరిగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ ఈ ముగ్గురు అన్నదమ్ములు విచిత్ర సోదరులు సినిమాలోని సోదరుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటారు. వీరినుంచి ఐక్యమత్యంగా ఎలా ఉండాలనేది నేర్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే తోబుట్టువుల మధ్య ఉండాల్సింది ఐక్యమత్యమే!. (చదవండి: ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..) -
నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు..
వాషింగ్టన్: అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి గుండె చప్పుడు విని భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి చనిపోగా ఆయన అవయవాలను దానం చేశారు ఆ బిడ్డలు. ఆ గుండె ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లిన ఆ అక్కాచెలెళ్లకు తండ్రి గుండెను అమర్చిన వ్యక్తి దొరికారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు. మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి. అలా అవయవదానం చేసిన ఎస్టబెన్ శాంటియాగో(39) కుమార్తెలు తన తండ్రి అవయవాల కోసం వెతుకుతూ చివరికి ఆయన గుండెను కనుగొన్నారు. కిసండ్ర శాంటియాగో(22) ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగి చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు. కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ మొత్తం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది. View this post on Instagram A post shared by TODAY (@todayshow) ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారతీయుడి జాక్‌పాట్.. నెలకు రూ.5.59 లక్షలు.. -
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?
అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలుసు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన కుటుంబం వారిది. దివంగత ధీరూభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు మరింత విస్తరించారు. వివిధ వ్యాపారాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ప్రసిద్ధి చెందారు. అయితే వారి సోదరీమణుల గురించి ఎక్కువ మందికి తెలియదు. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. వీరిలో నీనా కొఠారి రూ.68 వేల కోట్ల విలువైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ కంపెనీకి అధిపతి. 2003లో ఆమె జావగ్రీన్ అనే కాఫీ, ఫుడ్ చైన్‌ని స్థాపించారు. నీనా కొఠారి 1986లో వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. అనారోగ్య కారణాలతో శ్యామ్ కొఠారి 2015లో మరణించారు. ఆ తర్వాత నీనా కొఠారి వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను తీసుకున్నారు. 2015లో ఆమె కంపెనీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కార్పొరేట్ షేర్‌హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి పబ్లిక్‌గా రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ. 52.4 కోట్లకు పైగానే. -
Viral Video: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
-
దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
వాషింగ్టన్: మంటల్లో తగలబడుతున్న ఇంట్లోకి దూకి అందులోని వారిని హీరో రక్షించే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే అమెరికాలోని అయోవా ప్రాతంలో జరిగింది. మంటల్లో దగ్ధమవుతున్న ఇంట్లోని నలుగురు తోబుట్టువులను రక్షించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. ఇంట్లోని డోర్‌బెల్ కెమెరాలో నమోదైన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంట్లోంచి ప్రాణాలతో బయటపడిన వారిలో 8,14,17,22 ఏళ్ల వయసు వారిగా పోలీసులు తెలిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఇంటి యజమాని, నలుగురు పిల్లల తల్లి టెండర్ లెమన్. మన జీవితాలు శాశ్వతంగా మారిన రోజు! కానీ, బూడిద నుంచే కదా?? అంటూ రాసుకొచ్చారు. వీడియో ప్రకారం.. మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. కొద్ది సేపటికి ముందు నుంచి 22 ఏళ్ల యువకుడు సైతం అందులోంచి బయటకు వచ్చాడు. బ్రెండన్ బ్రిట్ అనే వ్యక్తి తన కారులో వెళ్తూ దారి తెలియక మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గంలో ఓ ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి కిటికీలను పగలగొట్టి లోపల ఎవరైనా ఉన్నారేమో పరీక్షించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారని భావించానని, వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు బ్రిట్ చెప్పారు. మంటలు తీవ్రమవుతున్న క్రమంలో లోపలి ఉన్న వారిని అలర్ట్ చేసి ఇంటి గుమ్మం గుండా బయటకు పంపించినట్లు తెలిపారు. మరోవైపు.. స్మోక్ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని, బయట నుంచి అరుపులు విని లేచినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఇంటి యజమాని లెమన్. ఈ మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఐదు పెంపుడు శునకాలు మృతి చెందాయని, మరో రెండు గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. అయితే, ఇంట్లో మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు రెడ్ ఓక్ ఫైర్ విభాగం తెలిపింది. ఇదీ చదవండి: బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా -
అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...వాంటెడ్ క్రిమినల్స్
ఎక్కడైన అన్నదమ్ములు అనగానే ఒకరు ఒకలా మరోకరు డిఫరెంట్‌గా ఉంటారు. ఇది సర్వసాధారణం. మరికొన్ని చోట్ల ఒకరుకొకరు ఆదర్శవంతంగా ఐక్యమత్యంగా ఉంటారు. ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధం ఈ అన్నదమ్ములిద్దరూ. పైగా ఒకరుకి మించి మరొకొకరు వాంటెడ్ క్రిమినల్స్ వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో నివశిస్తున్న27 ఏళ్ల వ్యక్తి అతని సోదరుడు ఇద్దరు వేర్వేరు కేసుల్లో వాంటెడ్ క్రిమనల్స్. 27 ఏళ్ల ఆశిష్ చౌహన్ ఆగస్టు 29, 2017న తన సహచరులతో కలసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న అప్పటి పోలీసులు ఆశిష్‌ని ట్రేస్ చేసి పట్టుకుంటున్న సమయంలో బహిరంగంగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎన్కౌంటర్ దాడులు జరపడంతో ఆశిష్ అతను సహచరుడు తీవ్రంగా గాయపడి పట్టుబడ్డారు. ఈ మేరకు అలీపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆశిష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐతే ఆశిష్‌కి నవంబర్3, 2020న బెయిల్ మంజూరయ్యింది. కానీ కోర్టు నిబంధనలను ఉల్లంఘించడంతో నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే అతని సోదరుడు కాల్సెంటర్లో పనిచేస్తున్న 23 ఏళ్ల దీపక్ తన సహచర ఉద్యోగినే అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసుల జరిపిన దర్యాప్తులో ఆశిష్ సోదరుడు దీపక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: ఉసురు తీసిన అతివేగం...ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు) -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
అత్తింటి పోరుకు బావిలో శవాలైన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు.. కారణం?
జైపూర్: ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత.. కానీ అందుకు భిన్నంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు అత్తారింట్లో మాత్రం గెలవలేకపోతున్నారు. ప్రపంచాన్ని జయించగలుగుతున్న నారీమణులు ఇంట్లో అత్తామామల పోరుకు బలైపోతున్నారు. కట్నం, అదనపు కట్నం వివాదాల్లోనే సగం మంది మహిళల జీవితాలు గతించిపోతున్నాయి. వరకట్న వేధింపులకు ఎంతో మంది ఆత్మహత్య, హత్యలకు గురవుతున్నారు. తాజాగా కట్న దాహానికి అయిదు నిండు ప్రాణాలు బలయ్యాయి. మృతుల్లో గర్భిణిలు, చిన్నారులు ఉండటం మరింత కలిచివేసే విషయం. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జైపూర్ జిల్లాలోని డుడు ప్రాంతంలో శనివారం ముగ్గురు మహిళలతో సహా అయిదుగురు మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీశారు. ఇందులో ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులున్నారు. అలాగే మహిళల్లో ఇద్దరు ప్రస్తుతం గర్భిణీలు. ముగ్గురు మహిళలు కాలు దేవి(27), మమతా(23) దేవి, కమలేష్(20) అక్కాచెల్లెల్లుగా గుర్తించారు. నాలుగేళ్ల చిన్నారి, 27 రోజుల శిశువును కాలుదేవి పిల్లలుగా గుర్తించారు. ముగ్గురు అక్కాచెల్లెల్లు బాల్య వివాహ బాధితులే. పెద్దగా చదువుకోని, మద్యం అలవాటు ఉన్న ముగ్గురు అన్నదమ్ములతో వీళ్ల వివాహాలు జరిగాయి. ముగ్గురు సోదరీలు గృహసింసకు గురవుతున్నట్లు తెలిసింది. చిన్న సోదరి కమలేష్ ఏడాది వయసున్నప్పుడే కాలుదేవికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఉన్నతంగా జీవించాలని ఆశపడ్డ ముగ్గురూ.. చాలా కష్టపడి చదువుకున్నారు. వీరిలో మమత పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించింది. పెళ్లైన తర్వాత కూడా చదవును కొనసాగిస్తున్న కాలు ప్రస్తుతం బీఏ చదువుతోంది. ఎనిమిది నెలల గర్భవతి అయిన చిన్న చెల్లెలు కమలేష్ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోంది. కాలు దేవిని అత్తామామలు కొట్టడంతో 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి తిరిగొచ్చింది. అయితే కాలు తన ఇద్దరు పిల్లలతోపాటు మమతా, కమలేష్ అయిదుగురు మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి కనిపించకుండా పోయారు. బుధవారం మిస్సింగ్ కేసు నమోదవ్వగా.. శనివారం విగతజీవులుగా తేలారు. ఇంటికి సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలోని బావిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు సోదరులు నర్సి, గోరియో, ముఖేష్లను అరెస్టు చేశారు. మహిళలు, వారి పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా లేక వరకట్న వేధింపులతో భర్తలు, అత్తమామలే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భర్తకు దూరంగా భార్య.. అనుమానాస్పద మృతి.. మరిదే కారణమంటూ.. -
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు
వాషింగ్టన్: టెక్సాస్‌లో ఓ తల్లి తన నలుగురి పిల్లల్ని హ్యస్టన్ అపార్ట్మెంట్లో వదిలేసి తన భాగస్వామితో కలిసి ఉంటోంది. పైగా ఆమె తన భాగస్వామితో కలిసి ఒక కొడుకుని హత్య చేసి చంపేసిందనే అనుమానంతో ఆమెను అరెస్టు చేసినట్లు టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కొడుకులు ముగ్గురు హ్యుస్టన్ అపార్ట్మెంట్లో చనిపోయిన తమ సోదరుడి అస్థిపంజర అవశేషాలతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ క్రమంలో ఆ పిల్లలు తల్లి 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను తారుమారు చేసే నిమిత్తం ఆ పిల్లలను గాయపరిచినట్లు తెలిపారు. అంతేకాదు ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారని, చాలా కాలంగా తలితండ్రులిద్దరూ అక్కడ నివశించటం లేదని పేర్కొన్నారు. అయితే ఆ పిల్లలు చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. అంతేకాదు ఆ ముగ్గురి పిల్లల్లో ఇరుగు పొరుగు వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవించేవారిని చెబుతున్నారని పోలీసులు అన్నారు. (చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ) -
ప్రపంచంలోనే వృద్ధ కవలలు వీరే.. ఎక్కడున్నారంటే!
టోక్కో: ఈ కాలంలో 60,70 ఏళ్లు బతికితే చాలు అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ 90 ఏళ్లు బతికితే ఇక జీవితానికి అదే మహాభాగ్యం. కానీ జపాన్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు సెంచరీ దాటేసి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వృద్ధ కవలల విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. వారే ఉమెనో సుమియామా, కోమే కొడామా. ప్రస్తుతం వీరి వయస్సు 107 ఏళ్ల 320 రోజులు. జీవిస్తున్న వారిలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలుగా(మహిళలు) ఈ ఘనత సాధించినట్లు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు జపాన్ కవలల పేరిటే ఉంది. అయితే వారి వయసు 107 సంవత్సరాల 175 రోజులే కావడంతో ఇప్పుడు ఆ రికార్డు ఉమెనో సుమియామా, కోమే కొడామాలకు దక్కింది. వీరు 1913 వవంబర్ 5న వీరు జన్మించారు. తమ కుటుంబంలో మొత్తం 11 మంది పిల్లలు జన్మించగా.. తమ తల్లికి మూడో కాన్పులో ఈ కవలలు జన్మించారు. జంటగా పుట్టినా వీరిద్దరు ఒకేచోట పెరగలేదు. స్కూల్ చదివేరోజుల్లో కౌమే పనిచేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పుట్టిన ప్రాంతాన్ని వదిలి కుటుంబానికి దూరంగా పెరిగారు. అలాగే వివాహం కూడా ఉమెనో షాడో ద్వీపానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుని అక్కడే ఉండిపోగా కౌమే మాత్రం తల్లిదండ్రులతో ఉంటూ అక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ కవల అక్కచెల్లెళ్లు ఇద్దరు రెండు ప్రపంచ యుద్ధాల్ని చూశారు. ఇద్దరు 300 కి.మీ దూరంలో ఉండేవారు. దీంతో వారు కలుసుకోవటం కూడా చాలా తక్కువగా జరిగేది. బంధువుల పెళ్లిళ్లు, అంత్యక్రియల సమయాల్లో మాత్రమే కలుసుకునేవారు. ఒకరినొకరు చూసుకునేవారు. కానీ వారికి 70 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇద్దరు కలిసి సమయం గడపాలని అనుకున్నారు. అలా వారిద్దరు బౌద్ధ తీర్థయాత్రల కలిసి ప్రయాణించారు. ఇక 125 మిలియన్ల జనాభా కలిగిన జపాన్‌లో 29శాతం మంది 65 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. ఇందులో 86,510 మంది వందేళ్లు పూర్తి చేసుకున్నవారే. -
పంచాయితీ బరిలో అక్కా, చెల్లెళ్ల ఢీ
సాక్షి, కారంచేడు(ప్రకాశం) : ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అక్కడే ఇద్దరూ ఇంటర్ వరకు చదువుకున్నారు. అదే ఊరికి చెందిన ఒకే ఇంటి పేరున్న వారిని వివాహమాడారు. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామంలోని ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో ఉంచితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బరిలోకి దించారు. ఇంత వరకు ఇద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేకపోయినప్పటికీ. .ఇప్పుడు ఇద్దరు తమ, తమ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. చదవండి: ఓసారి ఊరొచ్చి పోప్పా.. కావాలంటే కారు పంపిస్తా! బొడ్డు అంకయ్య, బొడ్డు నరసింహం అన్నదమ్ములే ప్రత్యర్థులు.. మిట్టపాలెం(కొండపి): ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామంలో 793 ఓట్లుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 380 దాకా ఉంటాయి. సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవడంతో ఆదివారం అన్నదమ్ములు బొడ్డు నరసింహం, బొడ్డు అంకయ్యలు నామినేషన్లు వేశారు. 87 ఏళ్ల వయస్సులో పోటీ మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని శేరేపాలెం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు 1993లో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001–2006 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 87 ఏళ్ల వయస్సులోనూ మరోసారి సర్పంచ్‌గా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి 1995 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా, 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీ సభ్యురాలిగా చేశారు. -
ఆడపిల్లకు ఒక అక్క ఉండాలి!
పనిలో ఉన్నాడు అతను. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ‘అవునా!’ అన్నాడు మెల్లిగా. ముఖం మీదకు చిరునవ్వు వచ్చి వాలింది. అప్పటికి అతడి లంచ్ అవలేదు. అవకపోయినా కొంచెం వెయిట్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యాడు. చేమంతి పుట్టినప్పుడు కాదు.. ఇప్పుడయ్యాడు అతడు ఆడపిల్ల తండ్రి! స్కూల్ నుంచి వచ్చాడు చేమంతి అన్నయ్య. వస్తూనే ‘అమ్మా, చేమంతి ఎక్కడ?’ అని వెతుక్కున్నాడు. అమ్మ పుట్టాక (వాడు పుట్టాక అని అర్థం) అమ్మని వెతుక్కున్నాడు. చెల్లి పుట్టాక చెల్లిని వెతుక్కుంటున్నాడు. నిన్నటి ఆటేదో మధ్యలో ఆపేశారు అన్నాచెల్లెళ్లు. దాన్ని కంటిన్యూ చెయ్యాలి. అందుకే చెల్లి కోసం చూశాడు. ‘ఎక్కడుందో చూడు’ అని చెప్పే తల్లి.. ‘ఎందుకురా చేమంతి?’ అంది ఆరోజు! అదేం గ్రహించలేదు చేమంతి అన్నయ్య. ‘ఎక్కడికెళ్లింది చేమంతి?’ అని అడిగాడు. ‘ఎక్కడికీ వెళ్లలేదు. ఇకనుంచి చెల్లితో ఆటలు తగ్గించు. ఏడిపించడం కూడా..’ అంది తల్లి. తను కూడా కొన్ని తగ్గించింది. మొదట కూతుర్ని ముద్దు చెయ్యడం తగ్గించింది. ఆడపిల్ల ఎదిగాక అకస్మాత్తుగా ఆ ఇంట్లో పాత్రలు మారిపోయాయి. తండ్రి ఆమెకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యాడు. అన్న ఆమెకు ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండో. తల్లి ఆమెకు ఆంతరంగిక సలహాదారు. ముగ్గురూ ఆమెకు కొంచెం దూరం కూడా అయ్యారు. రక్షణ వలయం కాస్త ఎడంగానే కదా ఉంటుంది. అమ్మ, నాన్న, అన్నయ్యలా అమ్మాయికి ఒక స్నేహితుడు కూడా ఉంటే అతడు ఆమెకు జడ్ ప్లస్ కేటగిరీ అయ్యేవాడు. చేమంతి ఎందుకైనా మౌనంగా ఉంటే.. ‘ఏమైంది తల్లీ.. ఒంట్లో బాగోలేదా?’ అని తల్లి ఒళ్లోకి లాక్కుంటుంది. ‘పిల్లేంటి డల్‌గా ఉంది’ అని చేమంతి తండ్రి చేమంతి తల్లిని అడుగుతాడు. ‘చేమంతీ.. ఎందుకలా ఉన్నావ్!’ అని అన్నయ్య అడుగుతాడు. ‘ఏమైంది చేమంతీ! నేనేమైనా అన్నానా?’ అని చేమంతి స్నేహితుడు వెనక్కి ఆలోచిస్తాడు. చేమంతి కళ్లలో ఎందుకైనా నీళ్లు తిరుగుతుంటే ‘బయట ఎవరైనా ఏడిపిస్తున్నారా అమ్మా?’ అని తల్లి లోపలికి తీసుకెళ్లి అడుగుతుంది. ‘నేనున్నాను కదరా.. నాకు చెప్పు..’ అని తండ్రి కూతురి తల నిమురుతాడు. ‘చేమంతీ.. ఇలా రా.. కాలేజ్‌లో ఏమైనా జరిగిందా?’ అని అమ్మానాన్న లేకుండా చూసి అన్నయ్య అడుగుతాడు. ‘ఎవడాడు చేమంతీ.. పద’ అని హాకీ స్టిక్ చేతికిచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు చామంతి స్నేహితుడు. (చదవండి: గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) పన్నెండేళ్ల వయసుకొచ్చాక ఆడపిల్ల ఒంటికి ప్రొటెక్షన్ వస్తుంది. ఆమె ఆలోచనలకు ప్రైవసీ పోతుంది. ఎవడాడో చెప్పాలి. కాలేజ్‌లో ఏమైందో చెప్పాలి. మౌనంగా ఎందుకుందో చెప్పాలి. కన్నీళ్లు ఎందుకొస్తున్నాయో చెప్పాలి. చెప్పాలని ఉండి కూడా.. అమ్మకీ, నాన్నకీ, అన్నకీ, ఆఖరికి స్నేహితుడికీ చెప్పలేకపోతుంటే? తనే ధైర్యంగా ఉండాలి. తనే ధీమాగా, తనకు తనే హామీగా, తనే భద్రంగా, తనకు తనే రక్షణగా ఉండాలి. అలా ఉండాలంటే ఒక అక్క ఉండాలి. పన్నెండేళ్లు రాగానే ఇంట్లో వాళ్లంతా ఇంటి ఆడపిల్ల కోసం కత్తీ డాలూ పట్టుకుని రెడీ అయిపోతారు. పన్నెండేళ్లు వచ్చాక కాదు, పన్నెండేళ్లు వచ్చేలోపు ఆ కత్తీ డాలు పట్టుకోవడం తనకే తెలిసుండాలంటే ఇంట్లో అక్క ఉండాలి. అమ్మ ఇవ్వలేని అనువు, నాన్న ఇవ్వలేని చనువు, అన్న ఇవ్వలేని సుళువు, స్నేహితుడు ఇవ్వలేని నెలవు అక్క ఇస్తుంది. బయట జరిగింది ఇంట్లో చెప్పుకోడానికే కాదు, ఇంట్లో జరిగింది బయటికి చెప్పుకోడానికీ అక్క ఉండాలి. చెల్లెలికి అక్కను మించిన ఆప్తురాలు, ఆత్మీయ నేస్తం ఎవరూ ఉండరని 38 దేశాల్లో లక్షా 20 వేలమంది పిల్లల్ని స్టడీ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా వెల్లడించింది. అక్క గుండె చెల్లెలి కోసం కూడా కొట్టుకుంటుందట. అపరిచితురాలైనా.. ఆపదలో ‘అక్కా..’ అని పిలిస్తే అక్క కాకుండా పోతుందా?! - మాధవ్ శింగరాజు -
వాళ్ల వయసు 1042 ఏళ్లు
కెనడా: భలే ఫ్యామిలీ వీళ్లది! దేవుడి అనుగ్రహం దివ్యంగా ఉన్నట్లుంది. తొమ్మిది మంది అక్కచెల్లెళ్లు. ముగ్గురు అన్నదమ్ములు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం వీళ్లలో అందరికన్నా చిన్న వారి వయసు 75 ఏళ్లు. అందరికన్నా పెద్దవారి వయసు 97 ఏళ్లు. ఉత్సాహంగా మంచి ఫిట్నెస్తో ఉన్నారు. ఇప్పుడైతే ఇక ‘ఈ భూమండలంపై జీవించి ఉన్నవారిలో సహోదరులందరి వయసునూ కలుపుకుని 1042 ఏళ్ల వయసు కలిగిన వారిగా’ గిన్నిస్ బుక్‌లోకీ ఎక్కారు. ఆ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ ఒక గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. వీళ్లది కెనడా. ఉండటం వేర్వేరు దేశాల్లో అయినా ఈ నెల 15న తమ కోసం గిన్నిస్ వాళ్లు వస్తున్నారంటే కెనడాలోని పుట్టింటికి చేరుకున్నారు. లోకల్‌గా వీళ్లకు ‘డీక్రజ్ తోబుట్టువులు’ అని పేరు. డీక్రజ్ అనేది వాళ్ల ఇంటిపేరు. మూడేళ్లకోసారి సెలవులకు వీరంతా కలుస్తుంటారట. చదవండి: ఈయూలో టీకా షురూ -
వైరల్ వీడియో.. ఖచ్చితంగా లాయర్ అవుతావు
తోబుట్టువుల మధ్య అనుబంధం చాలా అందమైన విషయం. వారు ఒకరినొకరు ప్రేమిస్తారు, రక్షించుకుంటారు, వారు తమ రహస్యాలు అన్నీ పంచుకుంటారు. అలానే కొన్ని సార్లు బాగా దెబ్బలాడుకుంటారు. ఎంత పెద్ద గొడవ జరిగినా వెంటనే కలిసి పోతారు. పెద్దవాళ్లయ్యాక తెలియదు కానీ బాల్యంలో మాత్రం ఇలానే ఉంటారు. ఈ నేపథ్యంలో అన్నాచెల్లెలి పోట్లాటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన వారంతా తమ బాల్య స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. చిన్నారులను దీవిస్తున్నారు. ఈ వీడియోలో ఒక పదేళ్ల బాలిక తన సోదరుడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తన తల్లికి వివరిస్తుంది. దానిలో భాగంగా ఆ చిన్నారి చెప్పే కారణాలు, పలికించే భావాలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 53 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ చిన్నారి తన సోదరుడిని ఉద్దేశించి ‘మలాకీ నన్ను కొట్టాడు.. అతను నన్ను ఒంటరిగా వదిలేయడం లేదు కాబట్టి నేను అతనితో పోరాడటం మొదలుపెట్టాను. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను’ అని తెలియజేస్తుంది. ( వైరల్: మందు కోసం పిల్లోడిని పడేసింది) Malachi stressing homegirl out🥺😭 pic.twitter.com/9IbK7CsgTd — 🇧🇧 (@Rahsheem_) October 20, 2020 నెటిజనులకు ఈ వీడియో తెగ నచ్చింది. ఇప్పటికే దీన్ని 24.7 కే మంది చూడగా.. వేల మంది రీట్వీట్ చేశారు. ఇక మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్కి కూడా తెగ నచ్చింది. అలానే కొందరు ట్విట్టర్ యూజర్లు ‘పెద్దయ్యాక ఖచ్చితంగా లాయర్ అవుతారు.. చిన్నారిని లా చదివించండి.. తెగ వాదిస్తోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
వైరల్ : అప్పుడే నవ్వారు.. అంతలోనే సీరియస్ అయ్యారు
మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అక్కా తమ్ముడు సెల్పీ తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కెనెడాలో మ్యాపెల్ లీప్స్, పిట్స్బర్గ్ పెంగ్విన్స్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్ చూడడానికి కోస్టా బౌరికాస్(17), ప్యాట్రిసియా బౌరికాస్(20) వచ్చారు. మ్యాచ్ వీక్షిస్తూనే మధ్యలో ఓ సెల్పీ తీసుకున్నారు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా! మీరు ఆ వీడియోనూ జాగ్రత్తగా గమనిస్తే.. అసలు విషయం మీకే అర్థం అర్థమవుతుంది. సెల్పీ తీసుకుంటున్న సమయంలో ఓకేసారి నవ్విన వీరిద్దరూ అది పూర్తవ్వగానే సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అయితే వీరిద్దరు నవ్వు నుంచి సీరియస్ మోడ్‌లోకి ఒకే సమయంలో మారడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో 28.8 లక్షల మిలియన్వ్యూస్ వచ్చాయి. అయితే వీడియో చూసిన కొందరు నెటిజన్లు వీరిద్దరిని భార్యభర్తలేమే అనుకున్నారు. అయితే నెటిజన్లు పెట్టిన కామెంట్లకు 20 ఏళ్ల ప్యాట్రిసియా బౌరికాస్ స్పందిస్తూ.. వాడు నా తమ్ముడని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. 😂 #Leafs #HNIC pic.twitter.com/GdwrxEomG6 — Kevin Doherty (@magictoasterfi1) November 17, 2019 -
20 ఏళ్ల తర్వాత కలిసిన బంధం
వాషింగ్టన్: రక్తం పంచుకుపుట్టిన వారి మధ్య ఉండే అనుబంధమే వేరుగా ఉంటుంది. ఎంత దూరాన ఉన్నా.. ఎన్ని రోజుల తర్వాత కలిసినా ఆ బంధం మాత్రం చెరిగిపోదు. ఇందుకు సాక్ష్యంగా నిలిచింది అమెరికాలో జరిగిన ఓ సంఘటన. రక్తం పంచుకుపుట్టిన ఇద్దరు అన్నదమ్ములు దాదాపు 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకున్న ఆ సమయాన వారి భావాలను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. కేవలం చూసి అర్థం చేసుకోవాల్సిందే. ఇసాబెల్ గోడోయ్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘20 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ రోజు మా నాన్న తన సోదరుడిని కలుసుకోబోతున్నారు. సోదరుడికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం మా నాన్న కొన్ని గంటల ముందే విమానాశ్రయానికి వచ్చాడు’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దాదాపు 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇసాబెల్ తండ్రి.. తన సోదరుడి వెనకే నిల్చుని కెమరాకు హాయ్ చెప్పాడు. లగేజ్ కోసం ఎదురు చూస్తున్న అతడి సోదరుడు వెనక్కి తిరిగే సరికి ఎదురుగా ఇసాబెల్ తండ్రి. సోదరులిద్దరూ ఒకరినొకరు చూసుకున్న ఆ క్షణంలో వారి సంతోషాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆనందం నుంచి తేరుకుని సోదరులిద్దరూ ఒకర్ని ఒకరు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ తమ తల్లిని కలవడానికి అలస్కా వెళ్లారు. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 11 లక్షల మంది వీక్షించారు. My dad hasn’t seen his brother in over 20 years. This is my dad surprising him at the airport.🥺❤️ pic.twitter.com/Dp04AbjCAb — Isabel Godoy (@isabel_10g) July 25, 2019 -
అమెరికాలో అకృత్యం : కన్నబిడ్డలు 13 మందిని..
కాలిఫోర్నియా : ఒక్కరుకాదు ఇద్దరు కాదు సొంతపిల్లలు 13 మందిని చైన్లు, తాళ్లతో కట్టేసి, తిండిపెడ్డకుండా నరకం చూపించారా తల్లిదండ్రులు! తిండిలేక చిక్కిపోయి, తీవ్రమైన దుర్గంధంలో పడిఉన్న వారిని ఎట్టకేలకు పోలీసులు కాపాడారు. అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ అకృత్యం కాలిఫోర్నియా రాష్ట్రం రివర్సైడ్ కంట్రీలోని పెర్రిస్ పట్టణంలో వెలుగుచూసింది. ఓ పాప తప్పించుకుని 911కు ఫోన్ చేయడంతో..: డేవిడ్ అలెన్ టర్ఫిన్ - ఆనా టర్ఫిన్ దంపతులకు 13 మంది సంతానం. వారంతా 2 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారు. పెర్రిస్ శివారులోని రెండస్తుల ఇంట్లో ఉంటున్నారు. అంతమంది పిల్లలున్న ఆ ఇంట్లో.. చాలా నెలలుగా అలికిడి లేకపోయినా చుట్టుపక్కలవారు అంతగా పట్టించుకోలేదు. చైన్లు, తాళ్లతో పిల్లలందరినీ మంచాలకు కట్టేసి, అలెన్-ఆనాలు కూడా లోపలే ఉండిపోయారు. బందీలుగా ఉన్న పిల్లల్లో ఓ పాప మొన్న ఆదివారం ఇంట్లో నుంచి తప్పించుకుని 911కు ఫోన్ చేసి విషయం చెప్పింది. నిమిషాల వ్యవధిలోనే పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దుర్భరస్థితిలో పడిఉన్నవారిలో ఎనిమిది మంది మైనర్లుకాగా, మిగిలిన ఏడుగురూ 18ఏళ్లుపైబడినవారే! బాధితులందరినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. తల్లిదండ్రుల్ని అరెస్టు చేసి పలుసెక్షన్లకింద కేసు నమోదుచేశారు. ఎందుకుచేశారిలా? : అలెన్-ఆనా దంపతులు సొంతపిల్లలనే ఎందుకు టార్చర్ పెట్టారనే కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. పిల్లలు ఇంకా షాక్‌లోనే ఉన్నారని, వారు కోలుకున్న తర్వాతే అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. పిల్లలు బందీలుగా ఉన్న ఇల్లు, ఇన్సెట్లో నిందితులు అలెన్,ఆనా -
చనిపోయిన తల్లిదండ్రులే వారిని కలిపారు!
బీజింగ్: వెయిటింగ్ ఫర్ మీ అనే టీవీ కార్యక్రమం ద్వారా 27 ఏళ్ల క్రితం విడిపోయిన తోబుట్టువులు చైనాలో మళ్లీ కలిశారు. వారిని కలిపింది ఎవరో కాదు.. చనిపోయిన వారి తల్లిదండ్రులే. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. చనిపోయిన తల్లిదండ్రుల సమాధి నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా అక్కాతమ్ముడు కలిశారు. షో నిర్వాహకులతో పాటు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వారిని కంటతడిపెట్టించిన ఆ వివరాలు ఇవి. 1990వ సంవత్సరంలో యాన్యన్ అనే రెండేళ్ల బాలుడు రైల్వే స్టేషన్లో తప్పిపోయాడు. తప్పిపోయిన కొడుకు కోసం నాలుగేళ్ల కూతురు జియాయును అమ్మమ్మ వద్ద వదిలేసి.. తల్లిదండ్రులు వెతకని చోటులేదు. ఉద్యోగాన్ని వదిలేసి రెండేళ్ల పాటు యాన్యన్‌ను వెతికుతూ.. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తరువాత తమ్ముడిని వెతికే బాధ్యతను జియాయు తీసుకుంది. ఈ క్రమంలో 2015లో పబ్లిక్ సెక్యురిటీ అఫిసియల్ వెబ్సైట్లో జియాయు తన డీఎన్ఏ వివరాలను నమోదుచేసుకుంది. రైల్వే స్టేషన్లో తప్పిపోయి అక్రమ రవాణా ద్వారా తూర్పు చైనాకు చేరుకున్న యాన్యన్ కూడా సరిగ్గా ఇదే సమయంలో తన డీఎన్ఏ వివరాలను ఆ వెబ్సైట్లో నమోదు చేశాడు. అయితే.. ఈ రెండు డీఎన్ఏల మధ్య సారూప్యతలు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోల్చడం ద్వారా వీరిద్దరు తోబుట్టువులని నిర్థారణ అయింది. దీంతో వెయిటింగ్ ఫర్ మీ అనే సీసీటీవీ కార్యక్రమం ద్వారా వారు కలిశారు. సమాధుల నుంచి తల్లిదండ్రుల డీఎన్ఏను సేకరించడానికి అక్కడి కట్టుబాట్ల పరంగా కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. జియాయు ధైర్యంగా సోదరుడి కోసం ముందడుగు వేసింది. ‘యాన్యన్ నువ్వు ఎక్కడ ఉన్నావ్. ఈ అమ్మ మొహాన్ని గుర్తుంచుకో. నిన్ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నా. ఎప్పుడూ నీ గురించే కలగంటున్నా’ అంటూ కొడుకు కోసం మరణించిన తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని మాటలను టీవీ కార్యక్రమంలో జియాయూ వినిపించింది. ఇక.. తమ్ముడిని తల్లిదండ్రుల సమాధి వద్దకు తీసుకెళ్లి మీ కొడుకు తిరిగొచ్చాడని చెప్తానని జియాయు తెలిపింది. కాగా.. తూర్పు చైనాలోని ఓ ఫ్యామిలీతో పాటు ఉంటున్న తాను.. అక్కడి వారి పోలికలు వేరుగా ఉండటంతో అనుమానంతో డీఎన్ఏ వివరాలు నమోదు చేశానని యాన్యన్ వెల్లడించాడు. -
పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి
దర్భాంగా: బిహార్‌లోని దర్భాంగా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టొలి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు పాముకాటుతో మృతి చెందారు. అన్నాచెల్లెలు.. ఆనంద్ పండిట్(12), కిరణ్ కుమారి(10)లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శనివారం అర్థరాత్రి సమయంలో వారిని పాము కాటేసింది. వీరిని తల్లిదండ్రలు వెంటనే దర్భాంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దిల్నవాజ్ అహ్మద్ వెల్లడించారు. మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
రెండేళ్ల చిన్నారి సాహసయాత్ర!
బీజింగ్: రెండేళ్ల చైనా చిన్నారి చేసిన సాసహయాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిన్నారి తనతో పాటు ఏడాది వయసున్న తమ్ముడు, చెల్లిని వెంట తీసుకొని సిటీ చూడటానికి బయలుదేరింది. ఒంటిమీద బట్టలు కూడా లేకుండా ఉన్న ఆ పాప.. ప్యాంపర్స్తో ఉన్న ఇద్దరిని వెంటబెట్టుకొని సాగించిన ఆ సాహసయాత్ర చివరికి పోలీస్ స్టేషన్లో ముగిసింది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్సులో ఓ రెండేళ్ల చిన్నారి తన ఇద్దరు సిబ్లింగ్స్ను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. జియాండే టౌన్లో అలా నడుచుకుంటూ వెళ్తన్న వారికి ఎదురైన స్థానికులు.. చిన్నారులు పెద్దవారి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్తుడటం చూసి ఆశ్చర్యపోయారు. కొందరైతే ముద్దులొలికే చిన్నారులకు లాలీపాప్‌లు కూడా ఇచ్చి సంతోషపడ్డారు. అనంతరం చిన్నారుల విషయాన్ని పోలీసులకు తెలుపగా వారు ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన చిన్నారుల తల్లి.. తాను ఇంట్లో నిద్రపోతున్న సమయంలో చిన్నారులు బయటకు వచ్చారని తెలిపింది. వేకువజామునే ఆఫీసుకు వెళ్లిన తన భర్త.. డోర్ లాక్ చేయడం మరిచాడని, అందుకే చిన్నారులు బయటకు వెళ్లారని పోలీసులకు తెలిపింది. నిద్రలేవగానే చిన్నారుల కోసం బయటంతా గాలించినా ఫలితం లేదని.. పోలీసులు తీసుకెళ్లారన్న విషయం ఓ స్థానికుడు తనకు చెప్పినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు వివరాలను సరిచూసుకొని చిన్నారులను ఆమెకు అప్పగించారు. వారు నివాసమున్నది ఓ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో అన్న విషయం విని పోలీసులు షాక్ తీన్నారు. పిల్లలను వదిలేసి గుర్రుపెట్టిన సదరు తల్లిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తుండగా.. కొందరు మాత్రం 'పాపం ఆమె తప్పేం లేదు.. పెద్దమ్మాయే(రెండేళ్లపాప) సాహసయాత్రకు బయలుదేరింది' అంటున్నారు.