తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు/కూతురు ఉంటే హ్యాపీ అనుకుంటారు గానీ. అది అస్సలు నిజం కాదు. తమ్ముడో, చెల్లో ఉంటే ఆ దారే వేరు. ఆ బలమే వేరు. అలాంటి తోబుట్టువులకు సంబంధించిన ఒక రోజు ఉందని తెలుసా... ఈ బిజీ లైఫ్‌లో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు బంధాలు ఉంటున్నాయి. అందుగురించే ఓ రోజుని ఏర్పాటు చేసి మనతో పాటు అమ్మ కడుపున పుట్టిన వాళ్లను అస్సలు విస్మరించొద్దు అని చెబుతున్నారు. దీన్ని మనం ప్రతి ఏటా ఏప్రిల్ 10న తోబుట్టువుల దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీ తోబుట్టువులు జాబితా గురించి చర్చిద్దామా? రక్త సంబంధాలను ఎలా బలంగా పదిలపర్చుకోవాలో కూడా సవివరంగా తెలుసుకుందాం..!
ఎంతటి వ్యక్తికైనా తన భాగస్వామి తోపాటు తోడబుట్టిన వాళ్లతో సత్సంబంధాలు బాగుండాలి. మన తోపాటు పుట్టిన వాళ్లని విస్మరించకూడదు. అంతెందుకు మన రామాయణంలో లక్ష్మణుడి కోసం రాముడు ఎంతగా పరితపిస్తాడో చక్కగా వివరించి ఉంటుంది. అందులో భార్య లేదా భర్త విధి వశాత్తు దూరమైతే మరొకరు ఆ స్థానం భర్తీ చేయగలరు గానీ మన తోడబుట్టినోడు దూరమైతే మరోకరు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఎంతో ఉద్విగ్నంగా రాసి ఉంటుంది. అంత గొప్ప రక్త సంబంధం అది. మృత్యువు తప్ప ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదు అన్నంత దృఢంగా ఉంచుకోవాలి. అలానే మన సినీ సెలబ్రెటీల తోబుట్టువులు ఒకరికొకరం అన్నంతగా ఉన్న వారెవరో చూద్దామా..!
షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్
ఇద్దరు స్టైలిష్ లుక్‌లో ఉండే సోదరులు ద్వయం. ఇరువు మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌తో కూడిని బంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి ఉండే గౌరవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరి రిలేషన్ నుంచి తోబుట్టువని చిన్న చూపు కాకుండా గౌరవప్రదంగా చూసుకోవాలనే విషయం తెలుస్తుంది. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించాలంటే ముందు పెద్దవాళ్లే సరైన విధంగా ప్రవర్తించాలని చెబుతోంది.
జాన్వీ కపూర్ -ఖుషీ కపూర్
టాలీవుడ్ అందాల రాశి దివంగంత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. ఇద్దరూ అమ్మకు తగ్గ అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇరువురు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. వారి తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడూ జాన్వీ తల్లిలా మారి తన చెల్లి ఖుషీకి ధైర్యం చెబుతూ మార్గ నిర్దేశించిన విధానం గురించి సోషల్ మీడియాల్లో విన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా ఇద్దర్ని కోల్పోయినప్పుడు మన తోడబుట్టిన వారికి ఎలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాలన్నది తెలియజేస్తుంది. అవసరమైతే తల్లిదండ్రులు రోల్‌ని తీసుకుని మరీ వారిపట్ల బాధ్యతతో వ్యవహరించాలనే విషయాన్ని తెలియజేబుతోంది.
కరిష్మా కపూర్ -కరీనా కపూర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ నటుల అయిన ఈ సిస్టర్స్ ద్వయం ఎక్కడకు వెళ్లిన కలిసే వెళ్తుంటారు. కెరీర్ పరంగా మీడియా ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలు తెప్పించే ప్రయత్నం చేసినా..మాలో ఎవరికి స్టార్‌డమ్ వచ్చినా హ్యాపీనే అని హుందాగా చెప్పి ఆశ్చర్యపరిచిన పలు సందర్భాలు అనేకం. కష్టకాలంలో తోబుట్టువుకి ఎలా మద్దతు ఇవ్వాలన్నది కూడా వారిని చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. కేవలం సంతోషంగా ఉంటేనే తోబట్టువులు గుర్తు తెచ్చుకోకూడదు. బాధలో ఉన్నప్పుడు తరచి తరచి వారి బాగోగులు తెలుసుకోవాలి, వారికి కావాల్సినంత అండ దండ ఇవ్వాల్సి కూడా ఉంటుందనే విషయం తప్పక గ్రహించాలి.
సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్
అన్నా-చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్‌ల ద్వయంని చూస్తే తెలుస్తుంది. ఇద్దరు రాజకుటుంబానికి చెందిన వారి వల్లే మంచి అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తారు. ఇరువురు స్నేహితులేమో అనుకునేలా ఉంటారు. చెబితేగాని తెలియదు అన్నాచెల్లెళ్లు అని. మన తోడబుట్టిన వాళ్లతో ఇంతలా సరదాగా ఓ స్నేహితుడితో ఉన్నంత చనువుగా ఉండాలని చెప్పకనే చెబుతోంది వీరి బంధం.
కృతి సనన్- నూపూర్ సనన్
అక్కా చెల్లెళ్లు ఎలా ఉండాలనేందుకు ఈ ఇద్దరే ఆదర్శం. అక్కా చెల్లెళ్లు అనంగానే కాస్త రాగద్వేషాలు, అసూయలు రాజుకుంటాయి. అది అందం లేదా కెరీర్ పరంగానైనా ఉండొచ్చు. కానీ వీళ్ల మధ్య వాటికి స్థానం లేదు. ప్రేమగా మెలుగుతున్న వారిని చూస్తే ఎవ్వరికైన అసూయాగా అనిపిస్తుంది. అబ్బా నాకు ఓ అక్క లేదా చెల్లి ఉంటే బాగుండును అనిపిస్తుంది. తగాదాలకు తావివ్వకుండా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ మంచి సోదరీమణుల్లా మెలుగుతుంది ఈ సిస్టర్స్ ద్వయం.
చివరిగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్
ఈ ముగ్గురు అన్నదమ్ములు విచిత్ర సోదరులు సినిమాలోని సోదరుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటారు. వీరినుంచి ఐక్యమత్యంగా ఎలా ఉండాలనేది నేర్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే తోబుట్టువుల మధ్య ఉండాల్సింది ఐక్యమత్యమే!.
(చదవండి: ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..)
Comments
Please login to add a commentAdd a comment