bond
-
రూ.1,500 కోట్లే చివరి రుణం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి రుణాన్ని ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకోనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఈ అప్పును సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 27 సంవత్సరాల కాలపరిమితితో రూ.1000 కోట్లు, 30 సంవత్సరాల కాలపరిమితితో మరో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. కాగా, ఈ రూ.1500 కోట్ల రుణంతో బహిరంగ మార్కెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.55,800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నట్టు అవుతుంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఏడాది జూలై నెలలో రూ.8 వేల కోట్లు, ఆగస్టులో రూ.6 వేల కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.5,800 కోట్లు ఆర్బీఐ ద్వారా రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మార్చి నెలలో ఇప్పటికే రూ. 5 వేల కోట్లను సమకూర్చుకుంది. ఈనెల 4న రూ.2 వేల కోట్లు, 11న రూ.3 వేల కోట్లు తీసుకున్న ప్రభుత్వం.. ఈనెల 25న మరో రూ.1,500 కోట్లు తీసుకోనుంది. షెడ్యూల్లో సగమే! అయితే, తొలి మూడు త్రైమాసికాల్లో రూ. 40వేల కోట్లకు పైగా రుణాన్ని ఆర్బీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరి త్రైమాసికంలో మరో రూ.30 వేల కోట్లు తీసుకోవాలని భావించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్లోనే ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చింది. కానీ, చివరి మూడు నెలల్లో కేవలం రూ.15,300 కోట్ల రుణాలకు మాత్రమే పరిమితమైంది. అదే షెడ్యూల్ మేరకు రుణాలు తీసుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై మరో రూ.14,700 కోట్ల రుణభారం పడేది.కానీ, ప్రభుత్వం మాత్రం ఆ మేరకు రుణ సేకరణ జరపలేదు. ఈ విషయమై ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘చివరి మూడు నెలల అవసరాలను బట్టి రూ.30 వేల కోట్లు అప్పులు అనివార్యమనే ఉద్దేశంతో ఆర్బీఐకి షెడ్యూల్ ఇచ్చాం. కానీ అనివార్యం కాకపోవడంతో తీసుకోలేదు. షెడ్యూల్లో పెట్టినా అవసరమైనప్పుడు మాత్రమే బిడ్డింగ్‌కు వెళ్లే వెసులుబాటు ఆర్బీఐ కలి్పస్తుంది.’అని వెల్లడించారు. -
భగ్గుమన్న భారత్, కెనడా బంధం. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
-
సిబ్లింగ్స్ డే: సెలబ్రెటీ సిబ్లింగ్స్..ఆ బంధం ఏం చెబుతోందంటే..!
తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు/కూతురు ఉంటే హ్యాపీ అనుకుంటారు గానీ. అది అస్సలు నిజం కాదు. తమ్ముడో, చెల్లో ఉంటే ఆ దారే వేరు. ఆ బలమే వేరు. అలాంటి తోబుట్టువులకు సంబంధించిన ఒక రోజు ఉందని తెలుసా... ఈ బిజీ లైఫ్‌లో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు బంధాలు ఉంటున్నాయి. అందుగురించే ఓ రోజుని ఏర్పాటు చేసి మనతో పాటు అమ్మ కడుపున పుట్టిన వాళ్లను అస్సలు విస్మరించొద్దు అని చెబుతున్నారు. దీన్ని మనం ప్రతి ఏటా ఏప్రిల్ 10న తోబుట్టువుల దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీ తోబుట్టువులు జాబితా గురించి చర్చిద్దామా? రక్త సంబంధాలను ఎలా బలంగా పదిలపర్చుకోవాలో కూడా సవివరంగా తెలుసుకుందాం..! ఎంతటి వ్యక్తికైనా తన భాగస్వామి తోపాటు తోడబుట్టిన వాళ్లతో సత్సంబంధాలు బాగుండాలి. మన తోపాటు పుట్టిన వాళ్లని విస్మరించకూడదు. అంతెందుకు మన రామాయణంలో లక్ష్మణుడి కోసం రాముడు ఎంతగా పరితపిస్తాడో చక్కగా వివరించి ఉంటుంది. అందులో భార్య లేదా భర్త విధి వశాత్తు దూరమైతే మరొకరు ఆ స్థానం భర్తీ చేయగలరు గానీ మన తోడబుట్టినోడు దూరమైతే మరోకరు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఎంతో ఉద్విగ్నంగా రాసి ఉంటుంది. అంత గొప్ప రక్త సంబంధం అది. మృత్యువు తప్ప ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదు అన్నంత దృఢంగా ఉంచుకోవాలి. అలానే మన సినీ సెలబ్రెటీల తోబుట్టువులు ఒకరికొకరం అన్నంతగా ఉన్న వారెవరో చూద్దామా..! షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్ ఇద్దరు స్టైలిష్ లుక్‌లో ఉండే సోదరులు ద్వయం. ఇరువు మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌తో కూడిని బంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి ఉండే గౌరవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరి రిలేషన్ నుంచి తోబుట్టువని చిన్న చూపు కాకుండా గౌరవప్రదంగా చూసుకోవాలనే విషయం తెలుస్తుంది. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించాలంటే ముందు పెద్దవాళ్లే సరైన విధంగా ప్రవర్తించాలని చెబుతోంది. జాన్వీ కపూర్ -ఖుషీ కపూర్ టాలీవుడ్ అందాల రాశి దివంగంత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. ఇద్దరూ అమ్మకు తగ్గ అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇరువురు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. వారి తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడూ జాన్వీ తల్లిలా మారి తన చెల్లి ఖుషీకి ధైర్యం చెబుతూ మార్గ నిర్దేశించిన విధానం గురించి సోషల్ మీడియాల్లో విన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా ఇద్దర్ని కోల్పోయినప్పుడు మన తోడబుట్టిన వారికి ఎలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాలన్నది తెలియజేస్తుంది. అవసరమైతే తల్లిదండ్రులు రోల్‌ని తీసుకుని మరీ వారిపట్ల బాధ్యతతో వ్యవహరించాలనే విషయాన్ని తెలియజేబుతోంది. కరిష్మా కపూర్ -కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ నటుల అయిన ఈ సిస్టర్స్ ద్వయం ఎక్కడకు వెళ్లిన కలిసే వెళ్తుంటారు. కెరీర్ పరంగా మీడియా ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలు తెప్పించే ప్రయత్నం చేసినా..మాలో ఎవరికి స్టార్డమ్ వచ్చినా హ్యాపీనే అని హుందాగా చెప్పి ఆశ్చర్యపరిచిన పలు సందర్భాలు అనేకం. కష్టకాలంలో తోబుట్టువుకి ఎలా మద్దతు ఇవ్వాలన్నది కూడా వారిని చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. కేవలం సంతోషంగా ఉంటేనే తోబట్టువులు గుర్తు తెచ్చుకోకూడదు. బాధలో ఉన్నప్పుడు తరచి తరచి వారి బాగోగులు తెలుసుకోవాలి, వారికి కావాల్సినంత అండ దండ ఇవ్వాల్సి కూడా ఉంటుందనే విషయం తప్పక గ్రహించాలి. సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అన్నా-చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ల ద్వయంని చూస్తే తెలుస్తుంది. ఇద్దరు రాజకుటుంబానికి చెందిన వారి వల్లే మంచి అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తారు. ఇరువురు స్నేహితులేమో అనుకునేలా ఉంటారు. చెబితేగాని తెలియదు అన్నాచెల్లెళ్లు అని. మన తోడబుట్టిన వాళ్లతో ఇంతలా సరదాగా ఓ స్నేహితుడితో ఉన్నంత చనువుగా ఉండాలని చెప్పకనే చెబుతోంది వీరి బంధం. కృతి సనన్- నూపూర్ సనన్ అక్కా చెల్లెళ్లు ఎలా ఉండాలనేందుకు ఈ ఇద్దరే ఆదర్శం. అక్కా చెల్లెళ్లు అనంగానే కాస్త రాగద్వేషాలు, అసూయలు రాజుకుంటాయి. అది అందం లేదా కెరీర్ పరంగానైనా ఉండొచ్చు. కానీ వీళ్ల మధ్య వాటికి స్థానం లేదు. ప్రేమగా మెలుగుతున్న వారిని చూస్తే ఎవ్వరికైన అసూయాగా అనిపిస్తుంది. అబ్బా నాకు ఓ అక్క లేదా చెల్లి ఉంటే బాగుండును అనిపిస్తుంది. తగాదాలకు తావివ్వకుండా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ మంచి సోదరీమణుల్లా మెలుగుతుంది ఈ సిస్టర్స్ ద్వయం. చివరిగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ ఈ ముగ్గురు అన్నదమ్ములు విచిత్ర సోదరులు సినిమాలోని సోదరుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటారు. వీరినుంచి ఐక్యమత్యంగా ఎలా ఉండాలనేది నేర్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే తోబుట్టువుల మధ్య ఉండాల్సింది ఐక్యమత్యమే!. (చదవండి: ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..) -
రూపాయి హై జంప్: కారణం ఇదే!
Rupee rises దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్లో పుంజుకుంది. ఆరంభంలోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో 82.93 వద్ద ముగిసింది. గురువారం 2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 2024 , జూన్ నుంచి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను (IGBs) చేర్చనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ స్వాగతించింది. (సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ) ప్రధాన గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం వల్ల దేశ రుణ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ప్రవాహం భారీగా పెరగనుందని అంచనా. భారత ప్రభుత్వ బాండ్లను , బెంచ్‌మార్క్ ఎమర్జింగ్-మార్కెట్ ఇండెక్స్‌లో చేర్చాలని జేప్ మోర్గాన్ చేజ్ & కో తీసుకున్న నిర్ణయం, భారతదేశ డెట్ మార్కెట్ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని ఫారెక్స్ వ్యాపారులు భావిస్తున్నారు. రూపాయి ఎన్‌డిఎఫ్ మార్కెట్లలో సుమారు 0.42 శాతం వృద్ధి చెంది 82.80 స్థాయిలకు చేరుకోవడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోగా,నిఫ్టీ 19700 దిగువన స్థిరపడింది. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 105.48కి చేరుకుంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 93.87 డాలర వద్ద ఉంది. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ3,007.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. (క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
మరో భారత్ బాండ్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ తాజాగా మరో బాండ్ ఇండెక్సును ప్రారంభించింది. నిఫ్టీ భారత్ బాండ్ ఇండెక్స్ సిరీస్‌లో భాగంగా ఏప్రిల్ 2033ను ప్రవేశపెట్టింది. అత్యధిక భద్రతగల ఏఏఏ రేటింగ్ ప్రభుత్వ బాండ్లతో ఎన్ఎస్ఈ బాండ్ ఇండెక్సులను ఆవిష్కరిస్తోంది. వీటిలో భాగంగా ఏప్రిల్ 2033ను విడుదల చేసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. భారత్ బాండ్ ఇండెక్స్‌లో భాగంగా తొలు త 2019 డిసెంబర్లో ఏప్రిల్ 2023, ఏప్రిల్ 2030 గడువులతో బాండ్ ఇండెక్సులను ప్రవేశపెట్టింది. తదుపరి 2020 జులైలో మరోసారి ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2031 గడువులతో ఇండెక్సులను ఆవిష్కరించింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ సిరీస్‌లో భాగంగా త్వరలో విడుదల చేయనున్న ఆరో భారత్ బాండ్ ఈటీఎఫ్ ద్వారా భారత్ బాండ్ ఇండెక్స్ 2033ను ట్రాక్ చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
గ్రేటర్ సూపర్ స్టార్.. నగరంపై నటశేఖరుడి ముద్ర
సాక్షి, హైదరాబాద్: కొండలు..గుట్టలు..అడవి..జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి నడవడం, సైకిల్‌పై వెళ్లడం తప్పితే కార్లు, ద్విచక్రవాహనాలు వెళ్లలేని పరిస్థితి. అలాంటి ప్రదేశాన్ని తన అభిరుచికి అనుగుణంగా కష్టపడి అద్భుతమైన స్టూడియోగా నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ. సినీ పరిశ్రమ నగరంలో స్థిరపడడంలో సూపర్‌స్టార్ కీలక పాత్ర పోషించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పద్మాలయా స్టూడియో నిర్మాణం. ముఖ్యంగా ఫిలింనగర్ అభివృద్ధికి మూలం సూపర్‌స్టారే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు 1981లో తరలిరాగా సినిమా షూటింగ్‌లకు అప్పట్లో అన్నపూర్ణ స్టూడియో మాత్రమే అందుబాటులో ఉండేది. పెద్ద ఎత్తున సినిమా షూటింగ్‌లు జరుగుతున్న హైదరాబాద్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా ఇక్కడే స్థిరపడాలంటే మరో స్టూడియో అవసరాన్ని 50 సంవత్సరాల క్రితమే కృష్ణ గుర్తించారు. తెలుగు సినిమాల షూటింగ్‌లు మళ్లీ మద్రాసుకు వెళ్లకుండా హైదరాబాద్‌లోనే స్థిరపడాలన్న దృఢసంకల్పంతో ఇక్కడ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు ఉన్న జూబ్లీహిల్స్, ఫిలింనగర్ లాంటి కాలనీలు లేని ఆ కాలంలో హైదరాబాద్‌కు దూరంగా..విసిరేసినట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పద్మాలయ స్టూడియో నిర్మాణం కోసం 1983లో తొమ్మిదిన్నర ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన కృష్ణ.. వెనక్కి తిరిగి చూసుకోకుండా రెండేళ్ల వ్యవధిలోనే నాలుగు ఫ్లోర్లు నిర్మించి ఇక్కడే కోర్టు హాల్, పోలీసు స్టేషన్, దేవాలయం, మసీదు, చర్చి తదితర సెట్టింగ్‌లను నిర్మించారు. ఆ తర్వాత మొత్తం చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడగా పద్మాలయ స్టూడియోలో రేయింబవళ్లు ప్రతి రో జూ నాలుగైదు షూటింగ్‌లు జరుగుతూ కళకళలాడింది. కలల స్టూడియోగా... ఈ పద్మాలయ స్టూడియోను కృష్ణ తన కలల సౌధంగా తీర్చిదిద్దుకుని అపురూపంగా చూసుకునే వారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, రాజేష్ ఖన్నా వంటి నాటి బాలీవుడ్ హీరోల సినిమాలు కూడా ఈ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకొన్నాయి. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి దక్షిణాది అగ్రహీరోల సినిమా షూటింగ్‌లు కూడా ఇదే స్టూడియోలో జరిగాయి. ముంబయి, మద్రాసు, కేరళ, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి షూటింగ్‌ల కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు పద్మాలయా స్టూడియోకు క్యూ కట్టడంతో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకుంది. నాటి రాళ్లు, రప్పులు, రత్నాలుగా మారి ఈ ప్రాంతానికి ఎనలేని శోభను చేకూరింది. కృష్ణ తన షూటింగుల్ని ఫిలింనగర్‌లోని తన ఇంట్లో కూడా తీసేవారు. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా తరలిరావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్లతో పాటు కృష్ణ చేసిన కృషిని తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నటికీ మరిచిపోలేదు. కేవలం కృష్ణ కృషి వల్లే ఇప్పడు ఉన్న ఫిలింనగర్ ప్రాంతమంతా కళకళలాడుతోందని చెప్పొచ్చు. సొంత డబ్బుతో రోడ్లు ఇప్పుడు ఉన్న ఫిలింనగర్ రోడ్ నెం.1 ప్రధాన రహదారి నుంచి పద్మాలయ స్టూడియో వరకు తన సొంత డబ్బులతో కృష్ణ ఆ కాలంలో కంకర రోడ్డు వేయించి రాకపోకలను సులువు చేశారు. అదే సమయంలో ఫిలింనగర్‌లోనే సొసైటీ నుంచి ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. పూర్తిగా తన మకాంను హైదరాబాద్‌కు మార్చడంతో ఆయన సినిమా షూటింగ్‌లన్నీ పద్మాలయ స్టూడియోలో జరుగుతూ తెలుగు చిత్రపరిశ్రమ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లింది. అప్పట్లో పద్మాలయ స్టూడియో నిర్మించకపోతే మళ్లీ షూటింగ్‌లకు తెలుగు పరిశ్రమ మద్రాసుకు వెళ్లేదని పలువురు సినీ పెద్దలు కృష్ణ నిర్ణయాన్ని స్వాగతించారు. పద్మాలయా స్టూడియో నిర్మాణం తర్వాతనే పక్కనే రామానాయుడు స్టూడియో కూడా నిర్మాణం జరుపుకుంది. అనంతరం ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో నిర్మాణాలు జరిగి అనేక సౌకర్యాలు సమకూరాయి. అనతికాలంలో వృద్ధి చెందింది. అచ్చొచ్చిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. విజయదుందుభి మోగించిన సినిమాలెన్నో... ముషీరాబాద్: సినీ వినోద కేంద్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సినిమా థియేటర్లలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా విడుదలైందంటే చాలు అభిమానులకు పండగే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దాని చుట్టు పక్కల గల సుమారు 15 థియేటర్లలో ఎప్పుడు ఏదో ఒక థియేటర్లో కృష్ణ సినిమా ఆడాల్సిందే. ఎక్కువగా సుదర్శన్ 35 ఎంఎం, 70 ఎంఎం, సంగం థియేటర్లలో కృష్ణ సినిమాలు విడుదలయ్యేవి. మొదటి రోజు సినిమా, ప్రివ్యూలు వీక్షించేందుకు కృష్ణ అనేక సార్లు క్రాస్‌రోడ్స్‌కు వచ్చి సినిమా వీక్షించే వారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రజారాజ్యం, ఈనాడు సినిమాలు సంధ్యా థియేటర్లో వంద రోజులు ఆడి రికార్డులు సృష్టించాయి. పాడి పంటలు బసంత్ టాకీస్‌లో వంద రోజులు నడిచింది. ఇక సుదర్శన్ 70ఎంఎంలో అగ్నిపర్వతం 175 రోజులు ఆడగా..అల్లూరి సీతారామరాజు సంగం థియేటర్లో విడుదలై సంచలనం సృష్టించింది. మొట్టమొదటిసారిగా కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా స్కోప్‌లో డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో విడుదలైన సింహాసనం దేవి థియేటర్లో విడుదలై శత దినోత్సవం జరుపుకొంది. దేవిలో ఆ సినిమా టికెట్లు నెల రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయంటే కృష్ణకు ఉన్న క్రేజ్ ఏ పాటితో ఇట్టే అర్థం అవుతుంది. ఇక కృష్ణ ఫ్యాన్స్ మిగిలిన వారికి భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా ఉండేవారని పలువురు థియేటర్ల యజమానులు కొనియాడుతున్నారు. మహేష్‌బాబు సినిమాల్లోనే కాదు యాడ్స్‌లోనూ సూపర్ హీరోనే. కానీ కృష్ణ విషయానికి వస్తే... యాడ్ వరల్డ్‌తో ఆయనకు పరిచయమే లేదనుకుంటాం. అలాంటి కృష్ణ కూడా నగరానికి చెందిన రెండు సంస్థల యాడ్స్‌లో నటించారు. ‘మొదట ఆయన కూడా నాతో యాడ్ ఏమిటి? అన్నారు. అయితే నా కాన్సెప్ట్ విన్నాక కన్విన్స్ అయ్యారు. యాడ్ చిత్రీకరణ సందర్భంగా కొన్ని రోజులు ఆయనతో గడపడం నా జీవితంలో మరచిపోలేను. ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా’ అని చెప్పారు యాడ్ ఫిల్మ్ రూపకర్త యమునా కిషోర్. తొలి యాడ్‌ని పూర్తిగా ఇంట్లోనే తీస్తామని చెప్పి ఆయన్ని ఒప్పించామన్నారు. షూటింగ్ సమయంలో ఇంట్లో స్వంత మనుషుల్లా తమ టీమ్‌ను ఆదరించారంటూ గుర్తు చేసుకున్నారు. అలా తనపై ఏర్పడిన మంచి అభిప్రాయంతో ఆ తర్వాత మరో యాడ్‌కు కూడా ఆయన్ను సులభంగా ఒప్పించగలిగానని చెప్పారు. లలితకళాతోరణంలో సన్మానం... ‘1993లో ఒకసారి కృష్ణ, విజయనిర్మల దంపతులిద్దర్నీ కలిపి లలితకళాతోరణంలో సన్మానించే అవకాశం లభించింది. వీలున్నంత వరకూ సన్మానాలు, సభలు అంటే ఆయన దూరంగా ఉండేవారు పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా సున్నితంగా కాదని చెప్పేవారు’ అంటూ గుర్తు చేసుకున్నారు నగరానికి చెందిన కిన్నెర ఆర్ట్స్ సంస్థకు చెందిన రఘురామ్. అయితే స్నేహానికి మాత్రం ఆయన దూరంగా ఎప్పుడూ లేరని, తనను ఒకసారి కలిస్తే మళ్లీ ఎక్కడ కలిసినా గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించేవారని చెప్పారు. చిన్ననాటి మిత్రులు.. సూపర్ స్టార్ డమ్ వచ్చినా చిన్ననాటి ఫ్రెండ్స్‌ని మాత్రం కృష్ణ ఎప్పుడూ మరచిపోలేదని ఆయన స్నేహితులు అంటున్నారు. ‘‘కృష్ణ నేను కలిసి చదువుకున్నాం. తర్వాత కూడా ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించాను. సినిమాకు సంబంధించి అన్ని శాఖల మీదా కృష్ణకు ఉన్నంత పట్టు నేను మరెవ్వరిలో చూడలేదు’’ అంటూ చెప్పారు నాగోలు నివాసి, ప్రముఖ సినీ విశ్లేషకులు ఎస్వీ రామారావు. కృష్ణ జ్ఞాపకాల్లో... నటశేఖరుడితో ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం.. సూపర్‌స్టార్‌ని తలచుకుంటున్న నగరం ఒకసారి కలిస్తే మరచిపోలేం అంటున్న సిటీజనులు ఆయన గురించి పుస్తకం రాశా... ‘సినిమా ప్రముఖుల గురించి పుస్తకాలు రాస్తున్న క్రమంలో కృష్ణగారిని కూడా కలిశాను. ఆయన గురించి రాస్తున్నాను అనగానే శుభాకాంక్షలు చెప్పారు’ అంటూ గుర్తు చేసుకున్నారు గురుప్రసాద్. తాను రాసిన సూపర్ స్టార్ పుస్తకాన్ని నగరానికి చెందిన కిన్నెర పబ్లికేషన్స్ ప్రచురించిందని, ఆ పుస్తకాన్ని కృష్ణగారి ఇంట్లోనే ఆవిష్కరించామని’ చెప్పారాయన. డేరింగ్ డాషింగ్ అనే పదాలకు సిసలైన అర్ధంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఇల్లు, పద్మాలయా ఆఫీసు, మరీ ముఖ్యమైన వేడుకల్లో తప్ప నగరంలో మరెక్కడా ఎవరినీ కలవడానికి కృష్ణ ఆసక్తి చూపేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సమకాలీకులతో పోటీగా ఏ రంగంలోనూ అయినా సై అనే కృష్ణ ఎన్టీయార్‌లాగే నగరంలో థియేటర్స్ ఏర్పాటు ఆలోచన కూడా చేశారని కొందరు అంటున్నారు. అయితే ఆ తర్వాత అది ఆచరణలో విజయవాడకు మారింది. సాయం చేసే గుణం... సూపర్ స్టార్ దాతృత్వం గురించి నిర్మాతల శ్రేయస్సు విషయంలో చూపే శ్రద్ధ గురించి సినీ పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న వేషాలు వేసుకునేవారి పట్ల కూడా అంతే ఉదారంగా ఆయన ప్రవర్తించేవారని కృష్ణానగర్ వాసులు అంటున్నారు. తన దగ్గర డూప్‌గా 20 ఏళ్ల పాటు పనిచేసిన నెల్లూరు వాసి ఆ తర్వాత అనారోగ్యం కారణంగా మంచం పడితే..అతను బతికున్నంత వరకూ పనిచేసినప్పుడు ఇచ్చినట్టే అంతే మొత్తం నెలనెలా జీతంలా పంపేవారని గుర్తు చేసుకున్నారు. ఆప్యాయత చూపేవారు నానక్‌రాంగూడ వాసులంటే కృష్ణ, విజయనిర్మలకు చాలా ఇష్టం, ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి మాతో మాట్లాడేవారు. స్థానిక ఆలయాల అభివృద్దికి చేయూత అందించారు. ఎలాంటి పూజలు, శుభ కార్యాలున్నా సమయాన్ని బట్టి వచ్చేవారు. ఆ యనతో ఉన్న అనుబంధం మాటాల్లో చెప్పలేనిది. :::కైలాస్సింగ్– నానక్‌రాంగూడ పాన్ ఇండియా సినిమా ఆనాడే తీశారు. మొదటి పాన్ ఇండియా సినిమాను ఆనాడే సూపర్‌స్టార్ కృష్ణ తీశారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ అన్ని భాషల్లో తీసి సత్తా చాటారు. ఇది రష్యా దేశంలోనూ బాగా ఆడింది. మల్టీస్టారర్ సినిమాలను కూడా చాలా తీశారు. ‘హీరోలందంరం ఒక్కటిగా ఉంటాం. మీరెందుకు పోట్లాడుతారు. అందరినీ గౌరవించాలి’ అని అభిమాన సంఘాలను ఆదేశించేవారు. తుపాను వచ్చినప్పుడు ఆయన ఆదేశాలతో దివిసీమలో సేవా కార్యక్రమాలు చేపట్టాం. రక్తదాన, అన్నదాన, వైద్య శిబిరాలు నిర్వహించి ఆపన్నులను ఆదుకున్నాం. ఆయనపై ఉన్న అభిమానంతో నా కుమారుడి పేరు కూడా కృష్ణగా పెట్టుకున్నా :::దిడ్డి రాంబాబు, కృష్ణ, మహేష్ సేన నాయకులు తట్టుకోలేక పోతున్నా... కృష్ణ మరణం తట్టుకోలేక పోతున్నా. వెంటనే ఆస్పత్రికి వచ్చాను. ఆయనపై ఉన్న అభిమానంతో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాను. అభిమాన సంఘాలతో కలిసి సేవాకార్యక్రమాలు చేపట్టాం. కృష్ణ లేడనే మాట వింటేనే ఎంతో బాధగా ఉంది. ::: బి.కృష్ణ, బీడీఎల్ ఉద్యోగి ఏటా మా క్యాసెట్‌ను ఆవిష్కరించేవారు ప్రతి యేటా మా కంపెనీ దివ్యజ్యోతి ఆడియోస్ క్యాసెట్‌ను మొదట కృష్ణ ఆవిష్కరించేవారు. ప్రతియేటా డిసెంబర్ 12న జరిగే అయ్యప్ప పూజల్లో పాల్గొనేవారు. స్థానిక ఆలయానికి ఎంతో సహకారం అందించారు. ఆయనతో నానక్‌రాంగూడకు 20 ఏళ్ళుగా ఎంతో అనుబంధం ఉంది. ::: జి.ముత్యంరెడ్డి– నానక్‌రాంగూడ మా అమ్మాయి వివాహానికి హాజరయ్యారు కృష్ణ కుటుంబంతో నానక్‌రాంగూడకు 20 ఏళ్ళుగా అనుబంధం ఉంది. ఇద్దరూ మాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. మా అమ్మాయి వివాహానికి కూడా ఆయన హజరయ్యారు. ఆయన మృతిని తట్టుకోలేకపోతున్నాం. :::రమేష్‌గౌడ్–నానక్‌రాంగూడ తరలివచ్చిన అభిమానగణం అభిమానులతో నానక్‌రాంగూడ నిండిపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ మృతి వార్త విన్న వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చారు. దీంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు పర్యవేక్షణలో అభిమానులను కట్టడి చేయాల్సి వచ్చింది. ఊహించని రీతిలో నానక్‌రాంగూడకు అభిమానులు చేరుకోవడంతో విప్రో సర్కిల్ నుంచి నానక్‌రాంగూడలోని సూపర్‌స్టార్ కృష్ణ ఇంటి వరకున్న రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. అనంతరం సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కృష్ణ నివాసానికి రావడానికి మార్గం సుగమం చేశారు. ‘సూపర్ స్టార్ అ మర్ రహే’ నినాదాలతో ఆప్రాంతం హోరెత్తింది. నానక్‌రాంగూడలోని ఆయన నివాసంలో ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాం«దీ, గచ్చి»ౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు. విజయకృష్ణ నిలయం.. ఎంతో ప్రత్యేకం నటశేఖర కృష్ణకు గచ్చిబౌలి డివిజన్లోని నానక్‌రాంగూడతో విడదీయలేని బంధం ఉండేది. ముఖ్యంగా నానక్‌రాంగూడలో నిర్మించిన తన స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. నానక్‌రాంగూడలో 1996లో స్థలాన్ని కొనుగోలు చేశారు. అనంతరం అక్కడే ఇంటి నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించి 2005లో నిర్మాణం పూర్తి చేసి దానికి ‘విజయకృష్ణ నిలయం’ అని నామకరణం చేశారు. విజయకృష్ణ నిలయం ప్రాంగణంలోనే కృష్ణ, విజయనిర్మల దంపతులు కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి పెంచారు. ఈ నిలయంలో ప్రతిఏటా వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. అభిమానులు పెద్ద సంఖ్యలో దూరం నుంచి వచ్చి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించేవారు. 9 ఏళ్లుగా కాంటినెంటల్ ఆస్పత్రికే... నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డ్రిస్టిక్ట్ ప్రాంతంలోని కాంటినెంటల్ ఆస్పత్రితో తొమ్మిదేళ్ల క్రితం అనుబంధం ఏర్పడింది. ఇంటికి చేరువలోనే ఉండడంతో ఈ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ కోసం, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెళ్లేవారు. చివరకు చికిత్స పొందుతూ కాంటినెంటల్ ఆస్పత్రిలోనే మృతి చెందారు. అక్క డి వైద్యులు ముఖ్యంగా కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డితో ఆయనకు మంచి స్నేహబంధం ఉంది. ప్రతియేటా సందడి.. నానక్‌రాంగూడకు చెందిన జి.ముత్యంరెడ్డి, డి.మాణిక్‌రెడ్డి నిర్మాతలుగా ఏర్పాటు చేసిన ‘దివ్యజ్యోతి ఆడియోస్’ అనే అయ్యప్ప స్వామి భక్తిగీతాల క్యాసెట్‌ను నటశేఖర కృష్ణ, విజయనిర్మల ప్రతి యేటా ఇక్కడే విడుదల చేసేవారు. నానక్‌రాంగూడలో జరిగే పలు శుభకార్యాలు, పూజాకార్యక్రమాలకు తప్పకుండా హాజరయ్యేవారు. నానక్‌రాంగూడలోని అమ్మవారి ఆలయం అంటే కూడా కృష్ణ, విజయనిర్మలకు చాలా భక్తి ఉండేది. ప్రతి నెలా ఆలయానికి కొంత మొత్తం విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధిగా కృష్ణ, విజయనిర్మల, నరేష్‌తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవారు. -
మధ్య కాలానికి డెట్‌లో పెట్టుబడులు: ఫండ్ రివ్యూ
ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకుల వైఖరి ప్రస్తుతం రేట్ల పెంపు దిశగానే ఉంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఈ తరుణంలో మీడియం డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడుల పరంగా పెద్దగా రిస్క్ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విషయంలో ఈ పథకం ఎక్కువ రిస్క్ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్ సాధనాలు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని రూ.1,570 కోట్ల పెట్టుబడుల్లో 20 శాతం నగదు రూపంలోనే ఉంది. వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం లేనందున నగదు నిల్వలు ఎక్కువగా కలిగి ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన 80 శాతం పెట్టుబడుల్లో 94 శాతం అధిక భద్రత సాధనాల్లోనే ఉన్నాయి. రిస్క్ ఉండే ఏ, అంతకంటే దిగువ రేటింగ్ సాధనాల్లో కేవలం 5 శాతం పెట్టుబడులనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. 33 శాతం పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉండడాన్ని గమనించాలి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ 3.5 శాతం రాబడినిచ్చింది. ఇక గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 6.5 శాతం చొప్పున రాబడులను తెచ్చి పెట్టింది. ఏడేళ్లలో 7.34 శాతం, పదేళ్లలో 7.89 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. మీడియం డ్యురేషన్ విభాగం సగటు రాబడులు గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 5.5 శాతంగా ఉన్నాయి. ఏడేళ్లలో 6.32 శాతం, పదేళ్లలో 7.37 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. బాండ్ ఫండఖ కావడంతో ఈ పథకంలో సిప్ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది -
డిసెంబర్లో నాలుగో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్
నాలుగో విడత భారత్ బాండ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను డిసెంబర్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా సమీకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పెట్టుబడి అవసరాల కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం సీపీఎస్ఈల నిధుల అవసరాలపై వాటితో చర్చలను జరుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. తాజా భారత్ బాండ్ ఈటీఎఫ్ పరిమాణం దాదాపు గతేడాది స్థాయిలోనే ఉండవచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో రూ.1,000 కోట్ల కోసం మూడో విడత జారీ చేయగా 6.2 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యి రూ. 6,200 కోట్లు వచ్చాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ దేశీయంగా తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్. 2019లో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టగా అప్పట్లో రూ. 12,400 కోట్లు వచ్చాయి. ఇక రెండో విడతలో రూ. 11,000 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు 3 విడతల్లో రూ. 29,600 కోట్లు సమీకరించారు. -
చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం
సాక్షి,తిరుత్తణి : చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరమంగళం గ్రామస్తులు మంగళవారం తిరుత్తణి పోలీసులను ఆశ్రయించారు. తిరుత్తణి సమీపంలోని కోరమంగళం గ్రామానికి చెందిన దాము అలియాస్ దామోదరన్ (45) తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చీటీలు నడుపుతున్నారు. అతని వద్ద కోరమంగళం, పరిసర గ్రామాలకు చెందిన వారు చీటీలు కట్టారు. అయితే రెండేళ్ల నుంచి చీటీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై బాధితులు అడిగితే బాండు రాసి ఇస్తానని డబ్బులు త్వరలో చెల్లిస్తానని చెపుతూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే చీటీలో నష్టం వచ్చిందని డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు దామును నిలదీశారు. దీంతో అతను అదృశ్యమయ్యాడు. బాధితులు వంద మంది తిరుత్తణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే రూ.2 కోట్లు కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని నేర విభాగంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపారు. -
బాండ్ల నష్టాలపై బ్యాంకులకు ఊరట
ముంబై: గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో బాండ్ల నష్టాల కేటాయింపులకు సంబంధించి బ్యాంకులకు ఆర్బీఐ కొంత ఊరటనిచ్చింది. వీటికి ప్రొవిజనింగ్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాల్లో సమంగా చూపించుకునేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ బాండ్లపై యీల్డ్‌లు ఒక్కసారిగా ఎగియడం వల్ల వాటిల్లిన నష్టాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం పడకుండా చూసే ఉద్దేశంతో.. ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే, భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధంగా ఎదుర్కొనగలిగేలా ప్రత్యేక రిజర్వ్‌ను (ఐఎఫ్ఆర్) ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకులకు..గత రెండు త్రైమాసికాల్లో బాండ్లపై ఈల్డ్ భారీగా పెరిగిపోవడం వల్ల గణనీయంగా నష్టాలు వాటిల్లాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఈ నష్టాలు రూ. 15,000 కోట్లు ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీల అంచనా. పూర్తి సంవత్సరం గణాంకాలు ఇంకా లెక్కించాల్సి ఉంది. -
బ్యాంకింగ్‌కు బాండ్ జోష్!
సాక్షి, బిజినెస్ విభాగం : గత శుక్రవారం అమెరికా మార్కెట్లు బారీగా పతనమయ్యాయి. మామూలుగా చూస్తే సోమవారం మన మార్కెట్లూ బలహీనంగానే ఉండాలి. కానీ... బ్యాంకు షేర్లలో భారీ ర్యాలీ జరగటంతో నిఫ్టీ ఏకంగా 133 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్ షేర్లలో జరిగిన ర్యాలీని సూచిస్తూ... బ్యాంక్ నిఫ్టీ 2.5 శాతం... అంటే 600 పాయింట్లకుపైగా పెరిగింది. పీఎస్‌యూ బ్యాంకులైతే మరింత భారీగా పెరిగాయి. మంగళవారం కూడా ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి ప్రధాన కారణం... బాండ్ మార్కెట్!!. కేంద్రం అనుకున్న దానికన్నా తక్కువ రుణాలు సమీకరించవచ్చనే వార్తలు రావటంతో బాండ్ మార్కెట్లో హడావుడి మొదలై ఈ షేర్ల పరుగుకు కారణమైంది. దాని వెనకున్న ఆసక్తికరమైన వివరాలే ఈ ప్రత్యేక కథనం... రుణ సమీకరణ ఎందుకు తక్కువంటే... బ్యాంకుల్లో డిపాజిట్లకు సంబంధించి కొత్త చట్టం రానుందని, దాంతో డిపాజిట్లకు భద్రత లేకుండా పోవచ్చని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో విత్‌డ్రాయల్స్ బాగానే పెరిగాయి. సురక్షితమైన సాధనాల కోసం చూస్తూ జనం పోస్టాఫీసు పథకాలను ఎంచుకుంటున్నారు. గడిచిన కొద్ది నెలల్లో చిన్నమొత్తాల పొదుపులు భారీగా పెరగటమే దీనికి నిదర్శనం. ఈ డబ్బు కేంద్రం చేతికొస్తుంది కనక కేంద్రం రుణాల్ని తగ్గించుకోవాలని అనుకుంది. అందుకే... బాండ్ మార్కెట్ నుంచి ఓ 50వేల కోట్లు తక్కువ సమీకరిస్తామని ప్రకటించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) ప్రథమార్ధంలో కేంద్రం బాండ్ల ద్వారా రూ.3.72 లక్షల కోట్లు సేకరించింది. మొత్తం లక్ష్యంలో ఇది 48 శాతం. ప్రభుత్వం ద్రవ్య అవసరాల కోసం విపరీతంగా బాండ్లను జారీ చేస్తుండటంతో కొద్ది నెలలుగా బాండ్లకు పూర్తిగా కొనుగోలు మద్దతు కరువై ఈల్డ్ పెరిగిపోతూ వచ్చింది. గత ఏడు నెలల్లో ఈల్డ్స్ 1.26 శాతం మేర పెరిగాయి కూడా. తాజా పరిణామాలతో ప్రభుత్వం బాండ్లపై ఆధారపడటం తగ్గుతుందని తెలియగానే ఈల్డ్స్ ఒక్కసారిగా 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.37 శాతానికి దిగొచ్చాయి. ఈ స్థాయిలో ఈల్డ్ తగ్గడం 2013 నవంబర్ తర్వాత ఇదే ప్రథమం. మరోవంక బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇన్వెస్టర్లకున్న పరిమితిని కూడా కేంద్ర పెంచనుందని, ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ, ఆర్బీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ వెల్లడించారు. ఇది బాండ్ల భారీ ర్యాలీకి కారణమయ్యింది. బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు ఎందుకంటే... ప్రభుత్వం జారీచేసే బాండ్లలో అధికం ప్రభుత్వ బ్యాంకులే పెట్టుబడి పెడతాయి. అయితే ఈ బాండ్ల ధరల మార్పులకు అనుగుణంగా కలిగే లాభనష్టాల్ని (అవి పుస్తకాల్లో వచ్చే లాభనష్టాలైనప్పటికీ) ఆర్థిక ఫలితాల్లో చూపించాల్సి ఉంటుంది. గత కొద్ది నెలల్లో బాండ్ల ధరలు పతనమై, ఈల్డ్స్ పెరిగిపోవటంతో పీఎస్‌యూ బ్యాంకులు... బాండ్లకు సంబంధించి నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ జనవరి–మార్చి క్వార్టర్లో అన్ని బ్యాంకులు కలిపి రూ.10,000 కోట్ల బాండ్ల నష్టాల్ని ఫలితాల్లో ప్రకటిస్తాయన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో వున్నాయి. ఇందు లో 75% ప్రభుత్వ బ్యాంకులవే కాగా... అందులోనూ ఎస్బీఐ వాటా అధికం. అందుకే ఈ షేరు ఇటీవల 52 వారాల కనిష్ట స్థాయి రూ.230కి పడింది. 2017–18 క్యూ2లో రూ.3,772 కోట్ల ట్రెజరీ లాభాల్ని (బాండ్ల ట్రేడింగ్ ద్వారా వచ్చేవి) చూపించిన ఎస్బీఐ... మూడో త్రైమాసికంలో రూ.3,260 కోట్ల నష్టాన్ని ప్రకటించిందంటే బాండ్లు ఈ బ్యాంకుకు ఎంత ప్రధానమో అర్థమవుతుంది. నాల్గో త్రైమాసికంలో బాండ్ల నష్టాలు భారీగా ఉంటాయని ఎస్బీఐ ఛైర్మన్ సంకేతాలిచ్చారు. కానీ నాటకీయంగా బాండ్ల ర్యాలీ ప్రారం భవడంతో... ఈ క్యూ4లో ప్రభుత్వ బాండ్లు అధికంగా కలిగివున్న బ్యాం కుల ట్రెజరీ నష్టాలు తక్కువే ఉంటాయి. ఈ అంచనాలే మార్కెట్లో ఈ షేర్ల పెరుగుదలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం... 1998 తర్వాత ఈ స్థాయిలో బాండ్ల గిరాకీ పడిపోయి ఈల్డ్స్ పెరిగిపోవటం గత 7 నెలల్లోనే జరిగింది. ఈల్డ్స్ పెరగడంతో ప్రభుత్వం జారీచేసే బాండ్లను అధిక వడ్డీ రేటుకు విడుదల చేయాల్సి ఉంటుంది. దాంతో సహజంగానే వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరగడం జరుగుతోంది. అందువల్ల తర్వాతి నెలల్లో ఆర్బీఐ కూడా రేట్లను పెంచుతుందనే అంచనాలు ఊపందుకున్నాయి. అయితే తాజా గా ప్రభుత్వం రుణ సమీకరణ లక్ష్యాన్ని కుదించిన సంకేతాలతో బాండ్ ఈల్డ్స్ తగ్గి, వడ్డీ రేట్ల అంచనాలు దిగిరావడానికి కారణమవుతోంది. -
బ్యాలన్స్డ్ ఫండ్సే ఎందుకు?
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు ప్లాన్లు ఉన్నాయని, డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు? అసలు ఈ రెండు ప్లాన్ల మధ్య ఏం తేడాలున్నాయి? – మధుకర్, విజయవాడ మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్లు దాదాపు రెండూ ఒకే విధంగా ఉంటాయి. వ్యయాల్లో తేడాఉంటుంది. డైరెక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్లకు సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎలాంటి కమీషన్‌ను, లేదా డిస్ట్రిబ్యూటర్ ఫీజును చెల్లించదు. డైరెక్ట్ ప్లాన్లలో మీరు నేరుగా(డైరెక్ట్‌గా) మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. డైరెక్ట్ ప్లాన్లలో బ్రోకరు, మధ్యవర్తి, ఏజంట్ల ప్రమేయం ఉండదు. అందుకని ఈక్విటీ ఫండ్స్‌కు సంబంధించిన డైరెక్ట్ ప్లాన్ల వార్షిక వ్యయాలు, రెగ్యులర్ ప్లాన్ కన్నా కనీసం 1% తక్కువ. డూ–ఇట్–యువర్ సెల్ఫ్ తరహా లేదా మ్యూచువల్ ఫండ్స్‌పై కొంచెం అవగాహన ఉన్నవారికి ఇవి అనువుగా ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి, డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజంట్ సేవలు తీసుకోవడం మంచిది. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసం రెగ్యులర్ ప్లాన్లనే ఎంచుకోండి. కొంత కాలం గడిచిన తర్వాత, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి కొంత అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేను మ్యూచువల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. ఇన్వెస్ట్మెంట్స్ కోసం రెండు, మూడు విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకున్నాను. అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్, సంబంధిత బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతా తెరవాలని అంటున్నాయి. ఇలా ప్రతి బ్యాంక్‌లో ఖాతా తెరవడం తప్పనిసరా? –జాన్సన్, విశాఖపట్టణం ఈ విషయంలో మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సంబంధిత మ్యూచువల్ ఫండ్ అనుబంధ బ్యాంకుల్లో ఖాతాలు తెరవవలసిన అవసరం లేదు. వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరవవలసిన పనిలేదు. కేవలం ఒక్క బ్యాంక్ ఖాతా ద్వారానే మీరు ఏ మ్యూచువల్ ఫండ్‌లోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి ఆ సామ్ములను పొందవచ్చు. ఎన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఒక బ్యాంక్ ఖాతా సరిపోతుంది. తొలిసారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని మీరు సూచిస్తుంటారు కదా! వీటినే ఎందుకు ఎంచుకోవాలి? కొన్ని మంచి బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను సూచించండి. –ప్రవల్లిక, హైదరాబాద్ మార్కెట్లు చక్రీయంగా ఉంటాయి. అంటే ఒక్కోసారి గరిష్ట స్థాయిలో, మరో సారి కనిష్ట స్థాయిలో, హెచ్చుతగ్గులకు, ఒడిదుడుకులకు గురవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ జోరుగా ఉంది. దీని ఆధారంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడులు పొందాలనుకోవడం సరైన వ్యూహం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన కొంత కాలానికి మార్కెట్ పడిపోయిందనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ విలువ కరిగిపోతుంది. బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. బ్యాలన్స్డ్ ఫండ్స్ తమ నిధుల్లో 25 శాతం వరకూ స్థిర ఆదాయాన్నిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా ఈ ఫండ్స్‌కు కొంత స్థిరత్వం వస్తుంది. అంతేకాకుండా బ్యాలన్స్డ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఏడాది దాటితే వాటిపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మరో వైపు బ్యాలన్స్డ్ ఫండ్‌కు సంబంధించిన ఫండ్ మేనేజర్, తన ఫండ్ పోర్ట్‌ఫోలియోను తరచుగా రీబ్యాలన్స్ చేస్తూ ఉంటారు. మార్కెట్ పరిమిత శ్రేణిలో కదలాడుతున్నప్పుడు ఇది మంచి వ్యూహం. బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచి పద్ధతి. ఇక ఇన్వెస్ట్ చేయడానికి టాటా, ఐసీఐసీఐ రిలయన్స్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. నా వయస్సు 30 సంవత్సరాలు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై కొంత అవగాహన ఉంది. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ రకమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదో సూచించండి? –వినయ్, కరీంనగర్ పన్ను ఆదా చేయాల్సిన అవసరం ఉంటే పన్ను ఆదా చేసే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ తరహా ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మీకు పన్ను ఆదా చేయాల్సిన అవసరాలు లేకపోతే, బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన మీకు ఉన్నట్లయితే, పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేకపోతే ఒకటి లేదా రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆదాయం పెరిగితే తదనుగుణంగా సిప్ మొత్తాన్ని కూడా పెంచండి. మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను కనీసం ఆరు నెలలకొకసారైనా పరిశీలించి, తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. -
బాండ్లలో పెట్టుబడులు సురక్షితమా?
ప్ర: నేను, నా భార్య ఇద్దరమూ వివిధ వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్నాం. మాకు ఒక పాప, ఒక బాబు. ఇద్దరూ మైనర్లే. వారి పేర్ల మీదుగా కూడా ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) ఖాతాలు తెరవాలనుకుంటున్నాము. మేము గరిష్టంగా ఎన్ని పీపీఎఫ్ ఖాతాలు నిర్వహించవచ్చు? అన్ని పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి ఎంత మొత్తానికి పన్ను రాయితీలు పొందవచ్చు? –కేశవరావు, విజయవాడ మీరు, మీ భార్య, చెరో పీపీఎఫ్ ఖాతా నిర్వహించవచ్చు. ఒక్కో ఖాతాకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ట పెట్టుబడి రూ.500, గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షలు. తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు తమ మైనర్ పిల్లలకు సంరక్షకులుగా మరో పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. అయితే ప్రతి బిడ్డ తరపున భార్యభర్తల్లో ఎవరో ఒకరు మాత్రమే పీపీఎఫ్ ఖాతా తెరవాలి. అయితే ఒక్క వ్యక్తి, తన తరపున, తన పిల్లల తరపున ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పీపీఎఫ్ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ప్ర: బాండ్ల బుడగ పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నదా? స్వల్పకాలిక బాండ్ ఫండ్స్ కంటే గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉంటాయా? – అను జైన్, సికింద్రాబాద్ ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. మార్కెట్ శిఖర స్థాయికి పెరగవచ్చు లేదా పాతాళ స్థాయికి పడిపోవచ్చు. కానీ ఈ తరహా తీవ్రమైన ఒడిదుడుకులు స్థిర ఆదాయ సాధనాలైన బాండ్లలో ఉండవు. బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే కొన్ని ప్రయోజనాలుంటాయి. బాండ్లు ఎవరు జారీ చేస్తున్నారో మనకు ముందే తెలుస్తుంది. దీంతో బాండ్ జారీ చేసే సంస్థ సమర్థత మనం తెలుసుకోవచ్చు. బాండ్ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? వచ్చే రాబడి(కూపన్ రేట్) ఎంత ? తదితర వివరాలు మనకు ముందే తెలుస్తాయి. దీర్ఘకాలంలో చూస్తే, బాండ్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కానీ స్వల్పకాలంలో వడ్డీరేట్లు తగ్గితే ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయి. బాండ్ల బుడగ పగిలిపోవడమనేది ఆర్బీఐ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, వడ్డీరేట్లలో మార్పులు కారణంగా తలెత్తే ఒడిదుడుకులు పెద్దగా ప్రభావం చూపవనే చెప్పవచ్చు. ఇక భద్రత విషయానికొస్తే, స్వల్పకాలిక బాండ్ ఫండ్స్‌కు, గిల్ట్ ఫండ్స్‌కు పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇక గిల్ట్ ఫండ్స్, స్వల్పకాలిక బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులే పొందవచ్చు. ప్ర: మ్యూచువల్ ఫండ్స్‌కు స్టాప్ లాస్, లాభాల స్వీకరణ వంటి స్టాక్ మార్కెట్ సంబంధిత అంశాలు వర్తిస్తాయా ? –రాకేశ్, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్స్‌కు స్టాప్ లాస్, లాభాల స్వీకరణ వంటి అంశాలు వర్తించవు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ నష్టాలు వచ్చి, ఇన్వెస్ట్‌చేసిన మొత్తం తగ్గుతుందనే భయం మీకు ఉంటే, బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్గా మ్యూచువల్ ఫండ్స్‌ను చూడకూడదు. స్టాక్ మార్కెట్లోని షేర్ల మాదిరి మ్యూచువల్ ఫండ్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ ఇన్వెస్టరైనా ఏడాదికాలంలో తరచుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ట్రేడ్ చేయలేడు. ఎగ్జిట్ లోడ్, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను తదితర వ్యయాలు, చార్జీలు ఉంటాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే లాభాల స్వీకరణ, స్టాప్‌లాస్ వంటి స్టాక్ మార్కెట్ అంశాలు మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించవనే చెప్పాలి. ప్ర: నాకు, నా భార్యకు కలిపి జాయింట్‌గా ఒక సేవింగ్స్ ఖాతా ఉంది. ఈ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డిపాజిట్‌పై వచ్చే వడ్డీని ఐటీ రిటర్నుల్లో చూపాల్సి ఉంటుందా? –కపిల్, వరంగల్ సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్నుల్లో చూపాల్సి ఉంటుంది. మీరు, మీ భార్య కలసి జాయింట్‌గా సేవింగ్స్ ఖాతాను నిర్వహిస్తున్నారు కదా ! మీ భార్యకు సంపాదన లేని పక్షంలో ఈ సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్‌పై వచ్చే వడ్డీని మీ ఐటీ రిటర్నుల్లో మీ మొత్తం ఆదాయానికి కలిపి చూపాలి. ఒక వేళ మీ భార్య ఉద్యోగం చేయడమో, వ్యాపారం ద్వారా సంపాదించడమో చేస్తున్నట్లయితే, మీలో ఎవరి ఐటీ రిటర్నుల్లో అయినా ఈ ఆదాయాన్ని చూపించవచ్చు. మీ మీ పన్ను బాధ్యతలను బట్టి మీ ఐటీ రిటర్నులో కానీ, మీ భార్య ఐటీ రిటర్నులో గానీ ఈ వడ్డీ ఆదాయాన్ని చూపించాలి. సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని–ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం అనే పద్దుకింద చూపించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తాల్లో ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 టీటీఏ ప్రకారం రూ.10,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి మించిన వడ్డీ ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికెట్‌ను మీ వద్దే భద్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ ట్యాక్స్ స్క్రూటినీ సందర్భంలో అసెస్సింగ్ ఆఫీసర్ ఈ సర్టిఫికెట్‌ను ప్రస్తావించినప్పుడు ఈ సర్టిఫికెట్‌ను చూపిస్తే సరిపోతోంది. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పేగు బంధాన్ని మరచి..
తల్లిని కాటికి సాగనంపేందుకు కుమారుడి నిరాకరణ కూతుళ్లే తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న వైనం వలిగొండ మండలం సుంకిశాలలో విషాదం పుత్రులు పున్నామనరకం నుంచి విముక్తి కలిగిస్తారని నానుడి...కానీ ఓ సుపుత్రుడు కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి నిరాకరించాడు.. అవసాన దశలో ఆలనా పాలనా చూడాల్సిందిపోయి.. తనకు సంబంధం లేదని తెగదెంపులు చేసుకున్నాడు.. చివరకు కాటికి సాగనంపేందుకు కూడా ముఖం చాటేసి మానవ సంబంధాలకు మచ్చతెచ్చాడు. నల్గొండ జిల్లా : వలిగొండ మండలం సుంకిశాలకు చెందిన బొక్క పద్మారెడ్డి, బొక్క కమలమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు సంతానం. పద్మారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ వ్యవసాయం చేసేవాడు. కొన్ని కారణాలతో హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో సంతానమంతా చిన్న పిల్లలు. కుమారుడు రాజిరెడ్డికి రెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పటి నుంచి కమలమ్మ వ్యవసాయం చేస్తూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరి వివాహాలు జరిపించి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది. రెండు సంవత్సరాల క్రితం వరకు కుమారుడు, ఆయన కుటుంబం ఆమెతోనే ఉండేవారు. పింఛన్ డబ్బులు కూడా ఆ కుటుంబానికి కొంత ఖర్చుపెట్టేది. ఏం జరిగిందో కానీ రెండేళ్ల క్రితం అతను సుంకిశాల విడిచి, తల్లిని అక్కడే వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లి పోయాడు. దీంతో కమలమ్మ అదే గ్రామంలో ఉంటున్న చిన్న కూతురైన లలిత ఇంట్లో ఉంటుంది. ఇటీవల అనారోగ్యం బారిన పడి మంగళవారం మృతిచెందింది. ఈ సమాచారం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు రాజిరెడ్డికి చేరవేశారు. తలకొరివి పెట్టడానికి రమ్మని పిలిచారు. అయినా అతను తనకు సంబంధం లేదంటూ తాను రానని ఖరాకండిగా చెప్పాడు. దీంతో గత్యంతరం లేక కూతుర్లే తలకొరివి పెట్టారు. ఈ దృశ్యం పలువురిని కంట తడిపెట్టించింది. ఇలాంటి కొడుకులు ఉన్న ప్రయోజనం ఏంటని అనుకుంటున్నారు. -
బాండ్ సినిమా స్క్రిప్టునే.. దోచేశారు!!
-
బాండు ఇస్తేనే స్టడీలీవ్
న్యూఢిల్లీ: స్టడీలీవ్పై వెళ్లే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సదరు సెలవు ముగిసిన తర్వాత నిర్దిష్టగడువు మేరకు విధులకు తిరిగి హాజరుకాని పక్షంలో, చదువుకోసం తమపై ప్రభుత్వం పెట్టిన ఖర్చునంతా తిరిగి చెల్లిస్తామని అంగీకరిస్తూ బాండ్‌ను సమర్పించవలసి ఉంటుందని, లీవ్‌పై వెళ్లేందుకు ముందస్తుగానే వారు బాండ్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం,..అఖిలభారత సర్వీసు అధికారులు, స్టడీలీవ్ గడువు అనంతరం సర్వీసులో కొనసాగవలసి ఉంటుంది. అయితే, కొందరు నిబంధనలను ఉల్లంఘించి సుదీర్ఘంగా సెలవుపై కొనసాగుతూ, నిర్దిష్ట గడువుమేర విధులు నిర్వర్తించ డంలేదని తమ దృష్టికి వచ్చినట్టు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల కేంద్ర విభాగం పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలోని బాండ్ పార్మాట్‌ను సవరించాలని నిర్ణయించినట్టు డీఓపీటీ తెలిపింది. ఏ అధికారి అయినా బాండ్‌ను ఉల్లంఘిస్తే. సవరించిన బాండ్ ప్రకారం, వడ్డీతో సహా ఖర్చును ప్రభుత్వానికి చెల్లించాలి.