న్యూఢిల్లీ: స్టడీలీవ్‌పై వెళ్లే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు సదరు సెలవు ముగిసిన తర్వాత నిర్దిష్టగడువు మేరకు విధులకు తిరిగి హాజరుకాని పక్షంలో, చదువుకోసం తమపై ప్రభుత్వం పెట్టిన ఖర్చునంతా తిరిగి చెల్లిస్తామని అంగీకరిస్తూ బాండ్‌ను సమర్పించవలసి ఉంటుందని, లీవ్‌పై వెళ్లేందుకు ముందస్తుగానే వారు బాండ్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం,..అఖిలభారత సర్వీసు అధికారులు, స్టడీలీవ్ గడువు అనంతరం సర్వీసులో కొనసాగవలసి ఉంటుంది. అయితే, కొందరు నిబంధనలను ఉల్లంఘించి సుదీర్ఘంగా సెలవుపై కొనసాగుతూ, నిర్దిష్ట గడువుమేర విధులు నిర్వర్తించ డంలేదని తమ దృష్టికి వచ్చినట్టు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల కేంద్ర విభాగం పేర్కొంది.
ఈ నేపథ్యంలో గతంలోని బాండ్ పార్మాట్‌ను సవరించాలని నిర్ణయించినట్టు డీఓపీటీ తెలిపింది. ఏ అధికారి అయినా బాండ్‌ను ఉల్లంఘిస్తే. సవరించిన బాండ్ ప్రకారం, వడ్డీతో సహా ఖర్చును ప్రభుత్వానికి చెల్లించాలి.