నాలుగో విడత భారత్ బాండ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను డిసెంబర్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా సమీకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) పెట్టుబడి అవసరాల కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం సీపీఎస్‌ఈల నిధుల అవసరాలపై వాటితో చర్చలను జరుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. తాజా భారత్ బాండ్ ఈటీఎఫ్ పరిమాణం దాదాపు గతేడాది స్థాయిలోనే ఉండవచ్చని పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్‌లో రూ.1,000 కోట్ల కోసం మూడో విడత జారీ చేయగా 6.2 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యి రూ. 6,200 కోట్లు వచ్చాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ దేశీయంగా తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్. 2019లో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టగా అప్పట్లో రూ. 12,400 కోట్లు వచ్చాయి. ఇక రెండో విడతలో రూ. 11,000 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు 3 విడతల్లో రూ. 29,600 కోట్లు సమీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment