ETF
-
పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్
కోల్‌కతా: ఇటీవల కొంతకాలంగా వెండి ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఏడాది కాలంలో సిల్వర్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ నాలుగు రెట్లు ఎగసింది. వెరసి గత నెల(అక్టోబర్)కల్లా వెండి ఈటీఎఫ్‌ల ఏయూఎం రూ. 12,331 కోట్లను తాకింది.2023 అక్టోబర్‌లో ఈ విలువ కేవలం రూ. 2,845 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లు సిల్వర్‌ను దేశీయంగా ధరల పెరుగుదలతోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు హెడ్జింగ్‌గా భావించడం ఇందుకు జతకలిసినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా అనలిటిక్స్ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం..2022లో షురూ సిల్వర్ ఈటీఎఫ్‌లకు 2022లో తెరతీశారు. వీటి అందుబాటు, పారదర్శకతల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరగుతోంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 215 శాతం జంప్‌చేసి 4.47 లక్షలకు చేరింది. 2023 అక్టోబర్‌లో ఇది 1.42 లక్షలు మాత్రమే. ఈ కాలంలో నికర పెట్టుబడులు 24 శాతం ఎగశాయి. రూ. 643 కోట్లను తాకాయి.మరోపక్క మార్కెట్లో 2023 ఏప్రిల్‌లో 8 వెండి ఈటీఎఫ్‌లు నమోదుకాగా.. 2024 ఆగస్ట్‌కల్లా 12కు పెరిగినట్లు ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్, సీనియర్ వీపీ అశ్వినీ కుమార్ వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగనున్నట్లు కుమార్ అంచనా వేశారు. సులభ నిర్వహణ సులభంగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ, చౌక వ్యయాలు వంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఆకర్షణను పెంచుతున్నాయి. ఫిజికల్ కొనుగోళ్లకు జీఎస్టీ వర్తించే సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్‌కావడంతో పెట్టుబడులకు లిక్విడిటీ సైతం ఉంటుంది. యూనిట్ల రూపంలో సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చునని కుమార్ తెలియజేశారు.అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు ఉత్తమ రిటర్నులను సైతం అందిస్తున్నాయి. నెల రోజుల్లో 7.6 శాతం, 3 నెలల్లో 16 శాతం, 6 నెలలు పరిగణిస్తే 20.25 శాతం సగటున రాబడినిచ్చాయి. ఏడాది కాలాన్ని తీసుకుంటే 32.5 శాతం రిటర్నులు అందించాయి. ఇదే కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడులతో పోలిస్తే ఇవి అధికంకావడం గమనార్హం! -
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) అక్టోబర్‌లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్‌లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్‌లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్‌లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!
డబ్బు ఖర్చు పెట్టడం సులువు. అదే సంపాదించాలంటే కొంత కష్టపడక తప్పదు. కష్టపడి పోగు చేసుకున్న డబ్బుతో విలాసవంత వస్తువులు కొనుగోలు చేయడంకంటే ఆ డబ్బును పొదుపు చేసి మరింత డబ్బు సంపాదించాలని చాలామంది సూచిస్తున్నారు. ఈమేరకు పొదుపునకు సంబంధించి సౌరవ్దత్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. కేవలం రూ.20 వేలతో రూ.17 లక్షలు పోగుచేసే మార్గాన్ని సూచించారు. రవి అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఆ డబ్బు ఎలా సమకూరుతుందో వివరించారు.‘రవి అనే వ్యక్తి రూ.10 లక్షలు ఖర్చు చేసి కారు కొనాలనుకున్నాడు. అందుకు ఐదేళ్లపాటు నెలవారీ రూ.20 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కారు వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. కాబట్టి 2030 నాటికి దాని విలువ రూ.నాలుగు లక్షలు అవుతుంది. అంటే ఐదేళ్లలో అది రూ.ఆరు లక్షలు తగ్గిపోతుంది. అదే తన వద్ద ఉన్న రూ.20 వేలను రవి నిఫ్టీ ఈటీఎఫ్‌లో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 2030 నాటికి తన వద్ద ఏకంగా రూ.17 లక్షలు జమవుతాయి. మన జీవితం ఎలా ఉండాలో మన చేతిలోనే ఉంటుంది’ అని సౌరవ్ పోస్ట్ చేశారు.₹20000/mo is the 5 year EMI of a 10L car for Ravi.Instead, Ravi puts ₹20000/mo for 5 years in Nifty ETF SIP.First decision gives him a car worth ₹4L in 2030.Second decision gives him ₹17L of bank balance in 2030.Life is about the choices we make.— Sourav Dutta (@Dutta_Souravd) October 15, 2024ఇదీ చదవండి: టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులుడిప్రిషియేషన్ అసెట్(కాలంతోపాటు విలువ తగ్గిపోయే వస్తువులు) కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరి అయితే తప్పా..దానివల్ల మనం వెచ్చించే డబ్బు కంటే అధిక లాభం ఉంటే తప్పా కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, ఈక్వీడీ మార్కెట్, ఎఫ్డీ..వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు. -
మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ విస్తృతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు (సిప్) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.సెక్యూరిటీస్‌లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ అనేవి భారత్‌లో ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫార్మాట్లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్), గతి (మూమెంటమ్), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్ ఇ న్వెస్టింగ్ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్ ఆధారితమైనదిగా ఉంటుంది.సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్‌ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్ క్లాస్‌లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ బెంచ్‌మార్క్‌లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.రిస్క్ మేనేజ్మెంట్: వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.పారదర్శకత: మిగతా పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్) తరహాలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్‌ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.డైవర్సిఫికేషన్: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పనితీరు బాగా లేకపోతే పోర్ట్‌ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్‌ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఫ్యాక్టర్స్ కొన్నాళ్ల పాటు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్ అనేవి నిర్దిష్ట మార్కెట్ పరిస్థితుల్లో గ్రోత్ స్టాక్స్‌తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్ ప్రయోజనం తగ్గిపోవచ్చు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ పాటించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది. చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!రిస్కు సామర్థ్యాలను బట్టి.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తమ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న ఇన్వెస్టర్లు, మూమెంటమ్ లేదా సైజ్ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు. చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది కల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్‌ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి. సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
బజాజ్ ఫిన్సర్వ్ రెండు ఈటీఎఫ్‌లు
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. -
మదుపర్లను ఆకర్షించని గోల్డ్ ఈటీఎఫ్‌లు
ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్‌ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్‌ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్న పోర్ట్‌ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది. -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త!
ఈపీఎఫ్‌వో (epfo) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (etf)లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం ఆర్ధిక శాఖ అనుమతి కోరుతుంది. కేంద్రం అనుమతితో ఈటీఎఫ్‌లో మదుపు చేయనుంది. తద్వారా ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ఈపీఎఫ్‌వో నిర్ణయాన్ని అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ, సెంట్రల్ బోర్డ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం తెలిపింది. ఈటీఎఫ్‌లో పెట్టుబడిలో పెట్టుబడి పెట్టి.. ఆ పెట్టుబడితో వచ్చిన లాభాల్ని తిరిగి చెల్లించేలా రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో ఈపీఎఫ్‌వో తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో 5శాతం నుంచి 15 శాతం వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ ఈటీఎఫ్ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ప్రతిపాదన కూడా ఉంది. అయితే,ఈపీఎఫ్‌వో తన పెట్టుబడిపై రాబడిని పెంచడానికి మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
మిరే అసెట్ నుంచి నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్
హైదరాబాద్: మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్ మేనేజరుగా ఉంటారు. 12 టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్ (ఈటీఎఫ్ ప్రోడక్ట్) సిద్ధార్థ్ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ విప్లవంతో ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్.. వందల కోట్లలో పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు గత నెల పసిడి ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో (ఈటీఎఫ్) గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం రూ. 124 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతకు మందు నెల మార్చ్‌లో రూ. 266 కోట్లు ఉపసంహరించుకున్నారు. సంపన్న ఎకానమీల్లో ఇంకా రిస్కులు కొనసాగుతున్నందున గోల్డ్ ఈటీఎఫ్‌లవైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. డేటా ప్రకారం పసిడి ఆధారిత 14 ఈటీఎఫ్‌ల్లోకి గత నెల రూ. 124.54 కోట్లు వచ్చాయి. దీంతో పసిడి ఈటీఎఫ్‌ల నిర్వహణనలోని ఆస్తుల పరిమాణం రూ. 22,950 కోట్లకు చేరింది. మార్చి నెలాఖరులో ఇది రూ. 22,737 కోట్లు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య 12,600 పెరిగి 47.13 లక్షలకు చేరింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 653 కోట్ల పెట్టుబడులు వచ్చాయ. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2021–22లో నమోదైన రూ. 2,541 కోట్లతో పోలిస్తే 74 శాతం క్షీణించాయి. ప్రధానంగా లాభాల స్వీకరణ, ఇన్వెస్టర్లు .. ఈక్విటీలవైపు మొగ్గు చూపడం ఇందుకు కారణం. -
యాక్సిస్ కొత్త ఈటీఎఫ్ ఫండ్... రూ. 50 కోట్లు సమీకరణకు టార్గెట్
ముంబై: దేశీయంగా ఏడో పెద్ద ఫండ్ హౌస్ యాక్సిస్ ఎంఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో)కు తెరతీస్తోంది. ఈ నెల 22న ఫండ్ ప్రారంభమైన ఫండ్, ఏప్రిల్ 5న ముగియనుంది. ఈ ఎన్ఎఫ్వో(ఓపెన్ ఎండెడ్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా కనీసం రూ. 50 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి! ఈ నిధులను ఎస్అండ్పీ 500 ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లో ఇన్వెస్ట్ చేయనుంది. ఫండ్‌ను వినాయక్ జయంత్ నిర్వహించనున్నారు. అలాట్మెంట్ తేదీ నుంచి 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... అలాట్మెంట్ అయ్యాక 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అమలుకాదని ఫండ్ హౌస్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవ్ అయ్యంగర్ పేర్కొన్నారు. వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేపట్టే ఇతర రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మాదిరికాకుండా ఈ ఫండ్ సొంత పథకాలు లేదా ఇతర ఫండ్ హౌస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగుస్తుందని ఫండ్‌ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు. రూ.4,000 కోట్ల వరకూ సమీకణ.. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది. మరిన్ని విశేషాలు ఇవీ.. ► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. ► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్. భారీ స్పందన.. భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది – తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. – రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ -
డిసెంబర్లో నాలుగో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్
నాలుగో విడత భారత్ బాండ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను డిసెంబర్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా సమీకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పెట్టుబడి అవసరాల కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం సీపీఎస్ఈల నిధుల అవసరాలపై వాటితో చర్చలను జరుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. తాజా భారత్ బాండ్ ఈటీఎఫ్ పరిమాణం దాదాపు గతేడాది స్థాయిలోనే ఉండవచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో రూ.1,000 కోట్ల కోసం మూడో విడత జారీ చేయగా 6.2 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యి రూ. 6,200 కోట్లు వచ్చాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ దేశీయంగా తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్. 2019లో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టగా అప్పట్లో రూ. 12,400 కోట్లు వచ్చాయి. ఇక రెండో విడతలో రూ. 11,000 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు 3 విడతల్లో రూ. 29,600 కోట్లు సమీకరించారు. -
బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్‌మార్క్ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. కోవిడ్- 19 లాక్డౌన్ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్‌లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. రాజీవ్ పాప్లీ : అవును, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో అనిశ్చిత కాలంలో గోల్డ్‌లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి. హాల్‌మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా? పెథే : హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్‌మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్‌మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్‌మార్కింగ్‌ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్‌ను వివరించే చార్ట్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి పూనమ్ రుంగ్తా : మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్ బార్గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్‌లలో మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి. ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా? రుంగ్తా : తక్కువ మేకింగ్ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి. -
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు దోహదపడ్డాయి. -
సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఏఎంసీలు సుముఖం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వరుసబెట్టి సిల్వర్ ఈటీఎఫ్‌లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి రూ.1,400 కోట్లను సమీకరించాయి. సిల్వర్ ఈటీఎఫ్‌ల ఆవిష్కరణకు సెబీ గతేడాది నవంబర్‌లో అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఏఎంసీలు సిల్వర్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్ల ప్రారంభానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. కోటక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే, సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. ఈ ఫండ్స్‌తో వెండిపై డిజిటల్‌గా పెట్టుబడులకు వీలు కలుగుతుంది. ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా సంస్థలు సిల్వర్ ఈటీఎఫ్‌లను ప్రారంభించాయి. ఈ సంస్థలన్నీ కూడా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లను కూడా నిర్వహిస్తున్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా సమీకరించిన నిధులను తీసుకెళ్లి తమ నిర్వహణలోని సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ సిల్వర్ ఈటీఎఫ్‌ల ఎన్ఎఫ్వో(నూతన పథకం)లు ఇటీవలే ముగిశాయి. ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్‌లు ప్రస్తుతం నిధుల సమీకరణలో ఉన్నాయి. హెడ్జ్ సాధనంగా.. ‘‘ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా చాలా మంది ఇన్వెస్టర్లు వెండిలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వీరికి సిల్వర్ ఈటీఎఫ్‌లు మంచి అవకాశంగా ఉన్నాయి. భౌతికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌గా కలిగి ఉండొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. పైగా ఇటీవలి కాలంలో వెండి ధరలు తగ్గి ఉండడం కూడా ఏఎంసీలు ఈటీఎఫ్‌లు, ఎఫ్వోఎఫ్ల ఆఫర్లను ప్రారంభించడానికి కారణంగా ఆమె పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల తరుణంగా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు తోడు, పారిశ్రామిక, తయారీ రంగాల్లోనూ దీని వినియోగం పెరిగినట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, 5జీ రంగాల నుంచి డిమాండ్ నెలకొన్నట్టు పేర్కొన్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.457 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జూలైలో నికరంగా రూ.457 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. పోర్టుఫోలియో రీబ్యాలెన్సింగ్ ప్రణాళికలో భాగంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి రక్షణాత్మక విభాగాల్లోకి మళ్లించడం కలిసొచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపారు. ఈ జూన్‌లో రూ.135 కోట్లు మాత్రమే వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి)గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2022) జూలై నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.982 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘యాంఫీ గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.., బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగింది. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం అంశాలు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. -
ఎఫ్‌వోఎఫ్ లాంచ్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్నియల్..!
ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ప్యాసివ్ మల్టీ-అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్‌వోఎఫ్) ఆవిష్కరించింది. ఈ ఫండ్ జనవరి 10తో ముగుస్తుంది. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని కింద 25-65 శాతం నిధులను దేశీయంగా ఈక్విటీల్లోను, 25-85 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ, 0-15 శాతం నిధులను బంగారం, 10-80 శాతం మొత్తాన్ని అంతర్జాతీయ సంస్థల షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈటీఎఫ్ మార్గంలో పెట్టుబడులు పెడుతుంది. సాధారణంగా ఏ ఆర్ధిక సాధనానికి ఎంత 'మేర ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో ఇన్వె స్టర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇన్వెస్టర్లు. ప్యాసివ్ విధానంలో వివిధ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరళతరమైన సాధనంగా ఉపయోగపడుతుందని సంస్థ హెడ్ (ప్రోడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ) చింతన్ హరియాతెలిపారు. దేశీ ఈక్వటీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడుల వల్ల డైవేర్సిఫికేషన్ మరింత మెరుగ్గా ఉండగలదని పేర్కొన్నారు. ఇతర ఫండ్, పౌస్‌ల ఈటీఎఫ్‌లలో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌కి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఫండ్ దేశంలోనే మొదటే సిల్వర్ ఈటీఎఫ్‌ను, ఈ నెల 6న ప్రారంభించనుంది. ఇది 19వ తేదీన ముగుస్తుంది. సిల్వర్, సిల్వర్ ఆధారిత సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ రుణ పత్రాల్లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్(ఏడాది కాలం వరకు), సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సిల్వర్. ఈటీఎఫ్‌ల నిర్వహణ మార్గదర్శకాలను సెబీ గత నవంబర్‌లో ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఎన్‌ఫ్‌వోకు దరఖాస్తు చేసుకుంది. వెండిలో ఇన్వెస్ట్ చేసుకునే వారికి భౌతిక వెండితో పోలిస్తే ఇది మెరుగైన సాధనం అవుతుంది. -
మిరే అసెట్ హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్
మిరే అసెట్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ప్రకటించింది. ఒకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ కాగా మరొకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్). మొదటిదానిలో పెట్టుబడులకు నవంబర్ 29, రెండో దానికి డిసెంబర్ 1 ఆఖరు తేదీ. ఈటీఎఫ్‌కు సిద్ధార్థ శ్రీవాస్తవ, ఎఫ్వోఎఫ్కు ఏక్తా గాలా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. హాంకాంగ్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన 30 చైనా టాప్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. -
భారత్ బాండ్ ఈటీఎఫ్‌తో రూ.10,000 కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం డిసెంబర్‌లోగా భారత్ బాండ్ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ద్వారా రూ.10,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలో ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పురోగతి ప్రణాళికలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇదే జరిగితే భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ ఇది మూడవ విడత అవుతుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల సులభతర రుణాలకు సంబంధించి ఒక పెట్టుబడి సాధనం. ఈటీఎఫ్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీల ’ఏఏఏ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. 2020 జూలైలో రెండవ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ జరిగింది. మూడురెట్లకుపైగా ఇది ఓవర్సబ్స్రై్కబ్ అయ్యింది. రూ.11,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ఇక 2019 డిసెంబర్లో వచ్చిన తొలి ఆఫర్ ద్వారా రూ.12,400 కోట్ల సమీరణలు జరిగాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు మొదటి విడతలో మూడు, పది సంవత్సరాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉండగా, రెండవ విడతకు ఐదు, 12 సంవత్సరాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎడెల్వైస్ అసెట్ మేనేజ్మెంట్ ఈ పథకం ఫండ్ మేనేజర్. -
బిట్‌కాయిన్ @ 66,901 డాలర్లు
న్యూయార్క్: కొన్నాళ్ల క్రితమే 30,000 డాలర్ల కిందికి పడిపోయిన బిట్‌కాయిన్ విలువ మళ్లీ దూసుకుపోతోంది. తాజాగా బుధవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయి 66,901 డాలర్లకు (దాదాపు రూ. 50,17,575) ఎగసింది. గతంలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 64,889 డాలర్లు. ఈ ఏడాది వేసవిలో బిట్‌కాయిన్ విలువ 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రోషేర్స్ బిట్‌కాయిన్ స్ట్రాటెజీ వంటి బిట్‌కాయిన్ ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుండటం కాయిన్ ర్యాలీకి దోహదపడుతోంది. లిస్టింగ్ రోజునే ప్రోషేర్స్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌కి సంబంధించి 2.41 కోట్ల షేర్లు చేతులు మారటం బిట్‌కాయిన్ డిమాండ్‌కి నిదర్శనం. ఈ ఈటిఎఫ్‌లు నేరుగా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, దానికి సంబంధించిన ఫ్యూచర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈటీఎఫ్‌ల వల్ల.. హాట్, కోల్డ్ వాలెట్లు వంటి సాంకేతిక అంశాల బాదరబందీ లేకపోవడంతో సామాన్య ఇన్వెస్టర్లు కూడా బిట్‌కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణ బ్రోకరేజి అకౌంటుతో కూడా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతోందని పేర్కొన్నాయి. -
ఆదిత్య బిర్లాసన్లైఫ్ నుంచి నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్‌కేర్ టీఆర్ఐ ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్‌కేర్ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు. -
బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్
డిజిటల్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకుల ఆంక్షల విధించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. రూ.35 లక్షలు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సేవల సంస్థలైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ మద్దతునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కెనడాలో బంగారం మాదిరే బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్ ప్రపంచంలోనే బౌతికంగా బిట్ కాయిన్‌తో పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్టర్లు తేలిగ్గా పొందడానికి ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ వెసులుబాటు కల్పిస్తున్నది. బిట్‌కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో $ 48,975కు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63శాతం పెరిగింది. 2020 మార్చి నుండి సుమారు 1,130 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిపెట్టినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. -
పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్స్
ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇండెక్స్ ఫండ్స్ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వ్యయాలపరంగా కాస్త చౌకగా ఉండటంతో పాటు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఉండటం కూడా వీటికి సానుకూలాంశం. దీర్ఘకాలికంగా సంపద సృష్టికి అనువైనవిగా నిరూపించుకున్నాయి. అమెరికా తదితర సంపన్న దేశాల్లో వందల కొద్దీ ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్చంజీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఉన్నప్పటికీ.. భారత్‌లో ఇవి ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం పలు అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు .. పెద్ద సంఖ్యలోనే ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. వందలకొద్దీ మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్ సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల ముందు ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ఈటీఎఫ్‌ల సంగతేంటి? ఎక్కడ మొదలెట్టాలి.. లాంటి సందేహాలెన్నో వస్తాయి. ఇందుకోసం బేరీజు వేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యామ్నాయం.. ఈటీఎఫ్‌లు ఇక ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఈటీఎఫ్‌లు మిగతా షేర్లలాగానే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతుంటాయి. ఇండెక్స్ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. నిర్వహిస్తుంటాయి. సాధారణంగా ఈటీఎఫ్‌లలో యూనిట్లు కొంటే ఓ రేటు, అమ్మితే ఇంకో రేటులాగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ వ్యయాలతో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కేటాయింపుల కోసం ఇండెక్స్ ఫండ్స్ చాలా మెరుగైన సాధనాలనే చెప్పవచ్చు. ఫండ్స్ మేళవింపే 90 శాతం పైగా రాబడులకు కీలకంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాం.. దేన్ని.. ఎప్పుడు అమ్మేశాం.. అన్నది కాకుండా పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. వివిధ రకాల అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇండెక్స్ ఫండ్స్‌ను నిస్సందేహంగా పరిశీలించవచ్చు. రిస్క్ సామర్థ్యం ముందుగా మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఎంతవరకూ రిస్కు తీసుకోగలరో అర్థం చేసుకుని, దానికి కట్టుబడి ఉండాలి. రిస్క్ సామర్థ్యంపై అవగాహన లేకపోతే.. బుల్ మార్కెట్లలో మరీ దూకుడుగా ఉండటమో, బేర్ మార్కెట్లలో మరీ వెనక్కి తగ్గిపోవడమో చేయడంవల్ల మొత్తం సంపదనంతా పోగొట్టుకునే అవకాశం ఉంది. అనువైన సాధనం మార్కెట్లో బోలెడన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు.. పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టరు.. మరీ ఎక్కువగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం శ్రేయస్కరం. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు కొంత మొత్తంలో కేటాయించవచ్చు. ఇక అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు.. షేర్లలోనూ, మిడ్.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనూ కాస్త పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవేంటంటే.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టోరల్, ఇంటర్నేషనల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లో భారత్‌లోని టాప్ 100 స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో తదుపరి 150 స్టాక్స్ (101–250), స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో మిగతా స్టాక్స్ (250 ప్లస్) ఉంటాయి. గత రాబడులు చూస్తే.. సెక్టోరల్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆకర్షణీయంగానే కనిపించవచ్చు. అయినప్పటికీ ఇవి చాలా రిస్కుతో కూడుకున్నవే కాకుండా తీవ్ర హెచ్చుతగ్గులకు కూడా లోనవుతుంటాయన్నది గుర్తుంచుకోవాలి. సురక్షితమైన సాధనం కావాలనుకునే వారు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ (నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కాకుండా, ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. రూపాయి మారకం విలువ క్షీణించినప్పుడు హెడ్జింగ్‌కు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు.. ఇంటర్నేషనల్ ఫండ్స్ తోడ్పడతాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. సరైన ఫండ్ ఎంపిక అనేక రకాల ఫండ్స్ సంస్థలు దాదాపు ఒకే రకమైన ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో గందరగోళం తలెత్తడం సహజం. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌ను ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకంగానే కనిపించినా.. ఇన్వెస్టర్లు ప్రధానంగా వ్యయాలపైన (టోటల్ ఎక్స్పెన్స్ నిష్పత్తి), ట్రాకింగ్ ఎర్రర్‌ని (టీఈ) పరిశీలించాలి. ప్రామాణిక సూచీ ఇచ్చే రాబడితో పోలిస్తే ఫండ్ ఎంత రాబడి ఇస్తోందన్నది టీఈ ద్వారా తెలుస్తుంది. అయితే, ప్రామాణిక సూచీ పనితీరునే కచ్చితంగా ప్రతిబింబించడం ఏ ఫండ్‌కైనా అసాధ్యమే. ట్రేడింగ్ వ్యయాలు, పన్నులు, వ్యయాల నిష్పత్తి మొదలైన వాటి కారణంగా ప్రతీ ఏటా.. ఎంతో కొంత టీఈకి దారి తీస్తుంది. చాలా సందర్భాల్లో వ్యయాల నిష్పత్తులు ఎంత ఎక్కువగా ఉంటే టీఈ అంత ఎక్కువగా ఉంటుంది. కనుక.. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. -
భారత్ బాండ్.. ఇన్వెస్ట్ చేస్తున్నారా?
భారత్ బాండ్ ఈటీఎఫ్.. నూతన మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో తొలి కార్పొరేట్ బాండ్ ఫండ్ ఇదే అవుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే, అప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా? అన్నది ఇన్వెస్టర్లు సులభంగా నిర్ణయించుకోగలరు. ఆ వివరాలు అందించే ‘ప్రాఫిట్’ కథనమే ఇది. ∙ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను కేంద్రం తీసుకురావడం వెనుక లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశీయ డెట్ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్ ఈటీఎఫ్‌ను అందించడం.. ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లు ప్యాసివ్ (క్రియాశీలకం కాని) పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్‌ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్‌కు అనుగుణంగానే ఉంటాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు సంబంధించి భారత్ బాండ్ ఇండెక్స్– ఏప్రిల్ 2023, భారత్ బాండ్ ఇండెక్స్ – ఏప్రిల్ 2030 సూచీలను ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఈటీఎఫ్‌లకు భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు మధ్య వ్యత్యాసం.. భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతాదంతా ఇతర ఈటీఎఫ్‌ల్లో మాదిరే ఉంటుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడేళ్లు (ఏప్రిల్ 2023), పదేళ్లు (ఏప్రిల్ 2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. కాల వ్యవధి తీరిన తర్వాత అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు. ఇందులో కేవలం గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్ ఆప్షన్ లేదు. ఎడెల్వీజ్ ఏఎంసీ ఈ ఈటీఎఫ్ నిర్వహణను చూస్తోంది. ఇది ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ కనుక ఇష్యూ ఈ నెల 20న ముగిసినప్పటికీ.. తర్వాత స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడవుతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేయనున్నారు. లిస్ట్ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్ (రూ.1,000) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ‘భారత్బాండ్ డాట్ ఇన్’ పోర్టల్‌కు వెళ్లి ఎన్ఎఫ్వో ఆఫర్ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్వీజ్ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇష్యూ సైజు మూడేళ్ల ఈటీఎఫ్ రూపంలో కనీసం రూ.3,000 కోట్లు, స్పందనను బట్టి అదనంగా మరో రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్ ద్వారా కనీసం రూ.4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో రూ.2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు. భద్రత ఎక్కువే... భారత్ బాండ్ ఈటీఎఫ్ కచ్చితంగా ఏఏఏ రేటింగ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీల డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. ఏఏఏ రేటింగ్ తిరిగి చెల్లింపుల విషయంలో అధిక భద్రతను సూచిస్తుంది. అంటే క్రెడిట్ రిస్క్ చాలా చాలా తక్కువ. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్ ఉండదు. పన్ను ఎంతో తక్కువ మూడేళ్లకు పైగా పెట్టుబడులను కొనసాగిస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పన్ను ఎంతో తక్కువ. ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కన్జర్వేటివ్ (రిస్క్ తీసుకోని) ఇన్వెస్టర్లు 20–22 శాతం పెట్టుబడులను భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు కేటాయించుకోవచ్చు. ఏఏఏ రేటింగ్ రాబడులు, రిస్క్ లేని సాధనం. – పవన్ అగర్వాల్, ప్రైవేటు వెల్త్ (ఇండియా నివేష్) ఎండీ అన్ని విధాలా అనుకూలం అత్యంత చౌక బాండ్ ఫండ్ ఇది. çఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే బయటకు వచ్చేందుకు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫండ్ విషయంలో ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీగా లిక్విడిటీ ఉంటుంది. రాబడులు, పన్ను, లిక్విడిటీ ఇలా అన్ని అంశాల్లోనూ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్‌తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్క్‌లు పడతాయి. – నితిన్ జైన్, ఎడెల్వీజ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో రాబడులు/చార్జీలు ఈటీఎఫ్‌లకు నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లుగా నిర్ణయించారు. కనుక వీటిల్లో రాబడులను సుమారుగా ఊహించొచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఎన్ఎఫ్వో డాక్యుమెంట్ ప్రకారం.. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసి కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఈటీఎఫ్‌లో కొనసాగితే అప్పుడు.. 2023 ఈటీఎఫ్‌లో వార్షిక రాబడులు 6.59 శాతం, 2030 ఈటీఎఫ్‌లో వార్షిక రాబడులు 7.52 శాతం వరకు ఉంటాయి. ఈ రాబడులు గ్యారంటీ కావు. కేవలం సూచనీయమైనవి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులకు ఎప్పుడూ హామీ ఉండదు. సూచిత రాబడులను రోజువారీగా ఎడెల్వీజ్ ఏఎంసీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై వసూలు చేసే నిర్వహణ చార్జీ) కేవలం 0.0005 శాతమే. దేశంలో అత్యంత చౌక మ్యూచువల్ ఫండ్ ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చౌక చార్జీలతో కూడిన డెట్ ఫండ్ కూడా అవుతుంది. డెట్ ఫండ్స్‌లో రాబడులు తక్కువగా ఉంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో చాలా కీలక పాత్రే పోషిస్తుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ చార్జీల పరంగా ఎంతో చౌక కనుక నికర రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఈటీఎఫ్‌లపై రాబడులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవే కాల పరిమితుల డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న రేట్ల స్థాయిలోనే ఉంటాయని భావించొచ్చు. ఇక ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు వైదొలిగితే అప్పుడు 0.10 శాతం ఎగ్జిట్‌లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడిటీ... ఒక సాధనంలో పెట్టుబడి, రాబడులతోపాటు అవసరమైన సందర్భాల్లో వేగంగా వాటిని నగదుగా మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టర్లకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణాల్లో లిక్విడిటీ కూడా ఒకటి. మన దేశంలో చాలా వరకు డెట్ ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్ స్వల్పంగానే ఉంటోంది. అయితే, పెద్ద సైజు ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్ యాక్టివిటీ చురుగ్గానే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారత్ బాండ్ ఈటీఎఫ్ రూ.7,000 కోట్లకుపైనే సమీకరించనున్న దృష్ట్యా లిక్విడిటీ తగినంత ఉంటుందని ఆశించొ చ్చు. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్‌లలో తగినంత లిక్విడిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎడెల్వీజ్ ఏఎంసీ చెబుతోంది. ఇందు కోసం పలువురు మార్కెట్ మేకర్లను నియమించనున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వీరు తగినంత లిక్విడిటీతోపాటు ధర సహేతుకంగా ఉండేలా చూస్తారు. మార్కెట్ మేకర్ల కోసం రూ.20 కోట్లను వెచ్చించేందుకు ఏఎంసీలకు అనుమతి ఉంది. పైగా ఇందులో రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న మొత్తం కావడంతో లిక్విడిటీ మెరుగ్గానే ఉంటుందని అంచనా. వాస్తవంగా లిక్విడిటీ ఏ మేరకు అన్నది ఈటీఎఫ్ లిస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎడెల్వీజ్ ఏఎంసీ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) రకాన్ని కూడా తీసుకురానుంది. ఇది భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి లిక్విడిటీ పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇతర డెట్ ఫండ్ పథకాల మాదిరే అవసరమైనప్పుడు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లేని వారు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అనుకూలమేనా..? డెట్ ఫండ్ విభాగంలో సంక్షోభాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అధిక క్వాలిటీ పోర్ట్‌ఫోలియోతో, ఊహించతగ్గ రాబడులతో, తక్కువ ఖర్చుతో కూడిన భారత్ బాండ్ ఈటీఎఫ్ అనుకూలమే. నిర్ణీత కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించొచ్చు. మూడేళ్లతో పోలిస్తే పదేళ్ల ఈటీఎఫ్‌లో తొలినాళ్లలో రేట్ల పరంగా అస్థిరత కొంత ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పదేళ్ల కాలంలో వడ్డీ రేట్ల పరంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే వారు ఆందోళన చెందక్కర్లేదు. తక్కువ క్రెడిట్ రిస్క్, అతి తక్కువ నిర్వహణ చార్జీలతో కూడిన కార్పొరేట్ డెట్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసి పూర్తి కాలం పాటు కొనసాగితే వడ్డీ రేట్ల రిస్క్ కూడా ఉండదు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు, పదవీ విరమణ చేసిన వారు, భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల కాల వ్యవధి వరకు కొనసాగేవారు పెట్టుబడులను పరిశీలించొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఇది ఉపకరిస్తుంది. పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా రియల్టీ) ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కోణంలో సూచనీయం కాదు. డెట్‌లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకో వాలన్నది నిపుణుల మాట. అందుకోసం భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను పరిశీలించొచ్చు. తమ పెట్టుబడుల్లో 10–20 శాతం మేర భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మూడేళ్ల పాటు కొనసాగితే, ద్రవ్యోల్బణ ప్రభావ మినహాయింపు (ఇండెక్సేషన్)ను పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్లపైన మూలధన రాబడులపై 20 శాతం పన్ను అమలవుతుంది. అంటే మూలధన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాతే 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి వ్యక్తిగత ఆదాయంలో కలసి, నిర్ణీత శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాబడి ఎఫ్‌డీల స్థాయిలో ఉన్నా కానీ, పన్ను ఆదా పరంగా బాండ్ ఈటీఎఫ్ అదనపు ప్రయోజనం. ప్రారంభంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మూడేళ్ల ఈటీఎఫ్‌పై నాలుగేళ్ల ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీంతో పన్ను అనంతర రాబడులు అధికంగా ఉంటాయని ఆశించొచ్చు. మూడేళ్ల బాండ్ ఈటీఎఫ్‌లో పన్ను అనంతరం రాబడులు 6.3%, పదేళ్ల ఈటీఎఫ్‌లో పన్ను అనంతర రాబడులు 7 శాతంగా ఉంటాయని అంచనా. పారదర్శకత రోజువారీగా పోర్ట్‌ఫోలియో, ఇండికేటివ్ రిటర్నులు (సూచిత రాబడులు) ఎంత మేర అన్న వివరాలను ఎడెల్వీజ్ ఏఎంసీ తన వెబ్సైట్లో ప్రదర్శించనుంది. అదే సంప్రదాయ డెట్ ఫండ్స్ నెలకోసారి మాత్రమే పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పోలిస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో పారదర్శకత ఎక్కువే.