హైదరాబాద్: మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్ మేనేజరుగా ఉంటారు. 12 టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్ చేస్తుంది.
రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్ (ఈటీఎఫ్ ప్రోడక్ట్) సిద్ధార్థ్ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ విప్లవంతో ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment