Nifty Bank
-
బజాజ్ ఫిన్సర్వ్ రెండు ఈటీఎఫ్‌లు
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. -
మిరే అసెట్ నుంచి నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్
హైదరాబాద్: మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్ మేనేజరుగా ఉంటారు. 12 టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్ (ఈటీఎఫ్ ప్రోడక్ట్) సిద్ధార్థ్ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ విప్లవంతో ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు. -
ఊగిసలాటలో.. ఫార్మా జోరు- బ్యాంకింగ్ వీక్
మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్లు క్షీణించి 37,909కు చేరగా.. నిఫ్టీ 20 పాయింట్ల వెనకడుగుతో 11,203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,080 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,891 దిగువన కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 11,250- 11,200 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇదీ తీరు ఎన్ఎస్ఈలో ఫార్మా 2 శాతం జంప్‌చేయగా.. ఎఫ్ఎంసీజీ 0.4 శాతం పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ 1.2 శాతం డీలాపడగా.. రియల్టీ, మెటల్, ఐటీ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, యూపీఎల్, హెచ్‌యూఎల్, నెస్లే, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్, ఆర్ఐఎల్ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, కోల్ ఇండియా, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టీసీఎస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఫార్మా భళా డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, కేడిలా హెల్త్, అరబిందో, లుపిన్, పీవీఆర్, గ్లెన్‌మార్క్, గోద్రెజ్ సీపీ, టొరంట్ ఫార్మా, ఎస్కార్ట్స్, టాటా కన్జూమర్ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా, పీఎన్బీ, బీవోబీ, బంధన్ బ్యాంక్, భెల్, ఇండిగో, బాటా, కంకార్ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 878 లాభపడగా.. 761 నష్టాలతో కదులుతున్నాయి. -
ఆద్యంతం ఆటుపోట్లు- చివరికి అక్కడక్కడే
ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ముగిశాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,973 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 5 పాయింట్లు తగ్గి 11,222 వద్ద స్థిరపడింది. అయితే వరుసగా మూడో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్‌చేసి 38,236ను తాకగా.. నిఫ్టీ 11,305 వరకూ ఎగసింది. అయితే ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 37,831 వద్ద, నిఫ్టీ 11,181 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చవిచూశాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా 2.2-0.7 శాతం మధ్య నీరసించగా.. మెటల్ 2 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటో, ఐటీ 0.3 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కొ, అల్ట్రాటెక్, హీరో మోటో, టైటన్, టీసీఎస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, శ్రీ సిమెంట్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, పవర్‌గ్రిడ్, యాక్సిస్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, గ్రాసిమ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ 3.5-1.3 శాతం మధ్య డీలా పడ్డాయి. ఐడియా పతనం డెరివేటివ్ కౌంటర్లలో జిందాల్ స్టీల్, పేజ్, మైండ్‌ట్రీ, ముత్తూట్, మదర్సన్, బాలకృష్ణ, అంబుజా, ఎస్కార్ట్స్, అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్, సీమెన్స్ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, భెల్, బీవోబీ, ఇన్ఫ్రాటెల్, పీఎన్బీ, జీఎంఆర్, మెక్‌డోవెల్, ఇండిగో, ఐజీఎల్, టాటా కన్జూమర్, మ్యాక్స్ ఫైనాన్స్, పిరమల్, హావెల్స్, ఫెడరల్ బ్యాంక్ 6-2.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,178 లాభపడగా.. 1,436 నష్టాలతో నిలిచాయి. డీఐఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,080 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
చివర్లో అమ్మకాలు- ఫార్మా ధూమ్‌ధామ్
తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లను చివరి గంటలో పెరిగిన అమ్మకాలు దెబ్బతీశాయి. వెరసి నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు క్షీణించి 38,846 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్ల వెనకడుగుతో 11,505 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో సెన్సెక్స్ 39,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. చివర్లో 38,636 పాయింట్ల దిగువకు సైతం చేరింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,584- 11,446 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అయితే తొలి నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 20,689 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఫార్మా జోరు ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 5 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 2 శాతం, ఆటో 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం, ఎఫ్ఎంసీజీ 0.6 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 10 శాతం, సిప్లా 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, విప్రో, పవర్‌గ్రిడ్, హీరో మోటో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్ 3.7-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, మారుతీ, టైటన్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, ఐవోసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ 2.2-0.75 శాతం మధ్య క్షీణించాయి. డెరివేటివ్స్‌లోనూ.. డెరివేటివ్ కౌంటర్లలో లుపిన్, దివీస్, కేడిలా, గ్లెన్‌మార్క్, అపోలో హాస్పిటల్స్, అరబిందో, డీఎల్ఎఫ్, బయోకాన్, సన్ టీవీ 4.5-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమ్, అపోలో టైర్, పెట్రోనెట్, బంధన్ బ్యాంక్, టొరంట్ పవర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, పిరమల్, వోల్టాస్, కోఫోర్జ్, అమరరాజా, జూబిలెంట్ ఫుడ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీఎన్బీ, జిందాల్ స్టీల్, కమిన్స్ 3.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.25 శాతం పుంజుకోగా, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1308 లాభపడగా.. 1431 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్@ 39,000- బ్యాంక్స్ దన్ను
ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాల వద్దే నిలవగలిగాయి. దీంతో సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయికి ఎగువన స్థిరపడగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500ను అధిగమించింది. నేటి ట్రేడింగ్‌లోనూ యథాప్రకారం ఆటుపోట్లు కనిపించినప్పటికీ చివరికి సెన్సెక్స్ 288 పాయింట్లు బలపడి 39,044 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు ఎగసి 11,522 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,754 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ ఒక దశలో 11,442 వరకూ నీరసించింది. మీడియా డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం లాభపడింది. రియల్టీ, మీడియా 0.7-0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, సిప్లా, యూపీఎల్, యాక్సిస్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టైటన్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్, ఐటీసీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్ 1.4-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. ఆటో గుడ్ డెరివేటివ్ కౌంటర్లలో మదర్సన్, అశోక్ లేలాండ్, లుపిన్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అరబిందో, నౌకరీ, అంబుజా సిమెంట్, ఐజీఎల్, శ్రీరామ్ ట్రాన్స్, మైండ్‌ట్రీ, అమరరాజా, కమిన్స్, గోద్రెజ్‌సీపీ 4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, నాల్కో, ఐబీ హౌసింగ్, బీఈఎల్, మారికో, పేజ్, ఎస్కార్ట్స్, అదానీ ఎంటర్, పీఎన్బీ 3.5-01 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,582 లాభపడగా.. 1,164 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,176 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డీఐఐలు రూ. 724 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
బ్యాంకింగ్ హవా- మార్కెట్లకు పుష్
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు సైతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి 39,467 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు ఎగసి 11,648 వద్ద నిలిచింది. మరోసారి హషారుగా ప్రారంభమైన మార్కెట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో రోజంతా పటిష్టంగా కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,580 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,235 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 11,686- 11,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. వరుసగా ఐదో రోజు గురువారం యూఎస్ ఇండెక్స్ ఎస్అండ్పీ సరికొత్త గరిష్టం వద్ద నిలవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇండస్ఇండ్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్ ఇండెక్సులు 5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. మీడియా 1.8 శాతం లాభపడగా.. ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ 0.8-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 12 శాతం దూసుకెళ్లగా.. యాక్సిస్, యూపీఎల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, ఎయిర్టెల్, జీ, టెక్ మహీంద్రా 8-2 శాతం మధ్య ఎగశాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, సిప్లా 3-1 శాతం మధ్య క్షీణించాయి. ఐడియా దూకుడు ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా, ఎన్ఎండీసీ, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, భెల్, బీవోబీ, పీఎన్బీ, ఐడిఎఫ్సీ ఫస్ట్, ఆర్బీఎల్ 15-4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క అశోక్ లేలాండ్, హావెల్స్, డీఎల్ఎఫ్, టీవీఎస్ మోటార్, భారత్ ఫోర్జ్, పిడిలైట్, టొరంట్ ఫార్మా, అపోలో టైర్, ఎక్సైడ్, ఎస్కార్ట్స్ 3-1.3 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.5 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1278 లాభపడగా.. 1614 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,164 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 809 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు 1,581 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
స్వల్ప లాభాలతో సరి- తొలుత 39,000కు
తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 45 పాయింట్లు పుంజుకుని 38,844 వద్ద నిలిచింది. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. అయితే విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలి సెషన్లోనే సెన్సెక్స్ సాంకేతికంగా కీలకమైన 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు నష్దాల బాట పట్టింది. వెరసి 38,680 దిగువన కనిష్టానికి చేరింది. మరోవైపు నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,526 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,423 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. ఆగస్ట్ డెరివేటివ్ సిరీస్ ముగింపు ముందున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టినట్లు నిపుణులు తెలియజేశారు. ఆటో, మీడియా అప్ ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 1.2 శాతం బలపడగా.. ఆటో, మీడియా 0.35 శాతం స్థాయిలో లాభపడ్డాయి. రియల్టీ 2.2 శాతం డీలాపడగా.. మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ 0.8-0.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ బ్యాంక్, టైటన్ 5.3-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గెయిల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, ఎల్అండ్టీ, నెస్లే, అదానీ పోర్ట్స్, విప్రో, యూపీఎల్, హీరో మోటో, ఇన్ఫోసిస్ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోరు ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ 21 శాతం దూసుకెళ్లగా.. మ్యాక్స్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, చోళమండలం, టాటా కెమ్, హావెల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కెనరా బ్యాంక్, ఐబీ హౌసింగ్, ఆర్బీఎల్ బ్యాంక్, అశోక్ లేలాండ్, సన్ టీవీ 13-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క బీహెచ్ఈఎల్, పేజ్, జిందాల్ స్టీల్, ఎంజీఎల్, బీఈఎల్, నాల్కో, కేడిలా హెల్త్, ఎన్ఎండీసీ, సెంచురీ టెక్స్, ఎస్బీఐ లైఫ్, అపోలో టైర్, బాటా, జీఎంఆర్ 2.5-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.5 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1353 లాభపడగా.. 1474 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 219 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మళ్లీ ర్యాలీ షురూ- 38,000కు సెన్సెక్స్
ఐదు రోజుల ర్యాలీకి ముందు రోజు బ్రేక్ పడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. తొలుత కొంత కన్సాలిడేషన్ కనిపించినప్పటికీ సమయం గడిచేకొద్దీ బలాన్ని పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 269 పాయింట్లు జంప్‌చేసి 38,140 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 11,215 వద్ద నిలిచింది. అయితే వరుసగా రెండో రోజు మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,225-37,739 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 11240 వద్ద గరిష్టాన్నీ, 11103 వద్ద కనిష్టాన్ని తాకింది. ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ఐటీ(0.2 శాతం) మాత్రమే వెనకడుగు వేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, ఫార్మా, రియల్టీ రంగాలు 1.4 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఐసీఐసీఐ, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఐవోసీ, ఐటీసీ, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే యాక్సిస్, శ్రీ సిమెంట్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, ఎల్అండ్టీ 4-0.5 శాతం మధ్య క్షీణించాయి. దివీస్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో దివీస్, జీఎంఆర్, బీఈఎల్, మణప్పురం, హావెల్స్, అపోలో హాస్పిటల్స్ 6-3.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎస్కార్ట్స్, శ్రీ సిమెంట్, గోద్రెజ్ సీపీ, ఎంఆర్ఎఫ్, జిందాల్ స్టీల్, పెట్రోనెట్, అంబుజా 3.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.6 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1453 లాభపడగా.. 1205 నష్టపోయాయి. ఎఫ్‌పీఐలు భళా.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
600 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ప్రారంభం
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ సోమవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 613 పాయింట్ల లాభంతో 34901 వద్ద, నిఫ్టీ 185 పాయింట్లు పెరిగి 10327 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ను నడిపిస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు నేటి ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3.50శాతానికి పైగా 21,785.85 వద్ద ట్రేడ్ అవుతోంది. లాక్డౌన్ సడలింపులో భాగంగా దాదాపు 75 రోజుల తర్వాత నేడు దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌తో పాటు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్థలాలు పునః ప్రారంభం కానుండటం ఈక్విటీ మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. మార్కెట్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. టైటాన్, పీవీఆర్, అబాట్ ఇండియా కంపెనీలతో పాటు 19 కంపెనీల త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొవిద్-19 కేసుల సంఖ్య 2.50లక్షలకు పైగా నమోదు కావడంతో స్టాక్ మార్కెట్‌ను కలవరపరుస్తుంది. గతవారంలో శుక్రవారం వెల్లడైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు అయ్యాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత తొందరగా రికవరి కావచ్చని ఆశలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్నాయి. ఫలితంగా నేడు ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, తైవాన్, థాయిలాండ్, కొరియా, ఇండోనేషియా దేశాలకు చెందిన స్టాక్ సూచీలన్నీ 1శాతానికి పైగా లాభాల్లో కదులుతున్నాయి. అత్యధికంగా ఇండోనేషియా ఇండెక్స్ జకార్తా కాంపోసైట్ 2.50శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది. రష్యాతో పాటు ఓపెక్ దేశాలు జూలై చివరి వరకు రికార్డు స్థాయిలో చమురు ఉత్పత్తి కోతను మరింత తగ్గించడానికి అంగీకరించడంతో క్రూడాయిల్ ధరలు 3నెలల గరిష్టంపై ట్రేడ్ అవుతున్నాయి. నేడు బ్యారెల్ బ్రెండ్ క్రూడాయిల్ ధర 1.50శాతం లాభపడి 43డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్, టాటామోటర్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, సన్‌ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి. -
ఫైనాన్స్ షేర్ల క్షీణత మార్కెట్‌ను మరింత ముంచింది..!
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్ని టర్మ్ లోన్ చెల్లింపులపై మారిటోరియాన్ని ఆగస్ట్ 31వరకు పొడిగించడంతో శుక్రవారం బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెన షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. రుణగ్రహీతల నుండి రుణాల తిరిగి పొందడానికి ఎక్కువ కాలం వేచి ఉండటంతో బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీస్తుందని విశ్లేషకులు తెలిపారు. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2.6శాతం నష్టంతో 17,279 వద్ద, నిప్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3శాతం నష్టంతో 9,421 ముగిశాయి. అయితే ఎన్ఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.10శాతం స్వల్ప నష్టంతో 1090 పాయింట్లు వద్ద స్థిరపడింది. ఇప్పటికే కోవిద్ లాక్‌డౌన్‌తో ఇప్పటికే బ్యాంకులు ఒత్తిడిలో ఉన్నాయి. అలాగే ఆస్తుల నాణ్యత విషయంలో చాలా సమస్యలను ఎదుర్కోంటున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ మారిటోరియం పొడగింపు ప్రతికూలంగా మారనుంది. అయితే, రెపోరేటు తగ్గింపు క్రెడిట్ వృద్ధికి సానుకూలంగా ఉంటుంది. ఈ తాత్కాలిక నిషేధం ప్రతికూలంగా ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల ఖర్చులను తగ్గిస్తుంది. అని షేర్‌ఖాన్ వైస్ ప్రెసిడెంట్ లలితాబ్ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగింపు సరికే యాక్సిస్ బ్యాంక్ 5.50శాతం, ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 4శాతం నష్టంతో ముగిశాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ షేర్లు అరశాతం నష్టంతో రూ.151 వద్ద ముగిసింది. -
మార్కెట్‌ను నడిపిస్తున్న బ్యాంకింగ్, ఆటోరంగ షేర్లు
స్వల్పలాభంతో మొదలైన మార్కెట్ క్రమంగా లాభాలను పెంచుకుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, అటో రంగ షేర్ల ర్యాలీ మార్కెట్‌ను ముందుండి నడిపిస్తుంది. లాక్డౌన్ పరిమితుల సడలింపు తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోలుకుంటుందనే ఆశావహన అంచనాలు ఇన్వెసర్లను కొనుగోళ్ల వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. ఒకదశలో నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 9,151 స్థాయిని, సెన్సెక్స్ 291 పాయింట్ల లాభపడి 31,110 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల భయాలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. నేటివరకు మొత్తంగా భారత్‌లో 1.12లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 3430 మంది మృత్యువాత పడినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. మిడ్ సెషన్ సమమయానికి సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో 31,058 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్లు పెరిగి 9,142.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.50శాతం లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.50శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ మెటల్ ఇండెక్స్ 2శాతం, నిఫ్టీ ఎన్ఎస్ఈ ఫైనాన్స్ సెక్టార్ 1.50శాతం ర్యాలీ చేశాయి. నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ అత్యధికంగా 3శాతం పెరిగింది. జీ లిమిటెడ్, హీరోమోటోకార్ప్, హిందాల్కో, బజాజ్-అటో, ఇన్ఫ్రాటెల్ షేర్లు 3శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, గ్రాసీం, ఎన్టీపీసీ, శ్రీరాం సిమెంట్స్ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టాన్ని చవిచూశాయి. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
-
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన ఈక్విటీ బెంచ్మార్కులు సోమవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల స్వల్ప లాభంతో 26,350 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,126.90 వద్ద క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.66 శాతం పెరిగాయి. కానీ రిజర్వు బ్యాంకు ఊహించని విధంగా సీఆర్ఆర్ పెంచడంతో బ్యాంకులు షేర్లు నష్టాల బాట పట్టాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద భారీగా డిపాజిట్లు పెరగడంతో సెంట్రల్ బ్యాంకు వద్ద బ్యాంకులు ఉంచాల్సిన నగదు నిల్వల నిష్ఫత్తి కూడా పెంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ 2.55 శాతం కిందకు దిగజారింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ కూడా 1.11 శాతం నష్టపోయింది. బ్యాంకు షేర్లలో భారీగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2.84 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.89 శాతం పడిపోయాయి. అయితే ఆసియన్ షేర్ల పెరుగుదల మొత్తంగా కొంచెం సెంటిమెంట్ బలపడంతో మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి.