మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్లు క్షీణించి 37,909కు చేరగా.. నిఫ్టీ 20 పాయింట్ల వెనకడుగుతో 11,203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,080 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,891 దిగువన కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 11,250- 11,200 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
ఇదీ తీరు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 2 శాతం జంప్‌చేయగా.. ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ 1.2 శాతం డీలాపడగా.. రియల్టీ, మెటల్, ఐటీ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, యూపీఎల్, హెచ్‌యూఎల్, నెస్లే, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్, ఆర్‌ఐఎల్ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టీసీఎస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి.
ఫార్మా భళా
డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, కేడిలా హెల్త్, అరబిందో, లుపిన్, పీవీఆర్, గ్లెన్‌మార్క్, గోద్రెజ్ సీపీ, టొరంట్ ఫార్మా, ఎస్కార్ట్స్, టాటా కన్జూమర్ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా, పీఎన్‌బీ, బీవోబీ, బంధన్ బ్యాంక్, భెల్, ఇండిగో, బాటా, కంకార్ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 878 లాభపడగా.. 761 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment