ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో బుధవారం అమెరికా మార్కెట్లు డీలాపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో రోజంతా దేశీ మార్కెట్లు బలహీనంగానే కదిలాయి. చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు క్షీణించి 40,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్ల వెనకడుగుతో 11,896 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,722- 40,309 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,940- 11,824 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు దేశీ మార్కెట్లలో ఇటీవల నమోదైన ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టినట్లు తెలియజేశారు.
మీడియా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో 0.9-0.2 శాతం మధ్య నీరసించాయి. మీడియా, మెటల్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 0.8-0.1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఎయిర్‌టెల్, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టాటా స్టీల్, యాక్సిస్, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, కోల్ ఇండియా, గెయిల్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, ఐటీసీ 4.2-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, టైటన్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, సిప్లా, సన్ ఫార్మా, ఐషర్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, మారుతీ, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆర్‌ఐఎల్ 3-0.7 శాతం మధ్య డీలా పడ్డాయి.
టొరంట్ 'పవర్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో టొరంట్ పవర్, శ్రీరామ్ ట్రాన్స్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, వేదాంతా, ఐడియా, ఎల్‌ఐసీ హౌసింగ్, టాటా పవర్, ఐజీఎల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఎక్సైడ్, అమరరాజా, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, మైండ్‌ట్రీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జూబిలెంట్ ఫుడ్, అరబిందో, బాలకృష్ణ, నౌకరీ, పీవీఆర్, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, ముత్తూట్, గోద్రెజ్ సీపీ, ఐబీ హౌసింగ్, డాబర్, బంధన్ బ్యాంక్ 3.4-1.6 శాతం మధ్య బోర్లా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,422 లాభపడగా.. 1,204 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,108 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,634 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment