psu banking
-
ఇండియన్ బ్యాంక్ ప్లస్... క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 34 శాతం ఎగసి రూ. 690 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 514 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 11,482 కోట్లయ్యింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.04 శాతం నుంచి 9.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 2.35 శాతం నుంచి 2.72 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా 2 శాతం బలపడి రూ. 4,395 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 1,556 కోట్లయ్యింది. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో మొత్తం ప్రొవిజన్లు 11 శాతం అధికమై రూ. 2,598 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.47 శాతంగా నమోదైంది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.1 శాతం నీరసించి 3.03 శాతానికి చేరాయి. రూ. 2,732 కోట్లమేర తాజా స్లిప్పేజీలు నమోదయ్యాయి. రూ. 5,400 కోట్ల విలువైన 34 మొండి ఖాతాలను గుర్తించినట్లు బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిలో తొలి దశకింద జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రూ. 1,200 కోట్ల విలువగల 5 ఖాతాలను బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. -
రికార్డుల ర్యాలీ- ప్రభుత్వ బ్యాంక్స్ హవా
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. వెరసి మరోసారి రికార్డుల ర్యాలీ నమోదైంది. సెన్సెక్స్ 181 పాయింట్లు ఎగసి 45,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలపడి 13,393 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,742ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 13,435ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్‌కు భారీ డిమాండ్ కనిపించడం గమనార్హం! చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) మీడియా వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్ 7.15 శాతం దూసుకెళ్లగా.. రియల్టీ, ఐటీ 0.8 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే మెటల్, ఫార్మా, మీడియా 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీసీఎస్, ఆర్ఐఎల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ 3-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హిందాల్కో, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఎయిర్టెల్ 2.3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. బ్యాంకింగ్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్ 19 శాతం, పీఎన్బీ 15 శాతం, బీవోబీ 10 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఇతర కౌంటర్లలో భెల్, వేదాంతా, గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, చోళమండలం 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్బీఎల్ బ్యాంక్, పెట్రోనెట్, లుపిన్, జిందాల్ స్టీల్, పీఎఫ్సీ, బంధన్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్ 2.6-1.8 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,498 లాభపడగా.. 1,460 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
వరుస లాభాలకు బ్రేక్- నష్టాల ముగింపు
ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో బుధవారం అమెరికా మార్కెట్లు డీలాపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో రోజంతా దేశీ మార్కెట్లు బలహీనంగానే కదిలాయి. చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు క్షీణించి 40,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్ల వెనకడుగుతో 11,896 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,722- 40,309 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,940- 11,824 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు దేశీ మార్కెట్లలో ఇటీవల నమోదైన ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. మీడియా ప్లస్‌లో ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో 0.9-0.2 శాతం మధ్య నీరసించాయి. మీడియా, మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.8-0.1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టాటా స్టీల్, యాక్సిస్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, కోల్ ఇండియా, గెయిల్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, హెచ్‌యూఎల్, ఐటీసీ 4.2-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, టైటన్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, సిప్లా, సన్ ఫార్మా, ఐషర్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, మారుతీ, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఆర్ఐఎల్ 3-0.7 శాతం మధ్య డీలా పడ్డాయి. టొరంట్ 'పవర్ ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో టొరంట్ పవర్, శ్రీరామ్ ట్రాన్స్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, వేదాంతా, ఐడియా, ఎల్ఐసీ హౌసింగ్, టాటా పవర్, ఐజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎక్సైడ్, అమరరాజా, ఆర్ఈసీ, పీఎఫ్సీ, మైండ్‌ట్రీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జూబిలెంట్ ఫుడ్, అరబిందో, బాలకృష్ణ, నౌకరీ, పీవీఆర్, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, ముత్తూట్, గోద్రెజ్ సీపీ, ఐబీ హౌసింగ్, డాబర్, బంధన్ బ్యాంక్ 3.4-1.6 శాతం మధ్య బోర్లా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,422 లాభపడగా.. 1,204 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,108 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,634 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
స్వల్ప నష్టాలతో సరి- ప్రభుత్వ బ్యాంక్స్ జోరు
పారిశ్రామికోత్పత్తి జూన్‌లో పాతాళానికి పడిపోవడం, విదేశీ మార్కెట్ల బలహీనతలతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ రికవర్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి 38,370 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,308 వద్ద నిలిచింది. అయితే అమ్మకాలు పెరగడంతో తొలుత సెన్సెక్స్ 38,126 దిగువన కనిష్టాన్ని తాకింది. తదుపరి చివర్లో 38,414 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. ఆటో, మీడియా అప్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, మీడియా 2.7-2 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5-0.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్, టాటా మోటార్స్, హీరో మోటో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, యూపీఎల్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సిప్లా, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, బీపీసీఎల్, విప్రో, బజాజ్ ఫిన్, ఎల్అండ్టీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. ఇండిగో జూమ్ డెరివేటివ్స్‌లో ఇండిగో 10 శాతం దూసుకెళ్లగా.. మదర్సన్, బాష్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, బీఈఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, ఎక్సైడ్, పీఎన్బీ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు నౌకరీ, కంకార్, ముత్తూట్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్, కేడిలా, గ్లెన్‌మార్క్, టొరంట్ ఫార్మా, లుపిన్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1511 లాభపడగా.. 1214 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఒక్క పాయింట్లో రికార్డు మిస్
ఒక్క పాయింట్ తేడాతో బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని మిస్సయ్యింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ముగింపు సమయంలో 21,205.44 పాయింట్ల స్థాయికి పరుగులు పెట్టింది. అయితే 2008 జనవరి 10న నెలకొల్పిన 21,206.77 పాయింట్ల రికార్డును అధిగమించలేకపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 130 పాయింట్లు లాభపడి 21,164 వద్ద క్లోజయ్యింది. ఇది సెన్సెక్స్‌కు కొత్త క్లోజింగ్ రికార్డు. ఎన్ఎస్ఈ నిఫ్టీ మూడేళ్ల విరామం తర్వాత తొలిసారిగా 6,300 స్థాయిని అధిగమించి, 6,309 వద్దకు చేరింది. చివరకు 47 పాయింట్ల పెరుగుదలతో 6,299 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐలు రూ. 1875 కోట్ల పెట్టుబడి చేయగా, రూ. 834 కోట్ల విలువైన షేర్లను దేశీయ సంస్థలు విక్రయించాయి. 2008 జనవరి 8ననెలకొల్పిన 6,357 పాయింట్ల రికార్డుస్థాయిని నిఫ్టీ ఇంకా బద్దలు చేయాల్సివుంది. 2010 నవంబర్ 5న 6,312 పాయింట్ల గరిష్ట ముగింపు రికార్డుకు నిఫ్టీ మరో 13 పాయింట్ల దూరంలో వుంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని కొనసాగించనున్నట్లు గత రాత్రి ప్రకటించినా, ఇతర ప్రపంచ మార్కెట్లు లాభాల స్వీకరణ ఫలితంగా క్షీణించాయి. కానీ స్థానిక మార్కెట్లో అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపురోజైనందున, ట్రేడింగ్ చివరి అరగంటలో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరిగిందని, దాంతో సూచీల ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత మూడురోజుల్లో సెన్సెక్స్ 594 పాయింట్లు లాభపడింది. ఒక్క అక్టోబర్ నెలలో భారీగా 1,785 పాయింట్ల ర్యాలీ జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌ను పాజిటివ్‌గా ఆశ్చర్యపర్చడంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. భారీ టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండు ఎక్స్ఛేంజీల్లో నగదు, డెరివేటివ్ విభాగాల్లో కలిపి భారీగా రూ. 5.33 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది. భారత్ స్టాక్ మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున టర్నోవర్ నమోదుకావడం ఇదే ప్రధమం. సెన్సెక్స్ పెరిగినా, సంపద పోయింది.... బీఎస్ఈ సెన్సెక్స్ 1.33 పాయింట్ల తేడా మినహా రికార్డుస్థాయికి చేరువైనా, ఇన్వెస్టర్ల సంపద మాత్రం మూడేళ్ల క్రితంకంటే ఇప్పుడు రూ. 10 లక్షల కోట్లు తగ్గింది. లిస్టెడ్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 68,44, 774 కోట్లకు చేరింది. 2010 నవంబర్ 5న సెన్సెక్స్ 21,005 పాయింట్ల వద్ద ముగిసినపుడు ఆ విలువ రూ. 77,28,600 లక్షల కోట్లు వుండేది. ఇప్పటివరకూ ఆ విలువే భారత్‌లో రికార్డు.