పారిశ్రామికోత్పత్తి జూన్‌లో పాతాళానికి పడిపోవడం, విదేశీ మార్కెట్ల బలహీనతలతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ రికవర్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి 38,370 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,308 వద్ద నిలిచింది. అయితే అమ్మకాలు పెరగడంతో తొలుత సెన్సెక్స్ 38,126 దిగువన కనిష్టాన్ని తాకింది. తదుపరి చివర్లో 38,414 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.
ఆటో, మీడియా అప్
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, మీడియా 2.7-2 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5-0.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్, టాటా మోటార్స్, హీరో మోటో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, యూపీఎల్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సిప్లా, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, బీపీసీఎల్, విప్రో, బజాజ్ ఫిన్, ఎల్‌అండ్‌టీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్ 2-1 శాతం మధ్య క్షీణించాయి.
ఇండిగో జూమ్
డెరివేటివ్స్‌లో ఇండిగో 10 శాతం దూసుకెళ్లగా.. మదర్‌సన్, బాష్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, బీఈఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, ఎక్సైడ్, పీఎన్‌బీ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు నౌకరీ, కంకార్, ముత్తూట్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్, కేడిలా, గ్లెన్‌మార్క్, టొరంట్ ఫార్మా, లుపిన్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1511 లాభపడగా.. 1214 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment