ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
Published Mon, Nov 28 2016 4:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
నష్టాలతో ప్రారంభమైన ఈక్విటీ బెంచ్మార్కులు సోమవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల స్వల్ప లాభంతో 26,350 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,126.90 వద్ద క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.66 శాతం పెరిగాయి. కానీ రిజర్వు బ్యాంకు ఊహించని విధంగా సీఆర్ఆర్ పెంచడంతో బ్యాంకులు షేర్లు నష్టాల బాట పట్టాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద భారీగా డిపాజిట్లు పెరగడంతో సెంట్రల్ బ్యాంకు వద్ద బ్యాంకులు ఉంచాల్సిన నగదు నిల్వల నిష్ఫత్తి కూడా పెంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.
ఈ ఆదేశాల నేపథ్యంలో నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ 2.55 శాతం కిందకు దిగజారింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ కూడా 1.11 శాతం నష్టపోయింది. బ్యాంకు షేర్లలో భారీగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2.84 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.89 శాతం పడిపోయాయి. అయితే ఆసియన్ షేర్ల పెరుగుదల మొత్తంగా కొంచెం సెంటిమెంట్ బలపడంతో మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి.
Advertisement