మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఈ జూన్1 తేది నుంచి లార్జ్‌క్యాప్ షేర్ల కంటే అధిక లాభాల్ని ఆర్జిస్తున్నాయి. లాక్‌డౌన్ విధింపుతో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్లోకి రావడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ జూన్ 1నుంచి బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13.6శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 17.2శాతం ర్యాలీ చేయగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ మాత్రం 12.50శాతం మాత్రమే పెరిగింది. గత కొన్నేళ్లుగా ర్యాలీలో వెనుకబడిన రియల్ ఎస్టేట్, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌లకు చెందిన మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టస్థాయిలకు పతమైన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లను అధికంగా కొనుగోలు చేశాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి.
ఈ జూన్‌లో రిటైల్, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ క్యాలెండర్ ఇయర్స్‌లో ప్రస్తుతం మిడ్‌క్యాప్ ఇండెక్స్ లార్జ్‌క్యాప్ ఇండెక్స్ కంటే అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ పరిస్థితులు విస్తృత మార్కెట్లో అధిక రిస్క్ భరించే స్థాయిని సూచిస్తుంది.’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఈక్విటీస్ సీఈవో రాజ్‌ఘరియా తెలిపారు. ప్రభుత్వరంగ రిటైల్ రంగాలకు చెందిన చెందిన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు అధిక రాణిస్తున్నాయని ఆయన తెలిపారు.
మిడ్‌క్యాప్ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లు రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా బ్యాంక్ సేర్లు ఈ జూన్ ప్రారంభం నుంచి 39శాతం నుంచి 108శాతం లాభపడ్డాయి.
గతకొన్నేళ్లుగా పీఎస్‌యూ బ్యాంక్, రియల్ ఎస్టేట్ షేర్లు ర్యాలీలో బాగా వెనుకబడ్డాయి. గడిచిన 11ఏళ్లలో బీఎస్‌ఈ రియాల్టీ ఇండెక్స్ 7ఏళ్లను నష్టాలను నమోదు చేసింది. అలాగే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్ 2010 నుంచి 6ఏళ్లు నష్టాలను చవిచూసింది. ఎన్‌పీఎ సంబంధిత ఆందోళలు, మార్కెట్‌లో వాటాను కోల్పోవడంతో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. అలాగే నెమ్మదించిన అమ్మకాలు, పెరిగిన రుణాలతో రియల్ ఎస్టేట్ షేర్ల పతనాన్ని చవిచూశాయి.
‘‘మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2018 జనవరిలో గరిష్టాన్ని తాకినప్పటికీ నుంచి మిడ్‌క్యాప్ షేర్లు చవిచూసిన మూడేళ్ల సైకిల్‌కు ఇది ముగింపు. ఈ మార్చిలో నిఫ్టీ ఇండెక్స్ 7500 కనిష్టస్థాయిని తాకినపుడు ఇవి బాటమ్ లైన్‌ను తాకాయి. అలాగే కనిష్టాలను చవిచూసిన ప్రతిషేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.’’ అని ఐఐఎఫ్‌ఎల్ ఇన్‌స్టిస్యూషనల్ ఈక్విటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ తెలిపారు. ప్రస్తుత ర్యాలీ భారీ పతనాన్ని చవిచూసిన పీఎస్‌యూ బ్యాంకులతో మొదలైంది. పీఎస్‌యూ బ్యాంకులు బలమైన రీ-రేటింగ్ పొటెన్షియల్‌ను కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment