midcaps
-
మిడ్‌క్యాప్‌లో మెరుగైన అవకాశాలు
దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలంలో మెరుగైన సంపద సృష్టించాలని కోరుకునే వారు నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో పెట్టుబడికి తక్కువ పథకాలే అందుబాటులో ఉన్నాయి. అందులో మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఒకటి. ఇన్వెస్టర్లు తమ వెసులుబాటుకు అనుగుణంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) లేదా లంప్సమ్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.రాబడులు మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ 2019 సెప్టెంబర్‌లో మొదలైంది. గడిచిన ఏడాది కాలంలో అసాధారణ స్థాయిలో 50 శాతం రాబడినిచ్చింది. మరీ ముఖ్యంగా మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ ఈ పథకం లాభాల్లో ప్రతిఫలిస్తోంది. మూడేళ్లలో ఏటా 27.55 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఆరంభం నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 32 శాతంగా ఉంది. నిఫ్టీ 100తో పోల్చి చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ పరిమిత రిస్క్‌తోనే రోలింగ్ రాబడులు అధికంగా ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే ఇండెక్స్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో ఫండ్స్ సంస్థలు వసూలు చేసే చార్జీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులు మెరుగవుతాయి.దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. కానీ, అదే సమయంలో అధిక రిస్క్ కూడా ఉంటుంది. కరెక్షన్లలో ఎక్కువ విలువను కోల్పోవడం ఈ విభాగంలో గమనించొచ్చు. అందుకని రిస్క్ భరించే సామర్థ్యంతో ఉన్న వారు, కనీసం 7–10 ఏళ్ల కాలానికి ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. అయితే, ఈ పథకం కేవలం మిడ్‌క్యాప్ ఒక్కటే కాకుండా, లార్జ్క్యాప్కూ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని గమనించొచ్చు.పెట్టుబడులకు విధానంప్రతీ ఇన్వెస్టర్ ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలకూ చోటు కల్పించుకోవాలి. తద్వారా రిస్క్ సర్దుబాటుతో అధిక రాబడులు సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. టాప్–100 కంపెనీల తదుపరి 150 కంపెనీల్లో ఈ పథకం ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంది. తమ పనితీరుతో చిన్న కంపెనీల నుంచి మధ్యస్థ స్థాయికి ఎదిగిన ఇవి.. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ కంపెనీలుగానూ అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్వెస్టర్ల రాబడులను ఇతోధికం చేస్తుంది.మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు వరుసలో ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్ విభాగం కిందకు వస్తాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌కు మధ్య వ్యత్యాసాన్ని గమనించినట్టయితే.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఒకే రంగానికి, ఒకే స్టాక్‌కు ఎక్కువ కేటాయింపులు చేయవు. దీంతో రిస్క్‌ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది.పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1878 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.86 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులో 41 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అయినప్పటికీ లార్జ్‌క్యాప్‌కు ఈ స్థాయి కేటాయింపులతో రిస్క్‌ను తగ్గించే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.మిడ్ క్యాప్ కంపెనీలకు 59 శాతం కేటాయింపులు చేసింది. రిస్క్ దృష్ట్యా స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. పోర్ట్‌ఫోలియోలో 150 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 21 శాతం పెట్టుబడులను ఇండస్ట్రియల్స్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 17 శాతం మేర ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో, కన్జ్యూమర్ డిస్క్రీషినరీలో 14.39 శాతం, మెటీరియల్స్‌లో 13 శాతం, హెల్త్‌కేర్‌లో 10.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లను ఇప్పుడు కొనవచ్చా..?
స్టాక్ మార్కెట్లో ఇటీవల స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీల షేర్ల సందడి కనిపిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాధాకృష్ణ ధమాని లాంటి ఏస్ ఇన్వెస్టర్ల వరకు మిడ్, స్మాల్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ జూన్ క్వార్టర్లో కొన్ని స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల్లో పెద్ద ఇన్వెస్టర్లు భారీగా వాటాలను పెంచుకున్నట్లు గుణాంకాలు చెబుతున్నాయి. ఫస్ట్‌సోర్స్ సెల్యూషన్స్‌లో ఝున్‌ఝున్‌వాలా ఈ క్యూ1లో అదనంగా 57లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. రాధాకృష్ణ ధమాని ఇదే జూన్ క్వార్టర్లో కళ్యాణి గ్రూప్‌నకు చెందిన బీఎఫ్ యుటిలిటీస్‌లో 1.3శాతం ఈక్విటీ వాటాను దక్కించుకున్నారు. అలాగే అస్ట్రా మైక్రోవేవ్ ప్రాజెక్ట్స్‌లో 1.03శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఈ రెండు కంపెనీలు స్మాల్‌క్యాప్ రంగానికి చెందినవి. అయితే చాలా మిడ్‌క్యాప్ కంపెనీల్లో వాటాలను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈఏడాది ప్రారంభం నుంచి ఈ జూలై 14నాటికి బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 11శాతం పతనమైంది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 8శాతం నష్టాన్ని చవిచూసింది. అయితే బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం 13శాతం క్షీణించింది. ఈ సమయంలో మిడ్, స్మాల్‌క్యాప్ కొనవచ్చా..? గత కొన్నేళ్లు స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ఆశించిన స్థాయిలో లాభపడలేదు. ఇప్పుడు ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య, ధీర్ఘకాలిక దృష్ట్యా నాణ్యత కలిగిన మిడ్, స్మాల్‌క్యాప్ షేర్ల ఎంపిక సరైనదేనని విశ్లేషకులు అంటున్నారు. తక్కువ వాల్యూయేషన్లతో ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఇటీవల స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు ర్యాలీ చేస్తున్నాయని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ తెలిపింది. కోటక్ సెక్యూరిటీస్ సిఫార్సులు: డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్, కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్స్, కాస్ట్రోల్ ఇండియా, సువెన్ ఫార్మాస్యూటికల్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ స్మాల్‌క్యాప్ షేర్లు: హాక్విన్స్ కుకర్, స్వరాజ్ ఇంజన్స్, రాడికో ఖేతన్, అమృతాంజన్ హెల్త్‌కేర్, కేఈఐ ఇండస్ట్రీస్ -
రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలో ర్యాలీ
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఈ జూన్1 తేది నుంచి లార్జ్‌క్యాప్ షేర్ల కంటే అధిక లాభాల్ని ఆర్జిస్తున్నాయి. లాక్డౌన్ విధింపుతో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లోకి రావడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ జూన్ 1నుంచి బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13.6శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 17.2శాతం ర్యాలీ చేయగా, బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం 12.50శాతం మాత్రమే పెరిగింది. గత కొన్నేళ్లుగా ర్యాలీలో వెనుకబడిన రియల్ ఎస్టేట్, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌లకు చెందిన మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల మార్కెట్ పతనంలో భాగంగా కనిష్టస్థాయిలకు పతమైన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లను అధికంగా కొనుగోలు చేశాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. ఈ జూన్‌లో రిటైల్, హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ క్యాలెండర్ ఇయర్స్‌లో ప్రస్తుతం మిడ్‌క్యాప్ ఇండెక్స్ లార్జ్‌క్యాప్ ఇండెక్స్ కంటే అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ పరిస్థితులు విస్తృత మార్కెట్లో అధిక రిస్క్ భరించే స్థాయిని సూచిస్తుంది.’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఈక్విటీస్ సీఈవో రాజ్ఘరియా తెలిపారు. ప్రభుత్వరంగ రిటైల్ రంగాలకు చెందిన చెందిన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు అధిక రాణిస్తున్నాయని ఆయన తెలిపారు. మిడ్‌క్యాప్ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లు రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా బ్యాంక్ సేర్లు ఈ జూన్ ప్రారంభం నుంచి 39శాతం నుంచి 108శాతం లాభపడ్డాయి. గతకొన్నేళ్లుగా పీఎస్‌యూ బ్యాంక్, రియల్ ఎస్టేట్ షేర్లు ర్యాలీలో బాగా వెనుకబడ్డాయి. గడిచిన 11ఏళ్లలో బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 7ఏళ్లను నష్టాలను నమోదు చేసింది. అలాగే బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ 2010 నుంచి 6ఏళ్లు నష్టాలను చవిచూసింది. ఎన్పీఎ సంబంధిత ఆందోళలు, మార్కెట్లో వాటాను కోల్పోవడంతో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. అలాగే నెమ్మదించిన అమ్మకాలు, పెరిగిన రుణాలతో రియల్ ఎస్టేట్ షేర్ల పతనాన్ని చవిచూశాయి. ‘‘మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2018 జనవరిలో గరిష్టాన్ని తాకినప్పటికీ నుంచి మిడ్‌క్యాప్ షేర్లు చవిచూసిన మూడేళ్ల సైకిల్‌కు ఇది ముగింపు. ఈ మార్చిలో నిఫ్టీ ఇండెక్స్ 7500 కనిష్టస్థాయిని తాకినపుడు ఇవి బాటమ్ లైన్‌ను తాకాయి. అలాగే కనిష్టాలను చవిచూసిన ప్రతిషేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.’’ అని ఐఐఎఫ్ఎల్ ఇన్స్టిస్యూషనల్ ఈక్విటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ తెలిపారు. ప్రస్తుత ర్యాలీ భారీ పతనాన్ని చవిచూసిన పీఎస్‌యూ బ్యాంకులతో మొదలైంది. పీఎస్‌యూ బ్యాంకులు బలమైన రీ-రేటింగ్ పొటెన్షియల్‌ను కలిగి ఉన్నాయి. -
ఈ మిడ్ క్యాప్స్ భలే స్పీడ్ సుమా!
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. భారీ లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 480 పాయింట్లు జంప్‌చేసి 35,894కు చేరగా.. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 10,567 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, పాలీకేబ్ ఇండియా ఫోర్టిస్ హెల్త్‌కేర్, కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ, రాణే హోల్డింగ్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ఈ ఎన్బీఎఫ్సీ షేరు ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 103 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 7.4 లక్షల షేర్లు చేతులు మారాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టీల్ పైపుల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1778 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1792 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 2000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి. పాలీక్యాబ్ ఇండియా ఎలక్ట్రికల్ కేబుల్స్, అప్లయెన్సెస్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 861 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1790 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 28,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 46,000 షేర్లు చేతులు మారాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ హెల్త్‌కేర్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం పుంజుకుని రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 132 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 3.95 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.71 లక్షల షేర్లు చేతులు మారాయి. కింగ్ఫా సైన్స్ పాలీప్రొఫిలీన్ కాంపౌండ్స్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12 శాతం పురోగమించి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 422 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3000 షేర్లు చేతులు మారాయి. రాణే హోల్డింగ్స్ ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 473 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 490 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 3000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. -
దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ గడిచిన 6–12 నెలల కాలంలో గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇది మంచి పెట్టుబడి అవకాశాలను తీసుకొచి్చంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మంచి పనితీరు కలిగిన స్మాల్‌క్యాప్ పథకాల్లో ఈ తరుణంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు పొందేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం కూడా మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఒకటి. పనితీరు..: అన్ని కాలాల్లోనూ ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీతో పోలిస్తే మంచి పనితీరు చూపించడం ఇన్వెస్టర్లు తప్పకుండా గమనించాల్సిన అంశం. ఏడాది కాలంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకంలో నికరంగా 12 శాతం నష్టాలు ఉన్నాయి. కానీ, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఇదే కాలంలో ఏకంగా 24 శాతానికి పైగా నష్టపోయింది. అంటే గత ఏడాది కాలంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉండడం పనితీరుపై ప్రభావం చూపించింది. అయినప్పటికీ ఈ ఫండ్ మేనేజర్లు నష్టాలను తగ్గించగలిగారు. ఇక మూడేళ్ల కాలంలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ పథకం వార్షికంగా 10.25 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 16.58 శాతం చొప్పున రిటర్నులు ఇచి్చంది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ మూడేళ్లలో అసలు రాబడులనే ఇవ్వకుండా ఫ్లాట్‌గా ఉంది. ఐదేళ్ల కాలంలో కేవలం 4.35 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మూడేళ్లు, ఐదేళ్ల కాలాల్లోనూ బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ అందుకోలేని పనితీరు ఈ పథకంలో చూడొచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో పోటీ పథకాలు హెచ్డీఎఫ్సీ స్మాల్‌క్యాప్, రిలయన్స్ స్మాల్‌క్యాప్ పథకాలను మించి అన్ని కాలాల్లోనూ ఎస్బీఐస్మా ల్ క్యాప్ ఉత్తమ పనితీరు చూపించడం గమనార్హం. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. ఇక ప్రస్తుత ప్రతికూల సమయంలోనూ ఈ పథకం పనితీరు మెచ్చుకోతగ్గదే. అంతేకాదు 2014, 2017 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన పెట్టుబడులను లార్జ్, మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. అలాగే, డెట్‌కు కూడా కొంత కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం పెట్టుబడులను గమనించినట్టయితే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 72 శాతం మేర ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 22 శాతం, లార్జ్‌క్యాప్‌లో 3.51 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 5 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇక ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచి్చంది. 45 శాతం పెట్టుబడులు ఈ రంగాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, సర్వీసెస్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
రూపీ రికవరీ, మిడ్‌క్యాప్స్ జోష్ : రెండో రోజు ర్యాలీ
ముంబై : శ్రావణమాసంలో చివరి శుక్రవారం మార్కెట్లకు మంచి లాభాలను అందించింది. తొలుత నష్టాలతో మొదలైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో నిలిచాయి. దీంతో వరుసగా రెండో రోజు రిలీఫ్ ర్యాలీ కొనసాగింది. మిడ్‌క్యాప్స్ భారీగా పైకి ఎగిశాయి. మిడ్‌క్యాప్స్‌తో పాటు ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ మంచి లాభాలను అందుకున్నాయి. దీంతో నిఫ్టీ 11,550 మార్కు పైన ముగిసింది. ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభపడి 38389.8 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11589 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రికవరీ అయి, రూపీ బలపడటం, ఆయిల్ ధరలు శాంతించడం మార్కెట్లను బాగా సహకరించింది. ప్రైవేట్ బ్యాంక్‌లు డాలర్‌ను విక్రయించడంతో, మన కరెన్సీ కొంత మేర కోలుకుంది. ఇండెక్స్‌లో హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రా అండ్ మహింద్రాలు కూడా నేడు మార్కెట్లో లాభాల పంట పండించాయి.ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో టాప్ గెయినర్లుగా నిలువగా.. యస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా ఎక్కువగా నష్టపోయాయి. అటు కోలుకున్న రూపాయి 33 పైసలు బలపడి 71.66 వద్ద నమోదైంది. -
ఆరంభ జోరు ఆవిరి..
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో జోరుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ మళ్లీ సాంకేతికంగా కీలకమైన మార్కు 11 వేలను పునరుద్ధరించుకుంది. అయితే ఆ జోరు ఎంత సేపు కొనసాగలేదు. వెంటనే మార్కెట్లు కిందకి పడిపోయాయి. మిడ్‌క్యాప్ షేర్లు ఎక్కువగా పతనమవుతుండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 4.32 పాయింట్ల లాభంలో 36,377 వద్ద, నిఫ్టీ 23.65 పాయింట్ల నష్టంలో 10,956 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం మేర క్షీణించింది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఫైనాన్సియల్, ఫార్మాస్యూటికల్స్, మెటల్స్, ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. మైడ్ట్రి షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే 6 శాతం మేర పతనమయ్యాయి. క్యూ లాభాలు 13 శాతం పడిపోవడం, సీఎఫ్ఓ రాజీనామా చేయడం ఈ కంపెనీ స్టాక్స్ పై పడింది. సెన్సెక్స్ టాప్ గెయినర్‌గా ఓఎన్జీసీ 2 శాతం పైన లాభాలు పండిస్తోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 16 పైసల మేర నష్టంలో 68.78 వద్ద కొనసాగుతోంది. -
పతనాల్లో పెట్టుబడులకు రక్షణ! కోటక్ సెలక్ట్ ఫోకస్ ఫండ్
ఈ మ్యూచువల్ ఫండ్ పథకం ఎక్కువగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మార్కెట్ల ర్యాలీ సమయాల్లో లాభాలను ఒడిసి పట్టుకోవటానికి మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది. మార్కెట్లు బాగా పెరిగి కరెక్షన్కు గురయ్యే సమయంలో రిస్క్ తగ్గించేందుకు, పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోకుండా కాపాడేందుకు డెట్ సాధనాల్లో ఎక్స్పోజర్ పెంచుకోవడం, నగదు నిల్వలు పెంచుకోవడం చేస్తుంటుంది. మోస్తరు రిస్క్ భరించగలిగే వారు, కనీసం 5–7 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయగలిగిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ‘కోటక్ సెలక్ట్ ఫోకస్ ఫండ్’ను పరిశీలించొచ్చు. పనితీరు ఎలా ఉందంటే... దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు ఆశాజనకంగా ఉంది. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్ విషయంలో గత ఐదు సంవత్సరాలుగా చోటు సంపాదించుకుంది. రాబడుల విషయంలో బెంచ్‌మార్క్ కంటే మెరుగ్గా ఉంది. ఈ పథకం రాబడులకు నిఫ్టీ 200 బెంచ్‌మార్క్‌గా ఉంది. మూడు, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్‌మార్క్ కంటే 4–7 శాతం అధిక రాబడులు, ఈ విభాగం మొత్తం రాబడులతో పోల్చి చూసుకుంటే 4–6 శాతం రాబడులు అధికంగా ఇచ్చింది. అయితే గత ఏడాది కాలంలో రాబడులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మిడ్‌క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేయడం, ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉండడం కారణం. పోర్ట్‌ఫోలియో ఇదీ..: ప్రస్తుతం ఈ పథకం 85–90 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసి ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులో అధిక పెట్టుబడులు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు కేటాయింపులు ఎక్కువగా చేసింది. బ్యాంకింగ్ రంగంలో 22 శాతం, ఫైనాన్షియల్ సెక్టార్లో 12 శాతం ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 8 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఎంఆర్ఎఫ్, మారుతి సుజుకి, బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ ఈ పథకానికి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఇవి గడిచిన ఏడాది కాలంలో 20–50 శాతం వరకు ర్యాలీ చేశాయి. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 20– 25 శాతం వరకు తగ్గిపోవడం పథకం రాబడులపై ప్రభావం చూపింది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, బాటా ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్స్ ఇటీవల పోర్ట్‌ఫోలియోలోకి కొత్తగా వచ్చి చేరాయి. సగటు కంటే ఎక్కువ రాబడులు ఆశించే వారికి అనువైన పథకం ఇది. - (సాక్షి, బిజినెస్ విభాగం) -
చివరికి లాభాలన్నీ పోయాయి..
సాక్షి, ముంబై : దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు, చివరికి తమ లాభాలన్నింటిన్నీ కోల్పోయాయి. ఇంట్రాడే గరిష్ట మార్కులను తాకిన నిఫ్టీ 13.75 పాయింట్ల నష్టంలో 10,079 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సైతం కేవలం 27.75 పాయింట్ల లాభంలో 32,186 వద్ద క్లోజైంది. అన్ని సెక్టార్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు ఉదయం నుంచి లాభాల్లో ట్రేడయ్యాయి. కానీ చివరి గంటల్లో జరిగిన ట్రేడింగ్‌లో మాత్రం మార్కెట్లు తన లాభాలన్నింటిన్నీ కోల్పోయాయి. అయినప్పటికీ నిఫ్టీ 10.050 మార్కుకు పైననే ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,131 గరిష్ట మార్కును తాకింది. ఆయిల్ మార్కెట్ కంపెనీలు మార్కెట్లను పడగొట్టాయి. మిడ్‌క్యాప్స్ కొంత కరెక్షన్కు గురయ్యాయి. ఫార్మా, ఎనర్జీ సూచీలు కూడా ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు కూడా అస్థిరంగానే నమోదయ్యాయి. రెండు సూచీల్లోనూ సన్ ఫార్మాస్యూటికల్స్, రిలయన్స్, టాటా పవర్, సన్‌ఫార్మా లాభాలు పండించగా.. ఐటీసీ, సిప్లా, బీపీసీఎల్, ఐఓసీ నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 63.99గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 72 రూపాయల లాభంలో రూ.30,015గా ఉన్నాయి.