స్టాక్ మార్కెట్లు ఫైల్ ఫోటో
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో జోరుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ మళ్లీ సాంకేతికంగా కీలకమైన మార్కు 11 వేలను పునరుద్ధరించుకుంది. అయితే ఆ జోరు ఎంత సేపు కొనసాగలేదు. వెంటనే మార్కెట్లు కిందకి పడిపోయాయి. మిడ్‌క్యాప్ షేర్లు ఎక్కువగా పతనమవుతుండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 4.32 పాయింట్ల లాభంలో 36,377 వద్ద, నిఫ్టీ 23.65 పాయింట్ల నష్టంలో 10,956 వద్ద కొనసాగుతున్నాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం మేర క్షీణించింది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఫైనాన్సియల్, ఫార్మాస్యూటికల్స్, మెటల్స్, ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. మైడ్‌ట్రి షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే 6 శాతం మేర పతనమయ్యాయి. క్యూ లాభాలు 13 శాతం పడిపోవడం, సీఎఫ్‌ఓ రాజీనామా చేయడం ఈ కంపెనీ స్టాక్స్ పై పడింది. సెన్సెక్స్ టాప్ గెయినర్‌గా ఓఎన్‌జీసీ 2 శాతం పైన లాభాలు పండిస్తోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 16 పైసల మేర నష్టంలో 68.78 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment