
ముంబై : శ్రావణమాసంలో చివరి శుక్రవారం మార్కెట్లకు మంచి లాభాలను అందించింది. తొలుత నష్టాలతో మొదలైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో నిలిచాయి. దీంతో వరుసగా రెండో రోజు రిలీఫ్ ర్యాలీ కొనసాగింది. మిడ్‌క్యాప్స్ భారీగా పైకి ఎగిశాయి. మిడ్‌క్యాప్స్‌తో పాటు ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ మంచి లాభాలను అందుకున్నాయి. దీంతో నిఫ్టీ 11,550 మార్కు పైన ముగిసింది. ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభపడి 38389.8 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11589 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రికవరీ అయి, రూపీ బలపడటం, ఆయిల్ ధరలు శాంతించడం మార్కెట్లను బాగా సహకరించింది.
ప్రైవేట్ బ్యాంక్‌లు డాలర్‌ను విక్రయించడంతో, మన కరెన్సీ కొంత మేర కోలుకుంది. ఇండెక్స్‌లో హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రా అండ్ మహింద్రాలు కూడా నేడు మార్కెట్‌లో లాభాల పంట పండించాయి.ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో టాప్ గెయినర్లుగా నిలువగా.. యస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా ఎక్కువగా నష్టపోయాయి. అటు కోలుకున్న రూపాయి 33 పైసలు బలపడి 71.66 వద్ద నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment