CRR
-
ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా రూ. లక్ష కోట్లు!
ముంబై: వృద్ధే లక్ష్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (I–CRR) విధానం నుంచి అక్టోబర్ 7 నాటికి దశల వారీగా పూర్తిగా వైదొలగాలని నిర్ణయించింది. దీనితో బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. లక్ష కోట్ల అదనపు నిధుల లభ్యత, ప్రస్తుత స్థాయిలోనే వడ్డీరేట్ల కొనసాగింపు వంటి సౌలభ్యతలు ఒనగూరే అవకాశం ఏర్పడుతుంది. రూ.2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను వెనక్కు తీసుకోడానికి, తద్వారా ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి ఐ–సీఆర్ఆర్ నిర్వహించాలని బ్యాంకింగ్‌కు ఆగస్టు 10వ తేదీన ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆదేశించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ కీలక ప్రకటన చేస్తూ... బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని యథాతథంగా 4.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగిన స్థాయి వరకూ వెనక్కు తీసుకోడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా మూడు నెలలకుపైగా కాలానికి (రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తేదీ 2023 మే 19వ తేదీ నుంచి 2023 జూలై 28 వరకూ) ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ) ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్)10 శాతంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు కూడా సూచన ప్రాయంగా తెలిపింది. తాజాగా ఈ నిధులను మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వదులుతున్నట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. మూడు దశల్లో... అమలైన ఐ–సీఆర్ఆర్లో 25 శాతం సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సెపె్టంబర్ 23న మరో 25 శాతం, పెండింగ్‌లో ఉన్న 50 శాతం అక్టోబర్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఐ–సీఆర్ఆర్’ను దశలవారీగా నిలిపివేయాలని ఒక సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చలామణి నుండి కరెన్సీని ఉపసంహరించుకున్న తేదీ మే 19న చెలామణిలో ఉన్న మొత్తం రూ. 2,000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకింగ్‌కు తిరిగి వచి్చనట్లు ఆర్బీఐ తెలిపింది. -
సీఆర్ఆర్ మరణం తీరని లోటు!
ఆదిలాబాద్: మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి మర ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు తీరని లో టని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శనివారం సీఆర్ఆర్ నివాసంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ, సీఆర్ఆర్ మరణం తనను దిగ్బ్రాంతికి గురిచేందన్నారు. ఆదివాసుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారని తెలిపారు. రాజకీయాలు శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. బోథ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరవలేనిదని కొనియాడారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రమణ, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, జెడ్పీటీసీ మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్, తదితరులున్నారు. -
ఆర్బీఐ కీలక చర్యలు: రూపాయికి బూస్ట్
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి జారిపోతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్పందించింది. ఈసీబీ రూటులో రుణ పరిమితిని రెట్టింపు చేయడంతో సహా విదేశీ మారకపు ప్రవాహాన్ని పెంచేందుకు నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. అస్థిరతను తగ్గించడానికి, గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లను తగ్గించేందుకు, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొన్ని నిబంధనలను సడలించింది. మొత్తం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని భరోసా ఇచ్చేలా ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను పెంచడానికి ఐదుచర్యలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులను నిరంతరం, నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. క్రమబద్ధమైన మార్కెట్ పనితీరును నిర్ధారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ పేర్కొంది. ► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లు FCNR(B), NRE టర్మ్ డిపాజిట్లపై క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) నుంచి మినహాయింపు ► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్(బీ) ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు. ఈ సడలింపు అక్టోబర్ 31, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ► రుణంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు పెట్టుబడులు. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో మూడు మార్గాల ద్వారా ఎఫ్‌పీఐలు పెట్టుబడి పెట్టవచ్చు. ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రోత్సహించేలా అక్టోబర్ 2015లో ప్రవేశపెట్టిన మధ్యస్థ-కాల ఫ్రేమ్‌వర్క్ (ఎంటీఎఫ్); (బి) మార్చి 2019లో ప్రవేశపెట్టిన వాలంటరీ రిటెన్షన్ రూట్ (వీఆర్ఆర్); (సి) ఏప్రిల్ 2020లో ఎఫ్ఏఆర్ నిబంధనల్లో మార్పులు చేసింది. ► అధీకృత డీలర్ కేటగిరీ I (AD కేటగిరీ-I) బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీ రుణాలు ► బాహ్య వాణిజ్య రుణాలు(ECBs):ఆటోమేటిక్ ఈసీబీ మార్గంలో, అర్హత కలిగిన రుణగ్రహీతలు ఆర్బీఐని సంప్రదించకుండానే ఆర్థిక సంవత్సానికి తీసుకునే పరిమితిని 750 మిలియన్ల డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు పెంచింది. అలాగే ఆల్ ఇన్ కాస్ట్ సీలింగ్ కూడా 100 బేసిస్ పాయింట్లకు పెంచింది. రుణ గ్రహీత పెట్టుబడి గ్రేడ్ రేటింగ్‌కు లోబడి ఇది ఉంటుంది. -
మనమంతా ఒక్కటే..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఉంగుటూరు: మనమంతా ఒక్కటే అనే భావన కలిగినప్పుడే శక్తివంతమైన దేశం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి విద్యాసంస్థల 75 వసంతాల వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. శక్తివంతమైన దేశంలో ఆకలి, దారిద్య్రం, లింగ, వర్ణ వివక్షలు ఉండకూడదన్నారు. మన దేశంలో ఇప్పటికీ 25 శాతం మంది పేదరికంలో, 27 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, భవిష్యత్‌లో వీటన్నింటినీ అధిగమించి ప్రగతి సాదించాల్సి ఉందన్నారు. సీఆర్ఆర్ విద్యా సంస్థలు 75 ఏళ్లుగా అంకితభావంతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సీఆర్ఆర్ విద్యా సంస్థల ప్రతినిధులు అల్లూరి ఇంద్రకుమార్, ఎంబీఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. జగన్నాథాష్టకం సీడీ ఆవిష్కరణ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో జరిగిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించే సీపీఆర్ పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశీ దండయాత్రలు, బ్రిటిషర్ల విధానంతో దేశం నష్టపోయిన వైనం పై అమెరికా యాత్రికుడు విల్ దురంత్ రాసిన ద కేస్ ఫర్ ఇండియా పుస్తకానికి తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ను వెంకయ్యనాయుడు ఆవి ష్కరించారు. ఆత్కూరులో విజయవాడ చాప్టర్ స్వ ర్ణభారత్ ట్రస్ట్‌లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ తనయుడు ప్రసేన్‌జిత్ హరిచందన్ నేతృత్వంలో డివైన్ క్యాప్సుల్ సంస్థ తీసుకొచ్చిన జగన్నాథాష్టకం సీడీని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. సీడీ తీసుకురావడంలో శ్రమించిన ప్రసేన్‌జిత్ హరిచందన్, గాయకుడు సురేశ్వాడేకర్, సంగీత దర్శకుడు జగ్యాన్దాస్ను అభినందించారు. -
‘శక్తి’మాన్.. బ్రహ్మాస్త్రం!
పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా... అసలే ఆర్థిక మందగమనంతో అతలాకుతలం అయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తాజాగా కరోనా కాటుకు గురవుతున్న నేపథ్యంలో... పరిస్థితిని చక్కదిద్దడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ మధ్య జరగాల్సిన 2020–21 మొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షను అర్ధంతరంగా మార్చి 27కు మార్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా కమిటీ సమావేశాన్ని సైతం వారం రోజులు ముందుకు తీసుకువచ్చిన అంశాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు ఇక చౌక బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును భారీగా 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి (చివరిసారి రెండు సార్లు మినహా) వరుసగా ఐదుసార్లు రెపో రేటును 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయం తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. దీనికి సంబంధించి మరింత లోతుకు వెళితే... 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో రెపో రేటు 4.75 శాతానికి తగ్గింది. అటు తర్వాత అంతకంటే తక్కువ స్థాయికి ప్రస్తుతం రెపోరేటు దిగివచ్చింది. ఇక ప్రస్తుత 4.4 శాతం రెపో రేటు 2004 తర్వాత చూడ్డం ఇదే తొలిసారి. అంటే ప్రస్తుత రేటు దశాబ్దంన్నర కనిష్టస్థాయి అన్నమాట. రెపో రేటు తగ్గింపు వల్ల ఈ రేటుతో అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు దిగివస్తాయి. పరిశ్రమలకు కూడా వడ్డీరేట్ల భారం తగ్గుతుంది. బ్యాంకులు డిపాజిట్ చేస్తే వచ్చేది 4 శాతమే.. ఇక బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు రివర్స్ రెపోను ఏకంగా 90 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. తమ ఫండ్స్‌ను ఆర్బీఐ వద్ద ఉంచడం వల్ల వచ్చే వడ్డీ మరీ తక్కువగా ఉండడం వల్ల, ఈ మేరకు నిర్ణయం విషయంలో బ్యాంకులను కొంత వెనక్కు తగ్గేలా చేసి, మార్కెట్లోనే వడ్డీకి ఇచ్చేలా వాటిని ప్రోత్సహించడం ఈ ఇన్స్ట్రుమెంట్ లక్ష్యం. ► అయితే ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో, మొండిబకాయిలు తీవ్రమైన పరిస్థితుల్లో నిధులను బయటకు వడ్డీకి ఇచ్చి ఇబ్బందులుపడే బదులు, వాటిని ఆర్బీఐ వద్దే ఉంచి స్వల్ప వడ్డీనైనా పొందడం మంచిదని బ్యాంకులు భావిస్తుంటాయని నిపుణుల విశ్లేషణ. సీఆర్ఆర్ ఏకంగా ఒకశాతం ఇక నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఆర్బీఐ ఏకంగా ఒకశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3 శాతానికి దిగివచ్చింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొత్త మొత్తాన్ని తప్పనిసరిగా నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలి. దీనిపై ఆర్బీఐ ఎటువంటి వడ్డీ ఇవ్వదు. ఈ రేటు తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద అదనపు నిధుల లభ్యత ఉంటుంది. ఆర్బీఐ సీఆర్ఆర్ను తగ్గించడం ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. వ్యవస్థలోకి నిధులు ఎలా..? ఇక ఆర్బీఐ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు రూ.3.74 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత– లిక్విడిటీ (2019–20 జీడీపీ అంచనాల్లో దాదాపు 2 శాతం) అందుబాటులోకి రానుంది. ఇందులో రెపో ఆపరేషన్ వల్ల రూ. లక్ష కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. సీఆర్ఆర్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్‌లోకి వచ్చే మొత్తం రూ.1.37 లక్షల కోట్లు. రుణాలపై 0.75% వడ్డీ కోత: ఎస్బీఐ ఆర్బీఐ విధాన ప్రకటన నేపథ్యంలో– బ్యాంకి ంగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 75 బేసిస్ పాయింట్ల రెపో కోతనూ కస్టమర్‌కు ఏప్రిల్ 1వ తేదీ నుంచీ బదలాయించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐ నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ అనుసంధాన వార్షిక రుణ రేటు (ఈబీఆర్) ప్రస్తుత 7.8 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గుతుంది. ఇక రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 7.40 శాతం నుంచి 6.65 శాతానికి దిగివస్తుంది. దీని ప్రకారం, 30 సంవత్సరాలకు సంబంధించి గృహ రుణ రేటు నెల ఈఎంఐపై లక్షకు రూ.52 తగ్గుతుందని ప్రకటన పేర్కొంది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)పై వచ్చే నెల్లో జరగనున్న బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటీ (ఏఎల్‌సీఓ) ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. డిపాజిట్ రేట్లూ తగ్గింపు అన్ని కాలపరిమితుల రిటైల్, బల్క్ డిపాజిట్ రేట్లనూ 20 నుంచి 100 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రిటైల్ డిపాజిట్‌పై రేటు 20 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గితే, బల్క్ డిపాజిట్‌పై రేటు 50 నుంచి 100 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఏయే రుణాలపై మారటోరియం... క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సహా టర్మ్ లోన్లపై (వ్యవసాయ, గృహ, విద్య, వ్యక్తిగత, వాహన) నెలవారీ చెల్లింపు(ఈఎంఐ)లకు సంబంధించి కస్టమర్లకు పెద్ద వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. ఈ రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం నిర్ణయం తీసుకోడానికి ఆర్థిక సంస్థలకు వెసులుబాటు ఇచ్చింది. మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిగా పరిగణించడానికి వీలు పడదు. ‘‘మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులపై మారటోరియం అమల్లో ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బకాయిలు సహా రిటైల్, కార్పొరేట్ రుణాలకు సంబంధించి అన్ని విభాగాలకూ ఇది వర్తిస్తుంది. అసలు, వడ్డీ, మొత్తం బకాయి చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు అన్నింటికీ మారటోరియం వర్తిస్తుంది’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. మారటోరియం తర్వాత టర్మ్ లోన్లకు సంబంధించి రుణ చెల్లింపుల షెడ్యూల్ మూడు నెలలు పెరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక రుణానికి సంబంధించి 2022 మార్చి 31లోపు అన్ని ఈఎంఐలు చెల్లించాల్సి ఉందనుకుందాం. ఆ షెడ్యూల్ ఇప్పుడు 2022 జూన్ 30 వరకూ పొడిగించడం జరుగుతుంది. అన్ని కమర్షియల్ బ్యాంక్‌లు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులుసహా) సహకార బ్యాంకులు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ చెల్లింపులు అన్నింటికీ ఈ మారటోరియం వర్తిస్తుంది. ► వ్యాపార సంస్థలు తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ కాలానికి పోగుపడే వడ్డీని మారటోరియం పూర్తయ్యాక కట్టాల్సి ఉంటుంది. ► మారటోరియం విధివిధానాలపై బ్యాంకులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ► ఒక రకంగా ఇది రుణాల చెల్లింపు కాస్త వాయిదా పడటమే తప్ప తర్వాతైనా కచ్చితంగా కట్టాల్సిందే. ఆయా బ్యాంకుల నిబంధనలు బట్టి ఈఎంఐ కాలవ్యవధి పెరగవచ్చు లేదా మారటోరియం వ్యవధిలో కట్టాల్సి వడ్డీని మిగిలిన టర్మ్‌లో కొద్ది కొద్దిగా కట్టేలా సర్దుబాటు చేయొచ్చు. దీనిపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బాకీల పరిస్థితేంటి... క్రెడిట్ కార్డు బాకీలు, ఈఎంఐలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. ఆ మేరకు బాకీలను మూడు నెలల తర్వాత కట్టవచ్చు. అయితే, ఈ మొత్తం సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు అసలు కట్టాల్సినది రూ. 10,000 అయితే, వాయిదాపడిన మొదటి నెలలో దీనిపై వడ్డీ లెక్కిస్తారు. దీనికి పన్నులు అదనం. అలాగే, రెండో నెలలో అసలు, వడ్డీ మీద కలిపి అదనంగా వడ్డీ, పన్నులు ఉంటాయి. మూడో నెలా ఇదే రిపీట్ అవుతుంది. ఇక నాలుగో నెలలో మాత్రం (మారటోరియం తర్వాత) అప్పటిదాకా పేరుకుపోయిన బాకాయి మొత్తాన్ని వడ్డీ, పన్నులతో సహా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో తడిసి మోపెడవుతుంది. రేటు తగ్గిస్తే ఏంటి ప్రయోజనం... గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లాంటి టర్మ్ లోన్స్ గ్రహీతలకు రేట్ల కోతతో ప్రయోజనం లభిస్తుంది. ఆర్బీఐ పాలసీకి అనుగుణంగా బ్యాంకులు కూడా రేటు తగ్గిస్తే .. రుణాలు చౌకగా మారతాయి. ఎలాగంటే.. ► రిజర్వ్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్లు (ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం) తగ్గించింది. దీనితో రెపో–రేటు అనుసంధానిత గృహ రుణం తీసుకున్నవారికి... గణనీయంగా వడ్డీ రేటు భారం తగ్గవచ్చు. ఉదాహరణకు 8 శాతం వార్షిక వడ్డీ రేటుపై రూ. 50 లక్షలు తీసుకున్న వారి ఈఎంఐ భారం దాదాపు రూ. 2,139 మేర తగ్గవచ్చు. అయితే, ఎస్బీఐ ఇప్పటికే 0.75 శాతం రుణ రేటు తగ్గించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులూ దీన్నే అనుసరించే చాన్స్ ఉంది. ► సాధారణంగా 2019 అక్టోబర్ 1 తర్వాత నుంచి రెపో రేటు ప్రాతిపదికనే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాలు ఇస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా ఆర్బీఐ తగ్గించిన మేరకు ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బ్యాంకులు బదలాయించాల్సి ఉంటుంది. గతంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్(ఎంసీఎల్ఆర్) ఆధారిత వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారికి కూడా కొంత మేర తగ్గుతుంది. ఒక వేళ పూర్తి ప్రయోజనాలు దక్కని పక్షంలో.. కాస్త వన్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చినా.. రెపో రేటు ఆధారిత గృహ రుణాలకు మారడం శ్రేయస్కరం. బ్యాంకులు తగ్గిస్తాయి కాబట్టి... వాటితో పోటీ పడేందుకైనా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలూ(హెచ్ఎఫ్సీ) తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ మారటోరియం అంటే.. సంక్షోభ సమయంలో రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేందుకు ఉద్దేశించినది మారటోరియం. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది. దీంతో రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ తాత్కాలికంగా ఈఎంఐల చెల్లింపు విషయంలో వ్యవధిపరంగా 3 నెలలు వెసులుబాటునిస్తూ మారటోరియం ప్రకటించింది. దీనితో మే నెల దాకా ఈఎంఐ కట్టకపోయినా.. బ్యాంకు మిమ్మల్ని ఎగవేతదారుగా పరిగణించ బోదు. మీ క్రెడిట్ స్కోరుకు నష్టం లేదు. ఆర్థికం అనిశ్చితే... అయినా పటిష్టం.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుంది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 4.7 శాతంగా నమోదయ్యే వీలుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరల పతనం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిచ్చే అంశం. తీసుకుంటున్న ద్రవ్య పరపతి చర్యల సానుకూల ప్రభావం, కరోనా కట్టడి వంటి అంశాలు భవిష్యత్‌తో దేశాభివృద్ధికి మార్గదర్శకాలుగా ఉంటాయి. రికార్డు స్థాయి ఆహార ఉత్పత్తుల వల్ల ఆహార ధరలు అదుపులోనే ఉంటాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌లపై ఎటువంటి అంచనాలనూ చెప్పలేం. అనిశ్చితి పరిస్థితులే దీనికి కారణం. ఇక ఆర్బీఐ తీసుకునే అన్చి చర్యలకూ ఆర్థిక పటిష్టత, వృద్ధి పునరుద్ధరణే లక్ష్యం. భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితం. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రం. బ్యాంకుల నుంచి భయాందోళనలతో కూడిన నిధుల ఉపసంహరణ (విత్‌డ్రాయెల్స్) అవసరం లేదు. 2008 ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుత భారత స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక వ్యవస్థకు రక్షణ ఆర్బీఐ చర్యలు కరోనావైరస్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయి. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులకు ఆర్బీఐ నిర్ణయాలు సహకరిస్తాయి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తక్షణ బదలాయింపు జరగాలి ఆర్బీఐ రెపోరేటు తగ్గింపు ద్వారా తమకు ఒనగూరిన ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించాలి. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గవర్నర్ ప్రకటన హర్షణీయం. బకాయిల చెల్లింపుపై మారటోరియం పెద్ద ఊరట. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి మానవీయ దృక్పధం ఆర్థిక వ్యవస్థ రక్షణలో మానవీయ దృక్పధంతో కూడిన సాహసోపేత, హర్షణీయ నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ఎస్బీఐకి సంబంధించి రూ.60,000 కోట్ల వరకూ రుణ మారటోరియం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
వడ్డీ రేట్లు తగ్గించాలి
న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి. సీఐఐ సూచనలు ఇవీ... ‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్ఎంఈ, ఇన్ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్ డిసిగ్నేట్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్ సదుపాయం కల్పించే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) ఎంఎస్ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. వృద్ధిని కూడా చూడాలి... రెపో రేటు, సీఆర్ఆర్ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్ సూచించింది. ‘‘ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్ తన సూచనల్లో పేర్కొంది. మరింత కరెన్సీ అవసరం: ఆర్బీఐ కోల్‌కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే. -
నోట్ల రద్దు ప్రభావంపై అస్పష్టతే అడ్డుపడింది: పటేల్
• ధరల పెరుగుదల సంకేతాలు కారణమే • రుణ రేట్లను ఇంకా తగ్గించేందుకు బ్యాంకులకు అవకాశం ఉందని వెల్లడి ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) బుధవారం నాటి సమీక్షా సమావేశంలో తప్పకుండా కీలక రేట్ల కోత ఉంటుందని అధిక శాతం అంచనాలున్నాయి. కనీసం పావు శాతమైనా కోత ఉంటుందని ఆశించారు. కానీ, రేట్లు యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఉర్జిత్ వివరించారు. స్పష్టత లేదు... పెద్ద నోట్ల రద్దు తర్వాత స్థూల ఆర్థిక రంగంపై దాని ప్రభావం ఏ మేరకు అన్న స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్లే రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకోలేకపోయినట్టు పటేల్ చెప్పారు. అలాగే, ధరల పెరుగుదలకు అనుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ఉండడం, ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టడం వంటివి సైతం యథాతథ స్థితిని కొనసాగించేలా చేసినట్టు చెప్పారు. ఈ అస్థిరమైన ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూనే ద్రవ్యోల్బణానికి సంబంధించి స్పష్టమైన అంచనాల కోసం వేచిచూస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ విలేకరులకు తెలిపారు. వృద్ధి ప్రాధమ్యాలను దృష్టిలో ఉంచుకుని వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు ఎంపీసీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి దిగొచ్చినప్పటికీ, చమురేతర, ఆహారేతర ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని పటేల్ గుర్తు చేశారు. బ్యాంకులు ఇటీవల రుణాలపై వడ్డీ రేట్లను కొంత తగ్గించినప్పటికీ, రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశం ఉన్నట్టు పటేల్ అభిప్రాయపడ్డారు. -
ఇప్పట్లో ఆర్బీఐ రేట్లు తగ్గవ్
పాలసీ రేట్లు యథాతథం • రేట్లలో మార్పు లేకపోవడం ఇది వరుసగా రెండవసారి • ఇక ముందు తగ్గింపు కష్టమని సూచన • ద్రవ్యోల్బణం, నోట్ల రద్దు ప్రభావాలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూపు • వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.9 శాతానికి కోత ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారంనాటి తన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వంటి కీలక రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఎందుకంటే... విధానం యథాతథంగా కొనసాగించడానికి పలుకారణాలనూ కమిటీ సూచించింది. ద్రవ్యోల్బణంపై అలాగే రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావాలపై మరింత స్పష్టత రావాలన్నది వీటిలో కీలకమైనవి. ఉత్పత్తి, సరఫరాల పరిస్థితి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. మొత్తంమీద ఇప్పటి వరకూ రేట్ల తగ్గింపునకు సంబంధించి సరళతర విధానాన్ని అవలంబించిన ఆర్బీఐ ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లేననీ సూచించింది. దీనితో రేట్ల తగ్గింపునకు సంబంధించి ఆర్బీఐ విధానం ‘‘తగిన ధోరణి’’ నుంచి ‘‘తటస్థం’’ వైపునకు మారినట్లయ్యింది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు 6.25 శాతంగా కొనసాగనుంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. 2015 జనవరి నుంచీ ఆర్బీఐ 175 బేసిస్ పాయింట్లు (1.75 శాతం)రెపో రేటును తగ్గించింది. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు 7.4 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లూ వివరించింది. ⇔ వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం శ్రేణి 4 నుంచి 4.5 శాతంగా ఉంటుంది. తరువాత ఆరు నెలలో 4.5 శాతం నుంచి 5 శాతంగా ఉండవచ్చు. నాలుగు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి కట్టుబడి ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిత్యావసరాలు, ఇతర ఆహార ధరలపై పడలేదనీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. చమురు, కరెన్సీ ధరల్లో ఒడిదుడుకులు ద్రవ్యోల్బణానికి సవాలని వివరించింది. ⇔ తన నిర్వహణ, పర్యవేక్షణా చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చూడడం కోసం ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఆర్బీఐ నిర్ణయం. ⇔ 2017లో ప్రపంచ వృద్ధి ఒక మోస్తరుగా ఉండే వీలుంది. ⇔ అభివృద్ధి చెందిన దేశాల్లో రక్షణాత్మక విధానాల అమలు పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావం సేవలు, దేశీయ విమాన, రైల్వే రవాణా, ఆటోమొబైల్ అమ్మకాలు, సిమెంట్ ఉత్పత్తిపై ప్రభావం చూపినట్లు హై ఫ్రీకెన్సీ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. అయితే స్టీల్ వినియోగం, పోర్ట్ ట్రాఫిక్, విదేశీ పర్యాటకుల రాక, అంతర్జాతీయ విమాన రవాణా విభాగాలు ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాయి. ⇔ మొండిబకాయిల సమస్య త్వరగా తగ్గడం, బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధన కల్పన వంటి అంశాలు రుణాలపై వడ్డీ రేటును మరింత దిగివచ్చేలా చేయడానికి దోహదపడతాయి. ⇔ తదుపరి ఆర్బీఐ పాలసీ సమీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగుతుంది. నిర్ణయం ఏకగ్రీవం... రెపో రేటు యథాతథంగా కొనసాగించాలన్న అంశంపై ఎంపీపీలోని ఆరుగురు సభ్యులూ ఏకాభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎంపీపీ ఏర్పాటయిన తర్వాత జరిగిన ప్రతి పాలసీ సమీక్షలోనూ ఆరుగురు సభ్యులు ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుండడం గమనార్హం. తన తొలి సమావేశంలో కమిటీ వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించింది. డిసెంబర్‌లోనూ అలాగే తాజా సమీక్షల్లో రేట్లను మార్చలేదు. ► ఎవరేమన్నారంటే.. బ్యాంకుల రేట్లు తగ్గాలి ఇప్పుడు బ్యాంకులు తమ రుణ రేటును తగ్గించాలి. రుణ మంజూరీలో ప్రత్యేకించి చిన్న తరహా పరిశ్రమలు, హౌసింగ్, వ్యక్తిగత రుణాలవైపు దృష్టి సారించాలి. ద్రవ్యలోటు 3.2% లక్ష్యం సాధ్యమవుతుంది. – శక్తికాంత్‌దాస్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఊహించిన విధంగానే.. ఆర్బీఐ విధానం ఊహించిన విధంగానే ఉంది. ఇక రేట్లు తగ్గించలేని పరిస్థితికి విధానం మారింది. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులు దీనికి కారణం. ఎన్పీఏలు తగ్గడం, మూలధన కల్పన, పొదుపురేట్ల పెరుగుదల ద్వారా రుణ రేట్లు మరింత తగ్గుతాయన్న ఆర్బీఐ అంచనాలు తగిన విధంగా ఉన్నాయి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ సమతుల్యతను సూచిస్తోంది... అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఇబ్బందుల రీత్యా ఆర్బీఐ తగిన పాలసీ విధానాన్ని అవలంబించింది. కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణం– వృద్ధి మధ్య సమతుల్యం అవసరమని పాలసీ సూచి స్తోంది. ఇది దీర్ఘకాలిక వృద్ధికి దారితీసే అంశం. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ద్రవ్యోల్బణమే కీలకం ఆర్బీఐ నిర్ణయానికి ద్రవ్యోల్బణం అం శాలే కీలకం. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధన కల్పన, ప్రభుత్వ సెక్యూరిటీలకు అనుగుణంగా చిన్న పొదుపు స్కీమ్‌లకు వడ్డీరేట్ల నిర్ణయం... ఇవన్నీ బ్యాంకింగ్‌కు సానుకూల అంశాలు. – రాజీవ్ రిషి, ఐబీఏ చైర్మన్ -
ఆర్బీఐ రూటు ఎటు..?
► రేట్ల కోతపై ఉత్కంఠ... ► యథాతథమేనని ఫిక్కీ అంచనా ► తగ్గించే చాన్స్ ఉందంటున్న బ్యాంకర్లు ► 8న పాలసీ సమీక్ష న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 8న (బు«ధ వారం) చేపట్టనున్న ఆర్బీఐ పాలసీ సమీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన డిపాజిట్ నిధుల ప్రభావం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచిఉండటం వంటి అంశాలతో పాలసీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, సేవల రంగం వరుసగా మూడో నెలలోనూ(జనవరి) క్షీణించడం చూస్తే.. రేట్ల కోత ఉండొచ్చని కొందరు బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నోట్ల రద్దుతో భారీగా నిధులు వచ్చిచేరడంతో బ్యాంకులు గత నెలలో రుణ రేట్లను ఒక శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పాలసీ సమీక్షలో ఉర్జిత్ పటేల్ రెపో రేటును పావు శాతం తగ్గించి 6.25 శాతానికి చేర్చారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) తొలి భేటీలోనే ఈ నిర్ణయం వెలువడింది. అయితే, నవంబర్ 8న రూ.1,000; రూ.500 నోట్లను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్లో జరిగిన భేటీలో కచ్చితంగా పావు శాతం కోత ఉండొచ్చని ఎక్కువ మంది అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఆర్బీఐ మాత్రం పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ జనవరిలో బ్యాంకులు వరుసగా రుణ రేట్లను భారీగా తగ్గించడంతో ఆర్బీఐపై ఒత్తిడి కాస్త తగ్గినట్లయింది. ప్రస్తుతం రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 6.25%, రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం... ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే అడ్డంకిగా భావిస్తున్నారు. ముడి చమురు ధర ఎగబాకుతుండటం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న పలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామిక మండలి ఫిక్కీ... ఆర్బీఐ రానున్న పాలసీ సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని పేర్కొంది. అయితే, 2017–18 ప్రథమార్ధంతో రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంటోంది. బ్యాంకర్లు అటూఇటూ... బ్యాంకుల వద్దకు భారీగా డిపాజిట్ నిధులు వచ్చి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ రానున్న పాలసీలో రేట్లను తగ్గించకపోవచ్చని బంధన్ బ్యాంక్ ఎండీ చంద్ర శేఖర్ఘోష్ అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు బ్యాంకర్లు మాత్రం కోతకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ‘ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలన్నీ రెపో తగ్గింపునకు అనుకూలంగానే ఉన్నాయి. వృద్ధికి చేయూతనిచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చర్యలు ప్రకటించింది. ఇక ఆర్బీఐ కూడా దీనికి అనుగుణంగానే పాలసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. 8న సమీక్షలో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నాం’ అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ ఆర్కే గుప్తా వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అధిక ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండటంతో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని యూకో బ్యాంక్ ఎండీ సీఈఓ ఆర్కే టక్కర్ పేర్కొన్నారు. ముప్పావు శాతం తగ్గించాలి: అసోచామ్ డీమోనిటైజేషన్‌తో చౌక డిపాజిట్ నిధుల రూపంలో బ్యాంకులకు భారీగా లాభం చేకూరిందని.. దీన్ని రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో బదలాయించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఆర్బీఐ రెపో రేటును 0.5–0.75 శాతం మేర తగ్గించాల్సిందే. ఈ కోతను బ్యాంకులు కూడా రుణ గ్రహీతలకు బదలాయించేలా ఆర్బీఐ, ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలి. రుణవృద్ధి మందగమనం.. వినియోగ డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడులకు పునరుత్తేజం కల్పించాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు చాలా కీలకం’ అని ఆసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాదికి పావు శాతమే..: నోమురా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ద్రవ్యోల్బణం విషయంలో మధ్యకాలానికి సానుకూలంగానే(ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండటం ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణ చర్యలు) ఉందని.. ఈ నేపథ్యంలో రానున్న సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రెపో రేటును తగ్గించొచ్చని జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం నోమురా పేర్కొంది. అధిక క్రూడ్ ధరలు ఇతరత్రా విదేశీ అంశాల ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్బీఐ కోతకే మొగ్గుచూపొచ్చని అభిప్రాయపడింది. అయితే, దీనితర్వాత ఈ ఏడాదిలో(2017) ఇక తగ్గింపులు ఉండకపోవచ్చనేది నోమురా అంచనా. -
ఉర్జిత్ ‘రేటు’ షాక్!
-
ఉర్జిత్ ‘రేటు’ షాక్!
►ఎక్కడి వడ్డీరేట్లు అక్కడే... ► రెపో 6.25%, రివర్స్ రెపో 5.75%, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు... ► నోట్ల రద్దుతో ఈ ఏడాది వృద్ధి అంచనా 7.1 శాతానికి కోత మార్చినాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం ► తదుపరి పాలసీ సమీక్ష ఫిబ్రవరి 8న అంచనాలన్నీ తప్పాయి. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో అష్టకష్టాలు పడుతున్న సామాన్యుడికి వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు కూడా ఆవిరయ్యాయి. కనీసం పావు శాతం వడ్డీ రేట్ల తగ్గింపు ఖాయమంటూ లెక్కలేసిన విశ్లేషకులు, స్టాక్ మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాక్ ఇచ్చారు. కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు డీమోనిటైజేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలానికి తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించింది. మొత్తంమీద రుణాలపై వడ్డీరేట్లు దిగొస్తాయని వేచిచూస్తున్నవారందరినీ ఆర్బీఐ తీవ్ర నిరాశకు గురిచేసింది. అరుుతే, తాత్కాలిక 100% సీఆర్ఆర్ పరిమితిని తొలగించడంతో రుణ రేట్లు రానున్న కాలంలో తగ్గుముఖం పట్టొచ్చని బ్యాంకర్లు పేర్కొనడం కాస్త ఊరటనిచ్చే అంశం. ముంబై: ఆర్బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్‌పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతున్నదన్న భయాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. వాస్తవానికి డీమోనిటైజేషన్ కారణంగా వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా పోటెత్తడంతో ఆర్బీఐ కచ్చితంగా ఈ సమీక్షలో పావు శాతమైనా రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి, ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం ఉంటుంది. మరోపక్క, డీమోనిటైజేషన్ కారణంగా ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది. ఈ స్వల్పకాలిక ప్రతికూలతల వల్లే ప్రస్తుత సమీక్షలో కాస్త ఆచితూచి రేట్లను యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సరళ పాలసీ విధానం కొనసాగుతుంది. రానున్న కాలంలో వెలువడే ప్రధాన ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తదుపరి పాలసీ చర్యలు ఉంటారుు’ అని ఆర్బీఐ పేర్కొంది. కాగా, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలవల్లే పాలసీ రేట్లను తగ్గించలేదా అన్న ప్రశ్నకు దాంతో సంబంధం లేదని ఉర్జిత్ పటేల్ పేర్కొనడం గమనార్హం. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కు... రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి(మార్చి) 5 శాతంగానే ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అరుుతే, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే రిస్కు ఉందని అభిప్రాయపడింది. 100 శాతం తాత్కాలిక సీఆర్ఆర్ రద్దు... తాత్కాలికంగా కొత్త డిపాజిట్లపై 100 శాతం నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం)ను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి దీన్ని తొలగించనున్నామని పాలసీ సమీక్ష సందర్భంగా వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి డిపాజిట్లు వెల్లువెత్తడంతో వాటిపై తాత్కాలికంగా సీఆర్ఆర్ను 100 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, మార్కెట్ స్థిరీకరణ పథకం(ఎంఎస్ఎస్) కింద ప్రభుత్వ బాండ్ల జారీ పరిమితిని ఇటీవలే రూ.30 వేల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్లకు పెంచిన నేపథ్యంలో ఈ 100 శాతం తాత్కాలిక సీఆర్ఆర్ను తొలగించేందుకు ఆర్బీఐకి మార్గం సుగమం అరుుంది. దీంతో ఇకపై డీమోనిటైజేషన్‌లో భాగంగా బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లను(ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది) బ్యాంకులు తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి దోహదం చేస్తుంది. వృద్ధికి డీమోనిటైజేషన్ దెబ్బ... డీమోనిటైజేషన్ కారణంగా డిమాండ్ మందగించడంతో స్వల్పకాలానికి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభవం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17) జీడీపీ వృద్ధి అంచనాలను 7.1 శాతానికి తగ్గించింది. గతంలో ఆర్బీఐ వృద్ధి రేటు అంచనా 7.6 శాతంగా ఉంది. ‘ప్రధానంగా నగదు లావాదేవీలపై అధికంగా ఆధారపడి ఉండే రిటైల్ వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణాతో పాటు అసంఘటిత రంగంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు కొంతకాలం తీవ్రంగా దెబ్బతినొచ్చు. ఈ రంగాల్లో డిమాండ్ దిగజారనుంది. దీంతో మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్దిని దిగజార్చవచ్చు. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వచ్చింది’ అని ఆర్బీఐ పేర్కొంది. పరిశ్రమవర్గాల నిరాశ... న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచడంపై పరిశ్రమవర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే.. కుదేలవుతున్న పరిశ్రమకు ఊతమిచ్చేందుకు, పెద్ద నోట్ల రద్దుతో తగ్గిన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడి ఉండేదని పేర్కొన్నాయి. ’ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేట్‌ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి ఉండి ఉంటే పారిశ్రామిక ఎకానమీకి ఊతమిచ్చినట్లయ్యేది. డీమోనిటైజేషన్ కారణంగా వినియోగ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే ఇటు వినియోగదారులకు, అటు పరిశ్రమకు తోడ్పాటు అందించినట్లయ్యేది’ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ న్యోతియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో దేశీ ఆర్థిక వ్యవస్థ నుంచే వృద్ధికి తోడ్పాటు లభించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, వృద్ధి, రుణాలపై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పైనా డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉందని అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోరియా చెప్పారు. కోతతో సెంటిమెంట్ మెరుగుపడేది.. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం ఉండేది. తగ్గించకపోవడం వల్ల మార్కె ట్ కాస్త నిరాశపడి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో డిమాండ్ గణనీయంగా పతనమైంది. డిమాండ్ పెరగాలంటే.. ఎకానమీ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అదనపు సీఆర్ఆర్ పెంపు తొలగింపు, మార్కెట్ స్థిరీకరణ పథకం కింద బాండ్ల జారీ పరిమితిని రూ. 6 లక్షల కోట్లకు పెంచడం పరిణామాలతో బ్యాంకులకు ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. వ్యవస్థలో ఆర్థిక స్థిరీకరణకు దోహదం చేస్తుంది. - అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఉదార విధానం.. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఉదార విధానం కొనసాగించింది. ఒకవైపు వృద్ధికి తోడ్పాటునిస్తూ.. మరోవైపు మధ్యకాలికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించడంపై దృష్టితో ద్రవ్యపరపతి విధానాన్ని స్థిరంగా ఉంచింది. అదనపు సీఆర్ఆర్ నిబంధన ఉపసంహరణ, లిక్విడిటీ నిర్వహణకు ఎంఎస్ఎస్ తదితర సాధనాలను ఉపయోగించడం మొదలైనవి స్వాగతించతగ్గ అంశాలు. రాబోయే రోజుల్లో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్ల తగ్గుదల కొనసాగే అవకాశాలు ఉన్నాయి. - చందా కొచర్, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్ డీమోనిటైజేషన్ ప్రభావాలపై ధీమా.. వృద్ధిపై డీమోనిటైజేషన్ ప్రభావాలు తాత్కాలికమైనవేనని, మధ్య-దీర్ఘకాలికంగా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని ఆర్బీఐకి ఉన్న ధీమాను పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించడం ప్రతిబింబిస్తోంది. - రాణా కపూర్, సీఈవో, యస్ బ్యాంక్ వేచి చూసే ధోరణి.. ఆర్బీఐ పావు శాతం పాలసీ రేట్లు తగ్గించవచ్చని చాలా మంది భావించారు. కానీ రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులు ఎలా ఉంటాయో పరిశీలించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ వేచి చూసే ధోరణిని అవలంబించింది. - చంద్రశేఖర్ ఘోష్, చైర్మన్, బంధన్ బ్యాంక్ సాహసోపేత నిర్ణయం: ఆర్థిక శాఖ పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ స్వాగతించింది. ‘అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు కుదుపులకు గురవుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం తగ్గుదలకు కొన్ని అటంకాలు నెలకొన్నాయి. ఇవన్నీ పరిశీలించే ఆర్బీఐ వేచిచూసే ధోరణితో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణరుుంచింది’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ప్రజల అంచనాలకు భిన్నంగా ఉంది కాబట్టి.. ఇది సాహసోపేతమైన చర్యేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రణియన్ వ్యాఖ్యానించారు. అందుకే తగ్గించకపోరుు ఉండొచ్చు.. డీమోనిటైజేషన్ ప్రభావంతో వ్యవస్థలోకి గణనీయంగా నగదు వచ్చి చేరింది. ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత స్థారుులోనే తిరుగాడుతోంది. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా రేట్లను తగ్గించి ఉంటే బోలెడంత ఊతంగా ఉండేది. అయితే, గత పాలసీ రేట్ల కోతల ప్రయోజనాల పూర్తి బదలారుుంపు కోసం ఆర్బీఐ బహుశా ఎదురుచూస్తుండవచ్చు. అందుకే రేట్ల కోత నిర్ణయం వాయిదా వేసి ఉండొచ్చు. ప్రస్తుతం నగదు లభ్యత బాగానే ఉంది.. అలాగే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం కూడా తగ్గనుంది కాబట్టి అవి ఇప్పుడిక వడ్డీ రేట్లు తగ్గించవచ్చు. - వీఎస్ పార్థసారథి, గ్రూప్ సీఎఫ్‌వో, ఎంఅండ్ఎం గ్రూప్ -
‘మార్కెట్ లోకి కొత్త రూ. 500 నోట్లు’
న్యూఢిల్లీ: మార్కెట్ లోకి కొత్త రూ. 500 నోట్లు వచ్చాయని, వీటి సరఫరాను క్రమంగా పెంచుతామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల కష్టాలు త్వరలోనే తీరతాయని, పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు. క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్)పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఈ నెల 9న సమీక్షిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోనని వేచి చూస్తున్నామన్నారు. అధికంగా ఉన్న లిక్విడిటీని ఆర్బీఐ నిర్వహిస్తుందని చెప్పారు. కాగా, కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. 2000 నోట్లకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ. 500 నోట్లు విరివిగా చెలామణిలోకి వస్తే చిల్లర కష్టాలు తీరతాయి. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. కొత్త వెయ్యి రూపాయల నోట్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. -
వడ్డీ రేట్లు ఇప్పటికింతే..
• డిపాజిట్లు వచ్చినా బ్యాంకులకు దక్కని ప్రయోజనం • సీఆర్ఆర్ పెంపే కారణం • బ్యాంకింగ్ వర్గాల విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడుతున్నప్పటికీ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలేమీ కనిపించడం లేదు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను రిజర్వ్ బ్యాంక్ ఎకాయెకిన 100 శాతానికి పెంచేయడంతో అదనపు నిల్వలపై బ్యాంకులకు రాబడి లేకపోవడమే ఇందుకు కారణమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నారుు. ’వడ్డీ రేట్ల కోత సంగతి అటుంచండి. రద్దు చేసిన రూ. 500/1,000 నోట్ల రూపంలో సేవింగ్స ఖాతాల్లోకి కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్న డిపాజిట్లపై 4 శాతం కనీస వడ్డీ రేటు చెల్లించేందుకు తగినన్ని వనరులను వెతుక్కుంటూ బ్యాంకులు నానా కష్టాలు పడుతున్నారుు’ అని సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు. మరోవైపు, పెట్టుబడులు తరలిపోయే విధంగా వడ్డీ రేట్లు నిర్దిష్ట స్థారుుకన్నా కిందికి పడిపోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపారుు. ’గిట్టుబాటు కాక పెట్టుబడులు ఒక్కసారిగా అమెరికాకు ఎగిరిపోయేంతగా కూడా వడ్డీ రేట్లు తగ్గించలేం. ఈ విషయంలో సమతూకంతో వ్యవహరించాలి’ అని పేర్కొన్నారుు. నవంబర్ 27 నాటికి బ్యాంకుల్లోకి రూ. 8.11 లక్షల కోట్ల మేర డిపాజిట్లు వచ్చారుు. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మొదలైనవి ఇప్పటికే డిపాజిట్లపై రేట్లు తగ్గించడంతో రుణాలపైనా వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు నెలకొన్నారుు. బ్యాంకులు తమకొచ్చిన లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను తమ దగ్గర అట్టే పెట్టుకుంటే కుదరదని, వడ్డీ రేట్లు తగ్గించి రుణాలుగా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడం దీనికి మరింతగా ఊతమిచ్చింది. అరుుతే, అధిక మొత్తంలో డిపాజిట్లు వచ్చి పడినా ఆర్బీఐ ఒక్కసారిగా సీఆర్ఆర్ పెంచేయడంతో .. తక్కువ వ్యయాలతో నిధులు సమకూర్చుకున్న ప్రయోజనం బ్యాంకులకు లేకుండా పోరుుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. దీంతో ఆర్బీఐ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ బ్యాంకులు వడ్డీ రేట్ల ప్రయోజనాలను బదలారుుంచకుండా ఆగే అవకాశం ఉందని వివరించింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చేమోనన్న ఆందోళనలతో పాటు అనేక అంశాల ప్రభావంతో రూపారుు మారకం విలువపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒకవైపు అమెరికా ట్రెజరీ బిల్స్, బాండ్ రేట్లకు అనుగుణంగా వర్ధమాన మార్కెట్లలో బాండ్ ఈల్డ్‌లు (రాబడులు) పెరుగుతుండగా.. భారత్‌లో మాత్రం బాండ్ ఈల్డ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!
ముంబై : బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకుల నుంచి రూ.3 ట్రిలియన్ నగదు తరలిపోనుందని, ఇది వడ్డీరేట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. సెప్టెంబర్ 16- నవంబర్ 11 మధ్య కాలానికి ఆర్బీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే నవంబర్ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా బ్యాంకుల వద్ద జమవుతున్న డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని నియంత్రించేందుకు తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్ల కోత ఆశలు ఆవిరయ్యాయని క్రిసిల్ పేర్కొంది. బ్యాంకులు వడ్డీరేట్ల కోతను జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తాయని 3-4 శాతం వడ్డీరేట్ల వాగ్దానం కూడా నెరవేరబోదని తెలిపింది. సీఆర్ఆర్కు నగదు తరలిపోతున్నందున్న డిపాజిట్లపై ఎలాంటి వడ్డీలు కస్టమర్లు పొందే అవకాశముండదని వ్యక్తంచేసింది. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి అంచనాలు తగ్గుతున్న నేపథ్యంలో డిసెంబర్ 7న జరుగబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేట్ నిర్ణయం కీలకంగా మారనుందని క్రిసిల్ పేర్కొంది. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
-
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన ఈక్విటీ బెంచ్మార్కులు సోమవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల స్వల్ప లాభంతో 26,350 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,126.90 వద్ద క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.66 శాతం పెరిగాయి. కానీ రిజర్వు బ్యాంకు ఊహించని విధంగా సీఆర్ఆర్ పెంచడంతో బ్యాంకులు షేర్లు నష్టాల బాట పట్టాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద భారీగా డిపాజిట్లు పెరగడంతో సెంట్రల్ బ్యాంకు వద్ద బ్యాంకులు ఉంచాల్సిన నగదు నిల్వల నిష్ఫత్తి కూడా పెంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ 2.55 శాతం కిందకు దిగజారింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ కూడా 1.11 శాతం నష్టపోయింది. బ్యాంకు షేర్లలో భారీగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2.84 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.89 శాతం పడిపోయాయి. అయితే ఆసియన్ షేర్ల పెరుగుదల మొత్తంగా కొంచెం సెంటిమెంట్ బలపడంతో మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి. -
ఎక్కడిరేట్లు అక్కడే!
రేపు ఆర్బీఐ పాలసీ సమీక్ష పెరుగుతున్న ఆహార ధరలతో రేట్ల తగ్గింపునకు చాన్స్ లేనట్టే బ్యాంకర్లు, విశ్లేషకుల అభిప్రాయం... న్యూఢిల్లీ: ఎగబాకుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. వడ్డీరేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఆర్బీఐ రేపు(మంగళ వారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని బ్యాంకర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పలు చోట్ల ఇటీవలి అకాల వర్షాల కారణంగా ఆహార ధరలకు రెక్కలొస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ధరల తగ్గుముఖ ధోరణి కనబడితేనే మళ్లీ ఆర్బీఐ భవిష్యత్తు రేట్ల కోత సంకేతాలిస్తుందనేది వారి వాదన. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గత రెండు సార్లు కూడా(జనవరి 15న, మార్చి 4న) పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ఇంకా రుణ గ్రహీతలకు బదలాయించడానికి తటపటాయిస్తున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ తగ్గిస్తే మంచిది..: అరుంధతీ భట్టాచార్య ఆర్బీఐ సమీక్షలో సీఆర్ఆర్ను తగ్గించాలని కోరుకుంటున్నట్లు దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దీనివల్ల బ్యాంకులకు నిధులపై వ్యయం తగ్గుముఖం పట్టి.. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు(రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు) అవకాశం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఆర్బీఐ రేపో రేటు తగ్గింపు చర్యలను బ్యాంకులు కూడా అనుసరించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుత ధరల స్థితిని చూస్తుంటే... మంగళవారంనాటి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యూనియన్ బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారి పేర్కొన్నారు. సీఆర్ఆర్ను తగ్గిస్తే.. బ్యాంకుల రుణ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతుందని ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం భాసిన్ చెప్పారు. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రుణ వితరణ చాలా మందకొడిగా ఉందని.. 2015-16 తొలి త్రైమాసికంలో కూడా ఇలాగే కొనసాగవచ్చని భాసిన్ పేర్కొన్నారు. మార్చి 20తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకుల రుణ వృద్ధి 9.5 శాతానికే పరిమితమైంది. రెండు దశాబ్దాల కాలంలో ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. ఆర్థిక వేత్తలు ఏమంటున్నారంటే... అకాల వర్షాల ప్రభావంతో రబీ సీజన్‌లోని గోధుమలు, నూనె గింజలు, పప్పులు తదితర పంటల దిగుబడులు 25-30% దెబ్బతినొచ్చని అసోచామ్ అంచనా వేస్తోంది. ఈ ప్రతికూల ప్రభావం కారణంగా ఆహారోత్పత్తుల ధరలు మరింత ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటంతో ఆర్బీఐ వేచిచూసే ధోరణి అవలంభిస్తుందని.. రేపటి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త జ్యోతిందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. అయితే, మరో పావు శాతం రెపో రేటు కోత గనుక ఈసారి సమీక్షలో ఉండకపోతే.. ఏప్రిల్‌లోనే పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రాజన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. మార్చి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడులైన తర్వాత ఈ చర్యలకు ఆస్కారం ఉందన్నారు. తయారీకి ఊతమివ్వలేదు: ఫిక్కీ సర్వే ఆర్బీఐ తాజా రేట్ల కోతలతో తయారీ రంగంలో పెట్టుబడులకు ఎలాంటి ఊతం లభించలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫిక్కీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రేట్ల కోత కారణంగా తమ కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగిన దాఖలాలేవీ లేవని సర్వేలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. తయారీ రంగ సంస్థలు ప్రస్తుతం బ్యాంకులకు 9.5-14.75 శాతం స్థాయిలో వడ్డీరేట్లను చెల్లిస్తున్నాయి. ఆర్బీఐ రేట్లు తగ్గించినా.. బ్యాంకులు ఇంకా ఆ ప్రయోజనాన్ని బదలాయించని విషయం విదితమే. కాగా, ప్రస్తుతం తమకు సగటున 12 శాతం పైబడిన వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయని 58 శాతం మంది తెలిపారు. వచ్చే మూడు నెలల కాలానికి తాము ఎలాంటి అదనపు నియామకాలూ చేపట్టలేదని 80 శాతం ప్రతినిధులు వెల్లడించారు. భూసేకరణ, నియంత్రణపరమైన ఇబ్బందులు, అధిక వడ్డీరేట్లు, అనుమతుల్లో జాప్యం వంటివి తయారీ రంగంలో విస్తరణ ప్రణాళికలకు ప్రధాన అడ్డంకులని సర్వే తెలిపింది. -
సీఆర్ఆర్ కోత చాన్స్: ఎస్బీఐ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత ప్రధాన ధ్యేయంగా త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్య తీసుకునే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక ఒకటి బుధవారం తెలిపింది. ఇందులో భాగంగా నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) కొంత తగ్గించవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 7 తదుపరి పాలసీ సమీక్షకు ముందే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చనీ అభిప్రాయపడింది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. దీనినే సీఆర్ఆర్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4%గా ఉంది. సీఆర్ఆర్ను అర శాతం తగ్గిస్తే, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.45,700 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. గడచిన రెండు నెలల్లో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 7.5 శాతానికి చేరింది. -
రుణాలు.. ఇక చౌక
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తన రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపించారు. అకస్మాత్తుగా రెండోసారి పాలసీ వడ్డీరేట్లను తగ్గించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో గృహ, వాహన, రిటైల్ రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం దిగిరానుంది. పారిశ్రామిక వర్గాల్లోనూ ఈ అనూహ్య నిర్ణయం ఆనందం నింపింది. అయితే, బ్యాంకర్లు తక్షణం రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించనప్పటికీ.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలిచ్చారు. మొత్తంమీద తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్లకు కాస్త సానుకూలంగా వ్యవహరించగా... ఇప్పుడు రాజన్ కూడా రేట్ల కోతతో తనవంతు చేయూతనివ్వడం విశేషం. ⇒ రేట్ల కోతతో ఆశ్చర్యపరిచిన ఆర్బీఐ గవర్నర్ రాజన్ ⇒ పావు శాతం తగ్గింపుతో 7.5 శాతానికి రెపో రేటు ⇒ రెండు నెలల్లో రెండోసారి కట్.. ⇒ రివర్స్ రెపో 6.5 శాతానికి తగ్గుదల.. ⇒ సీఆర్ఆర్ యథాతథంగా 4 శాతం ⇒ గృహ, వాహన, రిటైల్ రుణాలపై దిగిరానున్న ఈఎంఐలు ⇒ వడ్డీరేట్లపై బ్యాంకర్ల సానుకూల సంకేతాలు... ⇒ పారిశ్రామిక రంగానికి బూస్ట్... ముంబై: పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా ఆర్బీఐ మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో ఈ రేటు 7.5 శాతానికి దిగొచ్చింది. రెపోతో ముడిపడి ఉన్న రివర్స్ రెపో రేటు కూడా పావు శాతం తగ్గి.. 6.5 శాతానికి చేరింది. అయితే, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ను మాత్రం యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. జనవరి 15న ఆర్బీఐ అనూహ్యంగా పావు శాతం రెపో రేటును తగ్గించడం తెలిసిందే. తాజా కోతతో రెండు నెలల వ్యవధిలో రెండోసారి తగ్గించినట్లయింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతోపాటు కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు కట్టుబడి ఉంటామని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన కొద్ది రోజులకే ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయం వెలువడింది. గత నెలలో(ఫిబ్రవరి 3న) జరిగిన ద్వైమాసిక పాలసీ సమీక్షలో పాలసీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం.. కేవలం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని మాత్రం అర శాతం తగ్గించడం విదితమే. దీనిద్వారా వ్యవస్థలోకి రూ.42,000 కోట్ల మేర నగదు లభ్యతను పెంచింది. కాగా, గతసారి పాలసీ రేట్ల తగ్గింపు సందర్భంగా ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు అందించేందుకు వెనుకంజవేసిన బ్యాంకులు.. ఈసారి మాత్రం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలిస్తున్నాయి. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక ప్రకటించిన రెండు రేట్ల తగ్గింపు నిర్ణయాలూ పాలసీ సమీక్షకు వెలుపలే తీసుకోవడం గమనార్హం. అలాగే ఈ రెండు దఫాలు తెల్లవారగానే రాజన్ రేటు తగ్గింపును ప్రకటించడం విశేషం. కాగా, వచ్చే నెలలో(ఏప్రిల్ 7న) ఆర్బీఐ తదుపరి పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. బ్యాంకులు కూడా అనుసరించాలి...: కార్పొరేట్లు ‘వృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిరోజుల్లోనే ఆర్బీఐ అకస్మాత్తుగా పాలసీ రేట్లను తగ్గించడం చూస్తే.. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు ఇరు పక్షాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది’ అని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆర్బీఐ చర్యల నేపథ్యంలో వినియోగ, కార్పొరేట్ రుణాలపై ఇక బ్యాం కులు కూడా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటిస్తాయన్న విశ్వాసం ఉం దని ఫిక్కీ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి పేర్కొన్నారు. నిధుల లభ్య తలో సమస్యలు ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ఆర్బీఐ రేట్ల కోత చేదోడుగా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సం ఘం(క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ వ్యాఖ్యానించారు. బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతాయ్ తక్కువ రుణ రేటు వ్యవస్థ ప్రయోజనాన్ని త్వరలో బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తాయని విశ్వసిస్తున్నా. బహుశా ఏప్రిల్ నుంచీ బ్యాంకింగ్ రుణ రేట్ల తగ్గింపు ఉంటుందని భావిస్తున్నా. మనం కొద్ది వారాల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. తక్కువ వడ్డీరేటు బదలాయింపును మనం చూడబోతున్నాం. రెండు దఫాలుగా రేట్ల కోత నిర్ణయం వినియోగదారులకు మళ్లించాల్సిన ఒత్తిడి బ్యాంకింగ్ వ్యవస్థలో తప్పనిసరిగా ఉంటుందని నేను అంచనావేస్తున్నా. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడంలో వ్యవస్థాగత ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆయా అంశాలను సెంట్రల్ బ్యాంక్ పరిశీలిస్తుంది. - రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ నా మాటల అర్థం అది కాదు.. వడ్డీరేట్ల విషయంలో తన తాజా వ్యాఖ్యలపై రాజన్ వివరణ ఇచ్చారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో వడ్డీరేట్ల కోత సాధ్యం కాదు’ అని రాజన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హఠాత్తుగా మీ వైఖరి మారిపోడానికి కారణమేమిటి? అని విశ్లేషకులు మంగళవారం ప్రశ్నించారు. దీనికి రాజన్ సమాధానం ఇస్తూ... తాను చేసిన వ్యాఖ్యల అర్థం తప్పుగా మీడియాలో వచ్చిందన్నారు. పలు దేశాలు ‘జీరో’ స్థాయికి వడ్డీరేట్లు తగ్గించినా, మనం ఆ స్థాయికి తగ్గించలేమని మాత్రమే తాను పేర్కొన్నానన్నారు. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, డిమాండ్ పరిస్థితులే దీనికి కారణమని సైతం వివరించానని తెలిపారు. మార్కెట్‌ను ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించాయన్న విమర్శలకు ఆయన స్పందిస్తూ, ‘ఇలా జరగదు. జరిగితే ఇందుకు క్షమాపణలు’ అన్నారు. వడ్డీరేట్లు దిగొచ్చే సంకేతం ఆర్బీఐ రేట్ల కోత తక్కువ రుణ రేటు వ్యవస్థకు సంకేతమేనని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. అయితే అమలుకు కొంత సమయం పడుతుందని వారు సూచించారు. నెల రోజుల్లో ఆర్బీఐ రుణ రేటు అరశాతం తగ్గింది. అయితే డిపాజిట్ రేటు- రుణ రేటు ఆయా అంశాలను పరిగణను లోకి తీసుకోవడం, బేస్ రేట్ సమీక్ష వంటి అంశాలపై బ్యాంకింగ్‌కు కొంత సమయం పడుతుంది. వెరసి ఖాతాదారులు రుణ రేటు తగ్గింపునకు కొంత కాలం వేచిచూడాలి. - టీఎం భాసిన్, ఐబీఏ చైర్మన్, ఇండియన్ బ్యాంక్ చీఫ్ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని బేస్ రేటు కోతపై మా బ్యాంక్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఆయా అంశాలు బ్యాంకింగ్ నిర్ణయ రూపకల్పనకు దోహదం చేస్తాయి. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ ఇది హర్షణీయం. వృద్ధి ఊతం లక్ష్యంగా బడ్జెట్లో పేర్కొన్న సంస్కరణలు, పాలసీ చర్యల సానుకూలతలను ఆర్బీఐ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.5% రేట్ల కోతను నేను అంచనావేస్తున్నా. అదే జరిగితే వ్యాపారాభివృద్ధికి, పెట్టుబడులకు పునరుత్తేజం లభిస్తుంది. - రాణా కపూర్, యస్ బ్యాంక్ సీఈఓ స్వాగతిస్తున్నాం... ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల రుణ ఈఎంఐలు గణనీయంగా తగ్గేందుకు దోహదం చేస్తుంది. రానున్నకాలంలో వడ్డీరేట్లు మరింత తగ్గేందుకు ఆస్కారం ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాలు భారీగా దిగొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషన్) ధోరణులు కనబడుతున్నాయి. - జయంత్ సిన్హా,ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ ఏడాది మరో 1% వరకూ తగ్గే చాన్స్: నిపుణులు ఈ ఏడాది మరో అర శాతం నుంచి ఒక శాతం వరకూ ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గించే ఆస్కారం ఉందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొందరు బ్యాంకర్లయితే రానున్న పాలసీ సమీక్ష(ఏప్రిల్ 7న) మరోసారి రేట్ల తగ్గింపు ఉండొచ్చని కూడా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండటమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం. కాగా, ఆర్బీఐ తాజా రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తమ బేస్ రేటు(రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీరేటు)ను కచ్చితంగా సమీక్షించాల్సిన పరిస్థితి నెల కొందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ వ్యాఖ్యానించారు. ఏవరేమన్నారంటే... ‘ఈ ఏడాది(2015)లో మరో ఒక శాతం రెపో రేటు కోత ఉండొచ్చు. వచ్చే నెల 7న తదుపరి కోతకు అవకాశం ఉంది’. - మోర్గాన్ స్టాన్లీ ‘ఆర్బీఐ నేడు తీసుకున్న రేట్ల కోత నిర్ణయం ఊహించిందే. ఈ ఏడాది మొత్తంమీద ఒక శాతం వరకూ పాలసీ రేట్ల తగ్గింపు ఉంటుందనేది మా అంచనా. దీనిలో అర శాతం ఇప్పటికే పూర్తయింది. అయితే, మిగతా అర శాతం ఎప్పుడుంటుందనే నిర్ధిష్టంగా చెప్పలేం’. - కేకీ మిస్త్రీ, హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈఓ ‘రేట్ల కోతకు ఆర్బీఐ ఎంచుకున్న సమయం ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్, జూలై మధ్య మరో అర శాతం తగ్గింపు ఉండొచ్చని భావిస్తున్నా’. - ఏఎం నాయక్, ఎల్అండ్టీ చీఫ్ -
బాదుడుకు బ్రేక్..!
ముంబై: ఆర్బీఐ బుధవారం చేపట్టిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ కాస్త ఉదారంగా వ్యవహరించింది. కీలకమైన రెపో రేటు(ఆర్బీఐ వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను యథాతథంగా 7.75 శాతంగానే వదిలేసింది. అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకుల వద్ద నున్న డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన మొత్తం-దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు)ని ఇప్పుడున్న 4% వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, రివర్స్ రెపో(బ్యాంకులు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసే నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ) 6.75%గా ప్రస్తుత స్థాయిలోనే ఉంటుంది. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్-8.75%) ఎలాంటి మార్పూ లేదు. కాగా, తదుపరి మూడో త్రైమాసిక పాలసీ సమీక్ష జనవరి 28న జరగనుంది. అంతా అవాక్కు...! అటు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం, ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా చుక్కలు చూపిస్తుండటంతో ఆర్బీఐ మరోవిడత రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, నిపుణులు అంచనాలు వేశారు. పావు శాతం పెంచొచ్చని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కొంతమంది అర శాతం పెంపును కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే, రాజన్ మాత్రం ఎక్కడి రేట్లు అక్కడే ఉంచుతూ మార్కెట్ వర్గాలు, విశ్లేషకులను అవాక్కయ్యేలా చేశారు. సెప్టెంబర్‌లో ఆర్బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. కాగా, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి(7.52%), రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్టానికి(11.24%) ఎగబాకడం విదితమే. దీంతో ఆర్బీఐ కచ్చితంగా పాలసీ రేట్లను మరోసారి పెంచుతుందనే అంచనాలు వెల్లువెత్తాయి. మరోపక్క, అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి తిరోగమన బాటలోకి జారి మైనస్ 1.8 శాతానికి కుంగడంతో కార్పొరేట్లు వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్లు జోరందుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ యథాతథంగా కొనసాగడం గమనార్హం. పసిడి నియంత్రణలపై... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను తగ్గించేందుకుగాను బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలను ఎత్తివేసేందుకు సుముఖమేనని... అయితే, ఇది సరైన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనికి ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో క్యాడ్ 1.2 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. క్యూ1లో ఇది 4.9 శాతంగా ఉంది. క్రితం ఏడాదిలో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టాన్ని(4.8%) తాకడం తెలిసిందే. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసమే క్యాడ్. త్వరలో ధరల ఆధారిత పొదుపు పత్రం వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణానికి అనుసంధానమైన ‘పొదుపు పత్రాన్ని’ ఈ నెలాఖరుకల్లా ఆర్బీఐ ఆవిష్కరించనుంది. సీపీఐ వార్షిక సగటుకన్నా 1.5% అధికంగా ఈ ప్రొడక్ట్‌పై వడ్డీరేటు ఉంటుందని రాజన్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో డిపాజిట్ చేసిన సొమ్ముకు నిర్దిష్ట టర్మ్ తర్వాత తగిన రిటర్న్స్ రాకపోగా, నెగిటివ్ రాబ డులు నమోదవుతున్న నేపథ్యంలో తాజా పథకానికి ఆర్బీఐ రూపకల్పన చేసింది. ద్రవ్యోల్బణం సూచీ అ నుసంధాన పత్రం(ఐఐఎస్సీ)గా ఇది విడుదలవుతోం ది. పెట్టుబడులు, పొదుపు కోణంలో ద్రవ్యోల్బణం స వాళ్లను అధిగమించడానికి ఆర్బీఐ అంతక్రితం ప్రారంభించిన ఐఐబీ(ఇన్ఫ్లేషన్ ఇండెక్డ్స్ బాండ్లు) తర్వాత, ప్రతిపాదిత పొదుపు పత్రాలు కొత్త సిరీస్‌లోకి వస్తాయి. ఎప్పుడైనా పెంచుతాం: రాజన్ ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం గనుక దిగొస్తున్న సంకేతాలు వెలువడకపోతే... పాలసీ తేదీతో సంబంధం లేకుండా ఆర్బీఐ రేట్ల పెంపు ఇతరత్రా చర్యలను తీసుకుంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం చాలా అధికస్థాయిలో ఉంది. మరోపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాలసీ చర్యల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాం. అనిశ్చిత పరిస్థితులు తొలగేందుకు మరింత డేటా కోసం వేచిచూడటం వల్ల కొన్ని సానుకూలతలు ఉన్నాయి. మరోపక్క, దీనివల్ల కొన్ని రిస్క్‌లూ లేకపోలేదు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణను మొదలుపెడితే... వర్ధమాన మార్కెట్లపై తీవ్ర ప్రభావంచూపే అవకాశం ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణంపై పోరు విషయంలో కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే ఆర్బీఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించనుంది. చాన్నాళ్లుగా ఆర్థిక వ్యవస్థ బలహీన ధోరణిలో ఉండటం వల్లే.. ద్రవ్యోల్బణం కంటే వృద్ధిరేటుకు తోడ్పాటు దిశగా తాజా పాలసీలో ప్రధానంగా దృష్టిపెట్టాల్సి వచ్చింది. కాగా, వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధి, ఎగుమతుల మెరుగుదల, జాప్యాలతో నిలిచిపోయిన ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి రేటు పుంజుకునే అవకాశాలున్నాయి. స్వాగతించిన కార్పొరేట్లు... వడ్డీరేట్లను పెంచకుండా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘సమీక్షలో ఆర్బీఐ దూరదృష్టిని కనబరిచింది. వృద్ధి-ద్రవ్యోల్బణం అంశాలను ఎదుర్కోవడానికి సమన్వయంతో వ్యవహరించింది’ అని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘పారిశ్రామిక రంగం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని ఆర్బీఐ ఎట్టకేలకు గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. తదుపరి సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఉండొచ్చని భావిస్తున్నాం’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. తగినంత లిక్విడిటీ వ్యవస్థలో ఉన్నందున బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పెట్టుబడులకు చేయూతనివ్వాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. రుణ, డిపాజిట్ రేట్లు తగ్గవు: బ్యాంకర్లు ఆర్బీఐ ఆశ్చర్యకరమైన నిర్ణయం నేపథ్యంలో తాము రుణ, డిపాజిట్ రేట్లను తగ్గించే అవకాశాల్లేవని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఇది దోహదపడుతుందని ఆర్బీఐ చర్యలను ఆహ్వానించారు. ఎవరేమన్నారంటే... డిపాజిట్ రేట్లను తగ్గించే యోచనేదీ లేదు. ఇది వారిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. జూలై 15 నాటితో పోలిస్తే మా డిపాజిట్లు రేట్లు చాలా అధికస్థాయిలోనే ఉన్నప్పటికీ.. తక్షణం వీటిని తగ్గించే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణ, డిపాజిట్ రేట్లను తగ్గించేందుకు చాన్స్ లేదు. ద్రవ్యోల్బణం చాలా అధికస్థాయిలో ఉండటమే దీనికి కారణం. అయితే, బల్క్ డిపాజిట్ రేట్లను తగ్గించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం’ - విజయలక్ష్మి ఆర్. అయ్యర్,బీఓఐ చైర్పర్సన్ రానున్న కాలంలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న దృక్పథంతోనే ఆర్బీఐ పాలసీని యథాతథంగా కొనసాగించింది’ - ఎం. నరేంద్ర,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ కీలక పాలసీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. కొనసాగుతున్న వృద్ధి మందగమనం ధోరణి, రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలను దృష్టిలోపెట్టుకొనే ఆర్బీఐ ఈ విధంగా వ్యవహరించింది. ఆర్థిక రికవరీకి ఇది తోడ్పడుతుంది’ - చందా కొచర్,ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ