ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఉంగుటూరు: మనమంతా ఒక్కటే అనే భావన కలిగినప్పుడే శక్తివంతమైన దేశం ఏర్పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి విద్యాసంస్థల 75 వసంతాల వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. శక్తివంతమైన దేశంలో ఆకలి, దారిద్య్రం, లింగ, వర్ణ వివక్షలు ఉండకూడదన్నారు. మన దేశంలో ఇప్పటికీ 25 శాతం మంది పేదరికంలో, 27 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, భవిష్యత్‌లో వీటన్నింటినీ అధిగమించి ప్రగతి సాదించాల్సి ఉందన్నారు. సీఆర్‌ఆర్ విద్యా సంస్థలు 75 ఏళ్లుగా అంకితభావంతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సీఆర్‌ఆర్ విద్యా సంస్థల ప్రతినిధులు అల్లూరి ఇంద్రకుమార్, ఎంబీఎస్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.
జగన్నాథాష్టకం సీడీ ఆవిష్కరణ
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో జరిగిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించే సీపీఆర్ పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశీ దండయాత్రలు, బ్రిటిషర్ల విధానంతో దేశం నష్టపోయిన వైనం పై అమెరికా యాత్రికుడు విల్ దురంత్ రాసిన ద కేస్ ఫర్ ఇండియా పుస్తకానికి తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ను వెంకయ్యనాయుడు ఆవి ష్కరించారు. ఆత్కూరులో విజయవాడ చాప్టర్ స్వ ర్ణభారత్ ట్రస్ట్‌లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ తనయుడు ప్రసేన్‌జిత్ హరిచందన్ నేతృత్వంలో డివైన్ క్యాప్సుల్ సంస్థ తీసుకొచ్చిన జగన్నాథాష్టకం సీడీని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. సీడీ తీసుకురావడంలో శ్రమించిన ప్రసేన్‌జిత్ హరిచందన్, గాయకుడు సురేశ్‌వాడేకర్, సంగీత దర్శకుడు జగ్యాన్‌దాస్‌ను అభినందించారు.
మనమంతా ఒక్కటే..
Published Thu, Mar 3 2022 6:13 AM | Last Updated on Thu, Mar 3 2022 9:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment