ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్‌పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతున్నదన్న భయాల నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. వాస్తవానికి డీమోనిటైజేషన్ కారణంగా వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా పోటెత్తడంతో ఆర్‌బీఐ కచ్చితంగా ఈ సమీక్షలో పావు శాతమైనా రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు.