యథాతథంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేటు | RBI keeps repo rate unchanged at 6.25%, reverse repo up by 25 bps to 6% | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 6 2017 4:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

అంచనాలకు తగ్గట్టుకుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన పాలసీ రివ్యూలో యథాతథ పాలసీ అమలుకే నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6.25 శాతం, రివర్స్‌ రెపో 6శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.25 వద్దే కొనసాగనుంది. అయితే రివర్స్‌ రెపోను 25 బేసిస్‌ పాయింట్లను పెంచింది. తద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్‌ పెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు రివర్స్‌ రెపో 0.25 శాతం పెంపుతో ఇది 6 శాతంగా ఉండనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement