unchanged
-
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలనే ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. ఆర్బీఐ గవర్నర్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగిన ఈ మీటింగ్‌లో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు."మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు, దృక్పథాలను వివరణాత్మకంగా అంచనా వేసిన తర్వాత ద్రవ్య విధాన కమిటీ ఐదుగురు సభ్యుల మెజారిటీతో పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది" అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మళ్లీ జూన్‌లోనే... ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ముందుగానే అంచనా వేసింది. ఊహించినట్టుగానే ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. -
RBI Monetary policy: అయిదోసారీ అక్కడే..!
ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది. వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.5% పెంచింది. యూపీఐ పరిమితులు పెంపు.. ► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు. ► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్లో 6 శాతంగా ఉంటుందని అంచనా. ► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 4.7 శాతంగా ఉండవచ్చు. ► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్‌లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్‌టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు. ► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్.. సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంచనాల పెంపు సముచితమే.. ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం సముచితమే. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి రేటు తగ్గించాల్సింది.. వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది. – »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్ సానుకూల సంకేతాలు ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
నిత్యావసరాల ధరలు స్థిరం: కేంద్రం
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో చక్కెర, వంట నూనెలు సహా నిత్యావసర ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా భరోసా ఇచ్చారు. గోదుమలు, బియ్యం, పంచదార, వంట నూనెల వంటి ముఖ్యమైన ఆహార పదార్థాల దేశీయ సరఫరాలు, ధరలపై ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో ధరల స్థిరత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మే 22 నుండి గోధుమల ఎగుమతిపై నిషేధం, పార్బాయిల్డ్ బియ్యంపై మార్చి 2024 వరకు 20 శాతం ఎగుమతి సుంకం పొడిగింపు, పప్పుధాన్యాలపై స్టాక్ పరిమితులు, ‘నియంత్రిత’ కేటగిరీ కింద చక్కెర ఎగుమతుల పొడిగింపు వంటి అనేక ఆంక్షలు ధరల పెరుగుదలను నిరోధించడానికి దోహదపడతాయని తెలిపారు. దేశంలో వినియోగానికి తగిన చక్కెర నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. వంట నూనెల విషయంలో వేరుశెనగ నూనె మినహా మిగిలిన ఉత్పత్తులు రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. గడచిన మూడు నాలుగు నెలల్లో బియ్యం ద్రవ్యోల్బణం 11 నుంచి 12 శాతం స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. మార్కెట్లోకి కొత్త పంట ఉత్పత్తులు వస్తున్న నేపథ్యంలో, ధరలు మున్ముందు మరింత తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోధుమల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిలో దాదాపు 3.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. -
కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్ బిఐ
-
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్‌లోనూ ఎఫ్‌వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) -
భారత్ వృద్ధి రేటు.. 6 శాతం!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్ దిగ్గజం అంచనా వేసింది. (ఇదీ చదవండి: జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ త్రైమాసిక ఎకనమిక్ అప్డేట్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది. ► 2024–2026 మధ్య భారత్ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరంలలో భారత్ జీడీపీ వృద్ధి తీరు 6.9 శాతంగా ఉండనుంది. 2026–27లో 7.1%కి పెరుగుతుందని అంచనా. ► భారత్ ఎకానమీకి సాంప్రదాయకంగా ‘దేశీయ డిమాండ్’ చోదక శక్తిగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం కొంత ఎకానమీపై కనబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 4.4%కి నెమ్మదించడం గమనార్హం. ► ఆర్బీఐ రేటు పెంపునకు ప్రాతిపదిక అయిన వినియోగ ద్రవ్యోల్బణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ సవాళ్లుసహా పలు అడ్డంకులూ ఉన్నాయి. (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!) అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ ఆశావాద దృక్పథాన్నే వెలువరించింది. ఈ సంవత్సరం చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. 2023 చైనా వృద్ధికి సంబంధించి నవంబర్‌లో వేసిన 4.8 శాతం అంచనాలను 5.5 శాతానికి పెంచింది. మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రకటించిన 5 శాతం అంచనాలకన్నా ఇది అధికం కావడం గమనార్హం. వినియోగం, సేవల రంగాలు ఎకానమీ పురోగతికి దోహదపడతాయని అభిప్రాయపడింది. అమెరికా, యూరోజోన్‌లో ఎకానమీలో 2023లో భారీగా మందగించవచ్చని రేటింగ్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది అమెరికా 0.7 శాతం, యూరోజోన్ 0.3 శాతం వృద్ధి సాధిస్తాయన్నది తమ అంచనాగా తెలిపింది. చైనా కోలుకోవడం ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై అమెరికా, యూరప్‌లోని మందగమన ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయబోదని పేర్కొన్న ఎస్అండ్పీ, ఇది కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తుందని అంచనావేసింది. -
యధాతథంగా వడ్డీ రేట్ల కొనసాగింపు?
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఏప్రిల్ 6 నుండి 8 వరకూ సమావేశం కానుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను 8న వెల్లడించనుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, వృద్ధికి ఊతమిచ్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉండటం తదితర అంశాల కారణంగా ఆర్బీఐ ఇప్పటివరకూ అనుసరిస్తున్న ధోరణిలో కొంత మార్పు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను ఎంపీసీ ఎగువ వైపుగా సవరించవచ్చని, 2022–23 వృద్ధి అంచనాలను కొంత తగ్గించవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ ఏప్రిల్ 2022 పాలసీ రివ్యూ నివేదికలో పేర్కొన్నారు. అయినప్పటికీ విదేశీ అంశాల కారణంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడం కోసం వృద్ధిని పూర్తిగా త్యాగం చేయకపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 4 శాతంగాను, రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ) 3.35 శాతంగాను ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ 4 శాతం స్థాయిలో (2 శాతం అటూ, ఇటూగా) కట్టడి చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అవకాశాలు ఉన్నాయని ఎక్యూటీ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి అభిప్రాయపడ్డారు. -
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) సహా చిన్న పొదుపు పథకాలపై 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు వచ్చే 3 నెలల్లో కొనసాగనున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు త్రైమాసికం ప్రాతిపదికన నోటిఫై చేసే సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4 శాతం) వరుసగా పది ద్వైమాసిక సమావేశాల్లో ఒకేరీతిన కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులపై అదనపు వడ్డీ చెల్లింపు భారం అవకాశం లేదు. దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై రేట్లు దాదాపు యథాతథంగానే కొనసాగే వీలుంది. ఈ పరిణామం చిన్న పొదుపులపై కూడా రేట్లను ఎక్కడివక్కడే ఉంచడానికి కారణమవుతోంది. కొన్ని పథకాల రేట్లు ఇలా... ► పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 7.1 శాతంగా ఉంది. ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ 6.8%. ► ఏడాది డిపాజిట్ స్కీమ్ 5.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది ► బాలికా పథకం– సుకన్య సమృద్ధి యోజనపై అత్యధికంగా 7.6% వడ్డీ ఉంది. ► ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీరేటు 7.4%. వీటిపై త్రైమాసిక పరంగా వడ్డీ అందుతుంది. ► సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు వార్షికంగా 4%గా కొనసాగుతుంది. ► ఏడాది నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం 6.7% శ్రేణిలో ఉంది. వీటిపైనే వడ్డీ త్రైమాసికంగా అందుతుంది. ► ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ 5.8%. -
NSE NIFTY 50: మళ్లీ రికార్డుల బాట
ముంబై: ఒకరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ కదంతొక్కాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైన సూచీలు.., వెంటనే తేరుకొని మార్కెట్ ముగిసే వరకు ఎలాంటి తడబాటు లేకుండా స్థిరమైన ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 348 పాయింట్లు ఎగసి 54,874 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 318 పాయింట్ల లాభంతో 54,845 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 93 పాయింట్లు పెరిగి 16,375 వద్ద సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. మార్కెట్ ముగిసే సరికి 82 పాయింట్ల లాభంతో 16,364 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఈ వారం ఆరంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండుశాతం వరకు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో తొమ్మిది షేర్లు మాత్రమే నష్టపోయాయి. సూచీల రికార్డు ర్యాలీతో ఒకేరోజులో ఇన్వెస్టర్లు రూ.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్క్యాప్ రూ.239 లక్షల కోట్లకు చేరింది. రికార్డు ర్యాలీ ఎందుకంటే..? అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెలువడటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను ఇప్పట్లో పెంచకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డిమాండ్ ఊపందుకోవడంతో రెండో క్వార్టర్లో బ్రిటన్ మెరుగైన జీడీపీ వృద్ధిని సాధించింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఇక జాతీయంగా ఫారెక్స్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు అందాయి. డాలర్ మారకంలో రూపాయి 19 పైసలు ఎగసి 74.25 వద్ద స్థిరపడింది. గత మూడురోజుల ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా పతనాన్ని చవిచూసిన నాణ్యమైన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ప్యాసింజర్ వాహన విక్రయాలకు సంబంధించి జూలైలో వార్షిక ప్రాతిపదికన 45% వృద్ధి నమోదైనట్లు ఆటో పరిశ్రమ సంఘం సియామ్ తెలిపింది. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్ భావించే ఈక్విటీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ‘మార్కెట్ ముందుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ జరగవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్ మంచిది. గురు వారం విడుదలైన జూలై రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించనున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ 16300 స్థాయిపై ముగిసింది. తదుపరి 16500 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. దిగువ స్థాయిలో 16250 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఆప్టాస్ అదుర్స్.. కెమ్‌ప్లాస్ట్ ఓకే ముంబై: చెన్నైకి చెందిన ప్రత్యేక రసాయనాల కంపెనీ కెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఐపీఓకు ఓ మోస్తరు స్పందన లభించింది. చివరి రోజు నాటికి 2.17 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.99 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.. మొత్తం 8.66 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.29 రెట్లు ఎక్కువ దరఖాస్తులు లభించాయి. ఆప్టాస్ వేల్యూ 17 రెట్లు... ఆప్టాస్ వేల్యూ హౌసింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. మూడో రోజు నాటికి 17.20 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 5.51 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 94.82 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 71.35 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. -
కరోనా సెకండ్ వేవ్ : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్ విలయం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అంచనాకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండనుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా జీ-సాప్ 2.0 ను శక్తికాంత దాస్ ప్రకటించారు. జూన్ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నారు. ఫారిన్ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. అలానే దేశ జీడీపీని 9.5శాతంగా అంచనా వేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్ మెరుగ్గా ఉండనుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఇందుకుసకాలంలో వచ్చిన మాన్సూన్ నిదర్శనమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కన్పిస్తున్నా, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు గతంలో ఇచ్చినట్లుగా రూ.16 వేల కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు, ఆర్ధికంగా లిక్విడిటీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్! దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
కరోనా ఉధృతి: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తన ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో బెంచ్‌మార్క్ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్‌దాస్ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో దశలో విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా, సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసిందన్నారు. -
ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచారు. గురువారం శ్రీనగర్‌లో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన మరికొద్ది క్షణాల్లో వెలువడనుంది. కాగా కరోనామహమ్మారి నేపథ్యంలో పీఎఫ్ వడ్డీరేటును తగ్గనుందనే అంచనాలు వెలువడ్డాయి. 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018-19లో ఇది 8.65 శాతంగా ఉండగా, గత ఏడాది 8.5 శాతం వద్ద 7 సంవత్సరాల కనిష్టానికి చేరింది. తాజాగా దాదాపు దశాబ్దం కనిష్టానికి చేరింది. -
కీలక రేట్లు యథాతథం..
ముంబై : ఆర్థిక మందగమనం నేపథ్యంలో వడ్డీరేట్లలో కోత విధిస్తారనే అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.15 శాతంగానే కొనసాగించాలని నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ నిర్ణయించింది. అక్టోబర్ మాసంలో జరిగిన పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు కుదించి 5.15 శాతానికి తగ్గించింది. మరోవైపు తాజా భేటీలో 4.9 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటులోనూ ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. స్వల్ప కాలానికి వేచిచూసే ధోరణిలో వ్యవహరించేందుకే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ మొగ్గుచూపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. -
పది రోజుల్లో 84 పైసలు పెరిగిన పెట్రోలు ధర
-
పెరిగిన పెట్రోలు ధర
సాక్షి, ముంబై : పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసల చొప్పున ఎగిసింది. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెంట్ ఫూచర్స్ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. బుధవారం రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పది రోజుల్లో పెట్రోలు ధర 85 పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్‌కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.16, డీజిల్ ధర 71.80 విజయవాడ : పెట్రోలు ధర రూ. 77.40, డీజిల్ ధర 70.76 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర 65.79 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.15, డీజిల్ ధర 68.2 చెన్నై : పెట్రోలు ధర రూ. 76.34 డీజిల్ ధర 69.54 ముంబై : పెట్రోలు ధర రూ. 79.12, డీజిల్ ధర 69.01 -
ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!
వాషింగ్టన్: ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ రేటును ప్రస్తుత స్థాయిల్లోనే (2.25 శాతం నుంచి 2.50 శాతం) కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మొత్తం దాదాపు ఇదే రేటు కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు క్వాంటిటేటివ్ ఈజింగ్(ఉద్దీపన ప్యాకేజీ–క్యూఈ)ని కూడా పూర్తిగా నిలిపేయనున్నది. ఈ విధానంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలు(బాండ్లు), ఇతర సెక్యూరిటీలను ఫెడరల్ రిజర్వ్ కొనుగోలు చేస్తుంది. తద్వారా వ్యవస్థలోకి నిధులు పంపిస్తూ వడ్డీరేట్లను తక్కువ స్థాయిల్లో ఉండేట్లు చేస్తుంది. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ నెలకు 3,000 కోట్ల డాలర్ల మేర సెక్యూరిటీలను కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి దీనిని నెలకు 1,500 కోట్ల డాలర్లకు తగ్గించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయనున్నది. కాగా 2020లో మాత్రం ఫండ్స్ రేట్ 2.6 శాతానికి పెరగవచ్చని అంచనా. మరింత స్పష్టత... ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని, అప్పుడు పాలసీ మార్పుపై కూడా స్పష్టత వస్తుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించారు. రేట్ల పెంపు విషయమై నిర్ణయం తీసుకోవడానికి మరింత ఓపికతో ఎదురుచూస్తామని ఆయన మరోసారి పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మంచి స్థాయిలో ఉందని, ఆర్థిక వ్యవస్థ అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని పావెల్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికా–చైనాల మధ్య చర్చలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ తదితర అంశాలు సమస్యాత్మకంగానే ఉన్నాయని, వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని వివరించారు. 2018లో భారీగా పన్నులు తగ్గించడం, ప్రభుత్వ వ్యయం పెంచడం వల్ల వృద్ధి పుంజుకుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో కుటుంబాల వ్యయాలు తగ్గడం, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ఏడాది రేట్లను పెంచకూడదని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించిందని నిపుణులు అంటున్నారు. గతేడాది 3 శాతంగా ఉన్న అమెరికా వృద్ధి ఈ ఏడాది 2.1 శాతానికే పరిమితం కావచ్చని ఫెడరల్ రిజర్వ్ అంచనా వేస్తోంది. నిరుద్యోగ రేటు 3.7 శాతంగా, ద్రవ్యోల్బణం 1.8 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను వెలువరించింది. మార్కెట్లకు బూస్ట్.... ఫెడ్ ప్రకటన వెలువడగానే బుధవారం అమెరికా స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. కానీ చివరకు ఆ లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి. గురువారం హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు, డ్యాక్స్ మినహా మిగిలిన యూరప్ మార్కెట్లు కూడా మంచి లాభాల్లో ట్రేడయ్యాయి. గురువారం అమెరికా మార్కెట్లు కూడా మళ్లీ పుంజుకుని భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఊ ఫెడ్ తాజా నిర్ణయాలు మన మార్కెట్లపై బాగానే ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాల ప్రకారం... శుక్రవారం భారత్ స్టాక్ సూచీలు భారీగా లాభపడే అవకాశాలున్నాయి. ► ఫెడ్ నిర్ణయంతో డాలర్ ఇప్పటికే పడిపోయింది. దీంతో రూపాయి మరింతగా పుంజుకోవచ్చు. ► ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండగలదన్న ఫెడ్ అంచనాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. బంగారం ధరలు పెరుగుతాయి. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే తదుపరి జూన్ రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు ద్రవ్యోల్బణం ఫెడ్ టార్గెట్ రేటు కంటే తక్కువగానే ఉంది. కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేటు
-
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేటు
ముంబై: అంచనాలకు తగ్గట్టుకుగానే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన పాలసీ రివ్యూలో యథాతథ పాలసీ అమలుకే మొగ్గుచూపింది. రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 6 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రకటించారు. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.25 వద్దే కొనసాగనుంది. అయితే రివర్స్ రెపోను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్ పెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు రివర్స్ రెపో 0.25 శాతం పెంపుతో ఇది 6 శాతంగా ఉండనుంది. ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి నిర్ణయాలను ప్రకటించింది. దీంతో ద్వైమాసిక పాలసీ సమీక్షలో భాగంగా ఎంఎస్ఎఫ్ రేటును 6.25 శాతానికి తగ్గించింది. -
ఆశలు ఆవిరి.. ఎక్కడి రేట్లు అక్కడే
-
ఆశలు ఆవిరి.. ఎక్కడి రేట్లు అక్కడే
మెజారిటీ విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాకింగ్ న్యూస్ ప్రకటించారు. కీలక రెపో రేటులో ఎలాంటి కోత లేదని వెల్లడిస్తూ మార్కెట్ వర్గాలకు, విశ్లేషకులకు షాకిచ్చారు. రెండు రోజుల సమీక్ష నేపథ్యంలో నిన్న సమావేశమైన ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. రెపో రేటును ఏ మాత్రం మార్చకుండా ఇంతకుముందున్న 6.25 శాతాన్ని అలాగే ఉంచారు. రెపోతో పాటు రివర్స్ రెపో రేటులోనూ ఎలాంటి మార్పు చేయలేదు. రివర్స్ రెపో రేటునూ 5.75శాతంగానే ఉంచారు. మానిటరీ కమిటీలోని ఆరుగురు సభ్యులు రేట్ల కోతకు మొగ్గుచూపలేదని ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్దకు భారీగా చేరిన డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని అదుపులోకి ఉంచడానికి 100 శాతం పెంచిన ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం విడుదలైన మొదటి పాలసీ సమీక్ష కావడంతో ఈ పాలసీపై మార్కెట్లు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థపై పడే ప్రభావాన్ని నిరోధించడానికి ఆర్బీఐ కచ్చితంగా రేట్లలో కోత పెడుతుందని అంచనావేశారు. కొందరు 0.25 శాతంగా, మరికొందరు 0.50 శాతంగా ఈ రేటు కోత ఉంటుందని భావించారు. కాని వీరి అంచనాలన్నీ తలకిందులు చేస్తూ రెపో, రివర్స్ రెపోలను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ పాలసీపై భారీ ఆశలు పెట్టుకున్న మార్కెట్లు, రేట్లు యథాతథమని ప్రకటన వెలువడగానే కుప్పకూలాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కుప్పకూలి, 26,190వద్ద, నిఫ్టీ సైతం 50 పాయింట్లు క్రాష్ అయి 8092వద్ద కొనసాగుతోంది. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ తన చివరి ద్రవ్యపరపతి పాలసీ సమీక్షలో ఎలాంటి సర్ప్రైజ్ లు లేకుండా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించారు. మెజార్జీ నిపుణులు భావించిన మాదిరిగానే రాజన్ నిర్ణయం వెలువడింది. ఎలాంటి మార్పులు చేయని కీలక వడ్డీ రేట్లు రెపో 6.50 శాతంగా, రివర్స్ రెపో 6 శాతంగా, సీఆర్ఆర్ను 4శాతంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజన్‌కు ఇదే చివరి పరపతి విధాన సమీక్షా సమావేశం కానున్న నేపథ్యంలో మంగళవారం నాటి విధాన సమీక్షపై మార్కెట్ వర్గాలు, విశ్లేషకులు ఎక్కువగా దృష్టిసారించారు. రాజ్యసభ, లోక్‌సభలు ఆమోదించిన ఏకీకృత వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో బిజినెస్ సెంటిమెంట్ పెరుగుతుందని, పెట్టుబడులు మరింతగా ఆకర్షించవచ్చని రాజన్ చెప్పారు. అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారని తనపై ఆరోపణలు చేస్తున్న విమర్శకుల గురించి తానేమీ మాట్లాడదలుచుకోలేదని... ప్రజలనుంచి తనకు పూర్తి మద్దతు ఉందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌గా తనకు ఆఖరిక్షణం వరకూ అంతా పాజిటివ్ అనుభూతే కలగాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇదే తన చివరి పాలసీ కావడంతో తనకున్న తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని ద్రవ్య పరపతి సమీక్షలో వెల్లడించారు. అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారన్న విమర్శల వల్ల చివరి పాలసీలో రేట్లకు కొంత మేర కోత పెట్టొచ్చని కొందరు ఆర్థికనిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే ఎవరిని ఎలాంటి ఆశ్చర్యానికి లోనుచేయకుండా ముందటి పాలసీ మాదిరిగానే కీలక రేట్లలో ఎలాంటి మార్పుల చేపట్టలేదు. మరోవైపు రాజన్‌కు, ఆర్బీఐకు ఇదే చివరి ద్రవ్య పరపతి సమీక్ష. వచ్చే పాలసీ నిర్ణయం ప్రభుత్వం నియమించే మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించనుంది. తదుపరి సమీక్షా సమావేశం అక్టోబర్ 4న జరగనుంది. -
రూ. 31 వేల చేరువలో పసిడి
ముంబై: అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన బులియన్ మార్కెట్ కు తీపి కబురు అందించింది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటనతో సానుకూలంగా స్పందించింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి మెరుపులు మెరిపిస్తోంది. బుధవారం నష్టాల్లోకదలాడిన పుత్తడి ధరలు ఫెడ్ ప్రకటనలతో పరుగులు పెడుతూ భారీ లాభాలతో దూసుకుపోతోంది. దాదాపు 500 రూ. కు పైగా లాభపడింది. ప్రస్తుతం 526 రూపాయల లాభంతో 30,970 దగ్గర ట్రేడవుతూ 31 వేల మార్క్ కు చేరువలో ఉంది. అటు డాలర్ తో పోలిస్తూ భారత కరెన్సీ రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ బలహీనపడి నేల చూపులు చూస్తూ వుండడంతో రూపాయి క్రమేపీ బలపడుతోంది. కాగా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని ఫెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినట్టు తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.అయితే వడ్డీ రేట్ల పెంపు ఎపుడు ఉంటుందున్నది పేర్కొనలేదు.