ముంబై : ఆర్థిక మందగమనం నేపథ్యంలో వడ్డీరేట్లలో కోత విధిస్తారనే అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.15 శాతంగానే కొనసాగించాలని నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ నిర్ణయించింది. అక్టోబర్ మాసంలో జరిగిన పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు కుదించి 5.15 శాతానికి తగ్గించింది. మరోవైపు తాజా భేటీలో 4.9 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటులోనూ ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. స్వల్ప కాలానికి వేచిచూసే ధోరణిలో వ్యవహరించేందుకే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ మొగ్గుచూపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment