యథాతథంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేటు
ముంబై: అంచనాలకు తగ్గట్టుకుగానే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన పాలసీ రివ్యూలో యథాతథ పాలసీ అమలుకే మొగ్గుచూపింది. రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 6 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రకటించారు.
వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.25 వద్దే కొనసాగనుంది. అయితే రివర్స్ రెపోను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్ పెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు రివర్స్ రెపో 0.25 శాతం పెంపుతో ఇది 6 శాతంగా ఉండనుంది.
ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి నిర్ణయాలను ప్రకటించింది. దీంతో ద్వైమాసిక పాలసీ సమీక్షలో భాగంగా ఎంఎస్‌ఎఫ్ రేటును 6.25 శాతానికి తగ్గించింది.