![Petrol Price Hiked By Up To 16 Paise Per Litre In Metros, Diesel Price Unchanged - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/14/petrole.jpg.webp?itok=girfSN3B)
సాక్షి, ముంబై : పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసల చొప్పున ఎగిసింది. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెంట్ ఫూచర్స్ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. బుధవారం రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పది రోజుల్లో పెట్రోలు ధర 85 పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్‌కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది.
హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.16, డీజిల్ ధర 71.80
విజయవాడ : పెట్రోలు ధర రూ. 77.40, డీజిల్ ధర 70.76
ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర 65.79
కోలకతా: పెట్రోలు ధర రూ. 76.15, డీజిల్ ధర 68.2
చెన్నై : పెట్రోలు ధర రూ. 76.34 డీజిల్ ధర 69.54
ముంబై : పెట్రోలు ధర రూ. 79.12, డీజిల్ ధర 69.01
Comments
Please login to add a commentAdd a comment