Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్‌ను అందుకున్నాయి.
వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది.
దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్‌లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!.
ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment