petrol rates
-
దెబ్బకు దిగొచ్చిన ప్రైవేటు బంకులు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌ను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్ బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు ఏడాది తర్వాత మార్కెటింగ్ ధరలను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం ఇవి ప్రభుత్వరంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ పెట్రోల్ బంకులతో పోలిస్తే కాస్త అధిక రేట్లకే అమ్మకాలు సాగించాయి. అయినా కానీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే గణనీయ నష్టాలను చవిచూశాయి. దీనికి కారణం ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏడాదికి పైగా ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో రిలయన్స్–బీపీ, నయారా ఎనర్జీ, షెల్ సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలు అనుసరిస్తున్న మార్కెట్ ధరలకే విక్రయించడం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఆరు వారాల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో నష్టాలు కూడా తగ్గిపోవడంతో పీఎస్‌యూ పెట్రోల్ బంకుల్లో విక్రయించే రేట్లనే రిలయన్స్ బీపీ, షెల్, నయారా అనుసరిస్తున్నాయి. నయారాకు దేశవ్యాప్తంగా 86,855 పెట్రోల్ పంపులు ఉన్నాయి. మార్చి నెల నుంచే మార్కెట్ రేట్లకు విక్రయాలు మొదలు పెట్టింది. రిలయన్స్ బీపీ సంస్థకు 1,555 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈ నెల నుంచి డీజిల్‌ను మార్కెట్ ధరలకు (ప్రభుత్వరంగ సంస్థలు పాటించే) విక్రయాలు చేస్తోంది. రిలయన్స్ బీపీ సంస్థ ప్రత్యేకమైన డీజిల్‌ను మన దేశంలో విక్రయిస్తోంది. మన దేశ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మెరుగైన మేలేజీ వచ్చేలా అడిటివ్స్ కలిపి విక్రయిస్తోంది. -
చేతులెత్తేసిన శ్రీలంక సర్కార్.. అల్లాడుతున్న లంకేయులు
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్లో పోల్చిచే రూ. 275 ($1 = 275.0000 Sri Lankan rupees)కు చేరుకుంది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం. -
స్పెషల్ డిబేట్ ఆన్ పెట్రోల్ డీజిల్ రేట్స్
-
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్‌ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్‌పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్‌లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్‌కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్‌కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు!
సాక్షి, కనిగిరి(ప్రకాశం): ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో గురువారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్ సెంటర్లో కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పటించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అనుకోని ఘటనతో బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. విచారణలో యువకుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వాటి ధరలు తగ్గిస్తుందని.. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ చెప్పారు. -
సామాన్యుడిని భయపెడుతున్న చమురు, గ్యాస్ ధరలు
-
Petrol Diesel Prices: వాహనదారులకు ఊరట..స్థిరంగా ధరలు
దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఆల్ మోస్ట్ 2 నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇక మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 39సార్లు పెరగ్గా జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పెట్రోల్ - డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.105.15, డీజిల్ ధర రూ.97.78 ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.101.92, డీజిల్ ధర రూ.94.24 ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101, డీజిల్ ధర రూ.89.72 ముంబై పెట్రోల్ ధర రూ.107.20 డీజిల్ ధర రూ.97.29 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.35, డీజిల్ ధర రూ.92.81 -
డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
Petrol Diesel Prices ముంబై: ఇంధన ధరల్లో స్వల్ఫ ఊరట. డీజిల్ ధర లీటర్‌కు 15 నుంచి 17 పైసలు తగ్గింది. అయితే పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. సోమవారం లీటర్‌కు 25 నుంచి 34 పైసల చొప్పున పెరిగింది. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.97.33పై.గా ఉన్న లీటర్ డీజిల్ ధర.. ప్రస్తుతం 97.19పై.కి చేరింది. ఇక పెట్రోల్ మాత్రం రూ.107.24పై. చేరుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత డీజిల్ ధరలో తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం. మే 4 నుంచి పెట్రోల్ ధరపై ఇది 39వ పెంపు. ఇప్పటికే రాష్రా్టలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 16 చోట్ల పెట్రోల్ రేట్లు సెంచరీ దాటేశాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 105కి చేరుకోగా, లీటరు డీజిల్ స్వల్ఫంగా తగ్గి రూ.97.86పై. కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో.. పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. రాబోయే రోజుల్లో.. ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుండడంతో పెట్రో మంటలను అదుపు చేయలేకపోతున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ ‘కొత్త’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని, అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారాయన. -
‘కాంగ్రెస్ కారణంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి’
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ప్రజలు కరోనా వైరస్‌తోనే గాక పెరుగుతున్న నిత్యావసరల ధరలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూ సెంచరీనే దాటేసింది. తాజాగా పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన పనుల వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఆయిల్ బాండ్ల ద్వారా రూ.కోట్లు సమీకరించి, తిరిగి చెల్లించలేదని.. ఇప్పుడ తాము అసలు, వడ్డీ కడుతున్నామని తెలిపారు. ధరలు పెరిగేందుకు ఇది కూడా ముఖ్య కారణమనిచెప్పారు. అదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశానికి అవసరమయ్యే ఆయిల్ 80శాతం దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ నిరసనలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలపై కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. There has been a jump in crude oil prices in the international market. One of the main reasons behind the rise in fuel prices in India is that we have to import 80% of the oil we consume: Union Minister of Petroleum & Natural Gas, Dharmendra Pradhan pic.twitter.com/XMsOhRYMb6 — ANI (@ANI) June 23, 2021 చదవండి: ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు -
ఒక్క ఎస్ఎంఎస్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోండిలా?
గత కొంతకాలంగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. చమురు ధరలు ప్రతి రోజు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇంధన రేట్లను తెలియజేయడం కోసం స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎస్ఎంఎస్ సేవల ద్వారా దేశంలోని 41 ప్రాంతాలలో ఉన్న వినియోగదారులు క్షణాలలో మొబైల్లోనే రోజువారీ పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలను పొందటానికి వినియోగదారుడు 9224992249 నెంబర్ కు కంపెనీ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ నుంచి డీలర్ కోడ్ తెలుసుకోవాలి. ఉదా: హైదరాబాద్ - RSP 134483, విజయవాడ - RSP 127611, విశాఖపట్నం RSP 127290. ఇలా మీ ప్రాంత కోడ్ లను RSP 134483 అని టైపు చేసి 9224992249 నెంబర్ కు పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్సైట్లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ల జాబితాను క్రియేట్ చేసింది. చదవండి: కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్ విడుదల -
మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం వాహనదారుల జేబులకు చిల్లుపడుతుంది. సోమవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 84.95 రూపాయలకు చేరుకుంది. ముంబైలో లీటరుకు పెట్రోల్ ధర రూ.91.56గా ఉంది. హైదరాబాద్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై 26 పైసలు చొప్పున పెరగడంతో దీంతో లీటర్ ధర రూ.88.37కు, డీజిల్ ధర రూ.81.99గా ఉంది. పెరుగుతున్న ధరలను చూస్తుంటే త్వరలోనే హైదరాబాద్ లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటిపోయేలా కనిపిస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు జనవరి 7న పెట్రోల్‌కు 0.23 రూపాయలు, లీటరుకు 0.26 డీజిల్ పెంపును ప్రకటించడంతో గత 15 రోజుల్లో రెండవసారి ధరల పెంచారు. 2020 సంవత్సరం మధ్యలో పెట్రోల్ ధర మొదటిసారిగా లీటరుకు 80 రూపాయలకు చేరుకోగా.. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇంతకుముందు అక్టోబర్ 4, 2018న అత్యధికంగా నమోదైన పెట్రోల్ రేటు లీటరుకు 84 రూపాయలు. ఐఓసిఎల్ ధరల ప్రకారం పెట్రోల్ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నైలో రూ.87.63, కోల్‌కతాలో రూ.86.39కి చేరింది. ఇక డీజిల్ ధర ముంబయిలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది. -
18 రోజులు.. రూ.4 తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.05 తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.2.33 తగ్గింది. ఆదివారం నాడు లీటరు పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ ధర 17 పైసలు పతనమైంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 78.78, డీజిల్ ధర రూ.73.36 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ. 82.28, డీజిల్ రూ.76.88 వద్ద అమ్ముడవుతోంది. అక్టోబర్ 18 నుంచి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు, ఆగస్టు 16–అక్టోబర్ 4 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ.6.86, డీజిల్ ధర లీటరుకు రూ.6.73 పెరిగింది. -
ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం..!
న్యూఢిల్లీ: పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్క సారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్ స్వేచ్ఛ ఉంటుందని, ఇక ఓఎన్జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ భారాన్ని భరించాలని కేంద్రం అడగబోదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఇంధన ధరలు ఎగియడంతో కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో రూ. 1.50 ఎక్సయిజ్ సుంకాల తగ్గింపు రూపంలో ఉండగా, మిగతా రూ.1 భారాన్ని భరించాలంటూ చమురు కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇంధన రేట్లపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కేంద్రం ఈ విధమైన ఆదేశాలివ్వడంతో చమురు కంపెనీలకు (ఓఎంసీ) మళ్లీ సబ్సిడీల భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 5న రేట్లను తగ్గించినప్పటికీ.. ఆ తర్వాత ఇంధన రేటు మళ్లీ పెరుగుతూ పోవడంతో కేంద్రం మరోసారి ఓఎంసీలను ధర తగ్గించమని సూచించవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వీటిపై వివరణనిచ్చాయి. దీంతో గురువారం ఆయిల్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్ 19 శాతం, బీపీసీఎల్ 7 శాతం, ఐవోసీ 8 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో చివరికి హెచ్‌పీసీఎల్ షేరు సుమారు 15 శాతం పెరిగి రూ. 207.15 వద్ద, బీపీసీఎల్ 5 శాతం పెరుగుదలతో రూ. 278.65, ఐవోసీ 5 శాతం పెరిగి రూ. 131 వద్ద క్లోజయ్యాయి. పెట్రోల్ రేట్ల తగ్గింపు ప్రకటించినప్పట్నుంచీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీల షేర్ల ధరలు దాదాపు 20 శాతం దాకా క్షీణించాయి. -
బిగ్ రిలీఫ్
-
దేశంలో భగ్గుమంటున్న ఇంధన ధరలు
-
సెప్టెంబర్ 10న బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు
-
మోదీ పాలనలో సామన్యుడు బతికే పరిస్థితి లేదు
-
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
సాక్షి, విజయవాడ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు శనివారం ఆంధ్రప్రదేశ్ అంతటా ఆందోళనలు నిర్వహించాయి. విజయవాడలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. నగరంలోని పాతబస్టాండ్‌లో వామపక్ష శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి.. సామాన్యులకు ఉపశమనం కల్పించాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నేతలు మధు, రామకృష్ణలతోపాటు పార్టీ శ్రేణులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన.. గుంటూరు : పెట్రోలు ధరలు తగ్గించాలంటూ కమ్యూనిస్టులు గుంటూరులో ఆందోళన నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు : పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్ లా: మార్కాపురం కోర్టు సెంటర్ వద్ద వామపక్షాలు, ఇతర పార్టీల రాస్తారోకో, ఒంగోలు పట్టణంలో వామపక్షాల ఆందోళన కర్నూలు : పట్టణంలోని కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ఆందోళన. పశ్చిమ గోదావరి : వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద రాస్తారాకో.. పాల్గొన్న వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు. విజయనగరం : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలోని మయూరి జంక్షన్లో వామపక్షాల రాస్తారోకో -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి
న్యూఢిల్లీ : వరుసగా 16 రోజుల నుంచి వినియోగదారులకు వాతలు పెడుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఉపశమనం కల్పించాయి. దేశంలో అతిపెద్ద ఫ్యూయల్ రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంధన ధరలను తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర బుధవారం 60 పైసలు తగ్గి, రూ.77.83గా నమోదైంది. డీజిల్ ధర కూడా 56 పైసలు తగ్గి రూ.68.75గా రికార్డైంది. మిగతా నగరాల్లో కూడా లీటరు పెట్రోల్ ధర.. కోల్‌కత్తాలో రూ.80.47కు, ముంబైలో రూ.85.65కు, చెన్నైలో రూ.80.80కు, హైదరాబాద్‌లో రూ.82.45కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కోల్‌కతాలో రూ.71.30గా, ముంబైలో రూ.73.20గా, చెన్నైలో రూ.72.58గా, హైదరాబాద్‌లో రూ.74.73గా రికార్డయ్యాయి. స్థానిక పన్నుల నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ ధరలు వేరువేరుగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగుస్తూనే సరికొత్త స్థాయిలను తాకుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ ధరలు రికార్డు గరిష్టాలకు కూడా చేరకున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న ఈ ధరలు, గత 16 రోజుల నుంచి మళ్లీ చుక్కలు చూపించడం ప్రారంభించాయి. ఇంధన ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ ధరల పెంపుకు అడ్డుకట్ట వేసేందుకు తాము దీర్ఘకాలిక పరిష్కారాన్ని వెతుకుతామని ఓ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరలు తగ్గించినట్టు తెలిసింది. ఇంధన సరఫరాపై విధించిన ఆంక్షలను తొలగించి, సరఫరాను పెంచుతామని రష్యా చెప్పడంతో, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 60 పైసలు కాదా? ఒక్క పైసా మాత్రమేనా..! అయితే నిన్నటికీ నేటికి పెట్రోల్ ధర 60 పైసలు, డీజిల్ ధర 56 పైసలు తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలుత చూపించిన డేటాలో మార్పులు చోటు చేసుకున్నట్టు తెలిసింది. గంటల వ్యవధిలోనే ఈ ధర తగ్గింపు కేవలం 1 పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. 1 పైసా అయినా.. 60 పైసలు అయినా.. ధరలు మాత్రం అవేనని తెలిపింది. -
పెట్రో రికార్డు
సాక్షి, సిటీబ్యూరో : దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డీజిల్ ధరలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా...పెట్రోల్ ధరలో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఐదేళ్ల క్రితం నాటి పెట్రోల్ ధర ఆల్‌టైమ్ రికార్డును ఏపీ గత పదిరోజుల క్రితమే అధిగమించగా.. తాజాగా హైదరాబాద్ అధిగమించింది. పెట్రో ఉత్పత్తుల ధరల రోజువారీ సవరణ ప్రక్రియ అనంతరం తొలిసారిగా గత పక్షం రోజుల నుంచి రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వరసగా 19 రోజులు పెట్రోల్ ధరల ఉత్పత్తుల ధరల సవరణ జోలికి వెళ్లని చమురు సంస్థలు పోలింగ్ ముగియగానే విజృంభించాయి. దీంతో ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. ఆల్‌టైం రికార్డు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013 సెప్టెంబర్ నెలలో పెట్రోల్ లీటర్ ధర రూ.83.07తో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించగా.. తాజాగా మంగళవారం నాటికి రూ.83.08కు చేరి రికార్డును బ్రేక్ చేసింది. ఏపీలో మాత్రం గత పదిరోజుల క్రితమే ఆల్‌టైమ్ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.86.24 పైసలకు చేరింది. ఇక డీజిల్ ధర గత నెల రోజుల క్రితమే ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి దేశంలోనే టాప్‌గా మారా యి. ప్రస్తుతం ఆమరావతిలో డీజీల్ లీటర్ ధర రూ 76.57, హైదరాబాద్‌లో 75.54కు చేరింది. మరో పక్షం రోజులపాటు ధరల దూకుడు ఇలాగే ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పన్నులు అధికమే... పెట్రో ధరలపై పన్నుల మోత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల వడ్డింపు ఉంది. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్ను పోటే ఉంది. వాస్తవంగా పెట్రోల్, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగుతోంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48 పైసలు, డీజిల్‌పై రూ.17.33 పైసలు వడ్డింపు విధిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాట్ కింద పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం పన్ను విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై నాలుగు రూపాయలు అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 30.71 శాతం పడుతోంది. మెట్రో నగరాల్లో ధరలు ఇలా.. పెట్రోల్ (లీటర్) డీజిల్ (లీటర్) ముంబయి రూ. 86.24 రూ.73.79 అమరావతి రూ. 84.61 రూ.76.57 చెన్నై రూ.81.43 రూ. 73.18 హైదరాబాద్ రూ.83.08 రూ.75.34 కోల్‌కతా రూ.81.06 రూ.71.86 బెంగళూరు రూ. 79.71 రూ.70.50 న్యూఢిల్లీ రూ.78.43 రూ.69.31 హైదరాబాద్‌లో ధరల దూకుడు ఇలా నెల పెట్రోల్ డీజిల్ (లీటర్) మే–2018 83.08 75.34 ఏప్రిల్– 2018 78.08 70.16 మార్చి– 2018 75.79 67.63 ఫిబ్రవరి– 2018 77.36 69.65 జనవరి–2018 74.09 64.86 డిసెంబర్–2017 73.29 63.44 నవంబర్–2017 73.20 62.72 అక్టోబర్– 2017 74.93 64.02 సెప్టెంబర్–2017 73.34 62.06 ఆగస్టు–2017 69.24 60.38 జూలై–2017 69.02 58.08 -
‘మోదీ తరహాలోనే కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు గరిష్టంగా ధరలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014లో యూపీఏ సర్కార్ అధికారంలో ఉండగా అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరిగాయని తెలిసినా.. పెట్రో ధరలు అదుపు చేయడంలేదని బీజేపీ నిరసనలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రో ధరలు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై మోదీ తరహాలోనే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ పెట్రో ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు వేస్తోందని ఆరోపించారు. పెట్రోల్‌పై 35.2శాతం, డీజిల్‌పై 25శాతం రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోందని పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో టాక్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరలు తగ్గించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేయాలని సూచించారు. గోవా, మిజోరాం, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలలో కంటే తెలంగాణలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్ను వేస్తున్నారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల పెంపుపై మోదీకి వ్యతిరేకంగా ఎలా అయితే నిరసన చేస్తున్నామో రాష్ట్రంలో కూడా అలాంటి నిరసనలే చేయాలని శ్రావణ్ పిలుపునిచ్చారు. -
పెట్రో మంట
-
పెట్రో మంటల్లో ఏపీ టాప్