పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలి | Left parties Protest against Petrol Rates | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 2:14 PM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

Left parties Protest against Petrol Rates - Sakshi

సాక్షి, విజయవాడ : భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు శనివారం ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఆందోళనలు నిర్వహించాయి. విజయవాడలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. నగరంలోని పాతబస్టాండ్‌లో వామపక్ష శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించి.. సామాన్యులకు ఉపశమనం కల్పించాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నేతలు మధు, రామకృష్ణలతోపాటు పార్టీ శ్రేణులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన..
గుంటూరు : పెట్రోలు ధరలు తగ్గించాలంటూ కమ్యూనిస్టులు గుంటూరులో ఆందోళన నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్‌లో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌
స్థంభించిపోయింది.
అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు.
నెల్లూరు : పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ప్రకాశం జిల్ లా: మార్కాపురం కోర్టు సెంటర్‌ వద్ద వామపక్షాలు, ఇతర పార్టీల రాస్తారోకో, ఒంగోలు పట్టణంలో వామపక్షాల ఆందోళన
కర్నూలు : పట్టణంలోని కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ఆందోళన.
పశ్చిమ గోదావరి : వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద రాస్తారాకో.. పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు.
విజయనగరం : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలోని మయూరి జంక్షన్‌లో వామపక్షాల రాస్తారోకో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement