గత కొంతకాలంగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. చమురు ధరలు ప్రతి రోజు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇంధన రేట్లను తెలియజేయడం కోసం స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎస్ఎంఎస్ సేవల ద్వారా దేశంలోని 41 ప్రాంతాలలో ఉన్న వినియోగదారులు క్షణాలలో మొబైల్లోనే రోజువారీ పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ సేవలను పొందటానికి వినియోగదారుడు 9224992249 నెంబర్ కు కంపెనీ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ నుంచి డీలర్ కోడ్ తెలుసుకోవాలి. ఉదా: హైదరాబాద్ - RSP 134483, విజయవాడ - RSP 127611, విశాఖపట్నం RSP 127290. ఇలా మీ ప్రాంత కోడ్ లను RSP 134483 అని టైపు చేసి 9224992249 నెంబర్ కు పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీ మొబైల్కు ఎస్ఎంఎస్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్సైట్లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ల జాబితాను క్రియేట్ చేసింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment