IOCL
-
బ్రాండన్ హాల్ గోల్డ్ అవార్డ్ విన్నర్స్.. టీఎమ్ఐ, ఐఓసీఎల్
సేవా షూర్ వీర్ లెర్నింగ్ & డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), TMI e2E అకాడమీ 'బ్రాండన్ హాల్ గోల్డ్' అవార్డు గెలుపొందాయి. ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్లెట్లలో కస్టమర్ సర్వీస్ అండ్ డెలివరీలను మెరుగుపరచడమే. బ్రాండన్ హాల్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ అవార్డును లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్‌లో ఆస్కార్ అని పిలుస్తారు. సేవా షూర్వీర్ ప్రోగ్రామ్ IOCL పెట్రోల్ సర్వీస్ స్టేషన్లలో కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది. ఇండియన్ ఆయిల్ రిటైల్ అకాడమీకి భాగస్వామిగా సేవా షూర్ వీర్ ప్రాజెక్ట్ కోసం బ్రాండన్ హాల్ ఎక్సలెన్స్ గోల్డ్ అవార్డును గెలుచుకోవడం చాలా గౌరవంగా ఉందని టీఎమ్ఐ గ్రూప్ సీఈఓ బీ. రామకృష్ణన్ వెల్లడిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు వెల్లడించారు. బ్రాండన్ హాల్ అవార్డు పనిలో మా అత్యున్నత స్థాయిని సూచిస్తుందని చైర్మన్ మురళీధరన్ అన్నారు. -
ఒక్క నిర్ణయం.. ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, పెరుగుతున్న వాహనాలకు కావలసినన్ని 'ఛార్జింగ్ స్టేషన్స్' మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (TPEVCSL).. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పవర్ అనుబంధ సంస్థ TPEVCSL దేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచడానికి IOCLతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయనున్నాయి. త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా.. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే, సేలం-కొచ్చి హైవే, గుంటూరు-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై ఉన్న 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' అవుట్లెట్లలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, 'టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్' యాప్ ద్వారా లేదా 'ఇండియన్ ఆయిల్ ఈ-ఛార్జ్' మొబైల్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చని టాటా పవర్ బిజినెస్ డెవలప్మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ తెలిపారు. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి పెరుగుతున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 6000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు, వీటి సంఖ్యను 2024 నాటికి 10000 చేర్చడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్యలు దాదాపు తొలగిపోతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు
తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, డబ్బులు, బంగారం, నగలు చోరీ చేసిన ఘటనలు చూసే ఉంటాం. చైన్ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. జేబులోని పర్సులు, మొబైల్ విషయాల్లోనూ కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా అస్సలు ఉండలేదు. ఆయిల్‌ను దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా సొరంగం తవ్వేశాడు. పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో అనుమానం వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు సెప్టెంబర్ 29న పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆయిల్ దొంగిలిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపి ఆశ్చర్యపోయారు. మెయిన్ ఆయిల్ లైన్‌కు డ్రీల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి ప్లాస్టిక్ పైపులు పెట్టి ఆయిల్ దొంగతనం చేసేందుకు ఓ మిషన్‌ను అమర్చినట్లు గుర్తించారు. సొరంగం ద్వారా ఐఓసీఎల్ పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది. ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలోకి ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మీకు తెలుసా? టెస్లా బ్యాటరీలు ఇప్పుడు ఐవోసీఎల్ కేంద్రాల్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పెట్రోల్ పంపుల్లో టెస్లా పవర్ యూఎస్ఏ బ్యాటరీలను విక్రయించనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. విక్రయానంతర సేవలు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఐవోసీఎల్కు చెందిన 36,000 పైచిలుకు పంపుల్లో టెస్లా బ్యాటరీలు లభిస్తాయి. ‘బ్యాటరీ పంపిణీ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇది మొదటి జాతీయ స్థాయి భాగస్వామ్యం అవుతుంది. బ్యాటరీలు తొలుత ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఎంపిక చేసిన ఐవోసీఎల్ ఇంధన పంపుల వద్ద అందుబాటులో ఉంటాయి. తరువాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం’ అని టెస్లా పవర్ పేర్కొంది. ఇప్పటికే భారత్‌లో బ్యాటరీల విక్రయాలకు 5,000 పైచిలుకు పంపిణీ కేంద్రాలు ఉన్నాయని టెస్లా పవర్ యూఎస్ఏ ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు. ఈ ఏడాది వీటిని రెండింతలు చేస్తామన్నారు. ఐవోసీఎల్ చేరికతో పంపిణీ కేంద్రాల సంఖ్య 40,000 మార్కును దాటుతుందని వివరించారు. టెస్లా పవర్ యూఎస్ఏ వాహన, సోలార్ బ్యాటరీలు, హోమ్ యూపీఎస్‌లను, వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌తోపాటు యూఎస్ఏలో కార్యాలయాలు ఉన్నాయి. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్చి 1న పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర రూ.1,155 చేరింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు ఎగబాకింది. కాగా, ఇప్పటికే ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న వడ్డీ రేట్లు, నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగిన ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769 నుంచి రూ.2119.50కి చేరింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1052 నుంచి రూ.1102.5కి పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1079 నుంచి రూ.1129కి పెరిగింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1068.50 నుంచి రూ.1118.5కి చేరింది. -
పెట్రోల్‌పై లాభం.. డీజిల్‌పై నష్టం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 చొప్పున లాభాన్ని చూస్తున్నాయి. మరోవైపు లీటర్ డీజిల్ విక్రయంతో అవి రూ.6.5 నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నా కానీ అవి విక్రయ రేట్లను తగ్గించడం లేదు. ఎందుకంటే అంతకుమందు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో అవి రేట్లను ఒక దశ వరకు పెంచి, ఆ తర్వాత నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకున్నాయి. పైగా ఇప్పుడు డీజిల్‌పైనా నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్ రేటు దిగి రావడం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గత 15 నెలల నుంచి రేట్లను సవరించడం లేదు. ‘‘2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటర్ పెట్రోల్‌పై 17.4 నష్టపోగా, లీటర్ డీజిల్‌పై రూ.27.70 చొప్పున నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్–డిసెంబర్ కాలానికి వచ్చే సరికి అవి లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభం, లీటర్ డీజిల్‌పై నష్టం రూ.6.5కు తగ్గింది’’అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ మూడు ప్రభుత్వరంగ ఆయిల్ విక్రయ సంస్థలు రేట్లను సవరించడం నిలిపివేశాయి. చమురు బ్యారెల్ ధర 103 డాలర్ల నుంచి 116 డాలర్లకు పెరిగినప్పటికీ అవి రేట్లను యథాతథంగా కొనసాగించాయి. ఫలితంగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు సంస్థలు కలసి ఉమ్మడిగా రూ.21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. కానీ, ఈ నెల చమురు ధర 78 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అవి ఇక మీదట డీజిల్‌పైనా లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేటింగ్ లాభాలు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5–12.4 డాలర్లుగా ఉండడంతో మూడు కంపెనీలు తిరిగి ఆపరేటింగ్ లాభాల్లోకి ప్రవేశిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు ఐవోసీ రూ.2,400 కోట్ల ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు), బీపీసీఎల్‌కు రూ.1,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.800 కోట్ల ఎబిట్డా నమోదు చేస్తాయని పేర్కొంది. కాకపోతే నికరంగా నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది. ఐవోసీ రూ.1,300 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.600 కోట్లు చొప్పున నష్టాలను నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కరోనా ఆరంభంలో 2020లో మైనస్‌కు పడిపోవడం గమనార్హం. అక్కడి నుంచి రెండేళ్లలోనే 2022 మార్చి నాటికి బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరి, 14 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం చమురు ధరలకు ఆజ్యం పోసిందని చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లో మాంద్యం, చైనాలో వృద్ధి మందగమనం పరిస్థితులతో డిమాండ్ తగ్గి తిరిగి ధరలు దిగొస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో 90 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఇవి ఇంతకాలం పాటు రేట్లను సవరించకుండా ఉండడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ఇక దేశమంతటా పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!
ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతుండటంతో ఈవీ ఇన్ఫ్రా సెక్టార్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దేశమంతటా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలను మొదలుపెట్టాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్), మరో రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాబోయే 3-5 ఏళ్లలో 22,000 ఎలక్ట్రిక్ వేహికల్(ఈవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ ఐఓసీఎ రాబోయే మూడేళ్లలో 10,000 ఇంధన అవుట్ లెట్లలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) రాబోయే ఐదేళ్లలో 7,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కూడా 5,000 స్టేషన్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. 2021 సీఓపీ26 వాతావరణ మార్పు సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం 2070 నాటికి ఉద్గారాలను సున్నాకు తగ్గించనున్నట్లు వివరించారు. అలాగే, భారతదేశం తన తక్కువ కార్బన్ శక్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు(జిడబ్ల్యు) పెంచాలని, 2030 నాటికి తన మొత్తం శక్తి అవసరాలలో 50 శాతం తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. (చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!) -
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఐఓసీఎల్ గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల వల్ల కొత్త వాహనం కొనలనుకునేవారు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక విషయం మాత్రం వారిని వెనుకడుగు వేసేలా చేస్తుంది. అదే ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ సమస్య. దేశంలో పెట్రోల్, డీజిల్ ఉన్న సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఈవీ కొనుగోలుదారులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఈవీ కొనుగోలుదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక శుభవార్త తెలిపింది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీల) కోసం 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేట్(ఐఓసీఎల్) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదిలోగా 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రాబోయే రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐఓసీఎల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏర్పడటంతో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. దీంతో అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈవీ తయారీదారుల సహకారంతో దేశంలో ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గత వారం, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్-సెక్టార్ ఇంటిగ్రేటెడ్ కంపెనీల్లో ఒకటైన టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. We will be setting up 10,000 EV charging stations in the next three years: SM Vaidya, Chairman, Indian Oil Corporation pic.twitter.com/XJNr5jcDMN — ANI (@ANI) November 3, 2021 (చదవండి: వన్‌ప్లస్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, స్పీడ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!) -
గ్రీన్‌పవర్ దిశగా అడుగులు వేస్తున్న ఐవోసీఎల్..!
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తన రిఫైనరీ కేంద్రాలలో గ్రీన్ పవర్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు రిఫైనరీ కేంద్రాల్లో గ్రీన్ పవర్‌తో ఫ్యూయోల్ ఎక్స్పన్షన్ చేయనుంది. గ్రీన్ పవర్‌ను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని ఐవోసీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 నాటికి సుమారు 500,000 బ్యారెల్ పర్ డేకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ పవర్‌ను ఉపయోగించడంతో కొన్ని భాగాల మానుఫ్యాక్చరింగ్లో డీకార్బోనైజ్ చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మధుర శుద్ధి కర్మాగారంలో 1.6 లక్షల బీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను నిర్మించాలని ఐవోసీఎల్ యోచిస్తోంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రాజస్థాన్‌లో పవన విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉంది. విద్యుద్విశ్లేషణ ద్వారా పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి మథుర శుద్ధి కర్మాగారానికి ఉపయోగించనున్నట్లు పేర్కొంది. సౌర, పవనశక్తి వంటి పునరుత్పాదాకాలను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ వాడకంతో రిఫైనరీలో ఉపయోగించే కార్బన్-ఉద్గార ఇంధనాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిఫైనింగ్,ఇంధన రిటైలింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనుందని తెలిపింది. వచ్చే పదేళ్లలో ఐవోసిఎల్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి వైద్య చెప్పారు. -
మార్కెట్లోకి కొత్త బంకులు.... పెట్రోలు ధర తగ్గేనా ?
న్యూఢిల్లీ: ఆటో ప్యూయల్ మార్కెట్లో కొత్త పోటీకి కేంద్రం తెర లేపింది. ఇప్పటి వరకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ కంపెనీలకు పోటీగా మరి కొన్ని సంస్థలను మార్కెట్లోకి ఆహ్వానించింది. కొత్త ప్లేయర్లు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు కంపెనీలకు అనుమతులు జారీ చేసింది కేంద్రం. 2019లో మార్కెట్ ఫ్యూయల్ ట్రాన్స్‌పోర్టేషన్ నిబంధనలకు సంబంధించిన నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. అనుమతి పొందినవి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్, ఇథనాల్ వంటి ఆటో ఫ్యూయల్స్ అమ్మేందుకు కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియన్ మోలాసిస్ కంపెనీ (చెన్నై బేస్డ్), అస్సాం గ్యాస్ కంపెనీ, ఆన్సైట్ ఎనర్జీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్, రిటైల్‌గా పెట్రోలు, డీజిల్‌ను అమ్మడానికి అనుమతి ఉంటుంది. 100 బంకులు ఏడాదికి రూ. 500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన కంపెనీల నుంచి కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం బంకులను పూర్తిగా రిమోట్ ఏరియాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన కేంద్రం పొందు పరిచింది. వ్యాపారం జరిగేనా ఇంధన వ్యాపారానికి సంబంధించి కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో ఒక్క రిలయన్స్ ఇండస్ట్ట్రీస్‌కి తప్ప మరే కంపెనీకి దేశవ్యాప్తంగా నెట్వర్క్ లేదు. అస్సాం గ్యాస్ కంపెనీకి మౌలిక వసతులు ఉన్నా అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో చాలా వరకు బల్క్ ఫ్యూయల్ సెల్లింగ్‌కే అనుకూలంగా ఉన్నాయి. ధర తగ్గేనా ప్రస్తుతం ఆటో ఫ్యూయల్ విభాగంలో పోటీ నామామత్రంగా ఉంది. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ వంటి కంపెనీలు ఉన్నా ధరల్లో వత్యాసం లేదు. కొత్త ప్లేయర్లు మార్కెట్లోకి రావడం వల్ల ఫ్యూయల్ ధరలు ఏమైనా కిందికి దిగుతాయోమో చూడాలి. -
ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: దేశీయ ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర రూ.10 తగ్గింది. ఫీబ్రవరిలో వరుస పెరుగుల తర్వాత గ్యాస్ ధర స్వల్పంగా తగ్గడంతో గృహా వినియోగదారులకు కాసింత ఉపశమనం లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం సిలిండర్ ధర రూ.10 తగ్గించినట్లు పేర్కొంది. తగ్గిన ధరలు రేపటి(ఏప్రిల్ 1) నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ ధర రూ.871గా ఉంది. ఇక హైదరాబాద్ లో ఎల్పిజి సిలిండర్ ధర రూ.871.5 ఉంటే, విశాఖపట్నంలో రూ.826.5గా ఉంది. సమీప భవిష్యత్తులో ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్లపై ఆధారపడి ఉంటుంది. దేశీయ ఎల్పిజి సిలిండర్ల అమ్మకాలపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తి బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. చదవండి: ఇన్‌కం టాక్స్ వెబ్సైట్ క్రాష్! కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్ -
ఒక్క ఎస్ఎంఎస్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోండిలా?
గత కొంతకాలంగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. చమురు ధరలు ప్రతి రోజు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇంధన రేట్లను తెలియజేయడం కోసం స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎస్ఎంఎస్ సేవల ద్వారా దేశంలోని 41 ప్రాంతాలలో ఉన్న వినియోగదారులు క్షణాలలో మొబైల్లోనే రోజువారీ పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలను పొందటానికి వినియోగదారుడు 9224992249 నెంబర్ కు కంపెనీ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ నుంచి డీలర్ కోడ్ తెలుసుకోవాలి. ఉదా: హైదరాబాద్ - RSP 134483, విజయవాడ - RSP 127611, విశాఖపట్నం RSP 127290. ఇలా మీ ప్రాంత కోడ్ లను RSP 134483 అని టైపు చేసి 9224992249 నెంబర్ కు పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్సైట్లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ల జాబితాను క్రియేట్ చేసింది. చదవండి: కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్ విడుదల -
పెరిగిన వంట గ్యాస్ వినియోగం
కొద్దీ కాలం నుంచి ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుతన్న కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయువై) వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ వినియోగం పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ఒక నివేదికలో తెలిపింది. ఐఓసిఎల్ ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే మొత్తం దేశీయ ఎల్పీజీ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(ఫిబ్రవరి 21 వరకు) 10.3% వృద్ధిని నమోదు చేసినట్లు ‘ఐఓసీఎల్’ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం పీఎంయువై లబ్ధిదారులకు ఇచ్చిన మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ కారణమని పేర్కొంది. కోవిడ్-19 పాండమిక్ సమయంలో అట్టడుగున ఉన్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి పీఎంయువై లబ్ధిదారులకు మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశంతో "పీఎంయువై" పథకం కింద 8 కోట్ల 'ఎల్పీజీ' కనెక్షన్లను రూ.12,800 కోట్ల ప్రభుత్వ వ్యయంతో దేశమంతా లబ్ధిదారులకు అందజేసింది. మొత్తం రూ.9,670 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యాయి. లాక్డౌన్ కాలంలో 8 కోట్ల మంది లబ్ధిదారులు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 14 కోట్ల ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా పొందారు. చదవండి: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా! 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ -
మల్కాపూర్‌లో ఐఓసీ భారీ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్ – హైదరాబాద్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) పైప్‌లైన్ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ కొత్తగా నల్లగొండ జిల్లా మల్కాపూర్‌లో భారీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.611 కోట్ల పెట్టుబడులతో సుమారు 70 ఎకరాల్లో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు తెలిపారు. ‘‘ఈ టెర్మినల్‌లో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులు నిల్వ ఉంటాయి. దీని సామర్థ్యం 1.80 లక్షల కిలో లీటర్లు. ఒరిస్సాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి విశాఖపట్నం, అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు 1,200 కి.మీ. మేర డీఈఎఫ్ పైప్‌లైన్ ఉంటుందని’’ ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరణ ప్రణాళికల మీద బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 36 కోట్లతో ఎల్పీజీ ప్లాంట్ విస్తరణ.. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ మార్కెట్లో 39 శాతం మార్కెట్ వాటాతో ఐఓసీఎల్ మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం ఐఓసీఎల్‌కు చర్లపల్లిలో పెట్రోలియం టెర్మినల్, రామగుండంలో బల్క్ డిపోలు, చర్లపల్లి, తిమ్మాపూర్‌లో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల ఎల్పీజీ వార్షిక సామర్థ్యం 4100 మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఎల్పీజీ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో చర్లపల్లిలోని ఎల్పీజీ ప్లాంట్‌ను రూ.36 కోట్లతో విస్తరించనున్నామని తెలిపారు. దీంతో అదనంగా 2400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ కెపాసిటీ చేరుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా సీఎన్జీ స్టేషన్లు.. ప్రస్తుతం తెలంగాణలో ఐఓసీఎల్‌కు 1,100 రిటైల్ ఔట్‌లెట్లున్నాయి. 345 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. తెలంగాణలో 1.08 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లుంటే వీటిలో 44 లక్షల మంది ఇండియన్ గ్యాస్ కస్టమర్లే. ఇటీవలే కొత్తగా 1,478 రిటైల్ ఔట్లెట్లకు దరఖాస్తులను ఆహ్వానించాం. ఇందులో 52 ఔట్లెట్లను ఏర్పాటు చేశాం. త్వరలోనే మిగిలినవి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 13 సీఎన్జీ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 ఇంధనమే.. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలోని అన్ని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌ల్లో కేవలం భారత్ స్టేజ్ (బీఎస్)–6 పెట్రోల్, డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంటుందని, దీన్ని బీఎస్–4 వాహనాలకు సైతం వినియోగించవచ్చని శ్రవణ్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఎన్సీఆర్, ఆగ్రా నగరాల్లో కేవలం బీఎస్–6 ఇంధనాలను మాత్రమే సరఫరా చేస్తుంది. బీఎస్–6 ఇంధనం అల్ట్రా క్లీన్, నాణ్యత ప్రమాణాలను కలిగి ఉంటుందని.. దీంతో కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విష వాయువుల విడుదల ఉండవని ఆయన తెలిపారు. బీఎస్–4లో సల్ఫర్ 50 పీపీఎంగా ఉంటే.. బీఎస్–6లో 10 పీపీఎంగా ఉంటుందని పేర్కొన్నారు. -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్‌లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి. -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సర్కార్ రెండవ సారి కొలువుదీరిన తరువాత వరుసగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. సవరించిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.1.23 పైసలు పెంచింది. అలాగే నాన్ సబ్సీడీ సిలిండర్ ధరను రూ. 25 పెంచింది. అయితే విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను ప్రభుత్వం తగ్గించింది. సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1.23 పైసలు పెరిగింది. రాయితీలేని సిలిండర్ ధర రూ.25 పెరిగింది. సబ్సిడీదారులు సిలిండర్ ధరను చెల్లించిన తర్వాత సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో జమ అవుతాయి. కాగా ఎల్పీజీ ధర పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. -
సాగితే ప్రయాణం.. ఆగితే ప్రమాదం
కొత్తూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. స్థానిక ట్రాఫిక్, సివిల్ పోలీసులు, హైవే సిబ్బంది రోడ్డుపక్కన ఇష్టారాజ్యంగా నిలుపుతున్న వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో విలువైన ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు నిత్యకృత్యం మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులోని ఐఓసీఎల్(ఇండేన్ ఆయిల్ బాట్లింగ్ ప్లాంట్)కు చెందిన భారీ గ్యాస్ బుల్లెట్ వాహనాలను రోడ్డు పక్కనే నిలుపుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులతో పాటు ఆర్టీసీ, స్కూల్, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. అయితే, రోడ్డు పక్కనే నిలిపిన గ్యాస్ బుల్లెట్ వాహనాలను ఢీకొంటే.. ఆ ప్రమాద పరిస్థితిని ఊహించడం, నష్టాన్ని అంచనా వేయడం కష్టమే. వాహనాలను నిలుపుతున్న ప్రాంతానికి దగ్గరలో భారీగా గ్యాస్ నిల్వ ఉండే ప్రదేశం, పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయినప్పటికీ రోడ్డు పక్కన నిలుపుతున్న గ్యాస్ బుల్లెట్ వాహనాల గురించి అటు పోలీసులు ఇటు ప్లాంట్ ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగితే.. ఇక అంతే సంగతి కొత్తూరు మండల పరిధి తిమ్మాపూరు చెక్‌పోస్టు మొదలు షాద్‌నగర్ టోల్‌ప్లాజా వరకు విస్తరించి ఉంది. ఈ జాతీయ రహదారి కొత్తూరు, షాద్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఉంది. సుమారు 20 కిమీ మేర పొడవున్న ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, అక్కడక్కడా పరిశ్రమల సమీపంలో భారీ వాహనాలు ఇష్టానుసారంగా నిలుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్‌ప్లాజా సిబ్బంది, పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా ఫలితం శూన్యం. రాత్రుల్లో ప్రమాదకరంగా నిలిపి ఉంచిన వాహనాలను వెనుక నుంచి ఢీకొన్న ఘటనల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. పరిశ్రమల సమీపంలో.. తిమ్మాపూరు, కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జాతీయ రహదారిపై ఎక్కువగా కొలువుదీరడంతో సరుకుల లోడింగ్, అన్ లోడింగ్‌కు భారీ లారీలు వస్తాయి. ఈ వాహనాలను నిర్వాహకులు రహదారిపైనే నిలుపుతున్నారు. కొన్నిసార్లు ఆర్డర్లు రాకపోవడంతో రోజుల తరబడి అవి అలాగే నిలిపి ఉంటున్నాయి. తిమ్మాపూరు ఐఓసీఎల్ పరిశ్రమకు వచ్చే భారీ గ్యాస్ బుల్లెట్ వాహనాలను పదుల సంఖ్యలో జాతీయ రహదారి పైనే పార్కింగ్ చేస్తున్నారు. జరిగిన ప్రమాదాలు ఇవీ.. జాతీయ రహదారిపై లారీలను నిలిపి ఉంచడంతో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పోలీసులు కూడా దుర్మరణం పాలయ్యారు. నందిగామ శివారులో ట్రాక్టర్, లారీ ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం వెల్లిన ఓ ఏఎస్సై, కానిస్టేబుల్‌ను వెనుక నుంచి మరో లారీ ఢీకొంది ఈ ప్రమాదంలో ఏఎస్సై చనిపోగా.. కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపంతో తిమ్మాపూరు శివారులో ఆగిన కంటెయినర్‌ను వెనుక నుంచి వచ్చిన పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎంఎస్ఎన్ పరిశ్రమ ఎదురుగా నిలిపిన లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు పార్కింగ్‌ల ఇష్టారాజ్య పార్కింగ్తో జరుగుతున్నా పోలీసులు పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఐఓసీఎల్‌తో పాటు ఇతర పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల పరిధిలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేసుకునేలా చూస్తాం. అయినప్పటికీ మార్పు రాకుంటే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణ, రూరల్ సీఐ. షాద్‌నగర్ -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాదిలో రెండవసారి వినియోగదారులపై మళ్లీ వంటగ్యాస్ భారం పడింది. 14.2 కిలోల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ధరపై నామమాత్రంగా రూ. 25పైసలు, సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.5 చొప్పున పెరిగింది. సవరించిన ధరలు ఏప్రిల్ 1వ తేదీనుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ఒక ప్రకటన జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతోపాటు, కరెన్సీ మారకపు రేటు ఒడిదుడుకుల కారణంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రభావితమవుతున్నాయి. హైదరాబాద్‌లో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.762.35గా ఉంది. డిల్లీలో రూ.706. 50గా ఉంది. గత మూడు నెలలు (నవంబరునుంచి ఫిబ్రవరి దాకా) తగ్గుముఖం పట్టిన సిలిండర్ ధరలు మార్చి 1 తేదీన పెరుగుదలను నమోదు చేయగా, మళ్లీ ఏప్రిల్ నెలలో పెరిగాయి. మార్చి నెలలో సబ్సిడీ సిలిండర్ ధరను రూ.2.08, నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.42.50 పెంచిన సంగతి తెలిసిందే. అలాగే ఏవియేషన్ టర్బైన్ గ్యాస్(ఏటీఎఫ్ ఫ్యూయెల్) భారీగా పెంచింది. -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు రూ.53,558 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వారంలో రూ.15,379 కోట్లు గత వారంలో కేంద్రం రూ.15,379 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓ ద్వారా రూ.10,000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐకు ఉన్న వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడం ద్వారా రూ.5,379 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓకు మంచి స్పందన లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.38,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర బిడ్ చేశారు. గత ఏడాది జూన్‌లో ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,325 కోట్లు సమీకరించగలిగింది. షేర్ల బైబ్యాక్‌ల ద్వారా జోరుగా నిధులు... షేర్ల బైబ్యాక్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రూ.2,647 కోట్లు వచ్చాయి. అలాగే భెల్ నుంచి రూ.992 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.398 కోట్లు, కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి రూ.137 కోట్లు, ఎన్ఎల్సీ నుంచి రూ.990 కోట్లు, నాల్కో నుంచి రూ.260 కోట్లు, కేఐఓసీఎల్ నుంచి రూ.260 కోట్ల మేర నిధులు ప్రభుత్వానికి లభించాయి. హెచ్‌ఎస్‌సీసీలో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.285 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇక ఆఫర్ ఫర్ సేల్ విధానంలో కోల్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి రూ.5,218 కోట్లు లభించాయి. సీపీఎస్‌యూ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయం ద్వారా రూ.17,000 కోట్లు లభించాయి. ఇక ఐదు ప్రభుత్వ రంగ పీఎస్‌యూల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.1,700 కోట్లు కేంద్రం సమీకరించింది. రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓల ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. -
ఐఓసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ... బెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017–18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు చూస్తే... ► ప్రభుత్వానికి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన వాటిల్లో ఐవోసీఎల్ వాటా 13.37 శాతం, ఓఎన్జీసీ 12.49 శాతం, ఎన్టీపీసీ 6.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లాభదాయత పరంగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ► టాప్–10 లాభదాయక ప్రభుత్వ కంపెనీల్లో పవర్ ఫైనాన్స్ కూడా చోటు సంపాదించింది. ► ప్రభుత్వరంగంలో 184 కంపెనీలు లాభాలను నమోదు చేస్తే, ఈ లాభాల్లో 61.83 శాతం అగ్ర స్థాయి 10 కంపెనీలదే. ► 2017–18లో 71 ప్రభుత్వరంగ కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, మొత్తం నష్టాల్లో 84.71 శాతం టాప్–10 కంపెనీలవే ఉన్నాయి. ఇందులోనూ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ఇండియా ఉమ్మడి నష్టాలే 52.15 శాతం. ► భారత్ కోకింగ్ కోల్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ నష్టాలను ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 52 ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి మార్కెట్ క్యాప్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.15.22 లక్షల కోట్లు. ప్రభుత్వ ఖజానాకు రూ.3.5 లక్షల కోట్లు ఇక ప్రభుత్వరంగ సంస్థల ద్వారా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ప్రభుత్వ సర్వే తెలియజేసింది. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, డివిడెండ్ రూపంలో ఈ మొత్తాన్ని సమకూర్చాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో చూస్తే 2.98 శాతం తక్కువ. 2016–17లో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయం రూ.3.6 లక్షల కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క డివిడెండ్ రూపంలోనే రూ.76,578 కోట్లు సమకూరింది. క్యాజువల్, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10.88 లక్షల మందికి ప్రభుత్వరంగ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 11.35 లక్షల మందితో పోలిస్తే 4.14 శాతం తగ్గింది. కానీ, అదే సమయంలో వేతనాల బిల్లు రూ.1,40,956 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,621 కోట్లకు పెరిగింది. -
క్రీడాకారులకు ఐఓసీఎల్ సత్కారం
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సంస్థ గురువారం తమ సంస్థకు చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించింది. పలు టోర్నీల్లో ఐఓసీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 60 మంది భారత క్రీడాకారులను సన్మానించింది. ఈ కార్యక్రమంలో మేటి క్రీడాకారులైన మనికా బాత్రా, ఆచంట శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), పారుపల్లి కశ్యప్, ఎన్. సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్), ఆదిత్య తారే (క్రికెట్), ద్రోణవల్లి హారిక (చెస్) తదితరులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారుల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఐఓసీఎల్... ఈ సందర్భంగా కొత్త నిర్ణయాలను ప్రకటించింది. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించేలా నూతన క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నామని ఐఓసీఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ కె. రంజన్ మొహపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఐఓసీఎల్ 10 క్రీడలకు స్పాన్సర్షిప్ అందజేస్తుంది. వీటితో పాటు కొత్తగా వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, రెజ్లింగ్, కబడ్డీ క్రీడల్ని ఈ జాబితాలో చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రంజన్ తెలిపారు. వర్ధమాన ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కల్పిస్తూ, వారి ప్రతిభకు గుర్తింపుగా చిరు సత్కారాలతో గౌరవించడం వల్ల ఆటగాళ్లలో ప్రేరణ కలిగించవచ్చు అని ఆయన అన్నారు. ఈ ప్రేరణతో వారు దేశానికి, సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వారు కీర్తి ప్రతిష్టలు తెస్తారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐఓసీఎల్ తరఫున కోచింగ్, స్పోర్ట్స్ కిట్లను అందజేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
పెట్రోల్ 1 పైసా తగ్గింది
న్యూఢిల్లీ: వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తొలుత లీటర్‌కు 60 పైసల చొప్పున పెట్రో ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. గత ఏడాది జూన్‌లో రోజువారీ ధరల సవరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే భారీ తగ్గింపు. ఇలా ప్రకటించిన కొద్ది గంటలకే సాంకేతిక లోపం కారణంగా అలా వచ్చిందని.. వాస్తవానికి తగ్గించింది ఒక పైసా మాత్రమే అని చమురు సంస్థలు స్పష్టంచేశాయి. సాంకేతిక లోపం వల్లే..: ఐవోసీ తగ్గించిన మొత్తం 1 పైసానే అని, క్లరికల్ ఎర్రర్ కారణంగా మే 25 నాటి ధర.. బుధవారం నాటి ధరగా ప్రకటించామని, వాస్తవానికి తగ్గించింది ఒక పైసానే అని ఐవోసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఐవోసీ దీనిపై ఓ ప్రకటన చేసింది. ఒక పైసా తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.42కు, లీటర్ డీజిల్ ధర రూ. 69.30కి తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోందని, దీంతో దిగుమతుల ధర తగ్గుతుందని, దీని ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రో ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మే 12న కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి 16 రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 3.80.. డీజిల్ ధర లీటర్‌కు రూ.3.38 పెరిగింది. పిల్ల చేష్టలా ఉంది: రాహుల్ పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ప్రజలను వేళాకోళం చేయడానికి మోదీ ఈ ఐడియా వేయలేదు కదా అని ఎద్దేవా చేశారు. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉందని విమర్శించారు. ‘డియర్ పీఎం. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను మీరు ఒక పైసా తగ్గించారు. ఒక్క పైసానా..!?? ప్రజలను వేళాకోళం చేయడానికి మీరు వేసిన ఐడియా కాదు కదా ఇది. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉంది’ అని ట్వీట్ చేశారు. పెట్రో ధరలను రూ. 1 తగ్గించిన కేరళ తిరువనంతపురం: కేరళ సీఎం విజయన్ తమ రాష్ట్రంలో పెట్రో ధరలను లీటర్‌కు రూ. 1 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఈ తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.509 కోట్ల భారం పడుతుందని విజయన్ చెప్పారు. -
సొంతంగా ప్రిపేరయ్యా..
సాక్షి, మహబూబాబాద్: ‘ఎక్కడా కోచింగ్ తీసుకో లేదు.. అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రణాళిక ప్రకారం.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివి గేట్ ఇన్ ఇంజినీరింగ్ (గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించా’నని తెలిపాడు సౌరవ్ సింగ్. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరవ్ గేట్లో ప్రతిభ చాటాడు. తన ప్రిపరేషన్, భవిష్యత్ లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. గేట్లో మొదటి ర్యాంక్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నమ్మటానికి కొంచెం టైమ్ పట్టింది. ఒకటికి రెండుసార్లు రిజల్ట్ చూసుకున్నా. కుటుంబ నేపథ్యం.. బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్‌పూర్‌కు చెందిన విమల్సింగ్, పూనమ్‌సింగ్ నా తల్లిదండ్రులు. నాకు దివ్య, ప్రతిమ అక్కలు ఉన్నారు. నాన్న గ్రామంలో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. పెద్దక్క టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. రెండో అక్క సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రిపరేషన్ ఇలా... నిట్‌లో డాక్టర్ నర్సయ్య సార్ అందించిన ప్రోత్సాహం, నిట్ డైరెక్టర్, ఇతర ప్రొఫెసర్ల చొరవతోనే నంబర్‌వన్ ర్యాంకు సాధించా. గేట్ ప్రవేశపరీక్షకు సుమారు ఆరు నెలలు కష్టపడి చదివాను. ప్రతిరోజూ నాలుగు గంటలపాటు వివిధ పుస్తకాలను చదివే వాడిని. విషయ పరిజ్ఞానం కోసం అగ్లాసెమ్ వెబ్సైట్ చాలా తోడ్పడింది. సైట్లో గేట్లో విజయం సాధించిన ర్యాంకర్ల ఇంటరŠూయ్వలను పొందుపరిచారు. గత ఏడాది నంబర్‌వన్ ర్యాంకు సాధించిన నితీష్రాయ్ ఇంటరŠూయ్వ స్ఫూర్తినిచ్చింది. సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. సొంతగానే నోట్స్ తయారు చేసుకున్నా. ఐఓసీఎల్‌లో ఉద్యోగం చేస్తా.. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. గేట్లో ఆల్ ఇండియా లెవల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన నాకు ఎంటెక్ వైపు కాకుండా ఆయిల్, రీఫైనరీలో ఉద్యోగం చేయాలనుంది. ఆయిల్ కంపెనీల్లో పేరెన్నిక గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో ఉద్యోగం చేస్తా. ప్రస్తుతం ఐఓసీఎల్‌లో జాయిన్ అవుతా. నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తా.. నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. జేఈఈలో 20605 ర్యాంకు సాధించి నిట్ వరంగల్‌లో మెటలర్జికల్ విభాగంలో చేరాను. నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే ఆల్ ఇండియా నంబర్‌వన్ ర్యాంకు సాధించా. నాకు నంబర్‌వన్ ర్యాంకు అందించిన నిట్‌కు రుణపడి ఉంటా. నిరుపేదలకు ప్రోత్సాహం అందిస్తా. ఆర్థిక చేయూతనందిస్తా. వరంగల్ బ్యూటీపుల్ సిటీ. -
పోలీసులకే దిమ్మతిరిగే దొంగతనం
సాక్షి, న్యూఢిల్లీ : అతి తెలివి తేటలతో దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డట్లు వారి పనైంది. సాధారణంగా దొంగలు పెట్రోల్ చోరికి పాల్పడటం అరుదు. అలాంటివి జరిగినా ఏ బైక్‌ల నుంచో లేదంటే ఎవరూ లేని సమయంలో బంక్‌ల నుంచో దొంగతనం చేసిన సందర్బాలుంటాయి. కానీ, ఢిల్లీలో మాత్రం కొందరు దొంగలు ఏకంగా భూగర్భాన వెళుతున్న అతిపెద్ద పెట్రోల్ పైపు నుంచి పెట్రోల్ తోడేద్దామనుకున్నారు. చిన్నసొరంగంలాంటిదాన్ని తవ్వి పైపుకు కన్నం చేసి ఆయిల్ తీసే క్రమంలో కాస్త బాంబు పేలుడిలాంటి శబ్దంతో బద్దలైంది. వారి గుట్టుచప్పుడుకాకుండా చేద్దామనుకున్న పనికాస్త రట్టయింది. వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలోని కక్రోలాలో జూబీర్ అనే వ్యక్తి అయిల్ దొంగతరం చేయడానికి కొంతమందితో కలిసి ప్లాన్ చేసుకున్నాడు. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) కు చెందిన అండర్ గ్రౌండ్ పైపు లైన్‌ను తమ దొంగతనానికి ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఓ గది తీసుకొని అందులో నుంచి పైపులైన్‌కు సొరంగం లాంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయిల్ పైప్ లైన్‌కు గ్యాస్ కట్టర్ సహాయంతో పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పెట్రోలు దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే, ఇది పెద్ద పైపులైన్ కావడం, అందులో నుంచి తీవ్ర ఘాడత గల వాయువులు బయటకు రావడంవంటివి జరుగుతున్న క్రమంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటన జరగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం అర్థమైంది. అలాగే, దానికి దగ్గర్లో కొంత మేర ఇంధనం నింపిన ట్రక్‌ని కూడా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.