
కొద్దీ కాలం నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధరల పెరుగుతన్న కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయువై) వినియోగదారుల ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ఒక నివేదికలో తెలిపింది. ఐఓసిఎల్ ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే మొత్తం దేశీయ ఎల్‌పీజీ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(ఫిబ్రవరి 21 వరకు) 10.3% వృద్ధిని నమోదు చేసినట్లు ‘ఐఓసీఎల్’ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం పీఎంయువై లబ్ధిదారులకు ఇచ్చిన మూడు ఉచిత ఎల్‌పీజీ రీఫిల్స్ కారణమని పేర్కొంది.
కోవిడ్-19 పాండమిక్ సమయంలో అట్టడుగున ఉన్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి పీఎంయువై లబ్ధిదారులకు మూడు ఉచిత ఎల్‌పీజీ రీఫిల్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశంతో "పీఎంయువై" పథకం కింద 8 కోట్ల 'ఎల్‌పీజీ' కనెక్షన్లను రూ.12,800 కోట్ల ప్రభుత్వ వ్యయంతో దేశమంతా లబ్ధిదారులకు అందజేసింది. మొత్తం రూ.9,670 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యాయి. లాక్‌డౌన్ కాలంలో 8 కోట్ల మంది లబ్ధిదారులు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 14 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లను ఉచితంగా పొందారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment