ఐఓసీఎల్‌లో 362 అప్రెంటీస్‌ పోస్టులు | Apprentice 362 posts in IOCL | Sakshi
Sakshi News home page

ఐఓసీఎల్‌లో 362 అప్రెంటీస్‌ పోస్టులు

Published Wed, Jan 18 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

Apprentice 362 posts in IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌).. దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలోని మార్కెటింగ్‌ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్‌ అప్రెంటీస్‌షిప్‌ శిక్షణతోపాటు పైప్‌లైన్స్‌ డివిజన్‌లో టెక్నీషియన్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ప్రకటన జారీ చేసింది.

రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్టర్న్‌ రీజియన్‌–95, సదరన్‌ రీజియన్‌–89, వెస్టర్న్‌ రీజియన్‌–110, పైప్‌లైన్స్‌ డివిజన్‌–68.
సై్టపెండ్‌: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు రూ.7530; ట్రేడ్‌ అప్రెంటీస్‌కు రూ.6970.
విద్యార్హత: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా; ట్రేడ్‌ అప్రెంటీస్‌(ల్యాబ్‌ అసిస్టెంట్‌)కు బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్,
కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ).

గమనిక: పైన పేర్కొన్న కోర్సుల్లో పాసై 2016 డిసెంబర్‌ 1 నాటికి మూడేళ్లు దాటకూడదు. గతంలో శిక్షణ పొందినవారు/ఏడాది ఉద్యోగానుభవం గల వారు అనర్హులు.  
వయసు: మార్కెటింగ్‌ డివిజన్‌లోని పోస్టులకు 2016 డిసెంబర్‌ 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు ఉంటుంది. పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు వయసును లెక్కించేందుకు 2017 జనవరి 14ను కటాఫ్‌ డేట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.  

శిక్షణ వ్యవధి: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు 12 నెలలు; ట్రేడ్‌ అప్రెంటీస్‌కు 18 నెలలు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ్యలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వూ్యకి 15 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రతి అభ్యర్థి ఈ రెండు దశల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు జనరల్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం, ఇతరులు 35 శాతం మార్కులు పొందాలి.  

రాత పరీక్ష:
1. మార్కెటింగ్‌ డివిజన్‌లోని అప్రెంటీస్‌ పోస్టులకు: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటిని సంబంధిత డిసిప్లెయిన్‌; జీకే/అవేర్‌నెస్, రీజనింగ్‌/లాజికల్‌ ఎబిలిటీ సబ్జెక్టుల నుంచి రూపొందిస్తారు.

2. పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో 85 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఇందులో 60 ప్రశ్నలు సంబంధిత డిసిప్లెయిన్‌ నుంచి; మిగిలిన 25 ప్రశ్నలు జనరల్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిష్‌/హిందీ, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, జీకే నుంచి ఇస్తారు.

ఇంటర్వూ్య: పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ‘ఒక పోస్టుకు ముగ్గురు’ చొప్పున ఇంటర్వూ్యకి పిలుస్తారు.  
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ముఖ్య తేదీలు:
1. మార్కెటింగ్‌ డివిజన్‌లోని పోస్టులకు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభ తేది: ఫిబ్రవరి 1; చివరి తేది: ఫిబ్రవరి 13.
2. పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 13; రాత పరీక్ష తేది: మార్చి 5; ఇంటర్వూ్య తేదీలు: మార్చి 6, 7.   
వెబ్‌సైట్‌: www.iocl.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement