సేవా షూర్ వీర్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), TMI e2E అకాడమీ 'బ్రాండన్ హాల్ గోల్డ్' అవార్డు గెలుపొందాయి. ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్లలో కస్టమర్ సర్వీస్ అండ్ డెలివరీలను మెరుగుపరచడమే.
బ్రాండన్ హాల్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ అవార్డును లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ స్పేస్‌లో ఆస్కార్ అని పిలుస్తారు. సేవా షూర్‌వీర్ ప్రోగ్రామ్ IOCL పెట్రోల్ సర్వీస్ స్టేషన్‌లలో కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది.
ఇండియన్ ఆయిల్ రిటైల్ అకాడమీకి భాగస్వామిగా సేవా షూర్ వీర్ ప్రాజెక్ట్ కోసం బ్రాండన్ హాల్ ఎక్సలెన్స్ గోల్డ్ అవార్డును గెలుచుకోవడం చాలా గౌరవంగా ఉందని టీఎమ్ఐ గ్రూప్ సీఈఓ బీ. రామకృష్ణన్ వెల్లడిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు వెల్లడించారు. బ్రాండన్ హాల్ అవార్డు పనిలో మా అత్యున్నత స్థాయిని సూచిస్తుందని చైర్మన్ మురళీధరన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment