
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పెట్రోల్ పంపుల్లో టెస్లా పవర్ యూఎస్‌ఏ బ్యాటరీలను విక్రయించనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. విక్రయానంతర సేవలు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఐవోసీఎల్‌కు చెందిన 36,000 పైచిలుకు పంపుల్లో టెస్లా బ్యాటరీలు లభిస్తాయి.
‘బ్యాటరీ పంపిణీ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇది మొదటి జాతీయ స్థాయి భాగస్వామ్యం అవుతుంది. బ్యాటరీలు తొలుత ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఎంపిక చేసిన ఐవోసీఎల్ ఇంధన పంపుల వద్ద అందుబాటులో ఉంటాయి. తరువాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం’ అని టెస్లా పవర్ పేర్కొంది. ఇప్పటికే భారత్‌లో బ్యాటరీల విక్రయాలకు 5,000 పైచిలుకు పంపిణీ కేంద్రాలు ఉన్నాయని టెస్లా పవర్ యూఎస్‌ఏ ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు.
ఈ ఏడాది వీటిని రెండింతలు చేస్తామన్నారు. ఐవోసీఎల్ చేరికతో పంపిణీ కేంద్రాల సంఖ్య 40,000 మార్కును దాటుతుందని వివరించారు. టెస్లా పవర్ యూఎస్‌ఏ వాహన, సోలార్ బ్యాటరీలు, హోమ్ యూపీఎస్‌లను, వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌తోపాటు యూఎస్‌ఏలో కార్యాలయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment