Indian Oil
-
ఐవోసీ రూ.21,000 కోట్ల పెట్టుబడి
పట్నా: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. బిహార్‌లోని బరౌనీ రిఫైనరీ విస్తరణ, ఆ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు ఐవోసీ ఈడీ సుమన్ కుమార్ వెల్లడించారు.‘సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో బరౌని రిఫైనరీని పెట్రోకెమికల్ ప్లాంట్‌తో కలిపి ప్రస్తుత 6 మిలియన్ టన్నుల నుంచి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నాం. 27 నగరాల్లో ఆటోమొబైల్స్‌కు, గృహాలు, పరిశ్రమలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేయడానికి నెట్వర్క్ ఏర్పాటుకై మరో రూ.5,600 కోట్లు పెట్టుబడి పెడతాం. 2,00,000 టన్నుల తయారీ సామర్థ్యంతో పాలీప్రొఫైలిన్ కేంద్రాన్ని కూడా 2025 చివరినాటికి ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము? రూ.2 లక్షల కోట్ల కంటే అధిక పెట్టుబడి110 బిలియన్ డాలర్ల విలువైన ఐవోసీ..దూకుడుగా మూలధన విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రిఫైనింగ్ సామర్థ్యం, పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, అనుబంధ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఆస్తులను విస్తరించడానికి దశాబ్దంలో రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ‘ద ఎనర్జీ ఆఫ్ ఇండియా’గా సంస్థ 2050 నాటికి భారత ఇంధన అవసరాలలో 12.5 శాతం సమకూర్చడం ద్వారా ముందు వరుసలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు, గుజరాత్ రిఫైనరీని 13.7 మిలియన్ టన్నుల నుండి 18 మిలియన్ టన్నులకు విస్తరిస్తోంది. -
2047 నాటికి ఇంధన డిమాండ్ రెట్టింపు
దేశ ఇంధన డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశీయ డిమాండ్ 25 శాతం పెరుగుతుందన్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం)2024ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.‘ఎనర్జీ సెక్యూరిటీ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గణాంకాల ప్రకారం 2047 నాటికి భారత ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఇంధన డిమాండ్ గణనీయంగా 25 శాతం పెరుగుతుంది. నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మెరుగైన విధానాలు పాటించాలి. ఇథనాల్, హైడ్రోజన్, జీవ ఇంధనాలలో పురోగతి ద్వారా వికసిత్ భారత్ సాధనలో భాగం కావాలి. ఫాజిల్ ప్యూయెల్లో కలిపే జీవ ఇంధనం మిశ్రమం రేటు ప్రస్తుతం 16.9%కి చేరుకుంది. 2030 నాటికి ఇది 20% లక్ష్యాన్ని చేరాలనే లక్ష్యం ఉంది. కానీ షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ‘భారతదేశం 250 రూపాల్లోని ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ ప్రస్తుత ముడి చమురు శుద్ధి సామర్థ్యం 258 మిలియన్ మెట్రిక్టన్స్ పర్ యానమ్(ఎంఎంటీపీఏ)గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 310 ఎంఎంటీపీఏకి పెరుగుతుందని అంచనా’ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్‌పై స్పందిస్తూ 2027 నాటికి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 70 బిలియన్ డాలర్లు(రూ.5.81 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి.సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
ఇండియన్ ఆయిల్ చొరవ.. ఖైదీల జీవితాల్లో వెలుగు
జైలులో ఉన్న ఖైదీలు, బాలనేరస్థుల జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య , 'పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్' 8వ దశను, 'నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్' 5వ దశను ప్రారంభించారు.ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టిన ఈ రెండు కార్యక్రమాలు.. 22 జైళ్లు, జువైనల్ హోమ్‌లలో 1000 మందికి పైగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ఇండియన్ ఆయిల్ 23 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 మహిళా బాల్య కేంద్రాలతో సహా 150 సంస్థలలో 7300 మంది ఖైదీలకు స్పోర్ట్స్ కోచింగ్, పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉంది.పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్, నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్ ప్రారంభించిన సందర్భంగా ఇండియన్ ఆయిల్ చైర్మన్ మాట్లాడుతూ.. కార్పోరేట్ సంస్థల్లో ఇండియన్ ఆయిల్ అగ్రగామిగా నిలిచి జైలులో ఉన్న వారికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నాను. జైలు జీవితాలను గడిపిన వారు క్రీడల్లో రాణించేలా ప్రయత్నాలు సాగిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జైలు అధికారులు.. ఖైదీలు, బాలనేరస్థులు మెరుగైన జీవితాన్ని నిర్మించడంలో మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకోవడం గొప్ప విషయం. దీనికోసం ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు.ఇప్పటికే ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవతో.. ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) నిర్వహించిన ఖైదీల ఇంటర్కాంటినెంటల్ “చెస్ ఫర్ ఫ్రీడమ్” ఆన్లైన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పూణేలోని యెరవ్డా జైలులోని ఖైదీలు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఖైదీలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కారణంగా శ్రీకాంత్ మాధవ్ వైద్యకు ప్రపంచ చెస్ సమాఖ్య 'ఫ్రెండ్ ఆఫ్ ఫిడే" అనే ప్రతిష్టాత్మక బిరుదును అందించింది.‘పరివర్తన్-ప్రైజన్ టు ప్రైడ్’ కార్యక్రమం 2021 ఆగస్టు 15న ప్రారంభమైంది, అయితే ‘నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్’ను 2023 జనవరి 26న మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఖైదీలను క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఆయిల్ కంపెనీలకు చేదువార్త
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. షేర్లు డీలా... తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహంవిదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్పీఎస్పై మరింత పన్ను ప్రయోజనంనూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్పీఎస్ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు. ఈకామర్స్ ఎగుమతులకు దన్నుహబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్లను వీటికి జత చేస్తారు.డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.మధ్యంతర బడ్జెట్లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకతఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్సహా 15 నగరాల్లో ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. టెలికం పరికరాల దిగుమతులకు చెక్10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. సమతౌల్యత సాధన..ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.కీలక పురోగతి..ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అద్భుతమైనది ఏమీ లేదు..ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్వ్యవసాయానికి దన్నువ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.వృద్ధి ఆధారితంఅభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.సాహసోపేతందీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.మౌలిక రంగ పురోగతి లక్ష్యంవివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.ఉపాధి కల్పనకు ఊతంబడ్జెట్లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ -
రేసింగ్‌కు ప్రత్యేక ఇంధనం.. అంతర్జాతీయ ఈవెంట్లలో ఇండియన్ ఫ్యుయల్
దేశంలో రేసింగ్ కోసం ప్రత్యేక ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ తయారు చేసింది. ఎఫ్ఐఎం ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్ (ARRC) 2024 సీజన్ కోసం స్టోర్మ్ (STORM) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక రేసింగ్ ఇంధనాన్ని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు. రేసింగ్ సర్క్యూట్‌లోని ప్రీమియం సూపర్‌బైక్‌ల కోసం ఈ హై-ఆక్టేన్ అల్టిమేట్ రేసింగ్ ఫ్యూయల్‌ను ఇండియన్ఆయిల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేసింగ్ ఈవెంట్లలో ఛాంపియన్లకు ఇది ఇంధనంగా నిలుస్తుంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, డైరెక్టర్ (మార్కెటింగ్) సతీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ మొదటిసారిగా గుజరాత్ రిఫైనరీ నుంచి స్టోర్మ్ పేరుతో కేటగిరీ 2 రేస్ ఇంధనం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు. ఈ రేస్ ఇంధనం, ఏవీ గ్యాస్ 100 LL, రిఫరెన్స్ ఫ్యూయెల్స్ మొదలైనవాటితో పాటు కఠినమైన అంతర్జాతీయ స్పెసిఫికేషన్లకు కట్టుబడి స్వీయ-సమృద్ధి దిశగా భారత్ ప్రయత్నానికి అనుగుణంగా ఉంటుందన్నారు. పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్న ‘స్టోర్మ్’ ఇంధన ఆవిష్కరణ.. స్వావలంబన స్ఫూర్తికి, 'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇండియన్ ఆయిల్ ఇప్పటికే XP100, XP95 వంటి అధిక-ఆక్టేన్ ఇంధనాలను, అలాగే రిఫరెన్స్ గ్యాసోలిన్, డీజిల్ వంటి అధిక ఖచ్చితత్వ సముచిత ఇంధనాలను, ఏవియేషన్ ఇంధనం ఏవీ గ్యాస్ 100 LLలను విక్రయిస్తోంది. -
రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు
న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్‌తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్ ఆదాయం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ విదేశ్ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది. రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్ డాలర్ల డివిడెండ్ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, ఎండీ రంజిత్ రథ్ తెలిపారు. ఐవోసీ, భారత్ పెట్రో రీసోర్సెస్‌తో కలిపితే రావాల్సిన డివిడెండ్ 450 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. -
మీకు తెలుసా? టెస్లా బ్యాటరీలు ఇప్పుడు ఐవోసీఎల్ కేంద్రాల్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పెట్రోల్ పంపుల్లో టెస్లా పవర్ యూఎస్ఏ బ్యాటరీలను విక్రయించనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. విక్రయానంతర సేవలు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఐవోసీఎల్కు చెందిన 36,000 పైచిలుకు పంపుల్లో టెస్లా బ్యాటరీలు లభిస్తాయి. ‘బ్యాటరీ పంపిణీ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇది మొదటి జాతీయ స్థాయి భాగస్వామ్యం అవుతుంది. బ్యాటరీలు తొలుత ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఎంపిక చేసిన ఐవోసీఎల్ ఇంధన పంపుల వద్ద అందుబాటులో ఉంటాయి. తరువాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం’ అని టెస్లా పవర్ పేర్కొంది. ఇప్పటికే భారత్‌లో బ్యాటరీల విక్రయాలకు 5,000 పైచిలుకు పంపిణీ కేంద్రాలు ఉన్నాయని టెస్లా పవర్ యూఎస్ఏ ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు. ఈ ఏడాది వీటిని రెండింతలు చేస్తామన్నారు. ఐవోసీఎల్ చేరికతో పంపిణీ కేంద్రాల సంఖ్య 40,000 మార్కును దాటుతుందని వివరించారు. టెస్లా పవర్ యూఎస్ఏ వాహన, సోలార్ బ్యాటరీలు, హోమ్ యూపీఎస్‌లను, వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌తోపాటు యూఎస్ఏలో కార్యాలయాలు ఉన్నాయి. -
లక్షల కోట్లలో.. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూలు/పీఎస్ఈలు) నికర లాభం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 51 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, సెయిల్ అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 2020–21లో ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల నష్టం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.23వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు తగ్గింది. అంటే నష్టాన్ని 38 శాతం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ ఎక్కువ నష్టాలతో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల స్థూల ఆదాయం 2021–22లో రూ.31.95 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.24.08 లక్షల కోట్లుగా ఉండడం గమనించాలి. అంటే ఏడాదిలో 33 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా పెట్రోలియం రిఫైనరీ మార్కెటింగ్, ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్, పవర్ జనరేషన్ కంపెనీలే ఆదాయంలో 69 శాతం వాటా సమకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. 2021–22 సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన డివిడెండ్ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూ.73వేల కోట్లుగానే ఉంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు, డివిడెండ్, ఇతర సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2021–22లో రూ.5.07 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4.97 లక్షల కోట్లుగా ఉంది. ఇలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన టాప్–5 కంపెనీల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ ఒమన్ రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం ఉన్నాయి. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అర్హులైన కంపెనీలు చేసిన ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలకు చేయూతలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్ఎండీసీ, పవర్‌గ్రిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. -
బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ!
పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు ప్రజలపై భారంగా మారుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో సామాన్యులు నెలవారీ బడ్జెట్లో పొదుపు మంత్రం పాటించక తప్పట్లేదు. అందుకే పైసలు ఆదా చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కార్డు వాడకం ద్వారా 68 లీటర్ల ఉచిత పెట్రోల్, డీజిల్ పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని.. సిటీ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. కాకపోతే ఈ ఉచిత పెట్రోల్, డీజిల్ పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉంటాయని పేర్కొంది. 68 లీటర్ల ఇంధనం ఉచితం ఈ రోజుల్లో బైక్‌లు, కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ నెలా ఇంధన బిల్లుకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ పైసలను పొదుపు చేయాలంటే ఇలా చేయండి. ఈ సారి ఇంధన బిల్లులకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 7వేల ఆదా చేయవచ్చు. ఎలా అంటే.. ఈ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా కస్టమర్లు దీని నుంచి రివార్డ్ పాయింట్లను (టర్బో పాయింట్లు) పొందగలరు. ఈ పాయింట్లను రీడీమ్ చేయడం ద్వారా కార్డుదారులు సంవత్సరానికి 68 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్‌ని కొనుగోలు చేయవచ్చు. పాయింట్లు ఎలా వస్తాయ్ ► ఇండియన్ ఆయిల్ పంపుల వద్ద 1 శాతం ఇంధన సర్‌చార్జి మినహాయింపు. ► ఇండియన్ ఆయిల్ పంప్‌లలో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 4 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా గ్రోసరీలు, సూపర్ మార్కెట్లలో ఖర్చు చేసే రూ. 150కి 2 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా ఇతర కేటగిరీలో రూ.150 ఖర్చు చేస్తే 1 టర్బో పాయింట్‌ని పొందండి. అయితే ఈ టర్బో పాయింట్లకు.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రం ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ఎలా అంటారా.. బంకుల్లో ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం కాగా, ఇదే విధంగా ఇండిగో, గోఐబిబో వంటి ఇతర వాటిలో ఒక టర్బో పాయింట్‌కు రూ. 25 పైసలు మాత్రమే లభిస్తాయి. బుక్‌మైషో, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, షాపర్స్ స్టాప్ వంటి ప్రదేశాల్లో ఒక టర్బో పాయింట్‌తో 30 పైసలు వస్తాయి. ఇలా ఏడాది మొత్తంలో ఈ కార్డు ఉపయోగించి జరిపే లావాదేవీలపై వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ లేదా డిజిల్ కానీ పొందవచ్చని సిటీ బ్యాంక్ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు! -
ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్‌లో ఏపీసెజ్‌కు వాటా, రూ.1,050 కోట్ల డీల్
ఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) మరో కొనుగోలుకు తెరతీసింది. ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ లిమిటెడ్‌లో 49.38 శాతం వాటాను రూ.1,050 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు బుధవారం ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ సబ్సిడరీ అయిన ‘ఐవోటీ ఉత్కల్ ఎనర్జీ సర్వీసెస్’లో 10 శాతం వాటాను సైతం కొనుగోలు చేయడం ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నట్టు ఏపీ సెజ్ తెలిపింది. ఇందుకోసం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద రవాణా సదుపాయాల కల్పన కంపెనీగా అవతరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఈ కొనుగోలు ఉన్నట్టు సంస్థ పేర్కొంది. లిక్విడ్ స్టోరేజీ (ద్రవరూప నిల్వ సదుపాయాలు)లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్.. దేశవ్యాప్తంగా 2.4 మిలియన్ కిలో లీటర్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంలో ఆరు టెర్మినళ్లను కలిగి ఉన్నట్టు తెలిపింది. -
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్‌యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్‌లో చమురు పీఎస్‌యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్‌యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్‌కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్‌యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్‌యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే. -
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్‌గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్‌కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
5ఏళ్లు, రూ.40వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
మల్కాపూర్‌లో ఐఓసీ భారీ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్ – హైదరాబాద్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) పైప్‌లైన్ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ కొత్తగా నల్లగొండ జిల్లా మల్కాపూర్‌లో భారీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.611 కోట్ల పెట్టుబడులతో సుమారు 70 ఎకరాల్లో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు తెలిపారు. ‘‘ఈ టెర్మినల్‌లో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులు నిల్వ ఉంటాయి. దీని సామర్థ్యం 1.80 లక్షల కిలో లీటర్లు. ఒరిస్సాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి విశాఖపట్నం, అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు 1,200 కి.మీ. మేర డీఈఎఫ్ పైప్‌లైన్ ఉంటుందని’’ ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరణ ప్రణాళికల మీద బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 36 కోట్లతో ఎల్పీజీ ప్లాంట్ విస్తరణ.. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ మార్కెట్లో 39 శాతం మార్కెట్ వాటాతో ఐఓసీఎల్ మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం ఐఓసీఎల్‌కు చర్లపల్లిలో పెట్రోలియం టెర్మినల్, రామగుండంలో బల్క్ డిపోలు, చర్లపల్లి, తిమ్మాపూర్‌లో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల ఎల్పీజీ వార్షిక సామర్థ్యం 4100 మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఎల్పీజీ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో చర్లపల్లిలోని ఎల్పీజీ ప్లాంట్‌ను రూ.36 కోట్లతో విస్తరించనున్నామని తెలిపారు. దీంతో అదనంగా 2400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ కెపాసిటీ చేరుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా సీఎన్జీ స్టేషన్లు.. ప్రస్తుతం తెలంగాణలో ఐఓసీఎల్‌కు 1,100 రిటైల్ ఔట్‌లెట్లున్నాయి. 345 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. తెలంగాణలో 1.08 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లుంటే వీటిలో 44 లక్షల మంది ఇండియన్ గ్యాస్ కస్టమర్లే. ఇటీవలే కొత్తగా 1,478 రిటైల్ ఔట్లెట్లకు దరఖాస్తులను ఆహ్వానించాం. ఇందులో 52 ఔట్లెట్లను ఏర్పాటు చేశాం. త్వరలోనే మిగిలినవి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 13 సీఎన్జీ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 ఇంధనమే.. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలోని అన్ని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌ల్లో కేవలం భారత్ స్టేజ్ (బీఎస్)–6 పెట్రోల్, డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంటుందని, దీన్ని బీఎస్–4 వాహనాలకు సైతం వినియోగించవచ్చని శ్రవణ్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఎన్సీఆర్, ఆగ్రా నగరాల్లో కేవలం బీఎస్–6 ఇంధనాలను మాత్రమే సరఫరా చేస్తుంది. బీఎస్–6 ఇంధనం అల్ట్రా క్లీన్, నాణ్యత ప్రమాణాలను కలిగి ఉంటుందని.. దీంతో కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విష వాయువుల విడుదల ఉండవని ఆయన తెలిపారు. బీఎస్–4లో సల్ఫర్ 50 పీపీఎంగా ఉంటే.. బీఎస్–6లో 10 పీపీఎంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఐఓసీ నికర లాభం రూ.6,099 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,099 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.5,218 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది. షేర్ వారీ ఆర్జనను చూస్తే నికర లాభం రూ.5.51 నుంచి రూ.6.46కు పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉన్నా, ఇన్వెంటరీ లాభాలు, కరెన్సీ మారకంలో లాభాలు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించారు. స్థూల రిఫైనరీ మార్జిన్ (జీఆర్ఎమ్–బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల వచ్చే మార్జిన్) 9.12 డాలర్ల నుంచి 4.09 డాలర్లకు తగ్గిందని తెలిపారు. టర్నోవర్ రూ.1.36 లక్షల కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇన్వెంటరీ లాభాలు రూ.4,172 కోట్లు.. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.676 కోట్ల కరెన్సీ మారకం నష్టాలు రాగా, గత క్యూ4లో రూ.837 కోట్ల కరెన్సీ మారకం లాభాలు వచ్చాయని సంజీవ్ సింగ్ తెలిపారు. అయితే ఇన్వెంటరీ లాభాలు మాత్రం రూ.4,172 కోట్ల నుంచి రూ.2,655 కోట్లకు తగ్గాయని వివరించారు. ముడి చమురును ఈ కంపెనీ కొనుగోలు చేసిన ధర కంటే, ఈ చమురును ప్రాసెస్ చేసి ఇంధనంగా రిఫైనరీలకు సరఫరా చేసే సమయానికి ధర అధికంగా ఉంటే, వచ్చే లాభాలను ఇన్వెంటరీ లాభాలుగా పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ, కిరోసిన్ సబ్సిడీలు చెల్లించడంలో జాప్యం జరుగుతుండటంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, కంపెనీ రుణభారం రూ.86,359 కోట్లకు పెరిగిందని కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్) ఏ.కె. శర్మ తెలిపారు. కేంద్రం నుంచి వంట ఇంధనం సబ్సిడీలు రూ.19,000 కోట్లు రావలసి ఉన్నాయని వివరించారు. ఏడాది లాభం 21 శాతం డౌన్.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.21,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం తగ్గి రూ.16,894 కోట్లకు తగ్గిందని సింగ్ తెలిపారు. టర్నోవర్ మాత్రం రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.6.05 లక్షల కోట్లకు ఎగసిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్0.7 శాతం నష్టంతో రూ.150 వద్ద ముగిసింది. -
ఐవోసీకి నిల్వల సెగ..
న్యూఢిల్లీ: చమురు రేట్లు క్షీణించడం, అధిక ధరలకు ఖరీదు చేసిన ఇంధన నిల్వల విలువ పడిపోవడం తదితర కారణాలు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభం ఏకంగా 91 శాతం క్షీణించి రూ. 717 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 7,883 కోట్లు. మరోవైపు టర్నోవరు రూ. 1.32 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి చమురు ధరలు క్షీణించడంతో.. అప్పటికే నిల్వ చేసి పెట్టుకున్న ఇంధన విలువ గణనీయంగా పడిపోయిందని, ఇది ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐవోసీ పేర్కొంది. ఇక దేశీయంగా ఇంధన అమ్మకాలు 3 శాతం పెరిగి 21.5 మిలియన్ టన్నులకు చేరాయని వివరించింది. బుధవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 134.65 వద్ద క్లోజయ్యింది. -
బంపర్ ఆఫర్ : 5 లీటర్ల పెట్రోలు ఉచితం
సాక్షి,ముంబై: ఉచిత పెట్రోలు ఆఫర్‌ను మరి కొన్ని రోజులు పొడిగించింది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). వినియోగదారులకు 5లీటర్ల దాకా ఉచిత పెట్రోల్ ఆఫర్ చేస్తున్న ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. అయితే డిసెంబరు 15వరకు పొడిగించినట్టు ఎస్బీఐ ట్విటర్లో ప్రకటించింది. ఎస్బీఐ కార్డు లేదా, భీమ్ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్లెట్ల పెట్రోలు కొంటే 5 లీటర్ల వరకూ పెట్రోలు పూర్తిగా ఉచితంగా పొందండి. 2018 డిసెంబర్ 15 వరకు ఈ ఆఫర్ అంటూ ట్విటర్ ప్రకటనలో తెలిపింది. ఆఫర్ పొందాలంటే ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి. 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపంవచ్చు. అయితే ప్రతీ ఎస్ఎంఎస్కు డిఫరెంట్ కోడ్ ఉండాలి. ఆఫర్ పొందేందుకు అనుసరించాల్సిన విధానం ► ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ల నుండి రూ. 100 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అదీ భీమ్, ఎస్‌బీఐకార్డు ద్వారా చెల్లింపులకు మాత్రమే. ► 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు సెండ్ చేయాలి. ► భీమ్ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్ , ఎస్బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో 6అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇలా అందిన ఎస్ఎంఎస్లలో ఎంపికచేసిన దానికి 50, 100, 150, 200 రూపాయలు స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్ పొందే అవకాశం. ఆఫర్ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు. Fuel up with BHIM SBI Pay at any Indian Oil Retail outlet and get up to 5 litres of petrol absolutely free! Offer extended until 15th Dec 2018. For more details, visit: https://t.co/SItjGjVIxN Download now: https://t.co/1ho06MbWn9#IndianOil #NPCI #Offer #Deal #Fuel #Petrol pic.twitter.com/yBixwxYLZH — State Bank of India (@TheOfficialSBI) December 4, 2018 -
హిమదాస్‌కు ఐఓసీలో ఉద్యోగం
గువాహటి: స్ప్రింట్ సంచలనం హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ పోటీల్లో హిమ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకుంది. ఆమె సాధించిన ఘన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల (హెచ్ఆర్) విభాగంలో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఐఓసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తియ భట్టాచార్య తెలిపారు. హిమదాస్‌కు ఉన్నతస్థాయి వేతన భత్యాలతో పాటు ఆమె పాల్గొనే ఈవెంట్ల కోసం ప్రయాణ, బస ఏర్పాట్లకయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. హిమ ఘనతను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డు కూడా బహూకరించింది. -
స్టాక్స్ వ్యూ
నాల్కో బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 69 టార్గెట్ ధర: రూ.108 ఎందుకంటే: నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఎబిటా 344 శాతం(సీక్వెన్షియల్‌గా చూస్తే 61 శాతం) వృద్ధితో రూ.1,010 కోట్లకు ఎగిసింది. అల్యూమినా ధరలు బాగా పెరగడం వల్ల ఈ కంపెనీ ఈ స్థాయి ఎబిటా సాధించింది. నికర లాభం 5 రెట్లు (సీక్వెన్షియల్‌గా 70 శాతం) పెరిగి రూ.630 కోట్లకు చేరింది. అల్యుమినా ఉత్పత్తి 11 శాతం వృద్ధితో 583 కిలో టన్నులకు పెరిగింది. ఒక క్వార్టర్లో ఇంత అత్యధిక స్థాయి ఉత్పత్తి సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అమ్మకాలు 24 శాతం తగ్గినా, రియలైజేషన్ 36 శాతం (సీక్వెన్షియల్‌గా) పెరిగి 562 డాలర్లకు (టన్నుకు) పెరిగింది. అల్యూమినియం ఉత్పత్తి 9 శాతం, అమ్మకాలు 18 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ప్రపంచంలో అతి పెద్ద అల్యూమినా కంపెనీల్లో ఒకటైన నార్వేకు చెందిన నార్స్క్ హైడ్రో కొన్ని అల్యూమినా ప్లాంట్లను మూసేయడం, చైనా రిఫైనరీలు ఉత్పత్తిని నిలిపేయడం వల్ల అల్యూమినా ధరలు పెరుగుతున్నాయి. ఇది నాల్కో కంపెనీకి లాభిస్తోంది. నాల్కోకు విస్తారమైన బాక్సైట్ గనులు ఉండటం సానుకూలాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎబిటా 71 శాతం ఎగసి రూ.2,840 కోట్లకు, నికర లాభం 12 శాతం పెరిగి రూ.1,760 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. 2012–13లో 5 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పెరగగలదని భావిస్తున్నాం. ఆయిల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 204 టార్గెట్ ధర: రూ.314 ఎందుకంటే: ఆయిల్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.3,390 కోట్లకు పెరిగింది. చమురు, గ్యాస్ రియలైజేషన్లు అధికంగా ఉండటమే దీనికి కారణం. ఒక్కో బ్యారెల్‌కు ఆయిల్ రియలైజేషన్ 55 శాతం వృద్ధితో రూ.4,823కు పెరిగింది. అలాగే గ్యాస్ రియలైజేషన్ 17 శాతం ఎగసింది. ముడిచమురు అమ్మకాలు 0.6 శాతం తగ్గినా, ఎబిటా 61 శాతం వృద్ధితో రూ.1,408 కోట్లకు చేరింది. గత క్యూ1లో 29 శాతంగా ఉన్న పన్ను రేటు ఈ క్యూ1లో 35 శాతానికి పెరిగినప్పటికీ, నికర లాభం 56 శాతం వృద్ధితో రూ.703 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో ఎలాంటి సబ్సిడీ భారం లేదు. బ్యారెల్ ముడిచమురు 80 డాలర్ల లోపు ఉన్నంత వరకూ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, ఆప్‌స్ట్రీమ్ కంపెనీలపై ఎలాంటి భారం ఉండదు. అయితే వంట గ్యాస్ విషయమై కొంత సబ్సిడీ భారం ఆప్‌స్ట్రీమ్ కంపెనీలపై ఉంటుంది. ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఈ షేర్ ఈ ఏడాది జనవరిలో పైపైకి ఎగసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ, ఈ షేర్ 17 శాతం వరకూ తగ్గింది. ప్రస్తుత ధర కొనుగోళ్లకు ఆకర్షణీయమని భావిస్తున్నాం. డివిడెండ్ ఈల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతంగా ఉండొచ్చని అంచనా. అలాగే రెండేళ్లలో ఈపీఎస్ 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలదని భావిస్తున్నాం. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం. చమురు ధరలు పెరిగితే సబ్సిడీ భారం పెరుగుతుంది. ఇది షేర్ ధరపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. -
ఇది కూడా తగ్గింపేనా..?
-
ఇక ఇంటి వద్దకే ఇంధనం!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ తాజాగా ఇంటి వద్దకే ఇంధనం అందించే సర్వీసులు ప్రారంభించింది. ఇందులో భాగంగా డీజిల్‌ను హోమ్ డెలివరీ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం పుణెలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వీసులను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. అలాగే పెట్రోల్ కూడా హోమ్ డెలివరీ చేయాలని యోచిస్తోంది. రవాణాకు అనువైనది కావడంతో పాటు కొంత సురక్షితం అయినందున ముందుగా హోమ్ డెలివరీకి డీజిల్‌ని ఎంచుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీఎండీ సంజీవ్ సింగ్ తెలిపారు. పెట్రోల్‌ని కూడా అందించాలంటే కొన్ని రిస్కులు ఉన్నాయని.. దీనిపై పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో)తో చమురు కంపెనీలు చర్చిస్తున్నాయని ఆయన వివరించారు. ఇంధనాలను ఇంటివద్దకే అందించే సర్వీసుల అంశాన్ని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దాదాపు ఏడాది క్రితమే ప్రస్తావించారు. 2017 జూన్‌లోనే బెంగళూరుకి చెందిన స్టార్టప్ సంస్థ ఏఎన్‌బీ ఫ్యూయల్స్ సంస్థ .. మైపెట్రోల్పంప్ బ్రాండ్ పేరిట పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ సర్వీసులు కూడా మొదలుపెట్టింది. అయితే, ఈ విధంగా ఇంధనాలను రవాణా చేయడం సురక్షితం కాదని, ఏఎన్‌బీకి ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలంటూ చమురు కంపెనీలకు పెసో సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఉదంతం తర్వాత.. మళ్లీ ఇంధనాల హోమ్ డెలివరీకి ఇండియన్ ఆయిల్ తదితర చమురు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. వీటిలో ముందుగా ఇండియన్ ఆయిల్ సంస్థ ఈ సర్వీసులు ప్రారంభించింది. -
అంచనాలను మించిన ఐవోసీ, బోనస్ ప్రకటన
ముంబై: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 8269 కోట్లను నమోదు చేసింది. నికర లాభం 4,472 కోట్లుగా విశ్లేషకులు అంచనావేశారు. మొత్తం అమ్మకాలు రూ. 1,14,000 కోట్ల నుంచి 1,01,400 రూ. కోట్లకు తగ్గాయి. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) కూడా 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు క్షీణించింది. అయితే బ్యారెల్ కు 6 డాలర్లుగా ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. దీంతో ఎబిటా మార్జిన్ కూడా గణనీయంగా పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 4750 కోట్ల నుంచి రూ. 12,248 కోట్లకు జంప్ చేసింది. ఇబిటా మార్జిన్లు 4.8 శాతం నుంచి 12.8 శాతంగా నమోదయ్యాయి. విశ్లేషకులు అంచనావేసింది రూ. 7,040 కోట్లు. ఇతర ఆదాయం మాత్రం 35 శాతం తగ్గి రూ. 470 కోట్లకు పరిమితమైంది. దేశీయంగా 20.41 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తులను విక్రయించింది. కాగా, ఫైనాన్స్ వ్యయాలు 37 శాతం క్షీణించి 680 కోట్లకు చేరాయి. ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లా ఇండియన్ ఆయిల్ మెరుగైన ఫలితాల ను సాధించిందని గత మూడు త్రైమాసికాలలో అత్యధిక స్థాయిలో ఉండడం ప్రోత్సాహకరమని మార్కెట్ నిపుణుడు గౌరంగ్ షా తెలిపారు. -
అంతా వారే చేశారు!
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే విధానాలు, ప్రాజెక్టుల అమలు జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని.. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. నిర్దేశించుకుంటున్న ప్రాజెక్టులన్నీ అనుకున్న గడువులోగా పూర్తయ్యేందుకు ‘పని సంస్కృతి’ (వర్క్ కల్చర్)ను ప్రోత్సహిస్తూ ఎన్డీఏ సర్కారు ముందుకెళ్తోందన్నారు. పారాదీప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ను ఆయన ఆదివారం జాతికి అంకితం చేసి ప్రసంగించారు. కాంగ్రెస్ ఆందోళనలు, అనవసర విధానాల వల్ల ప్రాజెక్టుల జాప్యం జరుగుతోందని.. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదనేదే తమ ఆలోచన అనితెలిపారు. ‘కాంగ్రెస్ మిత్రులు మేమే ఇలాంటి సంస్కృతి(అమలును అడ్డుకోవటం) ని ప్రారంభించామంటున్నారు. కానీ మాకు ఆ అవసరం లేదు. 15 ఏళ్ల క్రితమే ఇవన్నీ జరిగుంటే సంతోషించేవాడిని’ అని అన్నారు. ‘2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి గ్రీన్‌ఫీల్డ్‌కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే దీన్ని జాతికి అంకితం చేశాం. ఇంత మంచి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 15 ఏళ్లు పట్టడం కాంగ్రెస్ అలసత్వానికి మంచి ఉదాహరణ’ అని తెలిపారు. దేశాభివృద్ధికి.. పౌరులు, పరిశ్రమలు, విధాన నిర్ణేతలు అందరూ కలిసి ‘సరైన సమయంలో పని ప్రారంభించి.. నిర్ణీత సమయంలో పూర్తి చేసే’ పని సంస్కృతిని అలవర్చుకోవాలన్నారు. కాగా, ప్రజలకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించాలని ప్రధాని భువనేశ్వర్‌లోని నైసర్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్) లో జరిగిన కార్యక్రమంలో కోరారు. ఒడిశాకు ప్రత్యేక హోదా కల్పించి అన్ని రంగాల్లో పురోగతి సాధించేలా కేంద్రం ఆదుకోవాలని సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. పారాదీప్ రిఫైనరీపై ప్రధానమంత్రివి అబద్ధాలని కాంగ్రెస్ పేర్కొంది. జగన్నాథుని దర్శనం.. పూరీలోప్రసిద్ధ జగన్నాథ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. పూరీనగర ప్రజల ప్రేమానురాగాలు తనను కదిలించాయన్నారు. మాకూ ఆ కళ నేర్పండి!.. ప్రధాని మోదీ.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌ను గుజరాత్‌కు ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో యువతకు సైకత శిల్ప కళలో శిక్షణ ఇవ్వాలని కోరారు. జగన్నాథాలయంలో మోదీ దర్శనం చేసుకుంటున్న సమయంలోనే పట్నాయక్ కలిశారు. ‘నవకళేబర’ వేడుక సందర్భంగా తను వేసిన జగన్నాథుని సైకతశిల్పం ఫొటోను ప్రధానికి బహూకరించారు. ‘ప్రధానిని కలవటం ఆనందంగా ఉంది. ఆయన కోరినట్లుగా గుజరాత్లో ఓ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాను’ అని పట్నాయక్ తెలిపారు. -
ఉద్యోగ సమాచారం
ఐఓసీఎల్‌లో 98 పోస్టులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.iocl.comచూడొచ్చు బీహెచ్ఈఎల్లో 50 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు బెంగళూరులోని బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రిక ల్స్ లిమిటెడ్).. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 50. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.bheledn.comచూడొచ్చు. ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్స్ రాయ్‌పూర్‌లోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 29. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.aiimsraipur.edu.inచూడొచ్చు. కేరళ వెటర్నరీ వర్సిటీలో తాత్కాలిక పోస్టులు కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిసెంట్ ప్రొఫెసర్స, టీచింగ్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 10. వివరాలకు www.kvasu.ac.inచూడొచ్చు. టాటా మెమోరియల్ సెంటర్లో ఫీల్డ్ వర్కర్లు టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.actrec.gov.inచూడొచ్చు. ఎన్సీఈఆర్టీలో స్పెషల్ రిక్రూట్మెంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ).. వికలాంగుల కోటాలో లోయర్ డివిజన్ క్లర్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 20. వివరాలకు www.ncert.nic.inచూడొచ్చు. బెనారస్ హిందూ వర్సిటీలో ఖాళీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా కలెక్షన్/కోడింగ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ అండ్ ఎనాలిసిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. వివరాలకు www.bhu.ac.inచూడొచ్చు. 145 డీఎడ్ కాలేజీలకు అనుమతులు రెండు రోజుల్లో డీఈఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)లో ప్రవేశాలకు చ ర్యలు మొదలయ్యాయి. 145 ప్రైవేటు డీఎడ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తూ సంబంధిత ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంతకం చేశారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆ వెంటనే డీఈఈసెట్-2015 ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వీలైతే ఈ నెల 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉంది. డీఈఈసెట్లో అర్హత సాధించిన 71 వేల మంది దీని కోసం ఎదురుచూస్తున్నారు. కళాశాల విద్యా కమిషనర్‌గా కిషన్‌కు బాధ్యతలు కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ సెలవులో ఉండడంతో ప్రభుత్వం... పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 8 వరకు ఓపెన్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ మొదటి, రెండో సంవత్సరం, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సంవత్సర వార్షిక పరీక్షలు డిసెంబర్, జనవరిలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 8లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ వార్షిక పరీక్షలు కూడా డిసెంబర్ ఆఖరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. తెలంగాణ, ఏపీలోని స్టడీ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 5న నిమ్స్‌లో డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో పారామెడికల్ డిప్లొమా పీజీ కోర్సులకు రెండో విడ త కౌన్సెలింగ్ ఈ నెల 5న నిర్వహించనున్నట్లు నిమ్స్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న నిమ్స్ పాత భవనం మొదటి అంతస్తులోని లె ర్నింగ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.nims.edu.inవెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. సిబ్బంది వివరాలు అప్లోడ్ చేయాల్సిందే జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశం... 15 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. అర్హులైన బోధన సిబ్బంది లేకపోయినా నెట్టుకొస్తున్న కాలేజీలను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను(బయోడేటా) తమ వెబ్సైట్లో ఈ నెల 15 లోగా అప్లోడ్ చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇందుకవసరమైన చర్య లు చేపట్టాలని ఆదేశించింది. వెబ్సైట్లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల లింకు సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో దరఖాస్తుల లింక్‌ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ నోటిఫికేషన్లో అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొనగా, మెయిన్ నోటిఫికేషన్ లో మాత్రం 1.5లక్షల మందినే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా తీసుకుంటారంది. -
ఇండియన్ ఆయిల్‌కు భారీగా నిల్వ నష్టాలు
క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గడంతో నిల్వ నష్టాలు బాగా పెరిగాయని, దీంతో నికర నష్టం అధికమైందని కంపెనీ చైర్మన్ బి. అశోక్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర నష్టాలు రూ. 961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. గత క్యూ3లో నిల్వ లాభాలు రూ.2,454 కోట్లుగా ఉండగా, ఈ క్యూ3లో నిల్వ నష్టాలు రూ.12,842 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ముడి చమురును కొనుగోలు చేసినప్పటి ధర కాకుండా ప్రాసెస్ చేసినప్పుడు ఉన్న ధర ఆధారంగా పెట్రో ఇంధనాల ధరలను నిర్ణయిస్తామని, ఈ కాలంలో ముడిచమురు ధరలు మరింతగా పతనమయ్యాయని, ఈ విధంగా నిల్వ నష్టాలు భారీగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. విక్రయాల ద్వారా వచ్చిన నష్టాలకు ప్రభుత్వం రూ.2,866 కోట్లు నగదు సబ్సిడీని, ఓఎన్జీసీ వంటి చమురు వెలికితీత కంపెనీలు రూ.6,116 కోట్ల తోడ్పాటునందించాయని వివరించారు. ఇక గత క్యూ3లో రూ.1,17,672 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.1,07,074 కోట్లకు తగ్గాయని తెలిపారు. వడ్డీ భారం రూ.1,262 కోట్ల నుంచి రూ.929 కోట్లకు తగ్గిందని వివరించారు.