బెంగళూరు: రాష్ట్రంలో గ్యాస్ కు నగదు బదిలీ పథకం-పహల్ (డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎల్‌పీజీ సబ్సిడీ- డీబీటీఎల్) కింద పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో ఇప్పటి వరకూ లక్ష్యంలో 40 శాతా న్ని మాత్రమే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-కర్ణాటక శాఖ చేరుకోగలిగింది. కర్ణాటకలోని అన్ని జిల్లాలలతో సహా దేశ వ్యాప్తంగా డీబీటీఎల్ అమల్లోకి గురువారం నుంచి అమల్లోకి వస్తోంది. అయితే పెలైట్ ప్రతిపాదికన నవంబర్ 15నే కర్ణాటకలోని తుమకూరు, మైసూరు జి ల్లాలను ఎంపిక చేసి అప్పటి నుంచి డీబీటీఎల్‌ను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా అప్పటి నుంచే పహ ల్ పథకాన్ని గూర్చి ప్రచారం చేయ డం అధికారులు పెద్ద ఎత్తున ప్రా రంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 68 లక్షల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉండగా.. అందులో దాదా పు 27.20 లక్షల మంది (40 శా తం) మాత్రమే ఇప్పటి వరకూ డీబీ టీఎల్ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చాలా మంది విని యోగదారులకు ఆధార్ కార్డులు లే క పోవడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్ అకౌంట్‌లేని వారు కూడా ఇప్పటి వరకూ సబ్సిడీ ధరలకే గ్యాస్‌ను పొందుతున్నవారు ఉన్నారు. ఇ లాంటి పరిస్థితి హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉంది. వీరు ఇప్పుడిప్పుడే ఖాతాను ప్రా రంభించడానికి ప్రయత్నాలు ప్రా రంభించారు. అయితే బ్యాంకు అధికారులు వివిధ కారణాలు చూపు తూ ఖాతాల నమోదుకు వెనకడుగు వేస్తున్నారు.
దీంతో అటు అధార్ కా ర్డు.. ఇటు బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఎల్‌పీజీ వినియోగదారు లు డీబీటీఎల్ లబ్ధిదారులు కా వడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (కర్ణాటక) జనరల్ మేనేజర్ ఎస్ వరదాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో డీబీటీఎల్ కింద పేర్ల నమోదు ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతు న్న మాట వాస్తవమే. ఇప్పటి వరకూ 40 శాతం ప్రక్రియ మా త్రమే పూర్తయింది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక కాస్త మెరుగ్గానే ఉంది. డీ బీటీఎల్‌పై ఇప్పుడిప్పుడే ప్రజలకు అవగాహన పెరుగుతోంది. అందువల్ల మరో రెండు నెల ల్లోనే 80 నుం చి 85 శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. గ్యాస్‌బుక్ చేసుకున్న రెండు రోజు ల్లోపు సబ్సిడీ ధర లబ్ధిదారుల బ్యాం క్ అకౌంట్‌కు చేర్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం.’ అని తెలిపారు.
పహెల్ పథకం ఇలా భాగస్వామ్యం కావచ్చు
ఎల్‌పీజీ వినియోగదారులు ఆధార్ ఉంటే దానితోపాటు బ్యాంకు అ కౌంట్‌ను గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఇందు కోసం ఫార్మ్-1ను పూర్తి చేసి బ్యాంక్ శాఖ లో అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నంబర్‌ను ఎల్‌పీజీ వినియోగ దారుని యునిక్ నంబర్ తో అనుసంధానం చేయడానికి వీ లుగా ఫార్మ్-2ను పూర్తి చేసి డిస్ట్రిబ్యూటర్‌కు అందించాల్సి ఉంటుం ది. ఆధార్‌లేని వారు బ్యాంక్ అకౌం ట్ నంబర్‌ను డిస్టిబ్యూటర్‌కు అం దించడానికి వీలుగా ఫార్మ్-4ను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా 17 అంకెల ఎల్‌పీజీ వినియోగదారుని యునిక్ నంబర్‌ను బ్యాంక్ అ కౌంట్‌తో అనుసంధానం చేయడానికి వీలుగా ఫార్మ్-3ను పూర్తి చేసి సంబంధిత అధికారికి అందజేయా ల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.mylpg.in లేదా 1800-2333-555లో సంప్రదించవచ్చు.
4.
నేటి నుంచి నగదు బదిలీ
Published Fri, Jan 2 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement
Advertisement