cash transfer scheme
-
నగదు బదిలీతో ఆర్థిక వ్యవస్థకు మేలే!
ఏపీలో ఇప్పుడున్న పాలక పక్షానికి (వైఎస్సార్సీపీ) గత మూడున్నర ఏళ్ల క్రితం ఎకాఎకిన 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వం – నూతన పరి పాలనా సంస్కరణలతో, తాను చేసిన వాగ్దానాల మేరకు... సంక్షేమ పథకాలు, ఉద్యోగకల్పన, పరిపాలనా వికేంద్రీ కరణతో శరవేగంగా దూసుకపోతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల్లోకెల్లా బాగా ప్రాచుర్యం పొందినవి రెండు – ఒకటి యువతకు భారీ ఉద్యోగ కల్పన. రెండు – నగదు బదిలీ పథకం. నగదు బదిలీ పథకం విషయంలో ‘పేదల్ని కూర్చోబెట్టి పోషిస్తున్నా’ రంటూ అనేకమంది అక్కసు వెళ్ళగక్కుతూ వస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు చేస్తున్న ఈ నగదు బదిలీ వల్ల ఖజానాకు ఒక్క పైసా నష్టం రాకపోగా; నగదు బదిలీ జరిగిన మరుసటి వారంలోపే దానిలో అత్యధిక భాగం తిరిగి చిల్లర వ్యాపారులకు – తద్వారా రాష్ట్ర ఖజానాకే చేరుతుంది ఆ డబ్బంతా! ఈ ద్రవ్య సంచయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుంది. నగదు బదిలీ పథకం వల్ల ప్రజలకు కొత్తగా తెలిసిందేమంటే – ఇంత భారీగా ప్రజ లకు ఇవ్వగలిగిన సొమ్ము – ఇప్పటి వరకు గత పాలకులు తమకు దక్కకుండా చేశారనే విషయం. ఇక ఉద్యోగ కల్పన విషయానికి వస్తే... గత ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా; ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేసి, దళారీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచాయి. ఇంతే కాదు, ఇలాంటి అస్థిర ఉద్యోగాల వల్ల అటువంటి ఉద్యో గులు – ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఉద్యోగాలతో రాజీ పడలేక, నాణ్యమైన సేవలు అందించలేక అస్థిర జీవనం కొనసాగించే వారు. అలాంటి తరుణంలో – వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన భారీ ఉదార ఉద్యోగ కల్పన వల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ ఉద్యోగాల కల్పన వల్ల యువతకు సుస్థిర జీవనం సాగించే అవకాశంతో పాటు; తమ మీద తమకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వీరికిచ్చే జీతాల వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుందన్న ప్రతిపక్షాల చీకటి ప్రచారాలు కూడా సరైన వాదనకు నిలబడేవి కావు. కారణం – ఇన్ని లక్షల మందికి చెల్లించే వందల కోట్ల జీతాల మొత్తాలు మరుసటి రోజే మార్కెట్లోకి వెళ్ళి పోతున్నాయి ఖర్చుల రూపంలో. ఖర్చులోనే ఆదాయ ముంటుందన్న ఆర్థిక సూత్రం మేరకు మళ్ళీ వీరి ఖర్చు ప్రభుత్వ ఖజానాలకు ఆదాయంగా మారుతోంది. అందువల్ల వీరి జీతాలను ఖర్చుగా భావించనక్కర్లేదు. పై పెచ్చు ఈ భారీ ఉద్యోగిత వల్ల పాలనా, సేవా సౌకర్యాలు అత్యంత సామాన్యుని ఇంటి ముంగిట వరకు చేరటంతో – పౌర సమాజానికి సమయం, డబ్బు ఆదా అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత నిచ్చి, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు చదువుకొనే విద్యార్థులకు అనేక ఫీజు రాయితీలు కల్పిస్తూ; ప్రభుత్వ రంగ విద్యా సంస్థ ల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవటం వల్ల... సమీప భవిష్యత్తులో నాణ్యమైన ప్రమాణాలు కల విద్యార్థి సమూహం సమాజంలోకి ధీమాగా అడుగు పెడుతుంది. ఇక వైద్య రంగాన్ని గమనిస్తే – వైద్య, ఆరోగ్య రంగాలలో భారీ ఉద్యోగితను కల్పించటం; ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సంస్థలను అభివృద్ధి పరచడం... తద్వారా అందని ద్రాక్షగా తయారైన వైద్యాన్ని సామాన్యుని ముంగిటకు తెచ్చినట్టయింది. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఫలితంగా మిగిలిన అప్పులూ... వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను భారం చేశాయి. అంతకు ముందు ఐదేళ్లల్లో ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని అంతగా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సంవత్సరంలో మాత్రం ఎడాపెడా రాష్ట్రమంతటా రోడ్లు వేయించ పూనుకున్నాడు. వేగుల ద్వారా – ప్రభుత్వంపై ఉన్న తారాస్థాయి అసంతృప్తి సమాచారాన్ని తెలుసుకొన్న తాను దోమలపై దండయాత్ర అంటూ, పంచాయితీలకు ఎన్నికల సంవత్సరం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులిచ్చాడు. ఈ ‘ఆఖరు క్షణం ఖర్చుల’ వల్ల రాష్ట్రానికి మూడు విధాల నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో చేతులు కలిపి భారీగా అవినీతికి పాల్పడటం మొదటిది కాగా; ఈ అవినీతి వల్ల పనుల్లో నాణ్యత తగ్గటం రెండోది. ఈ పర్యవసానాల వల్ల రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ అవ్వడం మూడోది. ఫలితంగా జగన్ తన పాలనను ‘మైనస్ జీరో బడ్జెట్’ నుండి మొదలు పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే – అప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పు – 2 లక్షల 64 వేల, 451 కోట్లు కాగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ కావటం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వానికి తొలిరోజు నుండే ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కనీసంగా వెయ్యి కోట్ల రూపాయిలు వడ్డీ ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా పేదల కోసం మొద లెట్టిన నగదు బదిలీ పథకం అప్రతిహతంగా కొనసాగించే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే! (క్లిక్ చేయండి: ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?) - మాకా రాజేంద్రన్ సామాజిక విశ్లేషకుడు -
నగదు బదిలీతో.. హక్కుగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ పథకానికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకానికి నగదు బదిలీ అమలు పురోగతిపై ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదివారం విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరాలు తెలియచేశారు. నగదు బదిలీ పథకం కింద రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారి ఖాతాలకు జమ చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని రైతులే నేరుగా విద్యుత్తు సంస్థలకు బిల్లుల రూపంలో ల్లించనున్నారు. రైతులే బిల్లులు చెల్లించి విద్యుత్తు తీసుకుంటారు కాబట్టి నాణ్యమైన కరెంట్ సరఫరాను తమ హక్కుగా ప్రశ్నించే వీలుంది. మరోవైపు తమకు బిల్లులు చెల్లిస్తున్న అన్నదాతల పట్ల విద్యుత్తు పంపిణీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాయి. వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను బిగించడం వల్ల లోడ్ ఎంతనేది ముందే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. తగినంత విద్యుత్తు సరఫరా జరుగుతుంది కాబట్టి మోటార్లు కాలిపోవు. లో వోల్జేజీ సమస్య అనేది ఎక్కడా ఉండదు. తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందుతుంది. పైసా కూడా భారం పడకుండా.. రైతన్నల అనుమతితోనే నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది. పథకం అమలుకు అంగీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 92 శాతం మంది రైతులు విద్యుత్ సంస్థలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ విద్యుత్ ధరను యూనిట్ సరాసరి రూ.5.73గా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించినప్పటికీ రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఆ వ్యయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న ఈ పథకానికి 98.6 శాతం మంది రైతులు అంగీకారం తెలిపారు. సామర్థ్యం పెంపు... లో ఓల్టేజీ పరిష్కారం మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ లోడు ఎక్కడ ఎక్కువ ఉంది? ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం ఎక్కడ, ఎంత పెంచాలి? అనే అంశాలను డిస్కమ్‌లు కచ్చితంగా తెలుసుకునే వీలుంది. లో ఓల్టేజి సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చు. ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూటే 9 గంటల పాటు సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడ్‌ను కచ్చితంగా లెక్కించవచ్చు. ఇప్పటివరకూ ఈ విధానం లేదు. మరో 30 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన కరెంట్ కోసం విద్యుత్ సంస్థలను ప్రశ్నించే హక్కు రైతులకు కల్పిస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శికి మంత్రి బాలినేని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకం అమలులో రాష్ట్ర్రంలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్‌కు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులంతా నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరాటంకంగా పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. -
రెండేళ్లలో ఖాతాల్లోకి నేరుగా రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. రెండో ఏడాది వరుసగా చేయూత పథకంతో పాటు గత రెండేళ్ల కాలంలో వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,00,116.35 కోట్లను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసి రికార్డు సృష్టించింది. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు 6,53,12,534 ప్రయోజనాలను పొందారు. రెండేళ్ల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అర్హులైన పేదల బ్యాంకు ఖాతాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. లక్ష కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ చేసినప్పటికీ పైసా కూడా పక్కదోవ పట్టకపోవడం విశేషం. ఎక్కడా పైసా అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా దుర్వినియోగం అనే మాట వినపించకుండా ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ప్రమాణికంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు వేలెత్తి చూపలేని స్థితిలో ఉన్నాయంటేనే ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధితో వాటిని అమలు చేశారో ఇట్టే స్పష్టం అవుతోంది. ప్రజల ముంగిటకే ప్రభుత్వ పథకాలు వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను స్వయంగా చూసి, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న కీలక నిర్ణయాలు కోట్లాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా, పేదరికమే కొలమానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ స్థాయిలోకి పాలనను తీసుకెళ్లేందుకు విప్లవాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, లక్షల సంఖ్యలో సేవాసైన్యం (వలంటీర్ల)ను సిద్ధం చేసి, ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువచ్చారు. అర్హతే ప్రామాణికత.. సంతృప్త స్థాయిలో అమలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సీఎం జగన్ ఆదేశాలతో, దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే ఆయా పథకాలను చేరువ చేశారు. వలంటీర్లు.. సచివాలయాల్లో అందచేసిన దరఖాస్తులను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించడం, లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేస్తున్నారు. ఎక్కడైనా అర్హులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే, వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియగా మార్చారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు. ప్రతి పథకం ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నారో ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తున్నారు. గతంలో పాలకులు ప్రభుత్వ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో, ఎంత మందికి ఇస్తారో స్పష్టంగా ప్రకటించిన దాఖలాలు లేవు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా కొందరికి మాత్రమే మంజూరు చేసేవారు. అర్హత ఉన్నా, రాజకీయ సిఫారసులు లేకపోవడం వల్ల అనేక మంది లబ్ధి పొందే పరిస్థితి ఉండేది కాదు. ఈ మొత్తం పరిస్థితిని మారుస్తూ, కేవలం అర్హత మాత్రమే ప్రాతిపాదికన సీఎం జగన్ ప్రభుత్వ పథకాల అమలులో సంస్కరణలు తీసుకువచ్చారు. కోవిడ్ సమయంలోనూ చెక్కు చెదరని సంకల్పం కోవిడ్ సంక్షోభంతో ప్రపంచమంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సీఎం జగన్ సంకల్పం చెక్కు చెదరలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, సమగ్ర పురోగతి ధ్యేయంగా పథకాల అమలులో తన చిత్తశుద్దిని చాటుకుంటున్నారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించిన మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎటువంటి మార్పు లేకుండా అమలు చేస్తుండటం విశేషం. కోవిడ్ లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలను ఆదుకునేందుకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్స్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,35,05,338 మందికి 1,350.53 కోట్ల రూపాయలు అందచేశారు. మహిళలకే అధిక ప్రాధాన్యత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలను పాఠశాలలకు పంపుతున్న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా రూ.13,022.93 కోట్లు జమ చేశారు. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మంది తల్లుల ఖాతాలకు రూ.2,269.93 కోట్లు, విద్యా దీవెన కింద 18,80,934 మంది తల్లుల ఖాతాలకు రూ.4,879.30 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాల మహిళలు 98,00,626 మందికి రూ.2,354.22 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 24,55,534 మంది మహిళలకు రూ.8943.52 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద 77,75,681 మంది మహిళలకు రూ.6,310.68 కోట్లు, వైఎస్సార్ కాపునేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకుని లక్షలాది మంది మహిళలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. -
ఉచిత విద్యుత్ పేటెంట్ వైఎస్సార్‌దే..
సాక్షి, తాడేపల్లి : నగదు బదిలీ పథకం వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సంస్కరణల్లో భాగంగా రైతులకు నగదు బదిలీ చేస్తున్నారని, రైతులకు మేలు చేసేందుకే నగదు బదిలీ పథకమని స్పష్టం చేశారు. అయితే ఉచిత విద్యుత్ సరఫరాపై టీడీపీ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుందని మండిపడ్డారు. అప్పు కోసమని, ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికే నగదు బదిలీ పథకమని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగల మీద చంద్రబాబు బట్టలు అరేసుకోవాలన్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడు..వి ద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే చంద్రబాబు కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. (మహానేత స్ఫూర్తితోనే వైఎస్ జగన్ పరిపాలన) నగదు బదిలీ పథకం వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదని సజ్జల రామకృష్ణ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన పథకమని, 1100 కోట్లు కరెంట్ బకాయిలను ప్రమాణ స్వీకారం రోజే వైఎస్సార్ రద్దు చేశారని ప్రస్తావించారు. ఉచిత విద్యుత్ పేటెంట్ రాజశేఖర్ రెడ్డిదని, నేడు తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నారు. 5 ఏళ్ళు పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సీఎంప్లాన్ చేస్తున్నారని తెలిపారు.ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని, 9 గంటల నాణ్యమైన విద్యుత్ కోసం ఫీడర్లకు 1700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. (బాబు చివరకు పాల వ్యాపారాన్నీ వదల్లేదు’) ‘ప్రజలు ఖాతాల్లో నగదు జమ చేయడం వలన జవాబుదారీతనం పెరుగుతుంది. రైతుల ఖాతాల్లో వేసిన డబ్బు వేరే వాటికి బ్యాంక్‌లు జమ చేసుకోవడానికి వీల్లేదు. ఒక వేళ డబ్బు రైతుల ఖాతాల్లో వేయడం అలస్యమైనప్పటికీ ఉచిత విద్యుత్ ఆపరు. రైతులకు ఎస్క్రో అకౌంట్స్ ఇస్తున్నాం. విద్యుత్ మీటర్లు బిగించడం వలన రైతులు ఎంత విద్యుత్ ఉపయోగించుకుంటున్నారో తెలుస్తుంది. తల తోక లేకుండా ప్రతిపక్ష పార్టీలు ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిస్కములకు చంద్రబాబు వేల కోట్ల బకాయిలు పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అప్పును 3 లక్షల 60 వేల కోట్లకు పెంచారు. ఎఫ్ఆర్బీఎమ్కు నిబంధనలకు అనుగుణంగా అప్పు చేస్తున్నాము. అప్పు దేనికి తెచ్చామో కూడా మేము లెక్కలు చెప్పాగలుగుతాము. టీడీపీ తెచ్చిన అప్పు మీద లెక్కలు చెప్పగలరా.. ఎన్నికల్లో ఓట్లు కోసం వైఎస్ జగన్ పథకాలు ప్రవేశ పెట్టలేదు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో, విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రజలు చనిపోతే చంద్రబాబు రాలేదు. అవినీతి, మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు. ప్రజలు చంద్రబాబు చేసే పనులను గుర్తు పెట్టుకుంటారు.’ అని సజ్జల మండిపడ్డారు. -
భారత్‌తో నగదు బదిలీకి సిద్ధం: పాక్ ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన, పారదర్శక నగదు బదలీ కార్యక్రమాన్ని భారత్‌తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది కూలీలు, కార్మికులు జీవించడానికి నగదు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారత్‌లో లాక్డౌన్ విధించినప్పటి నుంచి 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయిందని ముంబైకి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఓ నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భారత్‌లోని పేదలకు నగదు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్విటర్లో పేర్కొన్నారు. Acc to this report, 34% of households across India will not be able to survive for more than a week without add assistance. I am ready to offer help & share our successful cash transfer prog, lauded internationally for its reach & transparency, with India.https://t.co/CcvUf6wERM — Imran Khan (@ImranKhanPTI) June 11, 2020 అదే విధంగా 34 శాతం కుటుంబాలు ప్రత్యేక్ష నగదు సాయం లేకుండా కనీసం ఒక వారం రోజులు కూడా మనుగడ సాగించలేవని ఇమ్రాన్ తెలిపారు. కరోనా కష్ట కాలంలో పాకిస్తాన్లో తమ ప్రభుత్వం తొమ్మిది వారాల్లో 120 బిలియన్లను పారదర్శకంగా 10 లక్షల కుటుంబాలకు బదిలీ చేసిందని తెలిపారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, పూటగడవక ఆందోళన చెందే కార్మికుల సంక్షేమం, ఆహార, ఆర్థిక భద్రత కోసం ఈ ప్యాకేజీని కేటాయించారు. -
విద్యార్థులకూ నేరుగా నగదు!
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బదులుగా విద్యార్థులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతే కాకుండా ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సాయం అందించే వారితో కలిసి ని«ధుల్ని సమీకరించడానికి ఒక వేదిక ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈచ్ వన్, టీచ్ వన్ (ప్రతీ ఒక్కరూ, ఒక్కరిని చదివించాలి) అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈచ్ వన్, టీచ్ వన్: ధనిక వర్గాల్లోని ఒక్కో కుటుంబం ఒక నిరుపేద విద్యార్థికి చదవించడానికి ముందుకు రావాలని కేంద్రం పిలుపునివ్వనుంది. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఇచ్చిన డబ్బులు వృథా కాకుండా ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేయనుంది. విద్యాదాన్ పోర్టల్ తరహాలో రూపొందించే ఈ కొత్త పోర్టల్‌లో విద్యార్థులు, వారి చదువుకి సాయం అందించే దాతలు, విద్యాసంస్థల్ని అనుసంధానం చేస్తారు. మొత్తమ్మీద రూ.25 వేల కోట్ల నిధుల్ని సమీకరిస్తారు. వీటిని పూర్తి పారదర్శకంగా ఖర్చు చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. 10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుంది. ఈ సిఫారసుల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులతో కూడిన 10 గ్రూపులు మేధోమథనం నిర్వహించి (ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్‌గ్రెడేషన్ అండ్ ఇన్‌క్లూజన్ ప్రోగామ్ (ఎక్విప్)) రూపొందించారు. ఉన్నత విద్యా వ్యవస్థను ప్రక్షాళన కోసం వచ్చే అయిదేళ్లలో ఏయే నిర్ణయాలు తీసుకోవాలో ప్రతిపాదనలు చేశారు. ఈ గ్రూపులకు పలువురు ప్రముఖులు నేతృత్వం వహించారు. మాజీ రెవిన్యూ సెక్రటరీ హస్ముఖ్ అదిహ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కె. విజయరాఘవన్, రీడిఫ్ వ్యవస్థాపకుడు అజిత్ బాలకృష్ణన్, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో క్రిస్ గోపాల్‌కృష్ణన్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. సిఫారసులు ► ఫీజు రీయింబర్స్మెంట్కి బదులుగా విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకే నేరుగా నగదు బదిలీ చేయాలి. ► ఇతర విద్యార్థులకు రుణాలు మంజూరు చేయాలి. విద్యార్థులను చదివించడానికి ముందుకు వచ్చేవారికి వారు అందించే ఆర్థిక సహకారంపై ఆదాయపు పున్ను మినహాయింపు కల్పించాలి. ► ఐఐటీ సహా దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో దాతృత్వ కార్యాలయాల ఏర్పాటు. ► 16 లక్షల మంది బీసీ విద్యార్థుల కోసం 8 వేల హాస్టళ్లు. దూర విద్య ద్వారా విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ. ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 500 వృత్తివిద్యా డిగ్రీ కాలేజీల ఏర్పాటు. ► ప్రపంచస్థాయి ప్రమాణాల కోసం ఎంపిక చేసిన 40–50 విద్యాసంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి. ► విద్యార్థుల పరిశోధనలకు ఆర్థిక సహకారం కోసం జాతీయ అధ్యయన ఫౌండేషన్ ఏర్పాటు. -
గ్యాస్ సబ్సిడీ తిప్పలు ..!
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ డోర్ డెలివరీ జరిగి పక్షం రోజులు గడిచినా నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం పేదల పాలిట శాపంగా తయారైంది. డీబీటీ పథకం అమలు ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమవుతూ వచ్చింది. తాజాగా కొన్ని మాసాలుగా తిరిగి పాత పరిస్థితి పునరావృత్తం అవుతోంది. సబ్సిడీ సొమ్ము 25 రోజులు దాటినా జమ కాని పరిస్థితి నెలకొంది. కొందరికి అసలు సబ్సిడీ జమ నిలిచిపోయింది. సంబంధిత లబ్ధిదారులు డిస్ట్రిబ్యూటర్ను సంప్రదిస్తే సరైన స్పందన లభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ధర చెల్లించి... వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీపై డోర్ డెలివరీ జరుగుతున్న పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన సొమ్ము నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇదీ కేవలం ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. బ్యాంక్‌లో సైతం నగదు జమ కాదు. ఇదీలా ఉండగా సబ్సిడీ సిలిండర్‌కు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయడం పేదలకు ఆర్థిక భారంగా తయారైంది. ఆ తర్వాత సబ్సిడీ ధరపోనూ మిగిలిన నగదు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అయినా ముందు చెల్లింపు కష్టతరంగా తయారైంది. తాజా గా ఆ డబ్బు కూడా జమకాకపోవడంతో వినియోగదారులకు మరింత ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 29.21లక్షల పైనే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్త 125 ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు డిమాండ్ ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి బుకింగ్ ద్వా రా వినియోగదారులకు డోర్ డెలివరీ జరుగుతోంది. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర ఎల్పీజీ సిలిండర్ ధర : రూ.762.35 బ్యాంకులో జమ : రూ. 257.79 -
ప్రతి కుటుంబానికి 72వేలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకాన్ని అమలుచేస్తామన్న రాహుల్.. సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించారు. కనీస ఆదాయ భద్రత పథకంలో భాగంగా దేశంలో అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు ఏటా రూ.72,000 అందజేస్తామని రాహుల్ తెలిపారు. దేశంలోని ఐదు కోట్ల కుటుంబాలు, 25 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిపొందుతారని వెల్లడించారు.. కనీస ఆదాయ భద్రత పథకం ద్వారా దేశంలోని పేదరికంపై విజయం సాధిస్తామని రాహుల్ అన్నారు. ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చలు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులతో ఇప్పటికే చర్చించాం. అనుభవాలు, అభిప్రాయాలకు అనుగుణంగా 5 నెలల పాటు అధ్యయనం చేసి కనీస ఆదాయ భద్రత పథకాన్ని రూపొందించాం. ఇలాంటి చారిత్రాత్మక పథకం ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా రూపుదిద్దుకోలేదు. పేదలకు న్యాయం జరుగుతుంది’ అని తెలిపారు. కావాల్సినంత నిధులు ఉన్నాయి ‘మేం పేదలకు న్యాయం చేయబోతున్నాం. దేశంలో ధనిక, పేద భారత్‌లను ప్రధాని మోదీ సృష్టిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ ఎన్నటికీ జరగనివ్వదు. భారత్ ఎప్పుడూ ఐక్యంగా ఉంటుంది. ప్రధాని ధనికులకు నగదును దోచిపెడితే, కాంగ్రెస్ పార్టీ పేదలకు నగదును అందజేస్తుంది’ అని తెలిపారు. కనీస ఆదాయ భద్రత పథకం అమలు చేసేందుకు కేంద్రం వద్ద తగిన నిధులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక క్రమశిక్షణకు ముప్పు.. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకంపై నీతి ఆయోగ్ పెదవి విరిచింది. ఈ పథకం వల్ల దేశంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ‘స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 2 శాతం, ఏటా బడ్జెట్లో 13 శాతం నిధులను దీనికోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల ప్రజల వాస్తవ అవసరాలు మరుగున పడతాయి. ఇలాంటి పథకాలను అమలుచేయడం ఆచరణసాధ్యం కాదు. ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో ఇచ్చిన పెద్దపెద్ద హామీల తరహాలోనే కాంగ్రెస్ కనీస ఆదాయ భద్రత పథకాన్ని ప్రకటించింది. 1971లో పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హటావో), 2008లో ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్, 2013లో జాతీయ ఆహారభద్రత బిల్లు విషయంలో కాంగ్రెస్ హామీలు ఇచ్చినప్పటికీ వాటిని నిలబెట్టుకోలేదు. కనీస ఆదాయ పథకానికి కూడా ఇదే గతి పడుతుంది’ అని కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి(ఈఏసీ–పీఎం) స్పందిస్తూ.. ‘దేశ ఆర్థికవృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతౌల్యత కోసం నిపుణులు చాలా కష్టపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం వల్ల ఈ సమతౌల్యత దెబ్బతింటుంది’ అని ట్వీట్లు చేసింది. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని నెటిజన్లు గుర్తుచేయడంతో ఈఏసీ–పీఏం సదరు ట్వీట్లను తొలగించింది. ఎలా అమలు చేస్తామంటే? నెలకు రూ.12 వేలలోపు కుటుంబ ఆదాయాన్ని కనీస ఆదాయ భద్రత పథకానికి కటాఫ్‌గా నిర్ణయించామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ‘నెలకు రూ.12,000, అంతకన్నా తక్కువగా ఆర్జించే కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబ ఆదాయానికి, కటాఫ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఉదాహరణకు ఓ కుటుంబం నెలకు రూ.7,000 ఆదాయం పొందితే మిగతా రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇలా ఒక్కో కుటుంబానికి రూ.72 వేల వరకూ అందిస్తామని పునరుద్ఘాటించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కనీస ఆదాయ పథకమన్న రాహుల్.. దీన్ని దశలవారీగా అమలుచేస్తామని ప్రకటించారు. తొలుత పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించి, ఆ తర్వాత దేశమంతా విస్తరింపజేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినవెంటనే అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలను ఎంపిక చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని ప్రతీ నిరుపేదకు కనీస ఆదాయం కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేదలు ఈసారి మోసపోరు కాంగ్రెస్ కనీస ఆదాయ పథకంపై బీజేపీ నేత అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.72 వేలు అంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు. ‘నినాదాలు, వాగ్దానాలు పేదరికాన్ని తొలగించలేవు. అందుకు మా సర్కార్లా ఇళ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్లు, రోడ్లు, ఆసుపత్రులు, ఇతర మౌలికవసతులను కల్పించాల్సి ఉంటుంది. కనీస ఆదాయ పథకం కోసం కేంద్రం రూ.3.6 లక్షల కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం పేదల కోసం ఇప్పటికే రూ.5.34 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది. ప్రస్తుత దేశంలోని అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు వేర్వేరు పథకాల ద్వారా కేంద్రం ఏటా రూ.1.06 లక్షలను అందజేస్తోంది. అలాంటప్పుడు రాహుల్ అందిస్తామని చెబుతున్న రూ.72 వేలతో ప్రయోజనం ఏంటి?’ అని అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. దేశంలోని నిరుపేదలు ఇప్పటికే చాలాసార్లు కాంగ్రెస్ చేతిలో మోసపోయారనీ, కానీ ఈసారి ఆ ఉచ్చులో పడబోరని వ్యాఖ్యానించారు. -
నగదు బదిలీ వద్దు రేషనే మాకు ముద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో నేరుగా ప్రజలకు రేషన్ సరకులను సరఫరా చేయడానికి బదులుగా నగదు బదిలీ చేయడం పట్ల 97 శాతం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా, నగ్రీ సమతి స్థాయిలో పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని గతేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. అప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి తమకు కావాల్సిన బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున తీసుకొని వచ్చేవి. ఇప్పుడు ఆ కుటుంబాలు కేంద్రం నుంచి బ్యాంకులో డబ్బులు పడేవరకు నిరీక్షించాలి. బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు వచ్చాయో, లేదో ముందుగా విచారించాలి. డబ్బులు వచ్చినా అంత తక్కువ డబ్బు లావాదేవీలను బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. దాంతో కుటుంబాలు ప్రజ్ఞా కేంద్రాలకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఆ డబ్బులు తీసుకొని రేషన్ షాపులకు వెళ్లి కిలోకు 32 రూపాయలు చెల్లించి సరకులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. జార్ఖండ్‌లో ఇంటి నుంచి బ్యాంకులు దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు ఉండగా, బ్యాంకుల నుంచి ప్రజ్ఞా కేంద్రాలు 4.3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కాలి నడకన ఆ రెండు చోట్లకు వెళ్లి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి సరకులు తీసుకోవడానికి ఒకరికి 12 గంటల సమయం పడుతుందని పేద కుటుంబాలు వాపోతున్నాయి. ఊతకర్ర లేకుండా అడుగుకూడా వేయలేని జంత్రీదేవీ లాంటి వృద్ధులు ప్రతి నెలా కిలోమీటర్ల కొద్ది నడిచి రేషన్ సరకులు తెచ్చుకోవాలంటే చెప్పలేని గోసవుతోందని, దీనికి బదులు ఒక్కసారి ప్రాణం పోయినా బాగుండని వాపోతున్నారు. ఇక దౌరీదేవీ కాయకష్టం చేయడం వల్ల చేతి వేళ్లపై వేలిముద్రలు చెదిరి పోయాయని, ఆధార్ కార్డు వేలి ముద్రలతో పోలిక సరిపోక పోవడం వల్ల గత నాలుగు నెలలుగా ఆమెకు రేషన్ సరకులు ఇవ్వడం లేదట. రేషన్ సరకులు అందక ఒక్క జార్ఖండ్‌లోనే నలుగురు పిల్లలు మరణించిన విషయం తెల్సిందే. సమితి పరిధిలోని 13 గ్రామాల పరిధిలోని 244 కుటుంబాల అభిప్రాయలను విద్యార్థి వాలంటీర్లు సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్క జార్ఖండ్‌లోనే అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పైలెట్ ప్రాజెక్టలని నిర్వహిస్తున్నాయి. రేషన్ సరుకులు అన్యాక్రాంతం కాకుండా నిరోధించేందుకే తాము నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చామని, దీనివల్ల ఏకంగా 56 వేల కోట్ల రూపాయలు మిగిలాయని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. లబ్ధిదారులకే రేషన్ సరకులు అందక పోవడం వల్లనే ఈ నిధులు మిగిలాయన్నది వాస్తవం. -
నగదు బదిలీతో బహుపరాక్
తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదిలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? దానే దానేపే ఖానేవాలే నామ్ లిఖా హువా థా’ ప్రతి బియ్యపు గింజపైన తినేవాడి పేరు రాసి ఉంటుందట. ఆ మాటేమో గానీ, ప్రజా పంపిణీ వ్యవస్థతో సమాజంలో తమ వంటి వారికి ఆకలితో అలమటించవలసిన అవసరం తప్పిందని ఇప్పటిదాకా పేదప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు. ముతకవో, సన్నవో ఏవో ఒకరకం తిండిగింజలు రేపటి రోజున రేషన్ షాపులో ఇస్తారన్న భరోసా అది. కానీ అవినీతిలో కూరుకుపోయిన సమాజాన్ని శుద్ధిచేసే సాహసం చేయలేకో, ప్రత్యామ్నాయం ఆలోచించలేకో ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో నగదు బదిలీని అమలు చేసే దిశగా అడుగులు వేయడం ఇప్పుడు తెలంగాణ బిడ్డలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదా కరువు కాటకాలలో, తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలకు పాలకులే కనీస ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసేవారు. తదనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ, కరువు పరిస్థితుల్లోనూ ప్రజలు ఆకలి మరణాలకు గురికాకుండా చూసేందుకు పాలకులు బియ్యం తదితర అత్యవసర సరుకులను ప్రజలకు ఉచితంగా ఇచ్చే విధానమూ ఉంది. ఆ తరువాత నక్సల్బరీ ప్రభావంతో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాలు దేశంలో దళిత, ఆదివాసీలపై ఆర్థిక దోపిడీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇదే వారి అభ్యున్నతికి ఉద్యమాలు తెచ్చింది. పేదరికాన్ని తొలగించే కార్యాచరణకు మార్గం ఏర్పరిచింది. ఇందిర గరీబీ హఠావో నినాదం కూడా అందులో భాగమే. దీని ఫలితమే 1970వ దశకంలో ఇదే ప్రజాపంపిణీ వ్యవస్థ మరలా పేదవాడి ఆకలి తీర్చే కేంద్రమైంది. అప్పటినుంచి 2013 వరకు కేవలం సంక్షేమ పథకం రూపంలో ఉన్న ప్రజా పంపిణీ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు భారత ప్రజలను ఆకలి చావుల నుంచి ఓ మేరకైనా తప్పించ గలిగిందనడంలో సందేహం లేదు. సంక్షేమం పరి«ధిని దాటి, ఈ కార్యక్రమం 2013 ఆహార భద్రత చట్టంతో ప్రజల హక్కుగా మారింది. ప్రజలు ఆకలిదప్పులతో మరణించకుండా ఉండడమే ఈ పథకం లక్ష్యం. మూడు దశల్లో ఈ పథకం అమలు జరిగింది. 1939 నుంచి 1965 వరకు, 1965 నుంచి 1975 వరకు, 1975 నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందులో అనేక లొసుగులున్నమాట, అమలులో అవినీతి పేరుకుపోయిన మాట వాస్తవమే. కానీ దశాబ్దాలుగా పేదవాడి ఆకలితీరుస్తున్న ఏకైక పథకం ఇది. దీనితో ప్రధానంగా స్త్రీలు, భావిభారత పౌరులకు కనీస ఆహారం లభిస్తోంది. కేజీ ఒక్క రూపాయి లెక్కన ఒక్కొక్కరికి ఆరు కేజీలు, ఇంట్లో నలుగురుంటే 24 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సబ్సిడీతో రేషన్ ద్వారా అందిస్తోంది. కేవలం మన రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది 2 కోట్ల 79 లక్షల మంది. అంటే తెలంగాణ జనాభా మూడున్నర కోట్లలో ఇది 80 శాతం. నూటికి 20 శాతం మంది మాత్రమే సొంతంగా బియ్యం కొనుక్కొని తినగలుగుతున్నారని ప్రభుత్వమే తేల్చింది. మిగిలినవాళ్లంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారేనని ప్రభుత్వం అంచనావేసి, వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. రేషన్ కార్డుల తనిఖీలు నిర్వహించి, వారికి సరిగ్గా సరుకులు అందుతున్నాయా లేదా అని పరిశీలించి, చివరకు నేరుగా లబ్ధిదారులకే రేషన్ బియ్యం తదితరాలు అందేలా, ఆధార్‌తో అనుసం«ధానం చేసి, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటువంటి తరుణంలో, ప్రభుత్వం రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఒకటి అవినీతి. మరొక ప్రధానమైన అంశం– లబ్ధిదారులు ఈ బియ్యం వినియోగించుకోకుండా అమ్ముకుంటున్నారని. ప్రజలు వెచ్చిస్తున్న ఒక్క రూపాయి సహా, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కలిపి మొత్తం పాతిక రూపాయలకు పైగానే ఒక కిలో బియ్యానికి ఖర్చు అవుతున్నది. కనుక ఎవరో వ్యాపారస్తులకు కాక, ప్రజలకే నేరుగా ఇప్పుడు ఖర్చు చేస్తున్న పాతికరూపాయలకు అదనంగా కొంత కలిపి, మొత్తం 900 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయాలన్నది ప్రభుత్వ యోచన. అలాగే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో (పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్ అండ్ హవేలీ)ఈ నగదు బదిలీ అమలవున్నది. అది సత్ఫలితాలిస్తున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం పేదల మంచి కోసమే ఆలోచించే ఈ కార్యక్రమానికి పూనుకోవచ్చుగాక. కానీ ఆచరణలో ఇది అత్యంత ప్రమాదాన్ని కొనితెస్తుంది. మధ్యాహ్న భోజనం ఒక్కపూట మినహాయిస్తే మిగిలిన రెండు పూటలూ ఈ రేషన్ బియ్యంపైనే ఆధారపడి పిల్లలు బతుకుతున్నారు. ఈ పథకం మీద ఆధారపడి 60 శాతం మంది ప్రజలు బతుకుతున్నారని ఏ గ్రామాన్ని పరిశీలించినా అర్థం అవుతుంది. పోనీ సగం మందే ఈ పథకం ద్వారా వస్తున్న బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారనుకుందాం. అలా చూసినా తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? పురుషాధిపత్య సమాజంలో ఎంత మంది స్త్రీలకు ఆర్థికాంశాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నది? అసలు స్త్రీల చేతికి ఆ డబ్బు వస్తుందా? వచ్చినా నాలుగు తన్నులు తన్ని ఏ తాగుడుకో తగులబెట్టేవారు ఈ బియ్యం అవసరమైన కుటుంబాల్లోని వారే. మహిళలపై హింస పెట్రేగి, వారిని మరిన్ని సమస్యల్లోకి తోసివేసే ప్రమాదం నగదు బదిలీ ప్రక్రియలో ఉండదని హామీ ఇవ్వగలరా? ఓపెన్ మార్కెట్లో బియ్యం ధరలను విపరీతంగా పెంచే ప్రమాదం కూడా ఉంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? డిజిటల్ యుగంలో బయోమెట్రిక్ వంటి సాధనాలతో అవినీతిని కొంత మేరకైనా తగ్గించే అవకాశం ఉంది. పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. అవినీతిని అరికట్టేందుకు పేదప్రజలపై అస్త్రాలు ప్రయోగించడం కాకుండా బడాబాబుల, వ్యాపారస్తుల మోసాలను అరికట్టడానికి, పథకం దుర్వినియోగాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేయాలి. చివరగా ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్తున్న సన్న బియ్యాన్ని రేషన్ బియ్యానికి కూడా వర్తింపజేయాలి. ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో ఉన్నవి. ప్రభుత్వం చేయగలిగినవి. చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
‘రూ 57,000 కోట్లు ఆదా’
సాక్షి,న్యూఢిల్లీః ప్రభుత్వ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ 57,000 కోట్లు ఆదా అయ్యాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఈ సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్లేదని ఇప్పుడు దీనికి అడ్డుకట్ట పడిందని అన్నారు. ఉపాథి హామీ పథకం సహా పలు పథకాల చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతున్నాయని చెప్పారు. ఇక డ్రైవింగ్ లైసెన్సులకూ ఆధార్‌ను లింక్ చేయనున్నామన్నారు. ఆధార్ డేటాపై ఆందోళన అనవసరమని, ఐరిస్ స్కాన్, ఫింగర్‌ప్రింట్స్ సహా బయోమెట్రిక్ సమాచారం అంతా సురక్షితంగా భద్రపరుస్తారని తెలిపారు. ఆధార్ డిజిటల్ గుర్తింపు మాత్రమేనని, ఆధార్ అనధికార వినియోగాన్ని అరికట్టేందుకు చట్టాలున్నాయని చెప్పారు. -
‘దీపం’ వెలుగుకు నగదు బదిలీ అడ్డంకి!
ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి దూరంగా ఉన్న పేద కుటుంబాలు 3 జిల్లాల్లో ముగిసిన అదనపు గడువుతో మార్కెట్ ధర చెల్లించాల్సిన దుస్థితి హైదరాబాద్: ‘దీపం’ వెలుగులకు గ్యాస్ నగదు బదిలీ పథకం అడ్డంకిగా మారింది. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానంపై దీపం పథక లబ్ధిదారులకు అవగాహన లేకపోవడం వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 11 శాతం మంది గ్యాస్ నగదు బదిలీ పథకానికి దూరంగా ఉండగా అందులో 6 నుంచి 7 శాతం దీపం లబ్ధిదారులే ఉన్నారని ఆయిల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రెండోసారి ఇచ్చిన అదనపు గడువు సైతం ముగిసిన నేపథ్యంలో మొదటి విడతలో నగదు బదిలీ ఆరంభమైన 3 జిల్లాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌లలోని దీపం లబ్ధిదారులు మార్కెట్ ధరను చెల్లించి సిలిండర్‌ను పొందాల్సి వస్తోంది. నగదు బదిలీకి దూరంగా 4 లక్షల మంది దీపం లబ్ధిదారులు! కేంద్రం తీసుకొచ్చిన నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ నంబర్‌కు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు అనుసంధాన అదనపు వెసలుబాటు గడువు మూడు జిల్లాల్లో ఈ నెల 14తో ముగిసింది. మిగతా ఏడుజిల్లాల్లో జూన్ చివరతో ముగియనుంది. ఇప్పటివరకు అందిన లెక్కల మేరకు రాష్ట్రం మొత్తంగా 89 శాతం మంది ఆధార్, బ్యాంక్ ఖాతాలను అనుసంధానించుకున్నా, మిగతా వారిలో మాత్రం ఎక్కువగా దీపం పథకం లబ్ధిదారులే ఉన్నారు. ముఖ్యంగా తొలి విడత నగదు బదిలీ మొదలైన మూడు జిల్లాల పరిధిలో ఆధార్ సీడింగ్ కలిపి చూస్తే ఆదిలాబాద్‌లో 90 శాతం, రంగారెడ్డిలో 88 శాతం, హైదరాబాద్‌లో 87 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. జంట జిల్లాల్లో మొత్తం 29 లక్షల ఎల్పీజీ గృహ వినియోగదారులు ఉండగా, అందులో నగదు బదిలీ పథకంలో 22.44 లక్షలు చేరగా, 6.56 లక్షల వినియోగదారులు దూరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మరో 1.50 లక్షల మంది దూరంగా ఉన్నారని చెబుతున్నారు. గడువులోగా అనుసంధానానికి ముందుకురాని మొత్తం 8 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ రాయితీ ధరకు దక్కే అవకాశాల్లేవు. ఇందులో 4లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులే ఉన్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. బాధ్యత పౌర సరఫరాల శాఖదే! దీపం లబ్ధిదారులను నగదు బదిలీ పథకంలో చేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా పౌర సరఫరాల శాఖ మీదే ఉందని పరిశీలకులు అంటున్నారు. శాఖా పరంగా దీపం లభ్ధిదారుల వివరాలు తెప్పించి మండల, జిల్లాల వారీగా పరిశీలించి అందులో ఆధార్, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి, నగదు బదిలీ పథకంలో చేరేలా అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంటేనే నిరుపేదకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. -
నగదు బదిలీ ‘కాక ’
కలెక్టరేట్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ఆధార్ నంబర్ ఇస్తున్నా నగదు బదిలీ కాని పరిస్థితి అవస్థలు పడుతున్న వినియోగదారులు విజయనగరం కంటోన్మెంట్: కొత్త వలసకు చెందిన కంది సత్యనారాయణకు గ్యాస్ కనెక్షన్ ఉంది. దానికి ఆధార్ నంబర్ సీడింగ్‌తో పాటు ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ నంబర్‌ను కూడా అందజేశారు. ఈయనకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేశారు అయితే ఈయన దగ్గర గ్యాస్ సిలిండర్ కోసం పూర్తిస్థాయి నగదు తీసుకున్నప్పటికీ సబ్సిడీ డబ్బులు మాత్రం అకౌంట్లో జమ కాలేదు. దీంతో ఆయన కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఇటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో అమలు చేయలేని ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. జిల్లాలోని వినియోగదారుల ఖా తాలకు కాకుండా ఇతర ఖాతాలకు జమ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నా యి. దీంతో ఈ పథకం వల్ల వినియోగదారులకు సౌకర్యాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎనిమిది వందల రూపాయలకు పైగా డబ్బు గ్యాస్ సిలిండర్‌కు చెల్లిస్తున్నప్పటికీ సిలిండర్‌కు రూ.440 మినహాయిస్తే మిగతా సొమ్ము సబ్సిడీగా రావాల్సి ఉందని, దీనిని చెల్లించడం లేదని అడుగుతున్న వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు కూడా సక్రమంగా సమాధానాలు చెప్పడం లేదని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నగదు బదిలీని అమలుచేస్తామని గతంలో పలుమార్లు చెప్పిన అధికారులు ఆధార్ సీడింగ్ పూర్తిగా జరగకపోవడంతో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇప్పుడు దాదాపు 95 శాతం మందికి ఆధార్ నమోదు చేయ డంతో నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ నగదు మాత్రం బదిలీ కావడం లేదు. జిల్లాలో 5 కొత్త ఏజెన్సీలతో కలిపి మొత్తం 24 ఏజెన్సీలలో 3,28,658 గ్యాస్ కనెక్షన్లున్నాయి.ఈ కనెక్షన్లలో లక్షా 25వేలు దీపం పథకానికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్లున్నాయి. మొత్తం కనెక్షన్లలో దాదాపు 2.80లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేశారు. కానీ నగదు బదిలీ మాత్రం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనిపై ఏజెన్సీ సిబ్బంది మాట్లాడుతూ ఎక్కువ మంది వస్తుండడంతో తాము సమాధానం చెప్పడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. మార్చి నెలాఖరు వరకూ గడువు ఇచ్చినా.. జనవరి నెల నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పినప్పటికీ అన్ని వివరాలూ సమర్పించేందుకు మార్చి నెల వరకూ అవకాశం ఇచ్చారు. అయితే జిల్లాలో మాత్రం మార్చి నెల వరకూ చూడకుండా ఏకంగా జనవరి నెల నుంచే గ్యాస్ కనెక్షన్లు నిలిపివేశారు. బుక్ చేస్తే ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారికి కూడా మీ కనెక్షను సక్రమంగా లేదని సమాధానం వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. అదేవిధంగా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే ఆధార్, బ్యాంకు అకౌంట్లు సమర్పించిన వారికి కూడా మీ ఆధార్ నంబర్ సమర్పించలేదని సమాధానాలు వస్తున్నాయని వాపోతున్నారు. దీనిపై అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉందని కోరుతున్నారు. -
కరెంటు ఉంటే..కిరోసిన్ కట్!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీపై కిరోసిన్ పొందుతున్నవారిపై దృష్టి పెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం విద్యుత్ సదుపాయం ఉన్న గృహాలను గుర్తించి.. ఆ ఇళ్లకు సబ్సిడీ కిరోసిన్ సదుపాయాన్ని నిలిపేయాలనే ప్రతిపాదన తమకు వచ్చిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్లో ధరను సమయం వచ్చినప్పుడు తగ్గిస్తామని ప్రధాన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కిరోసిన్ సబ్సిడీ కోసం రూ. 30,575 కోట్లను, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ. 46,458 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.నగదు బదిలీ వల్ల ఎల్పీజీ సబ్సీడీ భారాన్ని 15శాతం తగ్గించుకుంది. -
నగదు బదిలీలో గోల్మాల్..!
చిత్తూరులో కొంగారెడ్డిపల్లెకు చెందిన సంజీవరెడ్డి(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 28 6509) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. అదే రోజున ఒక నెల రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.568 బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం వచ్చింది. చిత్తూరులో బీవీ రెడ్డి కాలనీ కి చెందిన రామ్మోహన్‌రాజు (గ్యాస్ కనెక్షన్ నెంబర్ 35 09) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నా రు. ఆ తర్వాత కొద్ది నిముషాలకే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.468 జమా చేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. చిత్తూరులో మార్కెట్ వీధికి చెందిన ధనశేఖర్(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 16292) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.343 జమ అయినట్లు ఎస్ఎంఎస్ రూపంలో సెల్‌ఫోన్‌కు సమాచారం వచ్చింది. గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో గోల్‌మాల్‌కు ఇదో తార్కాణం. అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తామన్న సర్కారు.. అధికశాతం మందికి రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు. * నగదు బదిలీ పేరుతో గ్యాస్ రాయితీలో కోత వేస్తున్న ప్రభుత్వం * తొలి నెల అడ్వాన్సుగా రూ.568 జమ చేస్తామంటూ ప్రకటనలు * కానీ అధికశాతం లబ్ధిదారులకు రాయితీలో రూ.200కు పైగా కోత * రాయితీలో భారీగా కోత వేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన! సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాత కథే పునరావృత్తమవుతోంది..! గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో లోపాలు బహిర్గతమవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తుండ డంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రజల పొట్టకొట్టి గ్యాస్ రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారన్న విమర్శలకు ఇది బలం చేకూర్చుతోంది. విపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడం రద్దు చేయాలంటూ ఉద్యమించిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ‘యూ’టర్న్ తీసుకున్నాయి. నగదు బదిలీ పథకమే ముద్దంటున్నాయి. పనిలో పనిగా నవంబర్, 2014 నుంచే గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా పథకాన్ని అమలుచేశారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేసుకున్న ఏ ఒక్క లబ్ధిదారునికి రాయితీని ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. జనవరి 1 నుంచి గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్(14.2 కిలోల) పూర్తి ధర రూ.768.50 కేంద్రం ఇచ్చే రాయితీ రూ.450. నవంబర్ ముందు వరకూ లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ చేసేటపుడు రూ.318.50 చెల్లించేవారు. జూన్ 1 నుంచి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారులకు తొలి నెల అడ్వాన్సు రాయితీ కింద రూ.568 జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. నాలుగు రోజులుగా రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారుల్లో 90 శాతం మందికిపైగా సగటున రూ.343 మాత్రమే అడ్వాన్సు రాయితీ రూపంలో జమ కావడం గమనార్హం. ప్రభుత్వం చేసిన ప్రకటనకూ.. క్షేత్ర స్థాయిలో అమలు తీరుకూ భారీ వ్యత్యాసం ఉండటంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఆందోళనలో లబ్ధిదారులు.. నిరుపేద లబ్ధిదారులు ముందే పూర్తి ధర వెచ్చించి సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకోలేరనే భావనతో ప్రభుత్వం తొలి అడ్వాన్సుగా రాయితీ కింద రూ.568 జమ చేస్తామని పేర్కొంది. కానీ.. అడ్వాన్సును జమ చేయడంలోనే గోల్మాల్ చోటుచేసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ కొంత మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు లేకపోవడంతో గ్యాస్ రాయితీ వారికి దక్కకుండా పోతోంది. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ.. ఇప్పటిదాకా 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం(సీడింగ్‌ను) పూర్తిచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అంటే.. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. దీన్నెప్పుడు పూర్తిచేస్తారన్న అంశంపై అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడంలేదు. ఇక ఆధార్ సీడింగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అధికశాతం మంది లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కావడం లేదు. లబ్ధిదారుడి గ్యాస్ కనెక్షన్ నంబర్.. ఆధార్ నంబర్.. బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేయడంలో తప్పులు దొర్లడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే.. ముంబయిలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఆ వెంటనే ఆన్లైన్లో సంబంధిత లబ్ధిదారుని ఖాతాలో రాయితీని జమ చేస్తారు. సీడింగ్‌లో తప్పులు దొర్లడం వల్ల లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ కావడం లేదు. ఈ తప్పులను సరిదిద్దడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. నాటి ఉద్యమాలు దేనికో.. యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2013 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు రాయితీని నగదు బదిలీ రూపంలో జమ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అప్పట్లోనే లబ్ధిదారుల గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలను సీడింగ్ చేశారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ నగదు బదిలీ రూపంలోనే గ్యాస్ రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. సీడింగ్‌లో లోపాలు ఉండడం వల్ల అధికశాతం మందికి రాయితీ జమ కాకపోవడం.. ఆధార్ లేకపోవడం వల్ల గ్యాస్ రాయితీ దక్కకుండా పోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఇదే అదునుగా తీసుకున్న టీడీపీ, బీజేపీలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజాగ్రహానికి దిగివచ్చిన యూపీఏ సర్కారు డిసెంబర్, 2013 నుంచి నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. అప్పట్లో నగదు బదిలీకి వ్యతిరేకంగా ఉద్యమించిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు అదే అమలుచేస్తోండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గ్యాస్ ‘కష్టాలు’ బదిలీ
నేటి నుంచి నగదు బదిలీ పథకం అమలు గ్యాస్ సిలిండర్ ధర రూ.752 కేంద్రం ఇచ్చే రాయితీ రూ.568 బుక్ చేయగానే అడ్వాన్స్ జమ తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర కానుకగా గ్యాస్ లబ్ధిదారులకు కష్టాలను బదిలీ చేశారుు. గ్యాస్ రాయితీ నగదు గురువారం నుంచి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రీ ఫిల్లింగ్ కోసం లబ్ధిదారుడు బుక్ చేసుకోగానే ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తారు. పూర్తి ధర వెచ్చించి రీ ఫిల్లింగ్ చేయించుకున్నాకనే రాయితీని ఖాతాలో జమ చేస్తారు. అంటే ఇకపై గ్యాస్ సర్వీసు నంబరు, ఆధార్ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేసుకోని లబ్ధిదారులకు అందదు. అనుసంధానం చేసుకున్నా సాంకేతిక మార్పులు తలెత్తితే రాయితీ దక్కదు. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇదే పద్ధతిని అనుసరించినప్పుడు బీజేపీ, టీడీపీలో ఉద్యమాలు చేశారుు. నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారుు. ఇప్పుడు పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు పట్టుబట్టి నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తోండటం గమనార్హం. అప్పుడు ఉద్యమాలు.. ఇప్పుడు నీతులా..? గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జనానికి దన్ను బీజేపీ, టీడీపీలు భారీ ఎత్తున ఉద్యమాలు చేశాయి. డిసెంబర్ 3, 2013న గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. కేంద్రం అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఆదిలోనే గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని నవంబర్ 10, 2014న ప్రకటించింది. జిల్లాలో జనవరి 1, 2015 నుంచి గ్యాస్ రాయితీని నగదు బదిలీ రూపంలో లబ్ధిదారులకు నేరుగా అందిస్తామని స్పష్టం చేసింది. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం పూర్తిచేశారు. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో లబ్ధిదారులు పూర్తి ధర వెచ్చించి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకున్నారు. ఆ రెండు నెలల రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జనవరిలో జమ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. బుక్ చేసుకోగానే అడ్వాన్సు జమ .. సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే లబ్ధిదారుడి ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పూర్తి ధర రూ.752. కేంద్రం ఇచ్చే రాయితీ రూ.568. తొలి నెల మాత్రమే ప్రభుత్వం అడ్వాన్సు రూపంలో రాయితీని జమ చేస్తుంది. రెండో నెల నుంచి లబ్ధిదారుడు పూర్తి ధర వెచ్చించి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేసుకోవాలి. సంబంధిత డీలర్ సిలిండర్ డెలివరీ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపరిచితేనే లబ్ధిదారుడి ఖాతాలో రాయితీ జమ అవుతుంది. డీలర్ డెలివరీ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపర్చకపోయినా.. సీడింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా లబ్ధిదారుడికి రాయితీ దక్కదు. విపక్షంలో ఉన్నప్పుడు వద్దన్న బీజేపీ, టీడీపీలు అధికారాన్ని చేజిక్కించుకోగానే నగదు బదిలీ ప్రవేశ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి నగదు బదిలీ
బెంగళూరు: రాష్ట్రంలో గ్యాస్ కు నగదు బదిలీ పథకం-పహల్ (డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎల్పీజీ సబ్సిడీ- డీబీటీఎల్) కింద పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో ఇప్పటి వరకూ లక్ష్యంలో 40 శాతా న్ని మాత్రమే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-కర్ణాటక శాఖ చేరుకోగలిగింది. కర్ణాటకలోని అన్ని జిల్లాలలతో సహా దేశ వ్యాప్తంగా డీబీటీఎల్ అమల్లోకి గురువారం నుంచి అమల్లోకి వస్తోంది. అయితే పెలైట్ ప్రతిపాదికన నవంబర్ 15నే కర్ణాటకలోని తుమకూరు, మైసూరు జి ల్లాలను ఎంపిక చేసి అప్పటి నుంచి డీబీటీఎల్ను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా అప్పటి నుంచే పహ ల్ పథకాన్ని గూర్చి ప్రచారం చేయ డం అధికారులు పెద్ద ఎత్తున ప్రా రంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 68 లక్షల మంది ఎల్పీజీ వినియోగదారులు ఉండగా.. అందులో దాదా పు 27.20 లక్షల మంది (40 శా తం) మాత్రమే ఇప్పటి వరకూ డీబీ టీఎల్ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చాలా మంది విని యోగదారులకు ఆధార్ కార్డులు లే క పోవడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్ అకౌంట్‌లేని వారు కూడా ఇప్పటి వరకూ సబ్సిడీ ధరలకే గ్యాస్‌ను పొందుతున్నవారు ఉన్నారు. ఇ లాంటి పరిస్థితి హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉంది. వీరు ఇప్పుడిప్పుడే ఖాతాను ప్రా రంభించడానికి ప్రయత్నాలు ప్రా రంభించారు. అయితే బ్యాంకు అధికారులు వివిధ కారణాలు చూపు తూ ఖాతాల నమోదుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో అటు అధార్ కా ర్డు.. ఇటు బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఎల్పీజీ వినియోగదారు లు డీబీటీఎల్ లబ్ధిదారులు కా వడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (కర్ణాటక) జనరల్ మేనేజర్ ఎస్ వరదాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో డీబీటీఎల్ కింద పేర్ల నమోదు ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతు న్న మాట వాస్తవమే. ఇప్పటి వరకూ 40 శాతం ప్రక్రియ మా త్రమే పూర్తయింది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక కాస్త మెరుగ్గానే ఉంది. డీ బీటీఎల్పై ఇప్పుడిప్పుడే ప్రజలకు అవగాహన పెరుగుతోంది. అందువల్ల మరో రెండు నెల ల్లోనే 80 నుం చి 85 శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. గ్యాస్‌బుక్ చేసుకున్న రెండు రోజు ల్లోపు సబ్సిడీ ధర లబ్ధిదారుల బ్యాం క్ అకౌంట్‌కు చేర్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం.’ అని తెలిపారు. పహెల్ పథకం ఇలా భాగస్వామ్యం కావచ్చు ఎల్పీజీ వినియోగదారులు ఆధార్ ఉంటే దానితోపాటు బ్యాంకు అ కౌంట్‌ను గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఇందు కోసం ఫార్మ్-1ను పూర్తి చేసి బ్యాంక్ శాఖ లో అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నంబర్‌ను ఎల్పీజీ వినియోగ దారుని యునిక్ నంబర్ తో అనుసంధానం చేయడానికి వీ లుగా ఫార్మ్-2ను పూర్తి చేసి డిస్ట్రిబ్యూటర్‌కు అందించాల్సి ఉంటుం ది. ఆధార్‌లేని వారు బ్యాంక్ అకౌం ట్ నంబర్‌ను డిస్టిబ్యూటర్‌కు అం దించడానికి వీలుగా ఫార్మ్-4ను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా 17 అంకెల ఎల్పీజీ వినియోగదారుని యునిక్ నంబర్‌ను బ్యాంక్ అ కౌంట్‌తో అనుసంధానం చేయడానికి వీలుగా ఫార్మ్-3ను పూర్తి చేసి సంబంధిత అధికారికి అందజేయా ల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.mylpg.in లేదా 1800-2333-555లో సంప్రదించవచ్చు. 4. -
నేటి నుంచి నగదు బదిలీ
జిల్లాలో 74 శాతం ఆధార్ అనుసంధానం బ్యాంక్‌ల్లో ఆధార్ నంబర్ తప్పనిసరి 75 వేల ఇండేన్ గ్యాస్ కనక్షన్లు తాత్కాలికంగా నిలుపుదల ! మార్చి నుంచి పూర్తి స్థాయిలోబదిలీ ప్రక్రియ అమలు ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం నేటి నుంచి అమలు కానుంది. నూతన సంవత్సరంలో గ్యాస్ వినియోగదారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ నగదు బదిలీని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో జిల్లాలో నేటి నుంచి ఈ పథకం అమలు కానుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వర్తించదు. వారికి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ. 981 చెల్లించాలి. తొలుత గ్యాస్ వినియోగదారులు గ్యాస్ ధర మొత్తాన్ని చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. కొద్దిరోజుల తర్వాత సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,05,446 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 5,00,114 కనెక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో 74 శాతం మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు. మార్చిలోపు అనుసంధానం కాకుంటే అదనపు భారం.. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారభింస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడువు ఉంది. అప్పటికి కూడా అనుసంధానం చేసుకోకుంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. గ్యాస్ కనెక్షన్లు తాత్కాలిక నిలుపుదల..! నగదు బదిలీ అమల్లో భాగంగా బ్యాంక్ ఖాతాలకు అధార్ అనుసంధానం చేసుకోని పలువురు వినియోగదారుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. వీటిలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులైన 75 వేల మంది బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం చేసుకోకపోవటంతో వారి కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. వినియోగదారుల్లో గందళగోళం... గ్యాస్ వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. జనవరి 1నుంచి నగదు బదిలీ అమలవుతుందని, ఇక నుంచి సిలిండర్‌కు సబ్సిడీ వర్తించద ని ప్రకటించడంతో వారు ఆందోళన చెందుతున్నా రు. గత ఏడాది జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి నగదు బదిలీ అమలు చేసే సమయంలో దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే కొందరు లబ్ధిదారులు నగదు బదిలీ చేయించుకోవడంతో సబ్సిడీలో కొంత గందరగోళం నెలకొంది. ఒక వినియోగదారుడి సబ్సిడీ మరొకరి ఖాతాలోకి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా మళ్లీ నగదు బదిలీ వ్యవహారం తెరపైకి రావడంతో ఒక వైపు ఆధార్ పూర్తికాక పోవడం, మరో వైపు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో అయోమయంలో పడ్డారు. గ్యాస్ వివరాలు ఇలా... జిల్లా వ్యాప్తంగా 5,00,114 గ్యాస్ కనక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో గ్యాస్ ఏజెన్సీల్లో అనుసంధానం అయినవి 3,69,816 కాగా, బ్యాంక్‌లో అనుసంధానం అయినవి 2,67,295 ఉన్నాయి. జిల్లాలో భారత్ పెట్రోలియం కంపెనీకి చెందినవి 76,805, ఇండియన్ అయిల్ కార్పొరేషన్ 1,66,118, హిందుస్థాన్ పెట్రోలియం 2,57,191 కనక్షన్లు ఉన్నాయి. -
వచ్చేనెల నుంచే నగదు బదిలీ!
మెదక్ రూరల్: జిల్లాలో నగదు బదిలీ పథకం మళ్లీ అమలుకాబోతోంది. కాంగ్రెస్ హయాంలో అమల్లోకొచ్చిన ఈ పథకం ఆ తర్వాత పలు కారణాలతో నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే అక్రమాలకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీ తప్పదని భావిస్తున్న సర్కార్ తిరిగి ఈ పథకాన్ని జనవరి నుంచి పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం కూడా సిద్ధమైంది. అధికారిక లెక్కల ప్రకారం..జిల్లాలో భారత్, హెచ్‌పీ, ఇండియన్ కంపెనీల పరిధిలో 3,39,742 కనె క్షన్లుండగా, దీపం పథకానికి సంబంధించిన మరో 1,75,391 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 5,15,133 కనెక్షన్లు ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పొందాలంటే 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులూ తప్పకుండా తమ ఆధార్ కార్డుల ప్రతిని గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అంతా పారదర్శకత మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతుంటే గ్యాస్ వినియోగదారుడు అంతమొత్తాన్ని గ్యాస్ డీలర్‌కు చెల్లించి గ్యాస్‌బండను పొందాల్సి ఉంటుంది. ఇలా గ్యాస్‌ను పొందిన వినియోగదారుల జాబితాను సదరు గ్యాస్ డీలర్ సర్కార్‌కు పంపితే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుంది. గ్యాస్‌బుకింగ్, డెలివరీ, సబ్సిడీ మొత్తం జమ అంతా ఆన్లైన్లో జరగడంతో అక్రమాలకు అవకాశం ఉండదని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారిలో సగం మంది కూడా గ్యాస్‌ను వాడడం లేదని, అయినప్పటికీ వారిపేరు మీద కొందరు డీలర్లు, ఇతరులు గ్యాస్‌ను బుక్ చేసుకుని ప్రభుత్వ సబ్సిడీని అక్రమంగా పొందుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే సర్కార్ ప్రతి వినియోగదారుడూ తన ఆధార్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఖాతా ప్రతిని గ్యాస్ డీలర్‌కు ఇవ్వాలని చెబుతోంది. అప్పుడు ఎవరైనా వినియోగదారునికి తెలియకుండా గ్యాస్ బుక్ చేసినా వెంటనే తెలిసిపోతుందని, అందువల్ల అక్రమాలకు తావే ఉండదని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి జిల్లాలోని గ్యాస్ వినియోగదారులంతా గ్యాస్‌కు పూర్తి డబ్బులను చెల్లించాల్సి ఉంటుందని పదే, పదే లబ్ధిదారుల ఫోన్లకు గ్యాస్ ఏజెంట్లు సంక్షిప్త సమాచారాన్ని పంపుతున్నారు. దూరాన్ని బట్టి ధర ప్రసుత్తం గ్యాస్ ధరను దూరాన్నిబట్టి రవాణా ఖర్చులను కలుపుకుని నిర్ణయిస్తారు. ప్రస్తుతం మెదక్‌లో సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఈ పూర్తి మొత్తాన్ని జనవరి నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెంట్లకు చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.451 నేరుగా లబ్ధిదారుడు ఖాతాలో జమ అవుతుంది. దీంతో నేరుగా ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారులకు చేరుతుంది. -
ఆధార్ ఉంటేనే ‘నగదు బదిలీ’
* జనవరి నుంచి పథకం అమలు * డీలర్లకు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ అందించాలి * గ్యాస్ వినియోగదారులకు కలెక్టర్ సూచన ప్రగతినగర్ : గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ డీలర్లకు వెంటనే బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు అందించాలని కలెక్టర్ రొనాల్రోస్ సూచించారు. లేని పక్షంలో నగదు బదిలీ పథకం ద్వారా ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ కోల్పోతారని స్పష్టం చేశారు. జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ పథకం అమలవుతుంద ని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లు, పౌర సరఫరాల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీలు, విని యోగదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నం బర్ల సేకరణపై సమీక్ష జరిపారు. నగదు బదిలీ పథ కం అమలు నేపథ్యంలో వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ నంబర్ల సీడింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం మహిళా స్వయం సహాయక సం ఘాల సహకారాన్ని తీసుకోవాలని గ్యాస్ డీలర్లకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 13 ఉండగా 1,86,970 కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు సీడింగ్ 56 శాతం, ఆధార్ సీడింగ్ 86 శాతం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలింగ్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 11 ఉండగా 1,29,375 కనెక్షన్లు ఉన్నాయి. 48 శాతం బ్యాంకు సీడింగ్ జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 20 ఉండగా 1,20,389 కనెక్షన్లు ఉన్నాయి. 48 శాతం బ్యాంకు సీడింగ్ జరిగింది. మిగిలిన వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి బ్యాంకులకు జాబితాలు అందచేయాలని గ్యాస్ డీలర్లతో కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంకర్లు సైతం అనుసంధాన ప్రక్రియను వేంటనే పూర్తిచేయాలన్నారు. ఆధార్ లేని వినియోగదారులు వెం టనే ఆధార్ తీసుకుని బ్యాంకు ఖాతా నంబర్లతో పాటు ఏజెన్సీలకు అందచేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణారావు, డిప్యూటీ ఎల్డీఎం రవీంధ్రనాథ్, డీఎస్ఓ కొండల్రావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ సెల్స్ మేనేజర్లు బ్రహ్మానందరావు, శివరాజ్‌సింగ్, మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అస్తవ్యస్తంగా గ్యాస్ రాయితీ
వ్యక్తిగత ఖాతాల్లో సక్రమంగా జమకాని సబ్సిడీ బ్యాంకులు, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న వినియోగదారులు ఎన్నిదఫాలు ఆధార్ ఇచ్చినా తప్పని తిప్పలు ధర్మవరం : గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం అస్తవ్యస్తంగా మారింది. వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు సక్రమంగా జమ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఖాతాల్లోకి డబ్బులు జమకాని వినియోగదారులు చాలా మందే ఉన్నారు. సబ్సీడీకి సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ (1800 2333 555) వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాధితులు చెబుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు 30 వేల దాకా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ వినియోగదారులు ఇప్పటికే తమ ఆధార్, బ్యాంకుఖాతా, ఫోన్‌నంబర్, గ్యాస్నంబర్ లను గ్యాస్ ఏజెన్సీలలో ఒక దఫా, బ్యాంకులలో మరో దఫా అందజేశారు. దీంతో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ సెంటర్లలోనూ కొందరు వినియోగదారులు తమ వివరాలను నమోదు చేయించారు. తొలుత వినియోగదారులు ప్రభుత్వ సబ్సిడీతో కలిపి మొత్తం నగదును గ్యాస్ ఏజెన్సీలకు చెల్లిస్తే సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లోకి జమకావాలి. కానీ చాలా మంది వినియోగదారులకు ప్రభుత్వ మందించే సబ్సిడీ జమ కావడం లేదు. దీంతో బాధితులు బ్యాంకుల చుట్టూ తిరిగితే వారు తమకు సంబంధం లేదంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలను అడిగితే ఇది తమ వ్యవహారం కాదంటున్నారు. మొత్తం మీద ఈ నగదు బదిలీ పథకం ద్వారా పూర్తి మొత్తం ప్రతి నెలా చెలిచి గ్యాస్ సిలెండర్లను కొనుగోలు చేయడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారింది. దీనిపై ప్రభుత్వం ఆలోచించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బాధల బదిలీ
గ్యాస్ బండ అందకున్నా తీసుకున్నట్లు మెసేజ్‌లు నత్తనడకన వంటగ్యాస్ ఆధార్ సీడింగ్ జిల్లాలో 7,20,991 వంటగ్యాస్ కనెక్షన్లు ఏజెన్సీల పరిధిలో 92 శాతం సీడింగ్ బ్యాంకుల వద్ద 82 శాతం సీడింగ్ చిత్తూరు: నగదు బదిలీ పథకం కాస్తా కష్టాల బదిలీగా మారింది. వంటగ్యాస్‌కు ఈ పథకం అమలు చేయడంలో బాలారిష్టాలను అధిగమించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల్లో ఇచ్చిన ఖాతా నంబర్‌కు నగదు సక్రమంగా జమ కావడం లేదు. ఒకే ఆధార్‌కార్డు నంబర్‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతా ఉన్న వ్యక్తులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఇచ్చిన ఖాతాకు కాకుండా మరో అకౌంట్లో మొత్తం జమ అవుతోంది. దీంతో ఆ వినియోగదారుడు తిప్పలు పడుతున్నాడు. ఇంకొంత మందికి అసలు సబ్సిడీ అందుతున్న పరిస్థితి లేదు. కొందరికి సబ్సిడీ మొత్తం తక్కువగా జమ అవుతోంది. దీంతో వినియోగదారులు పదేపదే ఏజెన్సీలు, బ్యాంకుల వద్దకు తిరగాల్సి వస్తోంది. సర్వర్ సమస్య ఈ సమస్యలన్నింటికీ సాంకేతిక తప్పిదాలే కారణం అని చమురు సంస్థల ప్రతినిధులు చల్లగా చెబుతున్నారు. ముంబైలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల సెల్ఫోన్లకు తప్పుడు ఎస్ఎంఎస్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే ఆధార్ నంబర్‌తో ఇతర బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉండడంవల్ల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తం మిగిలిన అకౌంట్లలో పడే అవకాశం ఉంటుందనేది వారి వాదన. ఏది ఏమైనా వినియోగదారులు మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సాగని ఆధార్ సీడింగ్ వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలు చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 14వ తేదీ లోపల పూర్తి చేయాలని తుది గడువు విధించారు. ఆ లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ అందదని చెబుతున్నారు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు. నాలుగేళ్లుగా నత్తనడక జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. వినియోగదారులు శ్రద్ధ చూపకపోవడంతోనే ఆధార్‌సీడింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లాలో 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకూ 89.98 శాతం మంది గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా బ్యాంకుల వద్ద మాత్రం కేవలం 81.84 శాతం మాత్రమే సీడింగ్ పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గ్యాస్ ఏజెన్సీల వద్ద 93 శాతం ఆధార్‌సీడింగ్ పూర్తి కాగా బ్యాంకుల వద్ద మాత్రం 83 శాతం మాత్రమే సీడింగ్ పూర్తయింది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం వినియోగదారులను అష్టకష్టాలకు గురి చేస్తోంది. గ్యాస్ బండ అందని వారికి కూడా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. రెండు లేదా మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి సబ్సిడీ మొత్తం ఏ ఖాతాలో జమ అయిందనేది కూడా తెలియడం లేదంటున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియతోపాటు సాంకేతిక లోపాలు వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. -
జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
ఖమ్మం జెడ్పీసెంటర్: జవవరి నెల నుంచి జిల్లాలో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి పేర్కొన్నారు. గ్యాస్ నగదు బదిలీపై అయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు, ఎల్డీఎం, పౌరసరఫరాలశాఖాధికారులతో శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్పిజీ గ్యాస్ నగదు బదిలీ పొందేందుకు వినియోగదారులందరూ తప్పనిసరిగా ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను సంబంధింత గ్యాస్ డీలర్‌కు అందజేయాలన్నారు. నగదు బదిలీ పొందేందుకు గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి వారి ఆధార్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను సేకరించాలన్నారు. ఆధార్ అనుసంథానం చేసుకొని వారు వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 3 లక్షల 61వేల 28 మంది ఆయా డీలర్ల వద్ద సీడింగ్ చేయించుకున్నారని, 2లక్షల 48వేల 61 మంది వివిధ బ్యాంకులతో సీడింగ్ చే యించుకున్నారని కలెక్టర్ తెలిపారు. జనవరి నుంచి నగదు బదిలీ అమలు జరుగుతుందని, అనుసంధానం చేయించుకొని వారికి నగదు బదిలీ సబ్సీడీ వర్తింపులో జాప్యం జరుగుతుందని అన్నారు. వెంటనే అందరు ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను డీలర్లకు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం శ్రీనివాస్, డీఎస్వో గౌరీ శంకర్ పాల్గొన్నారు. -
మళ్లీ నగదు బదిలీ
జనవరి ఒకటి నుంచి.. ఆధార్ నంబర్లు సేకరించాలి కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రగతినగర్ :జిల్లాలో జనవరి ఒకటో తేదీనుంచి వంటగ్యాస్ కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. గురువారం ప్రగతి భవన్లో పౌరసరఫరాధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం స్పెషల్ డ్రెవ్ పెట్టుకొని గ్యాస్ డెలివరి బాయ్స్‌తో ఆధార్ వివరాలు సేకరించాలని సూచించారు. డాటా ఎంట్రీ కూడా త్వరగా పూర్తి చేసి సంబంధిత బ్యాంకులకు జాబితాలను అందించాలన్నారు. వంటగ్యాస్ వినియోగదారులంతా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ఖాతా జిరాక్స్ ప్రతులను సంబంధిత గ్యాస్ ఏజెన్సీలలో అందించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ డీఎం దివాకర్, డీఎస్ఓ కొండల్రావు తదితరులు పాల్గొన్నారు. ఓటరు గుర్తింపు కార్డులకు.. ప్రగతినగర్ : ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ లింకేజీ ప్రక్రియపై గురువారం కలెక్టర్ రొనాల్డ్ రోస్ తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నిజామాబాద్ మండలంలో ఓటర్ల ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. కాగా దీనికి సంబంధించి ఆర్డీఓ యాదిరెడ్డి, తహశీల్దార్ రాజేందర్ ఇప్పటికే చర్యలు చేపట్టారు. -
జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే ఏడాది జనవరి 1 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నామని.. డీలర్లు గ్యాస్ కనెక్షన్లను ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ కన్నబాబు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఈనెల 15 నుంచి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. ఇందులో కర్నూలు జిల్లా లేదని.. వచ్చే జనవరి నుంచి జిల్లాలోనూ అమలు చేస్తున్నందున డీలర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 5,88,379 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 548920 కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయన్నారు. బ్యాంకు ఖాతాలు మాత్రం 3,36,127 కనెక్షన్లకే అనుసంధానం చేశారని.. ముఖ్యంగా వినియోగదారుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించి అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలన్నారు. వినియోగదారులను కూడా చైతన్య పరచి ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఇవ్వకపోతే జరిగే నష్టాలు, అనర్థాలను కూడా వివరించాలన్నారు. సీఎస్డీటీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే గ్యాస్ డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇన్చార్జి డీఎస్ఓ వెంకటకృష్ణుడు, ఏఎస్ఓ జ్యోతి, సీఎస్‌డీటీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు. -
నగదు బదిలీ.. నేటి నుంచే..
-
నగదు బదిలీ.. నేటి నుంచే..
ఆదిలాబాద్ అర్బన్ : రాయితీ వంటగ్యాస్ అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నగదు బదిలీ పథకం శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. దేశంలోని 54 జిల్లాలో ప్రారంభిస్తుండగా.. రాష్ట్రం లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌లలో మొదలు కానుంది. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసినా.. ఎన్నికల ముందు బ్రేక్ పడింది. కొన్ని మార్పులుచేర్పుల తదుపరి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తోంది. అప్పటి కలెక్టర్ అహ్మద్ కృషి ఫలితంగా జిలాల్లో నగదు బదిలీ ప్రారంభం కాగా, ఈ పథకం కింద ఆధార్ అనుసంధానంలో దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఐదు నెలలుగా ఈ పథకం అమలులో ఉన్నప్పుడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమకాకపోవడం.. పేద, మధ్య తరగతి కుటుంబీకులు మొత్తం ధర చెల్లించి సిలిండర్ తీసుకోలేకపోవడం.. తదితర కారణాలతో పథకం నిలిచిపోయింది. ఫలితంగా అప్పటి ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్నికలకు ముందు నగదు బదిలీని నిలిపివేసింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా అనుసంధానంతో అమలు చేసిన ఈ పథకంలో కొన్ని మార్పుల అనంతరం బ్యాంకు ఖాతాతోనే ఇప్పుడు పథకం ప్రారంభం కావడం విశేషం. జిల్లాలో 3,28,169 మందికి వర్తింపు.. జిల్లాలో 3,74,904 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 3,28,169 మంది లబ్ధిదారుల గ్యాస్ కనెక్షన్లు ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యాయి. ఇంకా 46,735 మంది తమ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. వీటిలో 45,303 మందికి ఆధార్‌తో అనుసంధానం అయినా బ్యాంకు ఖాతా లేదు. అందుకే.. ప్రభుత్వం ఈ పథకంలో చేరేందుకు మూడు నెలలు (గ్రేస్ పీరియడ్) గడువు విధించింది. ఈ మూడు నెల (ఫిబ్రవరి 14)ల్లోగా గ్యాస్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. లేదంటే మొత్తం ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అదికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పథకంలో చేరిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా అనుసంధానం చేస్తే రాయితీ సొమ్ము నేరుగా సదరు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆధార్ నంబర్ లేకున్నా సరిపోతుంది. 92,038 మందికి ఖాతాలు లేవు.. ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం కాని వారు 46,735 మంది ఉండగా.. బ్యాంకు ఖాతాతో చేయని వారు 45,303 మంది ఉన్నారు. దీంతో మొత్తంగా 92,038 మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు. ఒకే పేరుపై రెండేసి కనెక్షన్లు ఉండడం, కొందరికి ఆధార్, బ్యాంకు ఖాతాలు లేకపోవడం, కొన్ని కనెక్షన్లు హోటల్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వినియోగించడం వంటి తదితర కారణాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 89 శాతం గ్యాస్ కనెక్షన్లకు ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానమైంది. బ్యాంకు ఖాతాలు లేని 92,038 మంది లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిచేలా బ్యాంకు అధికారులకు ఆదేశాలిస్తున్నామని సంబంధింత అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పథకం అమలు ఎంతమేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే. -
వంట గ్యాస్ సబ్సిడీకి మళ్లీ నగదు బదిలీ
వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలుచేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగ దారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ ఇందుకు గడువు విధించారు. వినియోగదారులు ఆధార్‌తో పాటు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ప్రక్రియను గడువులోపల పూర్తిచేసుకోవాలి. అలా చేయకపోతే వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందదు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు. చిత్తూరు : జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 32 ఏజెన్సీలుండగా 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులున్నారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇక భారత్ గ్యాస్‌కు సంబంధించి 19 ఏజెన్సీలుండగా, 96,100 మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పటివరకు ఆధార్ సీడింగ్ జరగనవి ఇండేన్‌కు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వద్ద 3,59,475 (89శాతం) మంది వినియోగదారులు ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోగా, బ్యాంకుల్లో మాత్రం 3,25,446 (80.57 శాతం) మందే అకౌంట్లు పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 2,48,023 మంది (92.07శాతం) ఏజెన్సీ వద్ద ఆధార్‌సీడింగ్ పూర్తిచేసుకోగా, బ్యాంకుల్లో 1,84,791 (83.62శాతం) మాత్రమే అకౌంట్లు పూర్తి చేశారు. భారత్ గ్యాస్‌కు సంబంధించి 89,948 (93.65శాతం) మంది ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా, 77,303 (80.37శాతం) మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేశారు. మూ డు ఏజెన్సీల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 71 ఏజెన్సీల పరి ధిలో 7,20,991 మంది వంట గ్యాస్ వినియోగదారులుం డగా వీరిలో 6,54,246 మంది గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధా ర్ సీడింగ్ పూర్తిచేసుకోగా ఇక 5,87,540 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలను పూర్తి చేశారు. ఈ లెక్కన గ్యాస్ ఏజెన్సీలవద్ద సరాసరి 90.85 శాతం మంది వినియోగాదారులు ఆధార్ సీడింగ్ పూర్తిచేసుకోగా, 82.01 శాతం మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తి చేశారు. మిగిలిన వారు ఆధార్ సీడింగ్ పూర్తిచేయలేదు. సీడింగ్ పూర్తై వారికే సబ్సిడీ వంటగ్యాస్ వినియోగానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధార్ సీడింగ్‌తోపాటు బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేసిన వారికే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తుంది. ఏ ఒక్కటి చేయకపోయినా వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ వర్తించదు. ప్రక్రియ పూర్తిచేయని వారు గ్యాస్ మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి చేయడం ఎలా? వినియోగదారులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సంబంధిత వంటగ్యాస్ ఏజెన్సీలో అందజేయాలి. ఆ తరువాత గ్యాస్ ఏజెన్సీ వారి వద్ద ఫారం -3 నమూనాను తీసుకుని, అందులో తాము వినియోగిస్తున్న గ్యాస్‌కు సంబంధించిన 17 అంకెలతో కూడిన కన్స్యూమర్ ఐడీ నెంబ ర్ను నింపాలి. దాంతోపాటు గ్యాస్ కేటాయింపునకు సంబంధించిన రశీదును జత చేసి బ్యాంకుకు సమర్పించాలి. ఈ ప్రక్రియకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అవసరం లేదు. ఆధార్ కార్డు లేనివారు వారు ఫారం -3 ద్వారా బ్యాంకులో అకౌంట్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉన్న వారు కార్డు జిరాక్స్కాపీనీ బ్యాంకులో అందజేయవచ్చు. ఫారం-3 నమూనాలు సంబంధిత గ్యాస్ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో ఆధార్ మాత్రమే ఇచ్చి బ్యాంకు అకౌంట్లు చేయని వారు ఫారం -3 ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అందరూ ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలి ఆధార్ సీడింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 14వ తేదీలోపు వినియోగదారులు పూర్తి చేసుకోవాలి. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఫారం -3 ద్వారా ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. శనివారం నుంచే వినియోగదారులు గ్యాస్‌కు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. సబ్సిడీ మొత్తం ఎంత అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. - ఎంవీ సత్యప్రసాద్, ఎల్పీజీ డెప్యూటీ సేల్స్ మేనేజర్ గ్యాస్ ధరలపై స్పష్టత రాలేదు గ్యాస్ సిలెండర్ ధర తోపాటు సబ్సిడీ ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రభుత్వం ఆధార్ సీడింగ్‌లో భాగంగా సిలెండర్‌కు పూర్తి ధర చెల్లించాల్సిందే. ఫిబ్రవరి 14 లోపల ఆధార్ సీడింగ్ చేయకపోతే సబ్సిడీ పొందే అవకాశం కోల్పోతారు. వినియోగదారులు జాగ్రత్తపడి బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేసుకోవాలి. ప్రభుత్వం వినియోగదారుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లతో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి,గ్యాస్ డీలర్స్ అసోషియేషన్ -
రేపటి నుంచి ఏపీలోని 9జిల్లాల్లో నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం - తొమ్మిది జిల్లాల్లో ఈ నెల 15వ తేదీ (శనివారం) నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాయితీ (సబ్సిడీ) మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు జమ చేసేందుకు వీలుగా బ్యాంకు అకౌంట్లను వంట గ్యాస్ కనెక్షన్లకు అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లకు, గ్యాస్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
15 నుంచి నగదు బదిలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంటగ్యాస్ రాయితీకి సంబంధించి నగదు బదిలీ పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈనెల 15 నుంచి జిల్లాలో వంటగ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ డబ్బులు ఇక నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి పౌరసఫరాల శాఖ ఏర్పాట్లు వేగిరం చేసింది. వాస్తవానికి గతేడాదే ఈ పథకాన్ని యూపీఏ పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాకమునుపే నగదు బదిలీ అమలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 54జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈవారం చివరినుంచి నగదు బదిలీ అమల్లోకి రానుంది. ఆధార్ లేకున్నా సరే.. జిల్లాలో 13.76లక్షల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి గ్యాస్ వినియోగదారుడికి ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా పేర్కొంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు సంఖ్య, బ్యాంకు ఖాతాతో లబ్ధిదారుడి వివరాల్ని అనుసంధానం చేశారు. గ్యాస్ సిలిండర్ పొందిన అనంతరం రాయితీ డబ్బులు లబ్ధిదారుడి ఖాతాలో జమ అయ్యేవి. కానీ తాజాగా ఆధార్ సంఖ్య లేకుండానే నగదు బదిలీ అమలు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే లబ్ధిదారులు బ్యాంకు ఖాతా వివరాల్ని సంబంధిత డీలరుకు చేరవేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 88శాతం లబ్ధిదారుల వివరాలు ఆధార్ వివరాలతో అనుసంధానమయ్యాయి. మిగతా లబ్ధిదారులు ఆధార్ సంఖ్య లేకున్నా బ్యాంకు ఖాతా నంబరును డీలరుకు సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారెడ్డి తెలిపారు. ఇక పూర్తి ధర చెల్లించాలి.. శనివారం నుంచి జిల్లాలో గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పొందాలంటే పూర్తి సిలిండర్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.490 కాకుండా ప్రభుత్వం అందించే రాయితీని కలుపుకుని పూర్తి ధర చెల్లించాలి. సిలిండర్ పొందిన తర్వాత రాయితీ డబ్బులు నేరుగా వినియోగదారుడి ఖాతాకు ప్రభుత్వం బదలాయిస్తుంది. అక్రమాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. -
మళ్లీ నగదు బదిలీ
ఆదిలాబాద్ అర్బన్ : నగదు బదిలీ పథకం జిల్లాలో మళ్లీ అమల్లోకి రానుంది. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లకు ఈ నెల 15 నుంచి వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో మొదటగా సెప్టెంబర్ 2013 నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. పథకం అమలులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్రమంత్రివర్గం గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ లింక్‌ను తొలగిస్తూ 2014 జనవరిలో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తొమ్మిది నెలలపాటు ప్రభుత్వం వంటగ్యాస్‌కు ఎలాంటి లింక్ పెట్టలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నగదు బదిలీ పథకం ప్రయోగాత్మకంగా అమలు కానుంది. దేశంలో 54 జిల్లాలు ఎంపిక చేయగా.. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులతో ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 3.75 లక్షల గ్యాస్ కనెక్షన్లు.. జిల్లాలో 3.75 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 90 శాతం మంది లబ్ధిదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్నారు. 3,37,500 మంది గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీరు గతంలో నగదు బదిలీ ద్వారా సిలిండర్లు పొందిన వారే. మిగితా 37,500 కనెక్షన్లకు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్లు లేవు. వీరు గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అనుసంధాన ప్రక్రియ ద్వారా గతంలో 75 వేలకుపైగా కనెక్షన్లను బోగస్‌గా గుర్తించారు. ప్రస్తుతం 14.2 కేజీలు ఉండే ఒక్కో సిలిండర్ ధర రూ.445.50గా ఉంది. నగదు బదిలీతో ఆ ధర రూ.975కు పెరగనుంది. మిగితా సబ్సిడీ సొమ్ము రూ.529.50 ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. ఇప్పుడున్న సిలిండర్ ధరనే పేదలకు భారమనుకుంటే ఇక నుంచి పూర్తి సిలిండర్ ధరను ఒకేసారి చెల్లించాలంటే పేదలకు తలకు మించిన భారం అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ లేకున్నా గ్యాస్... సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు ఆధార్ లింక్ లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుని బ్యాంకు ఖాతా గ్యాస్‌కు అనుసంధానమై ఉండాలి. మరో మూడు నెలల వరకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నే అమలు చేస్తారు. అనంతరం గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల తర్వాత అనుసంధానం కానట్లయితే ఆ కనెక్షన్‌కు గ్యాస్ సరఫరా నిలిపివేస్తారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల యాజమానులు, సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలెక్టర్ ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నారు. మూడు నెలలు తీసుకోవచ్చు - వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎస్వో ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం లేకున్నా ఇప్పుడు తీసుకుంటున్న విధంగానే మరో మూడు నెలలు గ్యాస్ తీసుకోవచ్చు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా ఫర్వాలేదు. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ మూడు నెలల్లో గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేయించుకోవాలి. అనంతరం నగదు బదిలీ వర్తిస్తుంది. నగదు బదిలీకి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. -
నగదు బదిలీ మేనిఫెస్టోలో లేదేం?
చంద్రబాబును ప్రశ్నించిన రఘువీరా శ్రీకాకుళం/గరివిడి, నగదు బదిలీ పథకం అమలుచేస్తామని గత ఎన్నికల్లో చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల పార్టీ మేనిఫెస్టో లో ఆ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు బాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారని విమర్శించారు. శ్రీకాకుళం లో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో, విజయనగరం జిల్లా గరివిడిలో విలేకరులతోను ఆయన మాట్లాడారు. నగదు బదిలీ పథకాన్ని గతంలో ప్రజలు నమ్మలేదని, అందుకే ఈసారి దానిని వదిలేసి మరికొన్ని మోసపూరిత హామీలతో ముందుకు వస్తున్నారన్నారు. అధికారం కోసం ఏ గడ్డినైనా కరిచే మనస్తత్వం చంద్రబాబుదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, పార్టీ మేనిఫెస్టోను వారివద్దకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
తప్పిన తిప్పలు
మహానగర సిటీజనులకు శుభవార్త. సోమవారం నుంచి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల వంటగ్యాస్ గృహ వినియోగదారులకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా కానుంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం రద్దు కావడంతో.. నాన్ సబ్సిడీపై సిలిండర్ కొనుగోలు చేసే బాధ తప్పినట్లయింది. గృహ వినియోగదారులందరికీ పాత పద్ధతిలోనే సబ్సిడీ ధరకే వంటగ్యాస్ సిలిండర్లను అందించాలంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి వంటగ్యాస్ డీలర్లకు ఆదేశాలు అందడంతో సోమవారం నుంచి సబ్సిడీ ధర (ప్రస్తుతం రూ. 441) పైనే సిలిండర్ల సరఫరా అమలు కానుంది. వాస్తవంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేసింది. అయితే నగదు బదిలీ విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తిరిగి పాత పద్ధతిలో మార్పు చేసి సబ్సిడీ ధర బిల్లింగ్‌తో సిలిండర్లను సరఫరా చేసేందుకు కాస్త సమయం పట్టింది. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలైన ఇండేన్, భారత్, హెచ్‌పీ సాఫ్ట్వేర్ల మార్పు పక్రియ దాదాపు పూర్తవడంతో 10వ తేదీ నుంచి పాత విధానంలో సబ్సిడీ ధరపై బిల్లింగ్ చేసి నేరుగా వినియోగదారులకు సిలిండర్లు అందించాలని డీలర్లకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం నుంచి పాతపద్ధతిలో బిల్లింగ్ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. వంటగ్యాస్‌కు విముక్తి డీబీటీ అమలుతో డొమెస్టిక్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. సిలిం డర్ ధర సైతం నిలకడగా లేకుండా పై పైకి ఏగబాకింది. ఎల్పీజీ కనె క్షన్లను ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము పడకపోవడం తదితర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు వంటగ్యాస్‌కు సబ్సిడీ నగదు బదిలీ నుంచి విముక్తి లభించింది. -
గ్యాస్ ఊరట
సాక్షి, నల్లగొండ: గృహ అవసర వంటగ్యాస్‌కు గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఆధార్ అనుసంధానం లేని వినియోగదారులు రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధరకు కొనాల్సిందేనని ప్రభుత్వం నిక్కచ్చిగా పేర్కొంది. అయితే అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తంకావడం, పూర్తిస్థాయిలో ఆధార్ అందకపోవడం తదితర కారణాల వల్ల గడువును డిసెంబర్ 31వ తేదీకి పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో గడువును మరోసారి పొడిగించక తప్పలేదు. 2014 జనవరి 31వ తేదీలోగా ఆధార్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు సబ్సిడీయేతర ధర రూ.1333కే రీఫిల్ సిలిండర్ కొనాల్సిందేనని తెగేసి చెప్పింది. వారికే వర్తింపు..... గ్యాస్ ఏజెన్సీతోపాటు బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానమైన వినియోగదారులకు నగదు బదిలీ పథకం (డీబీసీ) వర్తిస్తుంది. అంటే వారు వాస్తవ ధరకే రీఫిల్ కొనుగోలు చేయాలి. ఒక్కో రీఫిల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1333. ఈ మొత్తాన్ని సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఏజెన్సీకి చెల్లిస్తే ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ రూ.843.50 ఆ వినియోగదారుడి ఖాతాలో జమవుతుంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ సీడింగ్ కాకుండా మిగిలిన 4,40,619 మంది వినియోగదారులు నేరుగా సబ్సిడీ ధర రూ.446కే రెండు నెలలపాటు కొనుగోలు చేయవచ్చు. గడువు ముగిసన తర్వాత వీరికి నగదు బదిలీ పథకం వర్తిస్తుంది. రెండునెలల పాటు తప్పనున్న భారం జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.23 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 1.82 లక్షల మంది వినియోగదారుల మాత్రమే తమ బ్యాంకు ఖాతాకు, వంటగ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. వీరు ఫిబ్రవరి నుంచి మొదటగా రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధర రూ.1333కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. సిలిండర్ ధర పోను ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ వారి బ్యాంక్ ఖాతాలో జమయ్యేది. మరో 3.14 లక్షల మంది వినియోగదారులు తమ ఆధార్ కార్డు నంబర్లు కేవలం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకే అందాయి. వీరి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాలేదు. వీరితోపాటు ఇప్పటికీ గ్యాస్ ఏజెన్సీలకు అసలు ఆధార్ నంబర్లు ఇవ్వని 1.26 లక్షల మంది సబ్సిడీయేతర ధరకే రీఫిల్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు నెలలపాటు ఈ భారం వినియోగదారులకు తప్పనుంది. కొంత మేర ప్రయోజనం.. జిల్లాలో ఆరు లక్షలకు పైగా వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఏడాదిలో ఆరుకు పైగా సిలిండర్లు వాడే కుటుంబాలు 2 లక్షల వరకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. 9 సిలిండర్లకు పైగా వినియోగించే కుటుంబాలు మరో లక్ష వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటప్పుడు గరిష్టంగా 12 సిలిండర్లకు పెంపు నిర్ణయం వీరికి కొంత మేర ప్రయోజనం కలిగించినట్టే. -
తత్వం బోధపడినట్టేనా!
సంపాదకీయం: దేశ ప్రజలందరినీ ప్రభావితం చేయగల నిర్ణయాలను తీసుకునే ముందు క్షేత్రస్థాయి పరిశీలనలు, లోతైన సమీక్షలూ అవసరం. లేనట్టయితే అలాంటి నిర్ణయాలు బెడిసికొడతాయి. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లపై యూపీఏ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు ఆ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఏడాదిలో ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచినట్టు... సిలిండర్లతో ముడిపెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు... 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభిం చాల్సిన తదుపరి దశ ఆధార్ నమోదు కార్యక్రమంపై వెనకడుగేసింది. ‘తగిన వ్యవధిలేకపోవడంతో’ దానికి సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించడం కేంద్ర కేబినెట్‌కు సాధ్యం కాలేదట! ఆధార్ కార్యక్రమం ప్రారంభించిననాడూ... సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్లంటూ వర్గీకరించిన నాడూ... ఆధార్ కార్డుంటేనే సబ్సిడీ సిలిండర్, నగదు బదిలీ ఉంటుందని చెప్పిననాడూ చాలా మంది వ్యతిరేకించారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే విఫలమైన ఆధార్‌వంటి పథకాన్ని ఇక్కడ వర్తింపజేయాలనుకోవడం, దాని ఆధారంగా నగదు బదిలీ పథకం వంటివి ప్రారంభించాలనుకోవడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏ దశలోనూ ఎవరి మాటా వినకుండా ముందుకెళ్లిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ మొహం చెల్లక తన నిర్ణయాలను తానే సవరించుకుంది. న్యూఢిల్లీలో ఈమధ్య జరిగిన ఏఐసీసీ సదస్సు సందర్భంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9నుంచి 12కు చేయాలని కోరినందువల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నా ఇందులో అంతకుమించిన అంతరార్ధమే ఉంది. ఆధార్ నమోదు కార్యక్రమం ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది. ఇలాంటి పథకాన్ని ఆసరా చేసుకుని అమలుజేయబూనుకున్న వంటగ్యాస్ సబ్సిడీ బెడిసికొట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే రాహుల్‌గాంధీ కోరినట్టు సిలిండర్ల సంఖ్య పెంపుతో ఊరుకోక నగదు బదిలీ పథకాన్ని కూడా నిలిపేశారు. దాంతోపాటు ఆధార్ తదుపరి కార్యక్రమంపైనా నిర్ణయాన్ని వాయిదావేశారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో... ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను ఉపశమింపజేయాలంటే ఇంతకంటే మార్గంలేదని యూపీఏ సర్కారు భావించింది. అందుకు రాహుల్‌ను అడ్డుబెట్టు కుంది. నగదు బదిలీ పథకం పనితీరును సమీక్షించడానికి ఒక కమిటీవేస్తామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చమురు శాఖ మంత్రి వీరప్పమొయిలీ చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో 18 రాష్ట్రాల్లోని 289 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ నెలనుంచి దీన్ని ఢిల్లీ, ముంబైలతోసహా మరో 105 జిల్లాలకు విస్తరించింది కూడా. గత ఏడాది జూన్ వరకూ సబ్సిడీ సిలెండర్ల సంఖ్యకు పరిమితిలేదు. అందువల్లే సబ్సిడీయేతర సిలిండర్ల సంఖ్య ఎంత పెరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, సబ్సిడీ సిలిండర్లకు ఆంక్షలు విధించి 9మాత్రమే ఇవ్వడం మొదలెట్టాక, పదో సిలిండర్ నుంచి రెట్టింపుపైగా వసూలు చేయడం ప్రారంభించాక జనంలో వ్యతిరేకత మొదలైంది. అసలు ఆధార్‌కున్న చట్టబద్ధతే సందేహాస్పదం. 2009లో కేవలం పాలనాపరమైన ఉత్తర్వు ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. 2011లో ఆధార్‌కు సంబంధించిన బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సుప్రీంకోర్టు సైతం దీని చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తంచేసింది. ఒకపక్క ఇదంతా సాగుతుండగానే దేశంలో పలు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం దాని తోవన అది నడుస్తూనే ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొననివారూ, పాల్గొన్నా కార్డురాని వారూ కోట్ల సంఖ్యలో ఉండగా... ఆకతాయిలు కొందరు జంతువుల పేర్లపైనా, పక్షుల పేర్లపైనా తీసుకున్న ఆధార్ కార్డులు వెలుగుచూసి ఆ పథకం పరువు తీశాయి. ఇంతటి అయోమయం పథకంతో నగదు బదిలీని ముడిపెట్టడం సహజంగానే అందరికీ ఆగ్రహం తె ప్పించింది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 28.29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో 9.03 లక్షలమందికి ఆధార్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ సిలెండర్లు రావడంలేదు. మన రాష్ట్ర హైకోర్టు సైతం ఆధార్ కార్డుతో వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీని ముడిపెట్టవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లలో 89.2 శాతం మంది ఏడాదికి 9 సిలిండర్లే వాడతారుగనుక మిగిలిన పది శాతం మంది మాత్రమే అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తుందని కేంద్రం గతంలో కాకిలెక్కలు చెప్పింది. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12 చేస్తూ చెప్పిన లెక్కల్లోనూ తేడాలున్నాయి. అదనంగా పెంచిన మూడు సిలిండర్లకూ ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి రూ.5,000 కోట్ల భారం పడుతుందని...మొత్తం సబ్సిడీ భారం రూ.80,000 కోట్లవుతుందని మొయిలీ సెలవిస్తున్నారు. కానీ, చమురు సంస్థలపై కేంద్రం విధిస్తున్న అమ్మకం పన్ను, దిగుమతి సుంకం... ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ వగైరాలన్నీ తీసేస్తే ఈ సబ్సిడీ భారం నికరంగా ఎంతో... ప్రజలకు ఇంకెంత చవగ్గా సిలిండర్లు సరఫరా చేయవచ్చునో తేటతెల్లమవుతుంది. మొత్తానికి కారణం ఏంచెప్పినా ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల సంఖ్యా పెరిగింది, దాన్ని ఆధార్‌తో ముడిపెట్టే విధానమూ ఆగింది. ఈ అనుభవంతోనైనా ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ సర్కారు విజ్ఞతను పాటిస్తుందని ఆశించాలి. -
బండ భారమే...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.25 కోట్ల ‘బండ’ భారం పడనుంది. నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ పొందేందుకు గాను ఆన్‌లైన్‌తో లింకయ్యేందుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈనెల 31తో ముగుస్తుండగా, జిల్లాలో ఇప్పటివరకు 40 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఆన్లైన్ చేయించుకున్నారు. మిగిలిన 60 శాతం మంది వివిధ కారణాలతో ఆన్‌లైన్‌తో లింకు కాలేకపోయారు. ఇందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, జిల్లాలో అందరికీ ఆధార్ కార్డులు అందకపోవడం, ఉన్నవాటిలోనూ తప్పులు దొర్లడం, బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో దీనిపై అవగాహన లోపించడం వంటి కారణాలున్నాయి. అయితే ఈనెల 31 తర్వాత ఆన్‌లైన్‌తో లింకు కాకుండా గ్యాస్ కొనుగోలు చేయాలంటే రూ.1350 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సబ్సిడీ కింద కేంద్రం ఇచ్చే రూ.870 రాదు. ఈ లెక్కన ఇప్పటి వరకు జిల్లాలో ఆన్‌లైన్‌తో లింక్ కాని మూడు లక్షల మంది వినియోగదారులు నెలకు రూ.25 కోట్లు భారం మోయాల్సిందే. గ్యాస్ ఏజెన్సీతో పాటు బ్యాంకులో ఆధార్‌కార్డు నకలును సమర్పించి ఆన్‌లైన్‌తో లింకయ్యేంతవరకు ఈ నష్టాన్ని భరించాల్సిందే. లింకు లెక్కలివే... జిల్లాలోని 39 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 5,16,386 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో మంగళవారం నాటికి ఆధార్ కార్డుతో లింకయిన వారి సంఖ్య 3, 20, 874 మాత్రమే. వీరిలోనూ అందరూ బ్యాంకుతో లింకు కాలేదు. బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, బ్యాంకులకు ఆధార్‌కార్డు నకలు సమర్పించని కారణంగా మరో లక్ష మంది ఇంకా బ్యాంకులకు లింక్ కాలేకపోయారు. ఇప్పటివరకు ఆధార్‌తో పాటు బ్యాంకులకు కూడా లింకయిన జిల్లా గ్యాస్ వినియోగదారుల సంఖ్య 2,06,846 మాత్రమే. అంటే మొత్తం వినియోగదారుల్లో ఇది కేవలం 40 శాతమే. మిగిలిన 60 శాతం వినియోగదారులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్యాస్ బండను సబ్సిడీ లేకుండా రూ.1350 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌తో లింకు కాని వారికి కేవలం రూ.480కే గ్యాస్‌బండ లభిస్తుండగా, వచ్చే నెల ఒకటి నుంచి మాత్రం ఆన్‌లైన్‌తో లింకయిన వారి తరహాలోనే మొత్తం చెల్లించి కొనుక్కోవాల్సిందే. కానీ, ఆన్‌లైన్‌తో లింకులేని వారికి సబ్సిడీ రాదు. మొత్తం చెల్లించి కొనుక్కున్న తర్వాత ఆన్‌లైన్‌తో లింకు అయినప్పటికీ.. అప్పటి నుంచే సబ్సిడీ ఇస్తారు. అంటే ఒక నెల రూ.1350 పెట్టి బండ కొన్నా సబ్సిడీ కింద రావాల్సిన రూ.870 నష్టపోవాల్సిందే. ఈ లెక్కన ఆన్‌లైన్‌తో లింకు కాని 3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు నెలకు రూ.25 కోట్లు సబ్సిడీ పోగొట్టుకుంటారు. అంటే జిల్లాపై ఒక్క నెలలో పడే గ్యాస్‌బండ భారం రూ.25 కోట్లు అన్నమాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ గ్యాస్ వినియోగదారులకు శాపంగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతుకు బండిని లాగలేకపోతుంటే ఇప్పుడు బండ భారం అదనంగా మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడువు పెంచే అవకాశం లేదు: డీఎస్వో గ్యాస్ సబ్సిడీ పొందేందుకు గాను ఆధార్, బ్యాంకు అకౌంట్లను ఆన్‌లైన్‌తో లింకు చేసుకునే గడువు పొడగించే అవకాశం లేదని జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గడువు పొడగింపు ఇతర జిల్లాల్లో కూడా జరగలేదని చెప్పారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వినయోగదారులంతా రూ.1350 పెట్టి గ్యాస్ కొనుక్కోవాల్సిందేనని, ఆన్‌లైన్‌తో లింకు కాని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రూ.870 సబ్సిడీ రాదని వెల్లడించారు. ఇప్పటికీ ఆన్‌లైన్‌తో లింకు కాని వారు వెంటనే తమ ఆధార్‌కార్డును సంబంధిత గ్యాస్ ఏజెన్సీతో పాటు బ్యాంకులో ఇవ్వాలని సూచించారు. -
ఆరిపోతున్న దీపం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వంట చెరకు వినియోగం తగ్గించడం, కాలుష్యం నుంచి పచ్చని పల్లెలను రక్షించడం అన్న లక్ష్యాలతో ప్రభుత్వం వెలిగించిన దీపం పథకం ఇప్పుడు అదే ప్రభుత్వ నిర్ణయాలతో ఆరిపోయే స్థితికి చేరుకుంది. నగదు బదిలీ పథకం పేరిట ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి దీపం లబ్ధిదారులకూ వర్తింపజేయడమే దీనికి కారణం. ఈ నిర్ణయంతో ఇప్పుడున్న దీపం లబ్ధిదారులకు తోడు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికీ గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ కష్టాలు పడలేక పలువురు లబ్ధిదారులు గ్యాస్ వినియోగాన్ని మానివేశారు. జిల్లాలో 1.3 లక్షల దీపం కనెక్షన్లు ఉండగా, ఇప్పటికే 47వేల మంది గ్యాస్‌ను విడిపించుకోవడం మానేశారు. కొందరు వలస వెళ్లడం, ఇంకొందరు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఇతరులకు అమ్మేయడం వల్ల ఈ కనెక్షన్లు వినియోగంలో లేవు. తాజాగా మరో 30వేలకుపైగా వినియోగదారులు గ్యాస్ మానేసి కట్టెల పొయ్యిలనే వాడుతున్నారు. ఆధార్ అనుసంధానాన్ని నిర్బంధం చేయడమే దీనికి ప్రధాన కారణం. గ్రామాల్లో చాలా మందికి ఇంకా ఆధార్ కార్డులు అందలేదు. ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్న వారిలోనూ కొందరికి బ్యాంకు ఖాతాలు లేవు. ఆధార్ కార్డు పొందడం మాటెలా ఉన్నా నగదు బదిలీ కోసం బ్యాంకు ఖాతా తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. ఎక్కడో దూరప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఖాతా తెరవడం ఒక సమస్య కాగా, ప్రతి నెలా అదే పనిగా బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు నిర్వహించడం గ్రామీణ ప్రజలకు కష్టసాధ్యం. బ్యాంకుకు వెళ్లాలంటే ఒకరోజు పని మానుకోవాలి. దాంతో ఆ రోజు కూలి కోల్పోవలసి వస్తుంది. దానికి తోడు బ్యాంకుకు వెళ్లి రావడానికి ఖర్చులు ఉంటాయి. ఇదంతా ఆర్థిక భారంతో కూడకున్న వ్యవహారమని గ్రామీణులు భావిస్తున్నారు. అలాగే ఇటీవలి వరకు రూ.415కే గ్యాస్ సిలెండర్ ఇచ్చేవారు. ఇప్పుడు దానికోసం ఏకంగా రూ.1300కు పైగా మదుపు పెట్టాల్సి వస్తోంది. సబ్సిడీ తర్వాత వచ్చినా ముందు అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ తర్వాత కూడా సబ్సిడీ మొత్తం కోసం వ్యయ ప్రయాసలతో బ్యాంకుకు వెళ్లడానికి పేదలైన దీపం లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త దరఖాస్తుదారులకు అనుమానమే ఇదిలా ఉంటే దీపం కనెక్షన్కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 60వేల మందికి అవి మంజూరయ్యే పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డును జత చేస్తేనే కనెక్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించడమే దీనికి కారణం. కాగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు కూడా గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరు కూడా రూ.1300కే గ్యాస్ కొనుగోలు చేస్తుండగా, బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఆర్థిక భారం పెరుగుతోందని వాపోతున్నారు. అందువల్ల గ్యాస్‌ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. -
వచ్చే నెల 1 నుంచి నగదు బదిలీ
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : వచ్చే నెల( ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నాగేశ్వర్రావు వెల్లడించారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆధార్ కార్డులు అందజేసిన ప్రతి ఒక్క వినియోగదారుడికి వెంటనే అనుసంధానం చేయాలని ఆదేశించారు. వినియోగదారులను చైతన్యం చేయడానికి ఏజెన్సీల వారు కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 46 శాతం మంది గ్యాస్ వినియోగదారులు అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. కాగా మిర్యాలగూడలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో 43,255 మంది గ్యాస్ వినియోగదారులుంటే ఇప్పటి వరకు 19,237 మంది మాత్రమే ఏజెన్సీ లో, 14,327 మంది బ్యాంకులో అనుసంధానం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో 34,832 మందికి గాను 11,337 మంది గ్యాస్ ఏజెన్సీలో, 5526 మంది బ్యాంకులో అనుసంధానం చేసుకున్నారన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నగదు బదిలీ పథకం జిల్లాలో అమలు కానున్నందున గ్యాస్ వినియోగదారులంతా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని కోరారు. అదే విధంగా దీపం గ్యాస్ కనెక్షన్‌కు స్టౌ లేకుండా 1060 మాత్రమే చెల్లించాలని కోరారు. కొత్త గ్యాస్ కనెక్షన్‌కు గాను స్టౌ లేకుండా 2,585, అదనపు సిలిండర్‌కు 1995 మాత్రమే చెల్లించాలని వివరించారు. కొత్త కనెక్షన్లకు ఎక్కు వ డబ్బులు తీసుకుంటే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏజీపీవో చంద్రశేఖర్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ ఆర్ఐ వాజిద్ ఉన్నారు. -
వీరిమాటేమి!
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఆధార్ నమోదు అస్తవ్యస్తం. బ్యాంకులో ఖాతాలు తెరవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు. అధికారులకు ఈ సమస్యలు కానరావు. కొత్త సంవత్సరం కానుకగా జిల్లాలో నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టేశారు. గ్యాస్‌కు, ప్రభుత్వ పథకాలకు ఆధార్ లింకప్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోక ముందుకు సాగడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్యాస్ వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతం. ఏడాది నుంచి ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. జిల్లాలో 5,52,576 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ నెంబర్ల అనుసంధానం పూర్తయిన కనెక్షన్లు 1.40 లక్షలే కావడం గమనార్హం. మరో నెల రోజుల సమయం పొడిగించినా.. ఆధార్ నమోదు తీరును పరిశీలిస్తే ఇప్పుడప్పుడే యూఐడీ నెంబర్లు అందే పరిస్థితి లేదు. ఆధార్ పురోగతి ఇంత అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నగదు బదిలీ పేరిట ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. సేకరించిన వివరాలను ఎస్ఆర్డీహెచ్ సైట్లో డేటా ఎంట్రీ చేయడాన్ని ముమ్మరం చేశారు. అయితే సీఎస్డీటీలు, గ్యాస్ డీలర్ల అలసత్వంతో ఆశించిన ఫలితం కరువైంది. ఇప్పటివరకు 4,19,372 మంది గ్యాస్ వినియోగదారుల నుంచి యూఐడీ, ఈఐడీ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించారు. వీటని గ్యాస్ డీలర్లు, ఎస్ఆర్డీహెచ్ సైట్లో నమోదు చేయాల్సి ఉండగా.. 3 లక్షల మంది వివరాలను మాత్రమే నమోదు చేశారు. ఇదిలాఉండగా నగదు బదిలీ పథకం కారణంగా గ్యాస్ వినియోగదారులకు బ్యాంకు ఖాతా అత్యవసరం. ఈ విషయానికొస్తే జిల్లాలో లక్ష మందికి పైగా వినియోగదారులకు బ్యాంకు ఖాతాలే లేవు. తాజాగా వీరంతా బ్యాంకులకు వెళితే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తికొండ, వెల్దుర్తి, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు ప్రాంతాల్లోని బ్యాంకర్లు ఖాతాలు ప్రారంభించడంలో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. -
వంట గ్యాస్‌కు ‘మంట’
సాక్షి, చెన్నై:కొత్త సంవత్సరం కానుకగా ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్రం గ్యాస్ ధరను పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్యాస్‌కు ఆధార్ కార్డుకు లింక్ పెట్టి, నగదు బదిలీ పథకాన్ని బుధవారం ఆరంభించారు. ఈ ప్రక్రియను సర్వత్రా వ్యతిరేకిస్తున్న క్రమంలో గ్యాస్ ధర పిడుగును ప్రజల నెత్తిన కేంద్రం వేసింది. తమకు ఆధార్ కార్డులు ఇంకా అందలేదంటూ గ్యాస్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్న సమయంలో ధర పెంపు మరింత గుది బండగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరను కుంటి సాకుగా చూపు తూ గ్యాస్ భారాన్ని తమ నెత్తిన కేంద్రం రుద్దడాన్ని వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇదీ ధర: 2012 సెప్టెంబరు సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర రాష్ట్రంలో రూ.780గా ఉండేది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ధర, తాజాగా పెరిగిన రూ.220తో గ్యాస్ సిలిండర్ రూ.1234కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీతో సబ్సిడీ సిలిండర్ ధర ఇది వరకు రూ.398.50గా ఉండేది. గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలోపు అదనంగా రూ.20 నుంచి 30 వరకు భారం పడుతుంది. తాజాగా పెంచిన రూ.220తో ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై అదనంగా రూ.20 పెరిగినట్టు అవుతోంది. ఇక రాష్ట్రంలో సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలోపు మొత్తంగా రూ.460కు చేరబోతున్నది. ఈ ధరల మోతపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు మండి పడుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ కార్యదర్శి టీ పాండియన్లు కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం తథ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెంపును ఉప సంహరించుకోని పక్షంలో ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. 24 సిలిండర్లు ఇవ్వండి: కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా కొత్త సంవత్సరం వేళ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన కేంద్రం, ప్రజల జీవితాలతో చెలాగటం ఆడే నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూడాలే గానీ, కన్నీళ్లు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లు అన్న నిబంధన అమల్లోకి రాగానే, ఆధార్‌ను గ్యాస్‌కు లింకు పెట్టారని, ఇప్పుడేమో కుంటి సాకులతో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ధరను పెంచారని ధ్వజమెత్తారు. పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తొమ్మిది సిలిండర్ల నిబంధనను సడలించి ఏడాదికి 24 సిలిండర్ల పంపిణీకి సిద్ధం కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
‘ఆధార్’ లేకుంటే కష్టాలే
సాక్షి, నల్లగొండ :నగదు బదిలీ పథకంలో భాగంగా వంట గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ కార్డు ఉండాల్సిందేనని సర్కారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి గృహ అవసర (డొమెస్టిక్) వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. ఈ తేదీలోగా తమ కనెక్షన్, బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులకు ఇప్పటికే నగదు బదిలీ వర్తిస్తోంది. వాస్తవంగా ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నాటికి ఆధార్ అనుసంధానం లేని వినియోగదారులు రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధరకే కొనాల్సిందేనని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే అన్నివర్గాల ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడం, పూర్తిస్థాయిలో ఆధార్ అందకపోవడం తదితర కారణాలతో గడువును డిసెంబర్ 31కి పొడిగించింది. అయినా ఆశించిన స్థా యిలో అనుసంధానం కాలేదు. దీంతో ప్రభుత్వం గడువును పొడిగించక తప్పలేదు. 2014 జనవరి 31వ తేదీలోగా ఆధార్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలని సూచించింది. లేకుంటే మరుసటి రోజు నుంచి ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు సబ్సిడీయేతర (రూ.1120) ధరకే రీఫిల్ సిలిండర్ కొనాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల యజమానులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యులర్ అందింది. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని నిక్కచ్చిగా స్పష్టంచేసింది. పెనుభారం.... జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.23 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 2.80 లక్షల మంది వినియోగదారులు ఆధార్ కార్డు నంబర్లు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు అందజేశారు. ఇందులో 1.80 లక్షల మంది బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చారు. వీరికి మాత్రమే నగదు బదిలీ పథకం అక్టోబర్ నుంచి వర్తిస్తోంది. మిగిలిన మరో లక్ష మంది బ్యాంకు ఖాతా నంబర్లు అందించాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు 3.43 లక్షల మంది ఇంకా ఆధార్ వివరాలు అందజేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వీరందరకీ ఎప్పుటిలోగా కార్డులు అందుతాయో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో జనవరి 31లోగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయడం అసాధ్యమే. ఇటువంటి వారు రీఫిల్ సిలిండర్ కొనుగోలు చేయాలంటే అదనపు భారం భరించక తప్పదు. వీరికి సబ్సిడీ ధర రూ.418 వర్తించదు. సబ్సిడీయేతర ధర రూ.1120కు కొనుగోలు చేయాల్సిందే. అంటే ఒక్కో రీఫిల్ సిలిండర్‌పై రూ.702 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్దమొత్తంలో భరించడం నిరుపేదలకు తలకు మించిన భారమే అవుతుంది. నత్తనడకన... ప్రభుత్వ నిర్లక్ష్యం, ‘ఆధార్’ ఏజెన్సీల నిర్వాకం వల్ల గ్యాస్ వినియోగదారులు ఆధార్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి ఆధార్ కార్డుల వివరాలు నమోదు చేస్తున్నా ఇప్పటివరకు ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. జిల్లా జనాభా 34.82 లక్షలుంటే, అందులో ఇప్పటివరకు 31లక్షల మంది మాత్రమే ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో ఎంతమందికి కార్డులు అందాయన్న విషయంపై స్పష్టత లేదు. మరో నాలుగు లక్షల పైచిలుకు మంది అసలు ఆధార్ నమోదుకు దూరంగా ఉన్నారు. వీరందరి వివరాలు సేకరించడం, కార్డులు అందజేయడానికి ఎన్ని నెలల సమయం పడుతుందో అధికారులకే తెలియాలి. -
అయోమయం
=స్పష్టత లేని నగదు బదిలీ -ప్రహసనంగా అమలు =ఇప్పటి వరకు 24 శాతం నమోదు =7.17 లక్షల మంది అనుసంధానం చేసుకోవాలి =లేదంటే నాన్‌సబ్సిడీ గ్యాస్ కొనుగోలు చేయాల్సిందే జిల్లాలో నగదు బదిలీ పథకం ప్రహసనంగా సాగుతోంది. ఆధార్‌తో అనుసంధానంపై స్పష్టత లేకుండా పోయింది. వారం రోజుల్లో దీనికి గడువు ముగియనుంది. అయినా ఇప్పటి వరకు కేవలం 24 శాతం మంది మాత్రమే గ్యాస్ క నెక్షన్ను బ్యాంకు అకౌంట్ అనుసంధానం జరిగింది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదుబదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అలా అనుసంధానం చేసుకున్న వారికే సబ్సిడీ సిలెండర్లు లభిస్తాయి. జిల్లాలో 9,44,694 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 24 శాతం మంది మాత్రమే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన వారంతా వచ్చే జనవరి ఒకటో తేదీ తరువాత గ్యాస్ బుక్ చేసుకుంటే మార్కెట్ ధర రూ.1077లకు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆధార్ లేని వారికి నగదు బదిలీ కోసం వివరాలను సేకరించాలో? లేదో? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. జిల్లాలో 98 శాతం వరకు ఆధార్ నమోదు పూర్తయింది. నగదు బదిలీకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది. ఇంకా సుమారుగా 7.17 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆధార్‌తో సంబంధం లేనప్పటికీ భవిష్యత్తులో మళ్లీ గ్యాస్‌తో అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న సందేహంతో కొంత మంది వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలను నమోదు చేయించుకుంటున్నారు. మార్కెట్ ధరకు గ్యాస్ డిసెంబర్ 31వ తేదీలోగా నగదు బదిలీ పథకానికి గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. కానీ కేవలం వారం రోజుల్లో 7.17 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో అనుసంధానం చేసుకోని వారు జనవరి 1వ తేదీ తరువాత గ్యాస్ బుక్ చేసుకుంటే నాన్‌సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే పథకం ద్వారా గ్యాస్‌పై రూ.50 వరకు అదనపు భారం పడుతుండడంతో వినియోగదారులు ఈ పథకంపై ఆసక్తి చూపించడం లేదు. ఈ నెలలో గ్యాస్ బుక్ చేసుకున్న తరువాత అనుసంధానం చేసుకోవాలని కొందరు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా భారీగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. లక్షకు పైగా కనెక్షన్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. -
వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రారంభమైంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసిన వారికి ఇకమీదట సబ్సిడీ మొత్తాన్ని ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అంటే... ఇక వంట గ్యాస్‌ను బుక్ చేసిన వినియోగదారులు మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారం తర్వాత సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని వినియోగదారులకు చమురు కంపెనీలు మూడు నెలలు గడువునిచ్చాయి. అప్పటి వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్లను సరఫరా చేస్తారు. వచ్చే ఏడాది మార్చి ఒకటో తేదీలోగా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయకపోతే మార్కెట్ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆధార్ లేకపోతే... వంట గ్యాస్ వినియోగదారులు ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతా, వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద అనుసంధానం చేయిస్తే అత్యుత్తమం. గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల వద్దకెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని కోసం బ్యాంకు, గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అర్జీలను పూర్తి చేసి సమర్పిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు నకళ్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఇంకా లభించని వారు బెంగళూరు వన్ కేంద్రాలకు వెళ్లి ఈ-ఆధార్ సంఖ్యను పొందవచ్చు. ఆధార్ నమోదు కేంద్రాల్లో ఇచ్చిన రసీదుల నకళ్లను సమర్పించినా సరిపోతుంది. కాగా గ్యాస్ వినియోగదారులకు పలు బ్యాంకుల్లో ఖాతాలున్నప్పటికీ, ఏదైనా ఒక బ్యాంకు వద్దే ఆధార్ అనుసంధానం చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు ఖాతాలున్న అన్ని బ్యాంకులతో అనుసంధానం చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తడమే కాకుం డా సబ్సిడీ లభించకపోయే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి... బెంగళూరు సహా హావేరి, కొప్పళ, బీదర్, దావణగెరె, బిజాపురలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఇదివరకే మైసూరు, తుమకూరు, ధార్వాడ, ఉడిపి, ఉత్తర కన్నడ, గదగ జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉంది. మిగిలిన 18 జిల్లాల్లో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 70 శాతం మందికి ఆధార్ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఆరు కోట్లా 11 లక్షలా 30 వేలా 704 మంది కాగా నాలుగు కోట్లా 30 లక్షలా ఏడు వేలా 539 మంది ఆధార్ పరిధిలోకి వచ్చారు. వీరిలో మూడు కోట్లా 44 లక్షలా 15 వేలా 581 మందికి ఆధార్ కార్డులు కూడా అందాయి. బెంగళూరులో 77 లక్షలా తొమ్మిది వేలా 78 మంది ఆధార్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకు 57 లక్షలా 19 వేలా 319 మందికి ఆధార్ సంఖ్య లభించింది. -
పకడ్బందీగా నగదు బదిలీ పథకం అమలు
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) వసంత్‌రావు దేశ్‌పాండే తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకు మేళాను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నగదు బదిలీ(డీబీటీ) పథకం ప్రగతిపై ప్రతి శుక్రవారం కలెక్టర్ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఖాతాలు లేని వారిని గుర్తించి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతోపాటు ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో బ్యాంకు మేళాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్యాస్ వినియోగదారులు 80,830 మంది ఉండగా నగదు బదిలీలో భాగంగా రూ.4.47 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. గ్యాస్ వినియోగదారుడికి మొదటి విడతగా రూ.435, రెండో విడతగా రెండ్రోజుల అనంతరం రూ.118తో కలిపి మొత్తంగా రూ.553 బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వివరించారు. జిల్లాలో 4.15లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా నగదు బదిలీ పథకంపై ఆధార్ నమోదుతో 3.82లక్షల వినియోగదారులు పరిగణనలోకి వచ్చారని తెలిపారు. ఇందులో 1.50 లక్షల దీపం పథకం వినియోగదారులు ఉన్నారని, సర్వే సాగుతోందని, ఆధార్, రేషన్‌కార్డు అనుసంధానం 80 శాతం వరకు పూర్తయిందని పేర్కొన్నారు. మంచిర్యాల మండలం గుడిపేటలో ఇటీవల ఇళ్లు కాలిపోగా వారిలో 39 మంది అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. బంగారుతల్లి పథకానికి రేషన్‌కార్డు తప్పనిసరి కావడంతో వచ్చే రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించి కార్డులు అందేలా చూస్తామన్నారు. కుటుంబంలో పెళ్లయిన వారు రేషన్‌కార్డు పాత జిరాక్స్ కాపీని అందజేస్తే అందులో వారి ఫొటోను తొలగించి ఆ జంటకు మరో రేషన్‌కార్డు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న, ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆధార్ అనుసంధానంతో గ్యాస్ వినియోగదారులపై భారం
ఒంగోలు, న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం గ్యాస్ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకున్న వారికే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము అందుతుందని, అది కూడా నేరుగా వినియోగదారుని బ్యాంకు అకౌంట్‌కు జమవుతుందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం రెండో దశలో ప్రకాశం జిల్లా ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆధార్ కార్డు పొందనివారికి మూడు నెలల గడువిచ్చారు. ఈ మూడు నెలలపాటు వారికి నెలకు రూ. 411లకే సిలిండర్ అందుతుంది. కానీ ఆధార్ సమర్పించిన వారికి మాత్రం భారీ బాదుడు తప్పడం లేదు. బాదుడు ఇలా... ఆధార్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోగానే వారి బ్యాంక్ అకౌంట్లో రూ. 435 సబ్సిడీ జమవుతుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1037. అంటే వినియోగదారుడు అదనంగా రూ. 602 సిలిండర్‌కు వెచ్చించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వినియోగదారుడు భరించాలి. కానీ గతంలో సబ్సిడీ మొత్తం పోను సిలిండర్‌కు రూ. 411 మాత్రమే వసూలు చేసేవారు. ఈ లెక్కన ప్రతి సిలిండర్‌పైన వినియోగదారునికి అదనంగా పడుతున్న భారం రూ. 191. అయితే ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి మరో మూడు నెలల గడువు పొడిగించడం వల్ల ఈ మూడు నెలలపాటు వారు బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్ కేవలం రూ. 411కే డెలివరీ అవుతుంది. అంటే ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన వారిపై అదనపు భారం పడుతుందన్నమాట. జిల్లా వ్యాప్తంగా 5,56,971 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వాటిలో ఆధార్ తీయించుకున్నవారు 2,75,387 మంది ఉన్నారు. అంటే ఇంకా 2,81,584 మంది ఆధార్ తీయించుకోవాల్సి ఉంది. ఆధార్ తీయించుకున్న వారిలో సబ్సిడీ కోసం గ్యాస్ కంపెనీల వద్ద నమోదు చేయించుకున్నవారు 1,22,654 మంది మాత్రమే. ఆధార్ తీయించుకున్న వారిలోనే మరో 1,52,733 మంది వినియోగదారులు సబ్సిడీ కోసం నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఇవి కాకుండా మొత్తం కనెక్షన్ల పరంగా చూస్తే ఫీడ్ చేయించుకోవాల్సిన వినియోగదారుల సంఖ్య 4,34,317 మంది వరకు ఉంది. వారంతా ఈ మూడు నెలలపాటు ఈ భారం నుంచి మినహాయింపు పొందినట్లే. మరోవైపు నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రోజురోజుకూ మార్కెట్లో పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం రూ. 1037లకు చేరింది. ఆధార్ నమోదుచేయించుకోకపోతే సబ్సిడీ అందదని, గ్యాస్ కనెక్షన్ కాస్తా నాన్ సబ్సిడీగా మారుతుందనే భయంతోనే వినియోగదారులు ఆధార్ నమోదుకు పోటీపడ్డారు. ఆధార్ భారమే: ఇప్పటి వరకు గ్యాస్‌కు రూ. 435ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 50 సబ్సిడీ ఇచ్చేది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సబ్సిడీ కాస్తా రూ. 50 నుంచి రూ. 25లకు పడిపోయింది. వాటితోపాటు చమురు కంపెనీలు పన్నుల రూపంలో సుమారు రూ. 62 అదనపు భారాన్ని వినియోగదారులపై రుద్దుతున్నాయి. ఈ రెండు మొత్తాలను మినహాయిస్తే అంటే రూ. 87 మినహా మిగిలిన మొత్తం త్వరలో బ్యాంక్ ఖాతాలకు జమయ్యే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా భావించినా గ్యాస్ సిలిండర్‌పై రూ.87 పెరిగిందని స్పష్టమవుతోంది. పల్లెల్లో తప్పని పాట్లు: పల్లెల్లో ఒకటి రెండు బ్యాంకు శాఖలు మాత్రమే ఉంటాయి. ఇంకా అన్ని చోట్ల ఏటీఎంలు ఏర్పాటు చేయలేదు. దానికితోడు ఇప్పటికీ ఏటీఎం కార్డులను ఎలా వినియోగించాలో తెలియని వారు చాలామందే ఉన్నారు. దీంతో గ్యాస్ బుక్‌చేసుకున్నా తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంకు ఉన్న గ్రామాలకు వె ళ్లడం, వాటిని డ్రా చేసుకోవడం అనేది వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. కేవలం జనాన్ని తిప్పలు పెట్టడం కాకపోతే ప్రభుత్వం నేరుగా సంబంధిత కంపెనీలకు సబ్సిడీ మొత్తం ఇస్తే ఈ సమస్యలు ఉండవు కదా అంటూ పల్లె ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ వినియోగం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గ్యాస్ వినియోగదారులు ఊరట చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మరలా పిటీషన్ దాఖలు చేయడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
వంటగ్యాస్ సబ్సిడీపై ‘వ్యాట్’ తొలగించాలి
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ ధరలు అమలు చేయడాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తప్పుపట్టింది. వంటగ్యాస్ సబ్సిడీ మొత్తంపైనా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధించడం సమంజసం కాదంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. ‘నగదు బదిలీ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు మొత్తం బిల్లుపై(సిలిండర్‌కు రూ.980మీద) రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయి. నగదు బదిలీ వర్తించని వారికి సబ్సిడీపోనూ వచ్చే బిల్లు(రూ.412)పైనే వ్యాట్ వసూలు చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానంవల్ల నగదు బదిలీ పరిధిలోకి వచ్చేవారికి వంటగ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉంటోంది. ఆధార్ అనుసంధానం చేసుకోనివారు చెల్లించే ధరకంటే.. అనుసంధానం చేసుకున్నవారు వంటగ్యాస్‌కు అధిక రేటు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆధార్ అనుసంధానానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. ఇలా ఒకేరకమైన వంటగ్యాస్‌పై రెండురకాలుగా వ్యాట్ విధించడం సరికాదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని సబ్సిడీ మొత్తానికి వ్యాట్‌ను మినహాయించాలి’’ అని లేఖలో కోరింది. రాష్ట్రంలో పరిస్థితిదీ: రాష్ట్రంలో వంటగ్యాస్ విషయంలో ద్వంద్వ ధరలు అమల్లో ఉన్నాయి. నగదు బదిలీ పరిధిలోకి వచ్చిన 12 జిల్లాల్లోని వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రూ.25 సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. అంతటితో సరిపెట్టుకోకుండా వినియోగదారులకు లభించే వంటగ్యాస్ ధరపైగాక మొత్తం బిల్లుపై (సిలిండర్‌కు రూ.980పై) వ్యాట్ బాదుతోంది. దీంతో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,024.50 పడుతోంది. అంటే.. వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రూ.558.30 సబ్సిడీపైనా రాష్ట్రప్రభుత్వం వ్యాట్ గుంజుతోందన్నమాట. దీంతో నగదు బదిలీ వర్తించనివారితో పోల్చితే ఈ పథకం వర్తించేవారికి ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.29 చొప్పున వ్యాట్ భారం అదనంగా పడుతోంది. దీనివల్లే నగదు బదిలీ అమల్లో లేని జిల్లాల ప్రజలకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.412.70 (దీనిపై సుమారు రూ.22 వరకు వ్యాట్ పడుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రూ.25 సబ్సిడీ వర్తిస్తుండడంతో దాదాపు అదే ధరకు వినియోగదారులకు లభిస్తున్నది) ఉండగా నగదు బదిలీ అమల్లో ఉన్న జిల్లాల్లో మాత్రం ఏకంగా రూ.466 పడుతోంది. నగదు బదిలీ వర్తించేవారికి రాష్ట్రప్రభుత్వం రూ.25 సబ్సిడీ రద్దు చేయడం, దీనికితోడు అదనంగా రూ.29 వ్యాట్ విధించడమే ఇందుకు కారణం. దీనివల్ల వీరికి ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.53 చొప్పున అదనపు భారం పడుతోంది. ఒకే వంటగ్యాస్‌పై ఇలా రెండు ధరలు అమలు చేయడం దారుణమనే విమర్శలను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ద్వంద్వ విధానం సరికాదని, సబ్సిడీపై మినహాయించి వినియోగదారులకు పడే వంటగ్యాస్ రేటుపైనే వ్యాట్ విధించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీచేయడం గమనార్హం. -
నగదు బదిలీ సమస్యలపై ప్రత్యేకాధికారులు
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌కు సంబంధించి నగదు బదిలీ(డీబీటీ)లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి బ్యాంకులు ప్రత్యేకాధికారులను నియమించాయి. వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు తమ బ్యాంకుల ప్రత్యేకాధికారుల వివరాలను స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్ వినియోగదారులు నగదు బదిలీకి సంబంధించి ఏదైనా బ్యాంకులో సమస్య ఏర్పడితే ఆయా బ్యాంకుకు సంబంధించిన ప్రత్యేక అధికారిని నేరుగా గానీ, ఫోన్లో గానీ సంప్రదించి వివరాలు అందజేసి పరిష్కరించుకోవచ్చు. ఈ రెండు జిల్లాల్లోని ఇతర బ్యాంకుల ప్రత్యేక అధికారుల వివరాలను కూడా త్వరలో ప్రకటిస్తామని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు భరత్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్‌లో ఉన్న పేరుకు, బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు స్పెల్లింగ్‌కు మధ్య ఒక అక్షరం తేడా ఉన్నా సబ్సిడీ జమ కావడం లేదు. కొందరు వినియోగదారులు తెలియక రెండు బ్యాంకు ఖాతాలను ఆధార్‌ను అనుసంధానం చేయడం సమస్యగా మారింది. కొందరి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అయినా, సాంకేతిక లోపం వల్ల అది మళ్లీ వెనక్కి వెళ్లిపోతోంది. ఇటువంటి ఏ సమస్య ఉన్నా గ్యాస్ వినియోగదారులు సంబంధిత బ్యాంకు ప్రత్యేకాధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. బ్యాంకు అధికారి పేరు, హోదా మొబైల్ నంబరు ఆంధ్రాబ్యాంకు పి.వి.రమణ, (ఏజీఎం) 8448104996 కెనరాబ్యాంకు కె.వెంకటేశ్వరరావు (ఏజీఎం) 9441928587 అలహాబాద్ బ్యాంకు విశ్వపతి (సీనియర్ మేనేజరు) 9441421507 బ్యాంక్ ఆఫ్ ఇండియా అపరాజిత దాస్ (మేనేజరు) 7893989850 ఎస్బీహెచ్ ఎం.ప్రశాంత్ (మేనేజరు) 9849139991 ఎస్బీహెచ్ ఎస్పట్నాయక్(చీఫ్ మేనేజరు) 9948820455 ఐసీఐసీఐ బ్యాంకు ఎస్.యూ. మూర్తి(ఏజీఎం) 9989056285 -
జనవరి 1 కల్లా అన్ని జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీ
వచ్చే నెల నుంచి మరో 8 జిల్లాల్లో పథకం సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు దశల్లో 12 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉండగా, వచ్చే నెల 1 నుంచి మరో 8 జిల్లాల్లో (కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, వరంగల్, మెదక్, నల్లగొండ, విశాఖపట్టణం) జిల్లాల్లో అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో అమలుచేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో అమల్లోకి తేనున్నారు. నగదు బదిలీ ప్రారంభించిన నాటి నుంచి మూడు నెలల్లోగా వినియోగదారులు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అనుసంధానం చేయకపోయినా సబ్సిడీని ఇస్తారు. మూడు నెలలు తరువాత కూడా ఆధార్‌ను బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయని వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వరు. మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆధార్‌ను బ్యాంకు లింకేజి చేసుకుంటే అప్పటి నుంచి వంట గ్యాస్ సబ్సిడీని అందజేస్తారు. -
‘నగదు బదిలీ’తో గ్యాస్ సిలిండర్ ధర తడిసి మోపెడు!
సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీతో ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొట్టినా, అసలు జరుగుతున్నది వేరు. దీని పేరు చెప్పి ప్రజలు ఎక్కువ భారం మోయాల్సి వస్తోంది. తాజాగా చమురు సంస్థలు సిలిండర్ ధరను వెయ్యి రూపాయలకు పైగా చేశారు. ఒక్క సిలిండర్ తీసుకోవాలంటే 1024 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్రంలో నగదు బదిలీ పథకం అమలయ్యే మొత్తం 12 జిల్లాల్లోనే తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరలు అమల్లోకి రానున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటిలోనూ హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పెంపు తక్షణం అమల్లోకి వచ్చిందని, మిగిలిన కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో మూడు నెలల అనంతరమే ధరల పెంపు వర్తించనుందని ఆయన వివరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలతో నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చే వినియోగదారులపై రూ. 7, ఆధార్ నమోదు కాని వారిపై రూ. 62 అదనపు భారం పడుతుందని వివరించారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 962.50 నుంచి రూ.1024.50 కు పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ కింద వినియోగదారుల బ్యాంకు అకౌంట్లలో జమచేసే సబ్సిడీని ఒక్కో సిలిండర్‌కు రూ. 498.76 నుంచి 553.70కు పెంచిందన్నారు. ఫలితంగా ఈ పథకం వర్తించే వినియోగదారులకు సిలిండర్‌పై రూ. 7 అదనపు భారం పడుతుందని, ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వారికి ఈ పెంపు రూ. 62గా ఉంటుందని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 24 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాలేదని, అందువల్ల వీరు ఒక్కో సిలిండర్‌ను రూ. 1024.50 చెల్లించి కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం వర్తించని 7 జిల్లాల్లో(కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, వైఎస్సార్, కర్నూలు) సిలిండర్ ధరల పెంపు తక్షణమే వర్తించదని అధికారి పేర్కొన్నారు. -
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీకి ఆదివారం నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తోంది. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నుంచి కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యను వంటగ్యాస్ కనెక్షన్లతో, బ్యాంకు ఖాతాలతోనూ అనుసంధానం చేసుకున్నవారికి నేరుగా బ్యాంకు అకౌంట్లకే వంటగ్యాస్ సబ్సిడీ అందుతుంది. వీరు వంటగ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్లకోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ అనుసంధానం కానివారికి మూడు నెలలపాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతుంది. మూడు నెలల్లోగా వారు ఆధార్ నమోదు, బ్యాంకు అకౌంట్లతో అనుసంధాన ప్రక్రియలు పూర్తి చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులోగా ఆధార్ అనుసంధానం చేసుకోనివారికి డిసెంబర్ ఒకటినుంచి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించబోదని పెట్రోలియం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరోవైపు మొదటి విడత నగదు బదిలీ అమల్లో ఉన్న చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారుల్లో 50 శాతం మందికి మాత్రమే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన మిగతా 50 శాతం మందికి సెప్టెంబర్ ఒకటి(ఆదివారం) నుంచి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించదు. వీరు పూర్తి మొత్తం డబ్బు చెల్లించి సబ్సిడీ రహిత సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
సగం మందికి సబ్సిడీ లేదు!
సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీ అమల్లో ఉన్న ఐదు జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు ‘ఆధార్’ గుబులు పట్టుకుంది. బ్యాంకు ఖాతాలు, వంటగ్యాస్ కనెక్షన్లతో ఆధార్ విశిష్ట సంఖ్య అనుసంధానానికి గడువు ఇక రెండు రోజులే మిగిలింది. ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో.. ఇప్పటికి 47 శాతం మంది ఆధార్ నంబర్ల అనుసంధానం మాత్రమే పూర్తయింది. యంత్రాంగం నిర్లక్ష్యం, విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా 24 లక్షలకు పైగా వినియోగదారులకు సబ్సిడీ అందకుండా పోతోంది. ఆదివారం నుంచి వీరంతా గ్యాస్ సిలిండర్‌ను రూ.962 చెల్లించి కొనుగోలు చేయక తప్పని స్థితి నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబరు 1నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ జిల్లాల్లో 48,18,279 మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకూ 22,28,573 మందికి(46.25 శాతం) ఆధార్ ప్రక్రియ పూర్తయింది. శనివారం లోగా మరో 3.75 శాతం పూర్తయినా.. మిగతా 50 శాతం గ్యాస్ వినియోగదారులకు వంటగ్యాస్ సబ్సిడీ తాత్కాలికంగా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆధార్, వంటగ్యాస్ కంపెనీలు, బ్యాంకుల మధ్య సమన్వయ లోపమే సమస్యగా మారిందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆధార్ నంబర్ పొందలేకపోయిన వారు కొందరైతే.. ఆధార్ నంబర్ పొంది, గ్యాస్ ఏజన్సీ, బ్యాంకులకు అందజేసిన వారి విషయంలో కూడా అనుసంధానం జరగడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
సెప్టెంబర్ నుంచి నగదు బదిలీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ కనెక్షన్లకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఆధార్ నంబర్లతో తమ బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 35 జిల్లాలో నగదు బదిలీ పథకం గ్యాస్ కనెక్షన్లకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం వర్తింపజేయనున్నట్లు, అందులో మన జిల్లా కూడా ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లోగా తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానం చేయకుంటే సబ్సిడీ రాదని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసిన వినియోగదారులకు రూ.450 జమ అవుతాయని వివరించారు. బ్యాంకులో డబ్బులు జమ అయిన తరువాత రెండు రోజుల్లో సిలిండర్ తీసుకోవాలన్నారు. జిల్లాలో 3.55 లక్షల మంది సాధారణ కనెక్షన్ వినియోగదారులు ఉండగా, 1.50 వేలు దీపం కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు లక్ష మంది వరకు మాత్రమే అనుసంధానం చేసుకున్నారని, మిగతా వారు ఈ వారంలోగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ లెటర్, ఎస్వీ జిరాక్స్ కాపీలతో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్, గ్యాస్ ఏజెన్సీ డీలర్లను, బ్యాంకులను సంప్రదించాలని సూచించారు. అధికారులపై ఆగ్రహం గ్యాస్ వినియోగదారుని ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేయడం తెలియడం లేదని అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పి 45 రోజులు గడుస్తున్నా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 54 శాతం సీడింగ్ పూర్తి చేశారని, జూలై మొదటి వారంలో 10 శాతం అనుసంధానం చేస్తే 45 రోజుల్లో 44 శాతం ఆధార్‌తో అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని హెచ్చరించారు. వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సుజాత శర్మ, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, ఎఎస్వో సత్యనారయణ, ఎన్ఐసీ డీఐవో రాకేష్ బ్యాంకర్లు, డీలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
బంగారుతల్లికీ ‘ఆధార్’ లింకు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల తరహాలోనే ‘బంగారుతల్లి’ పథకానికి కూడా ప్రభుత్వం ఆధార్ లింకు పెట్టింది. అయితే ఈ ఏడాదికి మినహాయింపునివ్వాలని... 2014, మార్చి 31 తర్వాత దరఖాస్తు చేసుకునే ప్రతి తల్లీ ఆధార్ కార్డు పొంది ఉండాల్సిందేనని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బంగారుతల్లి పథకంపై జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగారుతల్లి పథకం కింద ఆన్లైన్లో నగదు బదిలీకోసం అందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేయాలని, అయితే, ఈ ఏడాది అందరికీ ఆధార్ అందుబాటులో లేనందున మినహాయింపునివ్వాలని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఆధార్ నిబంధన అమల్లోకి వచ్చేంతవరకు ఈ పథకం కింద దరఖాస్తుకు గానీ, నగదు బదిలీకి గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతోపాటు ఒక కాన్పులో ఆడబిడ్డ పుట్టిన తర్వాత రెండో కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా ఈ పథకం కింద అర్హులుగానే పరిగణించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పుట్టిన 21 రోజుల్లోగా జనన ధ్రువీకరణ పత్రం పొందాలన్న నిబంధన తొలగించారని పేర్కొన్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు 51,929 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,360 మందికి బ్యాంకు అకౌంట్లే లే వు. సంక్షేమ పథకాలకు సమీకృత సాఫ్ట్వేర్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం సమీకృత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. సెర్ప్, ఉపాధిహామీ, పెన్షన్లు, బంగారుతల్లి లాంటి పథకాల కోసం ఒకే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని, ఇందుకోసం జి.కె.వీధి లాంటి రెండు గిరిజన మండలాలను పైలట్‌గా ఎంచుకోవాలని సూచించారు. గ్రీన్‌చానల్‌లో చేరుస్తున్నాం: మంత్రి సునీతా ‘బంగారు తల్లి’ పథకం అమలుకు నిధుల కొరత రాకుండా గ్రీన్‌చానల్ ద్వారా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆదేశించారని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ పథకం కోసం రూ. 57.5 కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. సెదారన్ ప్రక్రియలో 1.30 లక్షల మంది వికలాంగులు పెన్షన్‌కు అనర్హులయ్యారని, అయినా వారికి పెన్షన్ రద్దు చేయకుండా నెలకు రూ.200 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.